Parimal Nathwani
-
‘జగన్ భవిష్యత్తులో మీరు ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారు’
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మూడోస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పరిమళ్ నత్వాని సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇదే పని తీరుతో త్వరలోనే ఆయన ప్రథమస్థానంలో నిలుస్తారని ఆకాంక్షించారు. ఈ మేరకు శనివారం పరిమళ్ నత్వాని ట్వీట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఒక్క ఏడాదిలోనే సీఎం జగన్.. అత్యంత ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో మూడోస్థానం సంపాదించడం నిజంగా ప్రశంసనీయం. ఏపీ ప్రజల సంక్షేమం కోసం అన్ని రంగాల్లో విస్తృమైన కృషి చేస్తన్న మీరు.. భవిష్యత్తులో ఫస్ట్ ర్యాంక్ సాధిస్తారని నాకు తెలుసు’ అంటూ ట్వీట్ చేశారు. (ఆ పదవికి రాహులైతేనే బెస్ట్) It is commendable that on completion of just 1yr as #AP CM, Shri @ysjagan has been ranked as 3rd best performing CM in #India by @IndiaToday Mood of the Nation survey. I am sure that in future he will rise to 1st rank based on extensive work he is doing on all fronts for AP. pic.twitter.com/uij9g2qgVV — Parimal Nathwani (@mpparimal) August 8, 2020 ఇండియా టుడే మూడ్ ఆఫ్‌ది నేషన్ నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంలలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌కు ప్రథమ స్థానం దక్కగా.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తొమ్మిదో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. -
‘సీఎం జగన్ పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శం’
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పరిమళ్ నత్వాని ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం వైఎస్ జగన్ అమలు చేస్తున్న పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిస్తున్నాయని ట్విటర్లో పేర్కొన్నారు. ఇంటింటి సర్వే, వలంటీర్ వ్యవస్థలతో పాటుగా అనేక పథకాలను ఇతర రాష్ట్రాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని అన్నారు. జాతీయ మీడియా న్యూస్ ఎక్స్‌లో వచ్చిన ఓ కథనాన్ని ఆయన షేర్ చేశారు. కరోనాపై పోరులో తొలి నుంచి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న కృషికి ఇది నిదర్శనమని చెప్పారు. (చదవండి : అప్పటికి.. ఇప్పటికీ తేడా చూడండి) కరోనాపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న పోరాటాన్ని పలు రాష్ట్రాలు అనుకరిస్తున్నాయని న్యూస్ ఎక్స్ ఆ కథనంలో పేర్కొంది. కరోనా మహమ్మారిని ఎదురించేందుకు నూతన మార్గాలను అవలంబించడంలో ఏపీ ముందుందని.. ఇది ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపింది. కరోనాపై పోరులో భాగంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే, సాంకేతిక పరికరాల వినియోగం, వలంటీర్ వ్యవస్థ, డోర్ టు డోర్ సర్వేలను ప్రధానంగా ఆ కథనంలో ప్రస్తావించింది. Many state govts are adopting @AndhraPradeshCM's initiatives like door-to-door survey, volunteer system & other practices to #FightagainstCoronavirus. This validates good work @ysjagan has been doing in #AndhraFightsCorona right from the start. #YSJagan https://t.co/tYrcEetP9S pic.twitter.com/AwA2VOCLsV — Parimal Nathwani (@mpparimal) June 25, 2020 -
‘ రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోంది’
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను నియమించిన ప్రక్రియ రాజకీయ విశ్లేషకులనే ఆశ్చర్యపరుస్తోందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణ అన్నారు. బుధవారం వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానిలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా రాజ్యసభ అభ్యర్థులకు సీఎం జగన్ పార్టీ బీ-ఫామ్‌ను అందించారు. అనంతరం నలుగురు అభ్యర్థులు అసెంబ్లీకి బయల్దేరి వెళ్లి రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేశారు. అనంతరం మోపిదేవి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ బీసీలకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో రెండు స్థానాలు బీసీలకు.. రాష్ట్ర అభివృద్ధి కోసం నత్వానికి.. పారిశ్రామిక అభివృద్ధి కోసం అయోధ్య రామిరెడ్డికి సీటు ఇచ్చారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. నాయకులను చంద్రబాబు నాయుడులా వాడుకొని వదిలేయడం సీఎం జగన్‌కు తెలియదు. చంద్రబాబు నాయకులను కరివేపాకుల వాడి వదిలేస్తారు. దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా ప్రధమ స్థానంలో సీఎం జగన్ ఉంటారు. బీసీ వర్గాలకు చెందిన తమకు రాజ్యసభ పదవులు వస్తాయని అనుకోలేద’ని అన్నారు. ( సీఎం జగన్‌ను కలిసిన రాజ్యసభ అభ్యర్థులు ) ముందు చూపుతో అభ్యర్థులను ఎంపిక చేశారు : అయోధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో అభ్యర్థులను ఎంపిక చేశారని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి అయోధ్య రామిరెడ్డి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామన్నారు. సీఎం వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని అన్నారు. సీఎం జగన్ నాయకత్వంలో పని చేయడాన్ని గర్వంగా భావిస్తున్నానన్నారు. మేకిన్ ఇండియాలో భాగంగా మేకిన్ ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. వైఎస్ జగన్ రాజ్యసభ ఇవ్వటం గర్వంగా ఉంది : నత్వాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు రాజ్యసభ ఇవ్వటం గర్వంగా ఉందని వైఎస్సార్ సీపీ రాజ్యసభ అభ్యర్థి పరిమల్ నత్వాని అన్నారు. తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తానని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడుల అంశంపై తమ ఛైర్మన్ అంబానీ, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో చర్చించారని తెలిపారు. -
సీఎం జగన్‌ను కలిసిన నత్వానీ
సాక్షి, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంపీ పరిమల్ నత్వానీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిత్వం ఇచ్చినందుకు సీఎం వైఎస్ జగన్‌కు నత్వానీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నత్వానీ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తనను రాజ్యసభకు నామినేట్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. మళ్లీ ముఖ్యమంత్రిని కలిసి రాష్ట్రాభివృద్ధిపై చర్చిస్తానని అన్నారు. కాగా, నత్వానీ బుధవారం ఏపీ నుంచి రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ముందు నత్వానీ విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ ఏ బాధ్యత అప్పగించి ముందుండి పూర్తిచేస్తానని చెప్పారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులను తీసుకురావడంలో సీఎం జగన్ చెప్పినట్లు పనిచేస్తూ సాధించుకుంటామని తెలిపారు. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా నత్వానీతో పాటు ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, పార్టీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డిలను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. చదవండి : వైఎస్ జగన్‌తో కలిసి పనిచేయడం సంతోషకరం: నత్వానీ -
జగన్‌తో కలిసి పనిచేయడం సంతోషకరం: నత్వానీ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సన్నిహితుడు, ఎంపీ పరిమల్ నత్వానీ మంగళవారం నాడు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'ఏపీ నుంచి పెద్దల సభకు అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం వల్లనే తనకు మూడోసారి రాజ్యసభకు వెళ్లే అరుదైన అవకాశం దక్కిందన్నారు. సీఎం ఏ బాధ్యత అప్పగించిన తన వంతుగా ముందుండి పూర్తిచేస్తానని అన్నారు. కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన నిధులను తీసుకురావడంలో సీఎం జగన్ చెప్పినట్లు పనిచేస్తూ సాధించుకుంటామని తెలిపారు. తనకున్న అనుభవాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తానని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్న వైఎస్ జగన్‌తో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. పార్టీ ఎంపీలతో కలిసి టీమ్ వర్క్ చేస్తూ రాష్ట్రం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని' ఎంపీ నత్వానీ వెల్లడించారు. చదవండి: సీఎం జగన్‌కు ధన్యవాదాలు : పరిమల్ సగం బీసీలకే; బోస్, మోపిదేవిలకు అవకాశం -
సగం బీసీలకే; బోస్, మోపిదేవిలకు అవకాశం
సాక్షి, అమరావతి: బీసీల సాధికారత, సామాజిక న్యాయం దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న వైఎస్సార్ సీపీ వారికి మరోసారి పెద్దపీట వేసింది. వైఎస్సార్ సీపీకి లభించే నాలుగు రాజ్యసభ స్థానాల్లో రెండిటిని బీసీలకే కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నిబద్ధతను చాటుకున్నారు. పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రి మోపిదేవి వెంకటరమణారావు, పార్టీ నేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డితోపాటు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ సన్నిహితుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ పరిమల్ ధీరజ్‌లాల్ నత్వానీని ఎంపిక చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, శాసన మండలిలో పార్టీ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సోమవారం పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన వైఎస్సార్సీపీ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోవడం ఖాయమన్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ తరఫున రాజ్యసభకు వెళ్లే అవకాశం ఎవరికి దక్కుతుందన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. సామాజిక సమీకరణాలు, పార్టీకి చేసిన సేవలు, రాష్ట్రాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభ సభ్యులను ఎంపిక చేశారు. నమ్ముకున్న వారికి అండగా.. పిల్లి సుభాష్‌చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావులను రాజ్యసభ సభ్యులుగా ఎంపిక చేయడం ద్వారా తాను బీసీ పక్షపాతినని, దివంగత వైఎస్సార్ తనయుడిగా నమ్మకున్న వారికి సదా అండగా ఉంటానని సీఎం జగన్ మరోసారి నిరూపించుకున్నారు. పిల్లి సుభాష్ చంద్రబోస్ వైఎస్సార్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. వైఎస్సార్ సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌కు ఎమ్మెల్సీగా వైఎస్ జగన్ అవకాశం కల్పించారు. 2019 ఎన్నికల్లో మండపేట నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంలో కీలక స్థానం కల్పించారు. ఉపముఖ్యమంత్రిగా, రెవెన్యూ శాఖ మంత్రిగా నియమించారు. శాసనమండలిని రద్దు చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించాలని సీఎం నిర్ణయించారు. అయోధ్య రామిరెడ్డి సేవలకు గుర్తింపు ప్రముఖ పారిశ్రామికవేత్త, రాంకీ గ్రూప్ అధినేత ఆళ్ల అయోధ్య రామిరెడ్డి వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తున్నారు. 2014 ఎన్నికల్లో నరసరావుపేట నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో సామాజిక సమీకరణాల వల్ల ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయారు. పార్టీ వ్యవహారాల్లో కీలకంగా ఉంటూ వచ్చిన ఆయన సేవలకు గుర్తింపుగా రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం నత్వానీకి అవకాశం విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని పెంపొందించేందుకు ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమల్ ధీరజ్‌లాల్ నత్వానీని రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేశారు. ప్రస్తుతం జార్ఖండ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన పదవీకాలం ఏప్రిల్‌తో ముగియనుంది. ముఖేష్ అంబానీ ఇటీవల స్వయంగా తాడేపల్లి వచ్చి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయిన విషయం విదితమే. ఈ సందర్భంగా నత్వానీకి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రిని కోరారు. విధేయతకు పట్టం బీసీ వర్గానికే చెందిన మంత్రి మోపిదేవి వెంకటరమణారావు కూడా దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి సన్నిహితుడే. వైఎస్సార్ హయాంలో మంత్రిగా ఉన్న ఆయన అనంతరం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటి ఉంటూ వైఎస్సార్సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికీ బీసీ వర్గానికి చెందిన మోపిదేవి వెంకటరమణారావుకు ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. తాజాగా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించారు. బీసీలు, పార్టీకి విధేయులుగా ఉన్నవారికి తప్పకుండా గుర్తింపు కల్పిస్తామని రుజువు చేశారు. రాష్ట్రాభివృద్ధికి దోహదం బీసీలకు పెద్దపీట వేస్తూ రాష్ట్రాభివృద్ధికి దోహదపడేలా ముఖ్యమంత్రి జగన్ రాజ్యసభ సభ్యులను ఎంపిక చేశారని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ, శాసనమండలిలో పార్టీ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పార్టీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను వెల్లడించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సగం బీసీలకే కేటాయించడం ద్వారా ముఖ్యమంత్రి జగన్ వెనుకబడిన వర్గాల పట్ల నిబద్ధత చాటుకున్నారని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తామని ముఖేష్ అంబానీ ముఖ్యమంత్రికి మాట ఇచ్చారని తెలిపారు. చరిత్రలో నిలుస్తుంది.. ముఖ్యమంత్రి జగన్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తారని మరోసారి రుజువైంది. ఒకేసారి ఇద్దరు బీసీ నాయకులను అత్యున్నత సభకు పంపించడం కీలక ఘట్టంగా ఏపీ చరిత్రలో నిలుస్తుంది. నా ఎదుగు దలకు దివంగత వైఎస్సార్ బీజం వేస్తే ఆయన తనయుడు, సీఎం జగన్ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యం కల్పించారు. వైఎస్ కుటుంబానికి రుణపడి ఉంటా. –మోపిదేవి వెంకటరమణారావు, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ మంత్రి ఊహించలేదు.. రాజ్యసభకు వెళతానని కలలో కూడా ఊహించలేదు. విశ్వసనీయతతో పనిచేసే వారికి పార్టీలో కచ్చితంగా సముచిత స్థానం లభిస్తుంది. పెద్దల సభకు ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. బీసీలకు పెద్దపీట వేసింది ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే. – పిల్లి సుభాష్ చంద్రబోస్, డిప్యూటీ సీఎం ఏపీ అభివృద్ధికి కృషి చేస్తా ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి నా కృతజ్ఞతలు. ఏపీ అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేస్తాను. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉంటాను. –పరిమల్ నత్వానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేట్ వ్యవహారాల ప్రెసిడెంట్ -
సీఎం జగన్‌కు ధన్యవాదాలు : పరిమల్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎంపీ పరిమల్ నత్వాని ధన్యవాదాలు తెలిపారు. ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ విజ్ఞప్తి మేరకు పరిమల్‌ను ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పెద్దల సభకు నామినేట్ చేసిందుకు సీఎం జగన్‌కు, వైఎస్సార్సీపీకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిమల్ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. ‘ఏపీ ప్రజలకు ధన్యవాదాలు. నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తాను’ అని పోస్ట్ చేశారు. (వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు) ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమల్ నత్వానీ ప్రస్తుతం జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. త్వరలో అయన రాజ్యసభ పదవీకాలం పూర్తవుకానుంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పరిమల్‌ను రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని అంబానీ స్వయంగా వచ్చి సీఎం వైఎస్ జగన్‌ను కోరారు. అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి సహకరిస్తామని భరోసా కూడా ఇచ్చారు. దీంతో పార్టీ ముఖ్యనేతలో చర్చించిన అనంతరం పరిమల్‌ను పెద్దల సభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. I sincerely thank Hon'ble Chief Minister Sh @ysjagan and his party @YSRCParty for considering me as their Rajya Sabha candidate from Andhra Pradesh. I am committed to serve the people of #AndhraPradesh. @PMOIndia @narendramodi @AmitShah #RajyaSabha pic.twitter.com/DEX3KE8Urb — Parimal Nathwani (@mpparimal) March 9, 2020