parameswara
-
బెదిరించిన విలేకరితో వాదించడమూ తప్పేనా?
సాక్షి, నరసరావుపేట: నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్మే పచ్చ పత్రిక ఈనాడులో బుధవారం ప్రచురితమైన ‘పత్రికలపై పగబట్టిన వైకాపా’ వార్త పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో రాసిందే. అందులో పల్నాడు జిల్లా అమరావతి మండల న్యూస్‌టుడే విలేకరి పరమేశ్వరరావుపై దాడి చేశారని, చంపబోయారంటూ కట్టుకథలు అల్లారు. వాస్తవానికి ఆ విలేకరి సంఘ విద్రోహశక్తిగా పేరున్న టీడీపీ నేత దండా నాగేంద్రతో సాన్నిహిత్యంగా ఉంటూ అతని కనుసన్నల్లో ఇసుక సరఫరాపై నిత్యం తప్పుడు కథనాలు వండి వారుస్తున్నాడు. నాగేంద్ర పీడీ యాక్ట్‌పై జైలుకెళ్లి ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయంగా అల్లర్లు సృష్టించేందుకు ఆ టీడీపీ నేత గత కొన్ని నెలలుగా కుట్రలు చేస్తున్నాడు. పరమేశ్వరరావు ఒక పత్రికలో విలేకరిగా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడడంతో అతన్ని తొలగించారు. ఈ క్రమంలో అతనికి ఏడాది క్రితం నాగేంద్ర సిఫార్సుతో ఈనాడు విలేకరిగా అవకాశం కల్పించారు. అప్పటినుంచి స్వామిభక్తి చాటుకుంటూ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు రాస్తున్నాడు. దౌర్జన్యంగా ప్రవేశించి బెదిరింపులు.. ఈ నెల 13న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి స్వయంగా మల్లాది ఇసుక రీచ్‌కు వచ్చి పరిశీలించివెళ్లారు.ఇసుక తవ్వకాలు ఆపమని జిల్లా, మండల స్థాయి అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవటంతో మరుసటి రోజు యథావిధిగా ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఉదయం 10.30 గంటలకు తహసీల్దార్ కార్యాలయం నుంచి గ్రామస్థాయి అధికారులు వచ్చి వెంటనే ఇసుక తవ్వకాలు ఆపేయాలని నిర్వాహకులకు తెలిపారు. అప్పటికే పది ఇసుక వాహనాలకు లోడ్ చేయటానికి బిల్లులు రాశారు. బిల్లులు రాయకుండా ఉన్న 15 వాహనాలను వెనుకకు పంపారు. బిల్లులు రాసి లోడైన ఆరు వాహనాలు బయటకు వెళ్లాయి. ఈ సమయంలో మల్లాది గ్రామానికి చెందిన ఈనాడు కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు ఇసుకరీచ్లోకి వచ్చి నదిలో ఇసుక లోడ్ అవుతున్న నాలుగు వాహనాల ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ సమయంలో రీచ్‌లో కూలీకి పనిచేస్తున్న మల్లాది యువకులు తమ ఊరు వాడే కదా అనే చనువుతో ఏంటబ్బాయి ఫొటోలు, వీడియోలు తీస్తున్నావని అడగగా.. నేను ఈనాడు విలేకరిని, మాకు మా యాజమాన్యం నుంచి ఆదేశాలు అలాగే ఉన్నాయి, అయినా మీకు చెప్పాలా, మీ పర్మిషన్ తీసుకుని రావాలా ఏంటీ, అన్ని వాహనాలు సీజ్ చేయిస్తానంటూ దురుసుగా మాట్లాడాడు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈనాడు విలేకరి కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడే ఉçన్న ఇసుక తవ్వకాలు జరిపే కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు వారిని విడదీసి విలేకరిని ద్విచక్రవాహనంపై దగ్గరుండి పంపించారు. కిందపడ్డ పరమేశ్వరరావు సెల్‌ఫోన్‌ను తరువాత అక్కడకు చేరుకున్న సీఐ బ్రహ్మం తీసుకు వచ్చి అతనికి అప్పగించారు. సంఘటన జరిగిన తరువాత విజిలెన్స్ అధికారి మీడియాకు ఈ విషయాన్ని వివరించారు. వాస్తవాలు దాచిపెట్టి ఈనాడు కథనం సంఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని, అయితే జరిగింది ఒకటైతే ఈనాడు పత్రికలో వచ్చింది మాత్రం మరొకటని ఇసుక కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఈనాడు కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు ఇసుక రీచ్‌లోకి ప్రవేశించి అక్కడ ఉన్న వారితో వాగ్వివాదానికి దిగాడన్నారు. దీంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య తోపులాట జరిగిందన్నారు. అంతేగాని పెట్రోల్ తీసుకురండి.. తగలెట్టేద్దాం వంటి మాటలు అనటం, దాడి చేసి నిర్బంధించినట్లు రాయడం అవాస్తవమన్నారు. ఇసుక రీచ్‌కి సంబంధించిన సిబ్బంది ఎక్కడా వైఎస్సార్ సీపీ, ఎమ్మెల్యే శంకరరావు పేరు ప్రస్తావించలేదని చెప్పారు. దాడి జరిగిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వచ్చి పరామర్శించి, దీనికి రాజకీయ రంగు పులిమారు. అమరావతి నుంచి దండా నాగేంద్ర కారులో పరమేశ్వరరావు గుంటూరు ఈనాడు కార్యాలయానికి చేరి.. అక్కడ అల్లిన కట్టుకథే ఈనాడులో ప్రచురితమైంది. -
చెత్త పుస్తకం
శుభశ్రీ పరమేశ్వరన్ ఇంజనీరింగ్ చదివారు. ఐటీ రంగంలో పది సంవత్సరాలు పనిచేశారు. ‘లెట్స్ టాక్ ట్రాష్’ పుస్తకం ద్వారా జీరో వేస్ట్ గురించి ప్రచారం చేస్తున్నారు. వృథాను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలని ఆచరణ ద్వారా చూపుతున్నారు. ‘‘మనమంతా పరిశుభ్రమైన వాతావరణంలో ఆరోగ్యంగా జీవించడానికి అనుసరించవలసిన మార్గాలను అందరికీ తెలియచేయాలని సంకల్పించాను. బొమ్మల ద్వారా తేలికగా అర్థం చేసుకోగలుగుతారని భావించాను. చిన్న చిన్న బొమ్మలు వేసి, వాటి కిందే ఆ బొమ్మలకు సంబంధించిన సందేశం రాసి, పుస్తకంగా తయారు చేశాను’’ అన్నారు శుభశ్రీ సంగమేశ్వర. రెండేళ్లుగా బొమ్మల సందేశం బెంగళూరుకు చెందిన శుభశ్రీ రెండు సంవత్సరాల క్రితం ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. మన ముందు ముందుతరాల వారు ఏయే మార్గాల ద్వారా చెత్తను తగ్గించేవారో బొమ్మల ద్వారా చూపుతున్నారు ఆమె. ‘లెట్స్ టాక్ ట్రాష్’ అనే తన పుస్తకంలోని బొమ్మల్ని, సందేశాలను పిల్లలకు, పెద్దలకు అందరికీ అర్థమయ్యే రీతిలో వేశారు శుభశ్రీ. ‘‘నేను బి.టెక్ పూర్తి చేశాక, ఐటీ శాఖలో దశాబ్దకాలం పనిచేశాను. ఇంత చదువుకుని, యాంత్రికంగా జీవించడం నాకు నచ్చలేదు. నా వల్ల సమాజానికి ఎంతో కొంత ఉపయోగం ఉండాలని భావించాను. ‘జీరో వేస్ట్’ గురించి ప్రచారం చేయాలని నిశ్చయించుకున్నాను. ఇందుకు సంబంధించి రెండు సంవత్సరాలుగా బొమ్మలు వేయడం ప్రారంభించాను’’ అని చెప్పారు శుభశ్రీ. అందులో ఆమె వృథాను అరికట్టేందుకు ప్రతిరోజూ తనకు వచ్చే చిన్న చిన్న ఆలోచనలను బొమ్మలుగా వేశారు సీసాల్లో తెచ్చుకునేవారు ఈ పుస్తకం ద్వారా తాను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని కాని, తనను తాను ప్రదర్శించుకోవాలని కాని అనుకోవట్లేదంటారు శుభశ్రీ. ‘‘సుమారు ముప్పై సంవత్సరాల క్రితం వరకు ప్రతి ఇల్లు జీరో వేస్ట్‌గా ఉండేది. అంటే.. వీసమెత్తు కూడా వృథా ఉండేది కాదు. ఈ విషయం నేటితరం వారికి తెలియకపోవచ్చు కాని, నాటితరం పెద్దవాళ్లకి బాగా తెలిసి ఉంటుంది. పాలను గాజు సీసాలలో అమ్మేవారు. మన దగ్గర ఉండే ఖాళీ సీసాలను పాల కేంద్రంలో ఇచ్చి, అక్కడి నుంచి నిండు సీసాలు తెచ్చుకునేవారు. ప్లాస్టిక్ బ్యాగులలో చెత్తను తీసుకువెళ్లడమనేది ఆ రోజుల్లో ఎవ్వరికీ తెలియదు. ఏ ఇంట్లోనూ బయట పడేసేంత చెత్త కనిపించేది కాదు. మార్కెట్‌కి వెళ్లేటప్పుడు వారి వెంట సంచి తప్పనిసరిగా ఉండేది. ప్లాస్టిక్ కవర్లు కనిపించేవి కాదు. ఆ రోజుల్లో జీవన విధానం అంత శుభ్రంగా ఉండేది’’ అంటారు శుభశ్రీ. ఏదీ వృథా అయ్యేది కాదు గతంలో వస్త్రాలతో చేసిన సంచీలు, మళ్లీమళ్లీ వాడుకునేలాంటి వస్తువులనే ఎక్కువగా ఉపయోగించేవారు. గాజు సీసాలలో, స్టీలు పాత్రలలో వస్తువులను నిల్వ చేసుకునేవారు. పాతబడిపోయిన వస్త్రాలను ఇల్లు శుభ్రం చేయడానికి వినియోగించేవారు. బొగ్గులు కాలిన బూడిదతో గిన్నెలు తోముకునేవారు. వేప పుల్లలతో పళ్లు తోముకునేవారు. వాడకానికి పనికిరావు అనుకునే వస్తువులను మాత్రమే బయట పడేసేవారు. ఇంత పద్ధతిగా మన పూర్వీకులు జీరో వేస్ట్ జీవితాలను గడిపారు.. అంటూ తను గతంలో అమ్మమ్మల ఇంట్లో చూసిన విశేషాల గురించి చెప్పారు శుభశ్రీ. ‘చెత్త’గా మారిపోయాం రోజులు మారాయి. ఇళ్లన్నీ ప్లాస్టిక్ వస్తువులతో నిండిపోతున్నాయి. ఒక్క ఫోన్ కాల్ లేదా ఒక్క యాప్ ద్వారా ప్లాస్టిక్ కవర్లలో భోజనం ఇంటికి వస్తోంది. భోజనం పూర్తయ్యాక అన్ని కవర్లను బయట పడేస్తున్నారు. ప్రస్తుతం పట్టణాలలో ప్రతి మనిషి రోజుకి ఒకటిన్నర కిలోల చెత్తను బయటపడేస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. దీని గురించే చెబుతూ‘‘పది లక్షల జనాభా ఉన్న పెద్ద నగరాలలోని విషయం ఇది. చెత్త పెరగకుండా నియంత్రించడంలో నగరాలు చురుకుగా వ్యవహరించడం లేదు. వాతావరణం కలుషితమవడం గురించి అందరూ బాధ్యతగా ఆలోచించాలి’’ అంటున్న శుభశ్రీ... భూమిని కాపాడటానికి తనవంతు బాధ్యతగా ‘లెట్స్ టాక్ ట్రాష్’ తో తొలి అడుగు వేశారు. పాత పద్ధతులే ఆరోగ్యం ‘‘చిన్నప్పటి నుంచి మా అమ్మ, అమ్మమ్మ వాళ్లు ‘జీరో వేస్ట్’తో ఎంత సాధారణ జీవితాన్ని గడిపేవారో గమనించాను. స్టీలు క్యానుల్లో నూనె తెచ్చేవారు. పాత హార్లిక్స్ సీసాలు, బోర్న్‌విటా సీసాలను సరుకులు వేయడానికి ఉపయోగించేవారు. ఆ సీసాలు సుమారు 40 సంవత్సరాలుగా ఇంట్లో ఉండటం గమనించాను. ఆ పద్ధతులనే ఈ తరం వారు కూడా అనుసరించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి’’ అంటున్నారు శుభశ్రీ. అమెరికన్ సింగర్ లారెన్ నిర్వహిస్తున్న బ్లాగ్‌ను రెండు సంవత్సరాలుగా ఫాలో అవుతున్నారు శుభశ్రీ. ‘‘లారెన్, బెన్ జాన్సన్‌ల నుంచి ప్రేరణ పొందాను’’ అంటున్న శుభశ్రీ, తన ప్రణాళికకు ‘‘స్కెచ్ బుక్ ప్రాజెక్ట్’’ విధానం అనుసరిస్తున్నారు. ‘‘జీరో వేస్ట్‌ను ప్రతిబింబించేలా క్యారికేచర్లు వేయడం ద్వారా ప్రజలలో చైతన్యం తీసుకురావొచ్చనే ఉద్దేశంతో ఈ విధానం ఎంచుకున్నాను’’ అంటున్నారు. – వైజయంతి పురాణపండ మూడు సూత్రాలు ప్లాస్టిక్ సీసాలలో నీళ్లు తాగడం మానేయాలి, ప్లాస్టిక్ స్ట్రాలు నిషేధించాలి, ప్లాస్టిక్ బ్యాగులను తిరస్కరించాలి. బాత్రూమ్, కిచెన్, వార్డ్రోబ్ వంటి ప్రదేశాలలో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయం చూడాలి. ప్రయాణాలలో పసిపిల్లలకు సంబంధించిన వస్తువులను కూడా జీరో వేస్ట్‌గా చూసుకోవాలి. ముఖ్యంగా డిస్పోజబుల్ డయాపర్స్, ప్లాస్టిక్ బొమ్మలను నివారించాలి. మా అమ్మాయి కూడా..! నా వరకు నేను వేస్ట్‌ను బాగా తగ్గిస్తున్నాను. ఇంటికి ఏ ప్లాస్టిక్ వస్తువు తేవాలన్నా బాగా ఆలోచిస్తాను. స్ట్రాలు, ప్లాస్టిక్ కవర్లు తీసుకోను, బిస్కెట్లు, చిప్స్ వంటివి అస్సలు కొనను. ఎక్కడకు వెళ్లినా నా వెంట వాటర్ బాటిల్ ఉంటుంది. ప్రయాణాల్లో నా పరంగా ఎక్కువ చెత్త రాకుండా జాగ్రత్తపడుతున్నాను. మా నాలుగేళ్ల అమ్మాయి కూడా నన్ను అనుసరిస్తోంది. -
కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణం
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల కూటమి కొలువుదీరింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత, పీసీసీ అధ్యక్షుడు బి. పరమేశ్వర ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. గవర్నర్ వజుభాయ్ వాలా కుమారస్వామి, పరమేశ్వరతో ప్రమాణ స్వీకారం చేయించారు. కన్నడలో ప్రమాణ స్వీకార పత్రాన్ని కుమారస్వామి చదివి వినిపించారు. కర్ణాటక సీఎంగా కుమారస్వామి బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. గతంలో 2006 ఫిబ్రవరి 3న తొలిసారి సీఎం అయిన కుమారస్వామి 2007 అక్టోబర్ 9వరకు పదవిలో కొనసాగిన విషయం తెలిసిందే. ఈ నెల 25న కుమారస్వామి సర్కార్ బలనిరూపణ చేసుకోనుంది. వారం రోజుల తర్వాత రాష్ట్ర కేబినెట్ ఏర్పాటు అవుతుంది. బుధవారం జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలతో పాటు పలు రాష్ట్రాల కీలక నేతలు, ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, శరద్ యాదవ్, సీతారాం ఏచూరి, సురవరం సుధాకర్ రెడ్డి, అఖిలేశ్ యాదవ్, శరద్ పవార్, పినరయి విజయన్, అజిత్ సింగ్, లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజస్వీ యాదవ్, తదితర కీలక నేతలు కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బెంగళూరు ఘటనపై మంత్రి సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: యువత అనుసరిస్తున్న పాశ్చాత్య సంస్కృతి వల్లే బెంగళూరులో అనర్ధం జరిగిందని కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర అన్నారు. ఇలాంటి సందర్భాల్లో అలాంటి సంఘటనలు జరుగుతుంటాయని తేలికగా కొట్టిపారేశారు. బెంగళూరులో జరిగిన కొత్త సంవత్సర వేడుకల్లో కీచకులు రెచ్చిపోయిన విషయం తెలిసిందే. న్యూఇయర్ స్వాగతిస్తూ వేడుకలు జరుపుకున్న మహిళలను వేధింపులకు గురిచేశారు. పోలీసుల సాక్షిగానే కీచకులు ఈ అఘాయిత్యాలకు పాల్పడడం భయాందోళన రేపుతోంది. బాధితులు ఫిర్యాదు చేసినా రక్షకభటులు చూసిచూడనట్టు వ్యవహరించారన్న ఆరోపణలు వినిపించాయని ‘బెంగళూరు మిర్రర్’ పత్రిక తెలిపింది. ఈ నేపథ్యంలో హోంమంత్రి ఈ ఘటనపై అవాక్కయ్యేలా స్పందించారు. 'దురదృష్టం కొద్ది న్యూ ఇయర్ వంటి వేడుకల సందర్భాల్లోనే ఇలాంటివి జరుగుతుంటాయి. ఆ రోజు మొత్తం యువతే అక్కడ ఉన్నారు. వారంతా పాశ్చాత్య సంస్కృతి అనుసరిస్తున్న వారే. వారి ఆలోచన మాత్రమే కాదు.. వారి డ్రెస్సింగ్ స్టైల్ కూడా పాశ్చాత్య సంస్కృతిలాగే ఉంది. అందుకే కొంత గందరగోళం జరిగింది. కొంతమంది అమ్మాయిలను వేధింపులకు గురయ్యారు' అంటూ ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. దీనిపై జాతీయ మహిళ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రి వెంటనే సమాధానం చెప్పాలని, మొత్తం మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఆయనను వెంటనే మంత్రి పదవిలో నుంచి తొలగించాలని కోరింది. -
ఆమె రాత్రిపూట అక్కడెందుకు ఉండటం?
కర్ణాటక రాజధాని బెంగళూరు నడిబొడ్డున టెన్నిస్ క్లబ్ వద్ద జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై ఆ రాష్ట్ర హోం మంత్రి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేశారు. ''ఇది చాలా దురదృష్టకరం. తుముకూరుకు చెందిన ఓ మహిళ రాత్రి 9.30 గంటల సమయంలో టెన్నిస్ క్లబ్ వద్ద ఉంది. ఆమె టెన్నిస్ నేర్చుకోవాలని అక్కడికి వెళ్లిందన్నారు. కానీ, అసలు ఆ సమయంలో ఆమె అక్కడ ఎందుకు వేచి ఉందన్నదే అసలు ప్రశ్న. మేం అన్ని విషయాల మీద దర్యాప్తు చేస్తున్నాం'' అని హోం మంత్రి పరమేశ్వర వ్యాఖ్యానించారు. బెంగళూరు కబ్బన్ పార్కు వద్ద ఇద్దరు సెక్యూరిటీ గార్డులు 34 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేశారు. హోం మంత్రి వ్యాఖ్యలపై కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ మండిపడ్డారు. పరమేశ్వర వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆయన ఇలాంటి ప్రకటనలు చేయడం ఇదేమీ మొదటిసారి కాదని, దీనివల్ల ప్రజల్లోకి సరైన సందేశం వెళ్లదని ఆమె చెప్పారు. ఆయనకు తన పనిమీద ఆసక్తి లేకపోతే వెంటనే దిగిపోవాలని అన్నారు. గత నెలలో 22 ఏళ్ల కాల్ సెంటర్ ఉద్యోగినిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అప్పటి హోం మంత్రి కేజే జార్జి కూడా దానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇద్దరే చేస్తే అది గ్యాంగ్ రేప్ ఎందుకు అవుతుందని, కనీసం ముగ్గరు నలుగురు చేస్తే కదా.. అనాల్సింది అంటూ వ్యాఖ్యానించారు. కొన్నాళ్ల తర్వాతే ఆయన స్థానంలో పీసీసీ చీఫ్ పరమేశ్వరను నియమించారు. -
పదవుల పందేరం
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కాంగ్రెస్‌లో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదవుల పందేరం త్వరలోనే ప్రారంభం కానుంది. ఢిల్లీలో సోమవారం జరిగిన రాష్ర్ట కాంగ్రెస్ సమన్వయ సమితి సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. అలాంటి చర్చేమీ జరగలేదని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ. పరమేశ్వర ఢిల్లీలో ప్రకటించినప్పటికీ, త్వరలోనే నియామకాలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. మంత్రి వర్గ విస్తరణ, బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకంపై చర్చ జరిగినప్పుడు లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు వీటి జోలికి పోకూడదని తొలుత అనుకున్నప్పటికీ, సుదీర్ఘ వాదనల తర్వాత పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో వద్దనుకున్నారు. బోర్డులు, కార్పొరేషన్లలో సగం వాటిని భర్తీ చేయడం ద్వారా పార్టీ నాయకుల్లోని అసమ్మతిని తొలగించి.. నూతనోత్సాహాన్ని నింపవచ్చని అభిప్రాయం వ్యక్తమైంది. మిగిలిన వాటిని లోక్‌సభ ఎన్నికల తర్వాత భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. దీని వల్ల పదవులు పొందిన వారితో పాటు ఆశావహులు కూడా ఎన్నికల్లో బాగా పని చేస్తారని విశ్లేషించారు. అప్పుడే ప్రయత్నాలు పదవుల పందేరం ప్రారంభమవుతుందని తెలియగానే అనేక మంది శాసనస సభ్యులు తమకు ఆప్తులైన మంత్రులతో సమాలోచనలు జరిపారు. మరో వైపు మంత్రులు తమకు ఇష్టులైన కార్యకర్తలకు ఈ పదవులను ఇప్పించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తొలి దఫాలో మంత్రి వర్గంలో స్థానం లభించని జిల్లాలకు పదవులు లభించనున్నాయి. ఈ నెల 25 నుంచి బెల్గాంలో ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల తర్వాత నియామకాలను ప్రారంభించనున్నారు. విస్తరణ లేదు ఇప్పట్లో రాష్ర్ట మంత్రి వర్గ విస్తరణ లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. దివంగత ప్రధాని ఇందిరా గాంధీ 96వ జయంతిని పురస్కరించుకుని విధాన సౌధ ముంగిట మంగళవారం జాతీయ సమైక్యతా ప్రమాణం చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకానికి అధిష్టానం అంగీకరించిందని వెల్లడించారు. విధేయులకే ప్రాధాన్యం పార్టీ కోసం కష్టించి పని చేస్తున్న వారికే పదవులను ఇవ్వాల్సిందిగా రాహుల్ గాంధీ సూచించారని పరమేశ్వర తెలిపారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు బోర్డులు, కార్పొరేషన్ల అధ్యక్షుల నియామకంపై సమన్వయ కమిటీ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగిందని చెప్పారు. -
దిగ్విజయ్ జోక్యంతో దిగివచ్చిన ఎస్.ఎం.కృష్ణ
సాక్షి, బెంగళూరు: కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ జోక్యంతో మాజీ సీఎం ఎస్.ఎం.కృష్ణ ఎట్టకేలకు అలకపాన్పు నుంచి దిగివచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న కృష్ణ ఇంటికి దిగ్విజయ్ గురువారం పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరను వెంటపెట్టుకుని వెళ్లారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ వద్ద కృష్ణ తన అసంతృప్తిని వెళ్లగక్కినట్లు సమాచారం. మంత్రివర్గం కూర్పులో తన మాటకు విలువ ఇవ్వలేదని, ఎన్నికల సమయంలో తన సేవలను వినియోగించుకోవడం, ఆ తర్వాత విస్మరించడం మామూలైపోయిందని నిష్టూరాలాడినట్లు తెలిసింది. అయితే, దిగ్విజయ్ నచ్చజెప్పడంతో కృష్ణ శాంతించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.