papaiah peta
-
తెలంగాణ అబ్బాయి.. పోలాండ్ అమ్మాయి
సాక్షి, జవహర్నగర్: వారి ప్రేమకు ప్రాంతాలు, దేశాలు అడ్డురాలేదు. ఆ జంట జాతి, కులం, మతం, వర్గం, ప్రాంతం అనేది చూడలేదు. ఇద్దరి మనసులు కలవడంతో కుటుంబ పెద్దలను ఒప్పించారు. వివాహ బంధంతో ఒక్కటయ్యారు. తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలోని పాపయ్యపేటకు చెందిన కంచ కృష్ణకాంత్ హైదరాబాద్లో ఉన్నత విద్యనభ్యసించి ఉద్యోగ నిమిత్తం 2002లో లండన్ వెళ్లారు. అక్కడ పోలాండ్కు చెందిన బార్బర అనే యువతిని ప్రేమించారు. వీరిద్దరూ 2010లో హైదరాబాద్లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పదేళ్ల ఆరన్, అయిదేళ్ల నేతన్ ఇద్దరు కుమారులు. ప్రస్తుతం కృష్ణకాంత్ సోదరుడు నరేష్ ప్రేమ వివాహం చేసుకుని లండన్ సిటిజన్షిప్ (బ్రిటన్ పౌరసత్వం) తీసుకుని అక్కడే నివాసముంటున్నారు. ఆదివారం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా లండన్లోని కృష్ణకాంత్, బార్బర దంపతులను ‘సాక్షి’ ఫోన్లో పలకరించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రేమించడమే కాదు, పెద్దలను మెప్పించాలి. ఒకరినొకరు పరస్పరం అర్థం చేసుకోవాలి. అప్పుడే ఎవరికీ ఇబ్బందులు ఉండవు అని పేర్కొన్నారు. చదవండి: బెబ్బులి మళ్లీ వచ్చింది..! ‘పోడు’ రగడ.. బావిలో దూకిన మహిళ -
పెళ్లి చేసుకుని.. వదిలేసిన ప్రియుడు
న్యాయుం కోసం.. అత్తింటి ఎదుట బాధితురాలి ఆందోళన పాపయ్యుపేట(చెన్నారావుపేట): ‘నీతోనే జీవిస్తా.. కడదాక కలిసుంటా’ అనని ప్రేమతో మాయమాటలు చెప్పిన ఓ ప్రబుద్ధుడు ఆమెను పెళ్లి చేసుకుని కూతురు పుట్టాక వదిలేశాడు. దీంతో ఆ అభాగ్యురాలు చేసేది లేక భర్త ఇంటి ఎదుట న్యాయపోరాటానికి దిగింది. ఈ ఘటన వుండలంలోని పాపయ్యుపేటలో సోమవారం రాత్రి జరిగింది. బాధితురాలు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యూకూబీ, అజాజ్ దంపతుల కుమారుడు సద్దాం, నెక్కొండ గ్రామానికి చెందిన అబ్బదాసు నాగమ్మ, సమ్మయ్యు దంపతుల కూతురు ప్రియాంకను ఐదేళ్ల క్రితం ప్రేమించాడు. హైదరాబాద్ తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు. వారి సంసార జీవితంలో ఏడు నెలల క్రితం కువూరుడు జన్మించాడు. ఇటీవల అతడు ఆమెపెళ్లి చేసుకుని.. వదిలేసిన ప్రియుడును వదిలేసి హైదరాబాద్ నుంచి పాపయ్యుపేటకు వచ్చాడు. దీంతో ప్రియాంక పాపయ్యపేటకు చేరుకుని సద్దాం ఇంటి ఎదుట న్యాయ పోరాటానికి దిగింది. కాగా గ్రావుస్తులు ఆమె ఆందోళనకు మద్దతు తెలిపారు. పెళ్లి చేసుకుని, కువూరుడు జన్మించాక మోసం చేస్తే ఊరుకునేది లేదన్నారు.