Parikar
-
అంతా గవర్నర్ల విచక్షణేనా?
గోవా ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాకపోయినా గవర్నర్ మృదులా సిన్హా.. బీజేపీ నేత పరీకర్‌ను సీఎంగా నియమించడం వివాదానికి దారితీసింది. గోవాలో మాదిరే మణిపూర్ ఎన్నికల్లోనూ రెండో స్థానంలో నిలిచిన బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ నజ్మా హెప్తుల్లా ఆహ్వానం పలకడంతో ఈ వ్యవహారంపై దుమారం రేగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పక్షానికీ మెజారిటీ రాకపోతే.. ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. దీన్ని ఉల్లంఘించిన సందర్భాలూ ఉన్నాయి. హరియాణాలో.. 1982 మేలో జరిగిన హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 90 సీట్లకు గాను పాలక కాంగ్రెస్ 36, విపక్ష లోక్‌దళ్ 31 సాధించాయి. లోక్‌దళ్ పొత్తు పెట్టుకున్న బీజేపీకి 6 సీట్లు రావడంతో ఆ పార్టీ బలం 37కు చేరింది. 24వ తేదీన లోక్‌దళ్–బీజేపీ ఎమ్మెల్యేలతో కలసి రాజ్‌భవన్‌కు రావాలని కూటమి నేత, మాజీ సీఎం దేవీలాల్‌ను గవర్నర్ జీడీ తపాసే ఆదేశించారు. ఇందిర ప్రధానిగా ఉన్న ఆ సమయంలో ఏం జరిగిందోగానీ, కాంగ్రెస్ శాసనసభా పక్షనేతగా ఎన్నికైన సీఎం భజన్‌లాల్‌తో 23 సాయంత్రమే సీఎంగా తపాసే ప్రమాణం చేయించారు. వెంటనే దేవీలాల్ రాజ్‌భవన్‌కు వెళ్లి.. భజన్ సర్కారును రద్దుచేసి, తనతో సీఎంగా ప్రమాణం చేయించాలని గవర్నర్‌ను డిమాండ్ చేశారు. మెజారిటీ రాకున్నా అత్యధిక సీట్లు గెలిచిన పార్టీ(కాంగ్రెస్) నేతతో ప్రమాణం చేయించడం ఆనవాయితీగా వస్తోందని, తాను అదే చేశానని, గవర్నర్‌కు ఇలాంటి విచక్షణాధికారాలు ఉన్నాయని తపాసే వాదించారు. మైనారిటీని మెజారిటీగా మార్చడంలో ఆరితేరిన భజన్ రెండు రోజులకే మెజారిటీ కూడగట్టారు. లాల్ కోర్టుకెక్కినా ఫలితం లేకపోయింది. కేరళలో.. పొత్తు పెట్టుకున్న పార్టీలకొచ్చిన సీట్లన్నీ ఒకే పార్టీ సీట్లుగా పరిగణించిన సందర్భాలూ ఉన్నాయి. 1982 మేలోనే కేరళ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్‌కి మెజారిటీ వచ్చింది. తర్వాతి స్థానంలో సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్ నిలిచింది. కాంగ్రెస్‌కు విడిగా 20 , సీపీఎంకు విడిగా 26 సీట్లు వచ్చాయి. పెద్ద పార్టీని ఆహ్వానించే సంప్రదాయాన్ని పాటించాల్సి వస్తే.. గవర్నర్ సీపీఎం నేతతో సీఎంగా ప్రమాణం చేయించాలి. అయితే, గవర్నర్ యూడీఎఫ్ సారథి అయిన కాంగ్రెస్ నేతనే(సీఎల్పీ) సీఎంని చేశారు. మేఘాలయలో.. 1983 ఫిబ్రవరిలో 60 సీట్ల మేఘాలయ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ 25 సీట్లతో పెద్ద పార్టీగా అవతరించింది. విపక్షాలైన ఆల్ పార్టీ హిల్‌లీడర్స్ కాన్ఫరెన్స్(ఏపీహెచ్చెల్సీ)కు 15, హిల్‌స్టేట్ పీపుల్స్ డెమోక్రాటిక్ పార్టీ(హెచ్చెస్పీడీపీ)కి 15, పబ్లిక్ డిమాండ్స్ ఇంప్లిమెంటేషన్ కన్వెన్షెన్(పీడీఐసీ)కి 2 సీట్లు వచ్చాయి. పెద్ద పార్టీ నేతగా తననే సర్కారు ఏర్పాటుకు ఆహ్వానించాలని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కెప్టెన్ విలియంసన్ సంగ్మా గవర్నర్‌ను కోరారు. మెజారిటీకి అవసరమైన 32 మంది మద్దతు తనకుందంటూ ఏపీహెచ్చెల్సీ, హెచ్చెస్పీడీపీ, పీడీఐసీల కూటమి(యూఎంపీపీ) నేత లింగ్డో గవర్నర్‌కు జాబితా సమర్పించారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని లింగ్డోను గవర్నర్ ఆహ్వానించారు. పెద్ద పార్టీని సర్కారు ఏర్పాటుకు పిలవలేదు. సందర్భాన్నిబట్టి పెద్ద పార్టీని పిలవాలా? మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్న నేతను సీఎంను చేయాలా? అనే విషయంలో గవర్నర్‌కు ‘విచక్షణాధికారాలు’ ఉన్నాయని, అర్థమౌతుంది. 1990 ఫిబ్రవరి నాటి మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అతిపెద్ద పార్టీగా అవతరించిన కా>ంగ్రెస్‌కు గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వలేదు.అప్పుడు కేంద్రంలో నేషనల్ ఫ్రంట్ సర్కారు అధికారంలో ఉంది. ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లేదా కూటమి ప్రభావం, గవర్నర్ల వ్యక్తిత్వం వివిధ సందర్భాల్లో భిన్న సంప్రదాయాల అమలుకు దారితీస్తున్నాయి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చక్రం తిప్పిన ఢిల్లీ పెద్దలు!
గోవా, మణిపూర్లలో ఫలించిన బీజేపీ వ్యూహం ⇒ రెండో స్థానంలో ఉన్నా ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం ⇒ గోవాలో గడ్కారీ, పరీకర్.. మణిపూర్‌లో రాం మాధవ్, హిమంత ⇒ బీజేపీ ధనబలాన్ని ప్రయోగించిందని విపక్షాల ధ్వజం సాక్షి నేషనల్ డెస్క్: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ ఒక్క పంజాబ్‌లో తప్ప మిగిలిన చోట్ల బొక్కబోర్లా పడింది. మణిపూర్, గోవాల్లో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీగా నిలిచినా.. ప్రభుత్వ ఏర్పాటు వ్యూహంలో దారుణంగా విఫలమైంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన శక్తినుపయోగించి రాత్రికి రాత్రే చక్రం తిప్పేసింది. ఢిల్లీలోని పార్టీ పెద్దల సూచన ప్రకారం మణిపూర్, గోవాల్లో చిన్న పార్టీలు, ఇండిపెండెంట్లతో పొత్తులు కుదుర్చుకుని ప్రభుత్వ ఏర్పాటుకు ప్రమాణ స్వీకారం చేసుకుంది. ఇందుకు గవర్నర్లు రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని కాంగ్రెస్, ఆప్ విమర్శించినా.. పరిస్థితి అందిపుచ్చుకోవటంలో బీజేపీ పెద్దలు మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించారనేది సుస్పష్టం. ఎన్నికల ఫలితాలు విడుదలవటమే ఆలస్యం.. ఢిల్లీ నుంచి కమలం పార్టీ పెద్దలు ఆయా రాష్ట్రాల్లో వాలిపోయి పరిస్థితులు ‘చేతి’కందకుండా పరిస్థితులు చక్కబెట్టారు. దీంతో నేడు గోవాలో బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. మణిపూర్‌లో బీజేపీ తన మద్దతుదారుల జాబితాను గవర్నర్ నజ్మా హెప్తుల్లాకు సమర్పించింది. శనివారం రాత్రి ఏం జరిగింది? శనివారం వెల్లడైన ఐదు రాష్ట్రాల ఫలితాలతో బీజేపీ కార్యకర్తలు, నాయకులు సంబరాలు చేసుకుంటున్నా.. బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం మణిపూర్, గోవాల్లో ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టిపెట్టింది. ఎలాగైనా ఈ రెండు రాష్ట్రాల్లో గెలుస్తామనే ధీమాతోనే ఫలితాలు రాగానే అమిత్ షా ‘గోవా, మణిపూర్‌లలోనూ మా ప్రభుత్వమే ఉంటుంది’ అని బహిరంగంగా ప్రకటించగలిగారు. గోవా రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీని అమిత్‌షా రంగంలోకి దించారు. శనివారం రాత్రి గోవా చేరుకున్న నితిన్ గడ్కారీ.. వస్తూనే ‘మిషన్ గోవా సర్కారు’ను ప్రారంభించారు. పణజీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్లో మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఓ ఎన్సీపీ, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఆదివారం తెల్లవారుజామున 1 గంటనుంచి 4 గంటలవరకు మూడు గంటలపాటు వీరితో చర్చించి ప్రభుత్వానికి మద్దతిచ్చేలా ఒప్పించారు. దీంతో 13 సీట్లున్న బీజేపీకి ఏడుగురు చేరటంతో బలం 20కి పెరిగింది. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఎమ్మెల్యే కావాలి. దీంతో గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) ఎమ్మెల్యే విజయ్ సర్దేశాయ్తో పణజీ సమీపంలోని ఓ రిసార్టులో చర్చలు ప్రారంభించారు. ముగ్గురు ఎమ్మెల్యేలున్న జీఎఫ్తో ఉదయం ఎనిమిది గంటలవరకు జరిగినా సానుకూలంగా జరగలేదు. దీంతో మధ్యాహ్నం మరోసారి ఓ దూతను విజయ్ దగ్గరకు పంపిన గడ్కారీ.. డీల్ ఓకే (ముగ్గురికీ మంత్రి పదవులిచ్చేందుకు ఒప్పుకున్నట్లు సమాచారం) అయినట్లుగా జీఎఫ్తో మద్దతు పత్రాలపై సంతకాలు తీసుకున్నారు. దీంతో బీజేపీ బలం 23కు చేరింది. ఈ చర్చలన్నీ పరీకర్, గడ్కారీ సమక్షంలో జరిగాయి. అయితే పరీకర్‌ను తీవ్రంగా వ్యతిరేకించే విజయ్ సర్దేశాయ్.. సీఎంగా పరీకర్ ఉంటానంటేనే మద్దతిస్తాను అని ప్రకటించటం గమనార్హం. తెల్లారేసరికి మారిన ‘హంగ్’ మణిపూర్‌లోనూ అదే పరిస్థితి అధిష్టానం దూతలుగా ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించిన రామ్ మాధవ్, అస్సాం మంత్రి హిమంత్ బిస్వా శర్మలు శనివారం రాత్రికి రాత్రే చక్రం తిప్పారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఎన్పీపీ, ఎల్జేపీలతోపాటు ఓ టీఎంసీ ఎమ్మెల్యే, నాగా పీపుల్స్ ఫ్రంట్ ఎమ్మెల్యేలతో మాట్లాడి ప్రభుత్వానికి మద్దతిచ్చేందుకు ఒప్పించారు. హంగ్‌పై చర్చ జరుగుతుండగానే.. ఆదివారం తెల్లారేసరికి 32 ఎమ్మెల్యేల బలంతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సిద్ధమని ప్రకటించటం ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం జరిగిన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో శాసనసభాపక్ష నేతగా బీరేన్ సింగ్‌ను ఎన్నుకున్నారు. మణిపూర్ సీఎంగా బీరేన్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అధికార దుర్వినియోగమే: విపక్షాలు మణిపూర్, గోవాల్లో తమ చేతుల్లోంచి బీజేపీ అధికారాన్ని లాగేసుకుందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూనీ చేస్తోందని విరుచుకుపడింది. ‘ఎన్నికల ఫలితాల్లో రెండో స్థానంలో నిలిచిన పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే హక్కు ఎక్కడిది?’ అని మాజీ కేంద్రమంత్రి పి.చిదంబరం ప్రశ్నించారు. గోవాలో ప్రజాబలం కన్నా ధనబలమే విజయం సాధించిందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ట్వీట్ చేశారు. గోవాలో ధన, మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భంగపాటుకు గురైన ఆప్ కూడా బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించింది. గోవాలో ఎమ్మెల్యేలను ఎన్నుకునే బదులు.. ఎన్నికల సంఘం ఆ సీట్లను వేలం వేస్తే పార్టీలు కొనుక్కునేవని ఎద్దేవా చేసింది. నిమ్మకు నీరెత్తని కాంగ్రెస్ గోవాలో గడ్కారీ, పరీకర్ తమ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే పనిలో పడింది. పార్టీ పరిశీలకుడిగా గోవాలో మకాం వేసిన దిగ్విజయ్ సింగ్ సమక్షంలోనే ఎమ్మెల్యేలు నేనంటే నేను సీఎం అని పోటీ పడ్డారు. మెజారిటీకి తగ్గిన 4 సీట్ల గురించి ఆలోచించకుండానే.. ఆదివారమంతా హోటల్లో తమ బలాబలాల ప్రదర్శనలో పడ్డారు. సీఎల్పీ పదవికోసం రహస్య ఓటింగ్ నిర్వహించారు. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఓ ఎన్సీపీ అభ్యర్థి.. ప్రభుత్వం ఎవరు ఏర్పాటుచేసినా అందులో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతాలిచ్చినా.. కాంగ్రెస్‌నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశంలో ఉండగానే.. బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌తో భేటీకి వెళ్తున్న సమాచారం అందింది. -
గోవా ముఖ్యమంత్రిగా పరీకర్
-
గోవాలో హంగ్ అసెంబ్లీ
⇒ అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ ⇒ సీఎంతోపాటు ఆరుగురు మంత్రుల ఓటమి ⇒ రాజీనామా సమర్పించిన పర్సేకర్ పణజీ: ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో అతి చిన్నదైన గోవాలో ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత ఆధిక్యం సంపాదించలేకపోయింది. గోవా అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 40 కాగా అధికారం చేపట్టడానికి కావలసిన కనీస స్థానాలు 21. 17 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్‌కు 4 సీట్ల దూరంలో ఆగిపోగా, బీజేపీ 13 చోట్ల విజయం సాధించింది. మహారాష్ట్రవాడీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ)లు చెరో మూడు స్థానాల్లో గెలిచాయి. ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కూడా విజయ బావుటా ఎగురవేశారు. ఎన్సీపీకి ఒక స్థానం లభించింది. ఆమ్ఆద్మీపార్టీ (ఆప్) ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ప్రస్తుత ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి లక్ష్మీకాంత్ పర్సేకర్ మండ్రెమ్ స్థానం నుంచి పోటీ చేసి ఏడు వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ మంత్రివర్గంలోని ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు. పర్సేకర్ శనివారం గవర్నర్‌కు రాజీనామాను సమర్పించారు. 9 నుంచి 17కు పెరిగిన కాంగ్రెస్ బలం.. ప్రస్తుత అసెంబ్లీలో కేవలం 9 మంది సభ్యులను కలిగిన కాంగ్రెస్..ఈ ఎన్నికల్లో తన బలాన్ని దాదాపు రెట్టింపు చేసుకుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన దిగంబర్ కామత్, ప్రతాప్‌సిన్హ్ రాణే, రవి నాయక్, ల్యుజిన్హో ఫెలేరియోలు ఈ ఎన్నికల్లో భారీ విజయాలను అందుకున్నారు. హంగ్ రావడంతో చిన్న పార్టీలైన జీఎఫ్‌పీ, ఎంజీపీలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర వహించనున్నాయి. స్వతంత్రులు, ఇతరుల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్ మద్దతుతోనే గెలవడం లాభించే అంశం. మేం కూడా రేసులో ఉన్నాం: పరీకర్ కేంద్ర మంత్రి మనోహర్ పరీకర్ మాట్లాడుతూ ‘గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి బీజేపీ రేసులో ఉంది’అని అన్నారు. రాజీనామా సమర్పించిన అనంతరం లక్ష్మీకాంత్ పర్సేకర్ మాట్లాడుతూ ‘గోవా ప్రజలు తప్పు చేశారని నేను భావిస్తున్నా. వచ్చే ఐదేళ్లపాటు వారు పశ్చాత్తాప పడతారు’అని వ్యాఖ్యానించారు. -
నేడు ఢిల్లీకి మంత్రి కేటీఆర్
► కంటోన్మెంట్ రోడ్ల మూసివేతపై రక్షణ మంత్రితో చర్చ ► విదేశాంగ మంత్రి సుష్మతో భేటీ. సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ వెళ్తున్నారు. పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి మనోహర్ పరీకర్‌తో బుధవారం సమావేశం కానున్నారు. కంటోన్మెంట్ రోడ్ల మూసివేత నిర్ణయంపై పునఃపరిశీలన జరపాలని పరీకర్‌ను కోరనున్నారు. కంటోన్మెంట్ రోడ్లను మూసివేయాలని రక్షణ శాఖ నిర్ణయించడంతో ఆ రోడ్లపై నిత్యం రాకపోకలు సాగించే లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. ప్రత్యామ్నాయ రోడ్లను నిర్మించే వరకు కంటోన్మెంట్ రోడ్ల మూసివేత నిర్ణయాన్ని వారుుదా వేయాలని కోరనున్నారు. కేటీఆర్‌తోపాటు రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి, కంటోన్మెంట్ బోర్డు అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. ప్రవాస భారతీయుల సమస్యలపై.. మరోవైపు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో సమావేశమై ప్రవాస భారతీయుల రక్షణకు సంబంధించిన అంశాలను కేటీఆర్ ప్రస్తావిస్తారు. గల్ఫ్‌కు వలస వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందజేయనున్నారు. మరుసటి రోజు కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రిని కలసి రాష్ట్రంలో టెక్స్టైల్ పార్కుల ఏర్పాటు అంశంపై చర్చిస్తారు. పర్యటనలో కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, నిర్మలా సీతారామన్‌లను కూడా కలవనున్నారు. గురువారం ఫ్రెంచ్, స్వీడెన్ ఎంబసీ ప్రతినిధులను కేటీఆర్ కలవనున్నట్లు మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. -
రక్షణ బంధం బలోపేతం
వాషింగ్టన్: భారత-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా.. ఇరు దేశాలు మంగళవారం కీలకమైన రక్షణ వ్యూహరచన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిద్వారా ఇరు దేశాలు.. ఒకరి మిలటరీ, రక్షణ రంగ ఆస్తులు, ఎయిర్ బేస్‌లను మరొకరు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఇరు దేశాల మిలటరీ సంయుక్తంగా సమర్థవంతమైన ఆపరేషన్లు చేపట్టవచ్చు. వాషింగ్టన్లో భారత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, అమెరికా రక్షణ సెక్రటరీ ఆష్టన్ కార్టర్ మధ్య ‘లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రీమెంట్’ (ఎల్ఈఎమ్ఓఏ)పై ఒప్పందం జరిగింది. ఇరుదేశాల మిలటరీ మధ్య రక్షణ రంగంలో సాయం, ఆయుధాల సరఫరా, సేవలు వంటివి తిరిగి చెల్లించే పద్ధతిలో వినియోగించుకోవచ్చు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా తన మిత్ర, సన్నిహిత దేశాలతో రక్షణ రంగంలో ఉన్న సాంకేతికత, వ్యాపార సహకార సంబంధాలను ఇకపై భారత్‌తోనూ కొనసాగించనుందని.. ఒప్పందం తర్వాత సంయుక్త ప్రకటనలో అమెరికా వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో అమెరికా ఎయిర్‌బేస్‌లను నిర్మించుకోదని.. కేవలం ఇక్కడి సేవలను అమెరికా మిలటరీ వినియోగించుకుంటుందని పరీకర్ తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతం చేయటంలో ఈ ఒప్పందం కీలకమన్నారు. మరో రెండు ఒప్పందాలకు (సీఐఎస్ఎమ్ఓఏ, బీఈఏసీఏ) అమెరికా పట్టుపడుతున్నా సంతకాలు చేసేందుకు భారత్ తొందర పడటం లేదని పరీకర్ తెలిపారు.