నగరం కదిలింది
నెల్లూరు: నెల్లూరు సిటీ నియోజకవర్గం వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ శనివారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. తొలుత అనిల్ గాంధీబొమ్మ సెంటర్ నుంచి నామినేషన్ వేయనున్న మున్సిపల్ కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కనకమహల్ సెంటర్, ములుముడి బస్టాండ్, చిన్నబజారు, పెద్దబజారు, అలంకార్‌సెంటర్ మీదుగా సాగింది. ర్యాలీకి ముందు దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహంతో ఊరేగింపు నిర్వహించారు. అనిల్ నామినేషన్ కార్యక్రమానికి సిటీ నియోజకవర్గం నుంచి జనం వేలసంఖ్యలో తండోప తండాలుగా తరలివచ్చారు.
ముఖ్యంగా మహిళలు మండే ఎండను సైతం లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో హాజరుకావడం విశేషం. ర్యాలీలో ఒంటెలు, గుర్రాలు, బొమ్మ హెలికాప్టర్లు ఆకట్టుకున్నాయి. బాణసంచాతో నగరం మార్మోగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు, ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేయర్ అభ్యర్థి అబ్దుల్ అజీజ్‌తో పాటు జియాఉద్దీన్, పులిమి శైలజ, ముక్కాల ద్వారకానాథ్, దువ్వూరు శరశ్చంద్ర, సన్నపురెడ్డి పెంచలరెడ్డి, పడవల సుధాకర్, పుట్టా రామకృష్ణారెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, లోకిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, అబ్దుల్ జలీల్, ఎ.బాలకోటేశ్వరరరావు, రాజశేఖర్, ఎండీ ఖలీల్ అహ్మద్, ముప్పసాని శ్రీనివాసులు, మునీర్‌సిద్దిక్, లెక్కల వెంకారెడ్డి, పోలంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌కే సుభాన్, అతహర్, షఫీ, సుధీర్‌బాబు పాల్గొన్నారు.
రాష్ట్రంలో అధికారం వైఎస్సార్‌సీపీదే: ఎంపీ
సార్వత్రిక ఎన్నికల్లో సీమాంధ్రలో 150 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుందని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. శనివారం డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ నామినేషన్ కార్యక్రమంలో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో జనం వైఎస్సార్‌సీపీ పక్షాన ఉన్నారన్నారు. తిరిగి వైఎస్సార్ పాలన రావాలంటే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని జనం భావిస్తున్నారని మేకపాటి చెప్పారు. తొమ్మిదేళ్ల పాలనలో ప్రజల సంగతి పట్టించుకోని చంద్రబాబు ఇప్పుడు అధికారం కోసం అన్నీ చేస్తానంటూ కపట నాటకాలు ఆడుతున్నారని మేకపాటి విమర్శించారు. అనిల్‌తో పాటు జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ఒక్క అవకాశమివ్వండి: అనిల్
‘కుట్రలు, కుతంత్రాలతో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 90 ఓట్ల తేడాతో ఓటమి చెందాను. కష్ట నష్టాల కోర్చి ఐదేళ్లుగా మిమ్మల్నే నమ్ముకుని పనిచేస్తున్నా. ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం సాగిస్తున్నా.. వైఎస్సార్ దీవెనలు, జగన్‌మోహన్‌రెడ్డి ఆశీస్సులతో పాటు మీరందరూ ఆశీర్వదించి ఒక్క అవకాశం ఇవ్వండి’ అని శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్తిగా నామినేషన్ వేసిన డాక్టర్ పి.అనీల్‌కుమార్ యాదవ్ నెల్లూరు సీటీ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నామినేషన్ అనంతరం అనిల్ మాట్లాడారు. వైఎస్సార్ మరణించిన తర్వాత చీకటి పాలనతో విసిగిపోయారన్నారు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే తిరిగి రాజన్న రాజ్యం వస్తుందన్నారు. అందుకే వైఎస్సార్‌సీపీని గెలిపించి జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భా రీ మెజార్టీతో తనను గెలిపించాలని అనిల్ కోరారు. ప్రజల రుణం ఉంచుకోనని, జగన్ నాయకత్వంలో మంచిపరిపాలన కోసం శ్రమిస్తామన్నారు.