Parliament activities
-
ప్రజల వాణి వినిపించడంలో మన గొంతు కూడా మూగబోయిందని అనుకుంటున్నారు!
ప్రజల వాణి వినిపించడంలో మన గొంతు కూడా మూగబోయిందని అనుకుంటున్నారు! -
కాంగ్రెస్‌వి ప్రతీకార రాజకీయాలు
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు - అందుకే పార్లమెంటును అడ్డుకుంటున్నారు.. - ఇదే తీరు కొనసాగితే.. భవిష్యత్తులో ఒక్క సీటూ గెలవలేరు - ప్రధాన విపక్షంపై ప్రధాని మోదీ ధ్వజం రుషీకేశ్/చండీగఢ్: పార్లమెంట్ కార్యక్రమాలను అడ్డుకుంటూ కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో చవిచూసిన ఘోర ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతూ దేశం అభివృద్ధి పథంలో ముందుకెళ్లడాన్ని అడ్డుకుంటోందన్నారు. ఇలాగే వ్యవహరిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటూ గెలుచుకోలేదన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు వారిని ఘోరంగా ఓడించారు. అందుకు వారిపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు. పార్లమెంటును సాగనివ్వడం లేదు. దేశాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ప్రతికూల రాజకీయాలకు పాల్పడుతున్న వారిని ప్రజలు గమనించాలి. రానున్నరోజుల్లోనూ వారికి తగిన గుణపాఠం నేర్పించాలి’ అన్నారు. చండీగఢ్, రుషికేశ్‌లలో జరిగిన బహిరంగ సభల్లో శుక్రవారం మోదీ పాల్గొన్నారు. 40 మంది ఎంపీలు కుట్రపూరితంగా పార్లమెంట్లో ప్రజాస్వామ్య ప్రక్రియను అడ్డుకుంటూ, ప్రజాస్వామ్యంతో ఆడుకుంటున్నారని మోదీ కాంగ్రెస్ ఎంపీలపై మండిపడ్డారు. వారు చేసేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ‘లోక్‌సభ పైన ప్రజా జనసభ ఉంటుంది. అందుకే నా అభిప్రాయాల్ని ఇక్కడ ఈ జనసభలో వ్యక్తం చేస్తున్నా’నన్నారు. ‘ప్రతికూల రాజకీయాలకు, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించడానికి తేడా ఉంది. ప్రతిపక్షంగా ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం, భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేయడం మంచిదే. కానీ ప్రతీకారాత్మక రాజకీయాలు చేయడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ తేడాను కాంగ్రెస్ గుర్తించాలి. ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజా తీర్పును గౌరవించడం నేర్చుకోవాలి’ అని హితవు చెప్పారు. గతంలో బీజేపీ కూడా రెండే స్థానాలు గెలుచుకున్న సందర్భముందని, అయితే, బీజేపీ ఏనాడు ఇలా ప్రతీకార రాజకీయాలకు పాల్పడలేదని, సమస్యలపై పోరాడి ప్రజల హృదయం గెలుచుకుందని అన్నారు. ‘ప్రతిపక్షంలో కూర్చోవడానికి వారు(కాంగ్రెస్) ఇంకా అలవాటు పడలేదు. బీజేపీ ఇలా సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారం మా కుటుంబ ఆస్తి. దాన్ని ఒక చాయ్‌వాలా.. ఒక పేదవాడి కొడుకు.. ఒక సామాన్యుడు మా నుంచి లాక్కోవడం ఏంటి..? అని వారు అసహనంతో ఉన్నారు. ఈ వైఖరి వారి పేదల వ్యతిరేక మనస్తత్వానికి అద్దం పడుతోంది’ అని కాంగ్రెస్‌పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. గతంలో పంచాయతీల నుంచి పార్లమెంటు వరకు రెపరెపలాడిన కాంగ్రెస్ జెండా ఇప్పుడెక్కడా కనిపించడం లేదంటూ ఎద్దేవా చేశారు. చండీగఢ్ హౌసింగ్ బోర్డ్వారి ఒక కార్యక్రమంలో పాల్గొంటూ.. 2022 నాటికి దేశంలోని నిరుపేదలకు కూడా గృహ వసతి కల్పించడం తన స్వప్నమన్నారు. ఈ సందర్భంగా ఒక మొబైల్ యాప్‌ను, వెబ్‌సైట్‌ను ప్రధాని ప్రారంభించారు. ఇలాంటివాటి వల్ల సామాన్యులకు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం లభిస్తుందన్నారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ ప్రారంభం చండీగఢ్ విమానాశ్రయంలో అధునాతన టెర్మినల్‌ను మోదీ ప్రారంభించారు. పంజాబ్, హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల ప్రజలకు, ఈ ప్రాంతాల ఆర్థికాభివృద్ధికి ఇది ఎంతో ఉపయోగపడ్తుందన్నారు. పంజాబ్, హరియాణా, చండీగఢ్‌ల్లో ఈ విమానాశ్రయం ఎవరికి చెందుతుందన్న వివాదాన్ని ఆయన కొట్టేశారు.ఇథనాల్ ఉత్పత్తికి అనుమతి ..మొక్కజొన్న నుంచి ఇథనాల్ తయారు చేసేందుకు త్వరలో పంజాబ్ రైతులకు కేంద్రం తరఫున అనుమతినిస్తామని మోదీ ప్రకటించారు. మొక్కజొన్న అధికంగా పండే పంజాబ్‌కు ఇది ఆర్థికంగా ఎంతో ఉపయోగకరమన్నారు. ములాయంపై మరోసారి ప్రశంసలు పార్లమెంటు కార్యకలాపాలను కాంగ్రెస్ అడ్డుకోవడాన్ని తప్పుబట్టడం ద్వారా.. ప్రతిపక్ష నేత అయినప్పటికీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సాధ్యమైనంత కృషి చేశారం’టూ సమాజ్‌వాదీ నేత ములాయంపై మోదీ మళ్లీ ప్రశంసలు గుప్పించారు. యూపీలో జరిగిన ఒక సభలో శుక్రవారం ప్రధాని పాల్గొన్నారు. ఇబ్బంది కలిగించాను.. సారీ! నగరంలో శుక్రవారం ప్రధాని మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా జన జీవనం అస్తవ్యస్తం అయింది. ట్రాఫిక్ స్తంభించింది. అధికారులు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను మూసేయించారు. చనిపోయిన తమవారిని ఖననం చేసేందుకు కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న మోదీ.. తన పర్యటనతో నగర ప్రజలకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నానంటూ ట్విటర్లో క్షమాపణలు కోరారు. దీనిపై విచారణ జరపాలని స్థానిక అధికారులను ఆదేశించారు. -
మూడన్నారు... ఒక్కటీ లేదు !
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై రాజకీయవర్గాలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రవిభజన సమయంలో చేసిన హామీల అమలుపై చిత్తశుద్ధి చూపకపోవడం...వెనుకబడిన ప్రాంతమని తెలిసి...అభివృద్ధి కోసం దన్నుగా నిలవకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో సెంట్రల్ యూనివర్శిటీ, ఎయిమ్స్‌కు అనుబంధ కేంద్రం, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మూడింటిలో ఒక్క హామీని కూడా బడ్జెట్లో ప్రస్తావించలేదు. దీనికి తోడు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విస్మరించారని, మహిళా, స్త్రీ శిశుసంక్షేమశాఖకు నిధులు కేటాయింపుల్లో కోత వేయడం కూడా సరికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌పై దాదాపు అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బడ్జెట్‌పై ప్రముఖుల స్పందన... ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆశించిన నవ్యాంధ్రప్రదేశ్ ప్రజలకు నిరాశే మిగిలింది. నిన్న రైల్వే బడ్జెట్లో పూర్తిగా అన్యాయం జరిగింది. నేడు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో నిరాశే మిగిలింది. ఆర్భాట ప్రచారాలతో హోరెత్తించిన బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక నిధులు కేటాయించడంలో మొండి చేయి చూపింది. దీనిపై రాజకీయ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. -అనంతపురం అర్బన్ బడ్జెట్లో తీవ్ర అన్యాయం ఇది ఏమాత్రం పేదలకు ఉపయోగపడే బడ్టెట్ కాదు.. ఎన్నికల ముందు ప్రచార ఆర్భాటాలు చేసిన ప్రధానమంత్రి మోదీ ఎన్నికల తరువాత అదే ప్రచార ఆర్భాటాలతో హోరెత్తిస్తున్నారు. ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక బడ్జెట్ కల్పించడంలో కేంద్రం విఫలమైంది. పోలవరం, ప్రత్యేక ప్యాకే జీపై ఉసే లేదు. బడ్జెట్లో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేసి మొండి చేయి చూపింది. రైల్వే బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ బడ్జెట్లో కూడా అలాగే చేయడం బాధకరం. రాష్ట్రానికి ప్రత్యేక నిధులు కావడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -ఎం.శంకర్‌నారాయణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రాయలసీమకు తీవ్ర అన్యాయం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలను చులకనగా చూస్తోంది. బడ్జెట్ కేటాయింపులు దీనినే సూచిస్తోంది. ప్రధానంగా రాయలసీమకి తీవ్ర అన్యాయం జరిగింది. విభజన హామీలన్నింటినీ తుంగలో తొక్కారు. వెనుబడిన రాయలసీమ ప్రయోజనాన్ని చేకూర్చే ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ చేతులెత్తేసింది. కేంద్ర విద్యా సంస్థలను కూడా అరకొర కేటాయింపులు చేసి వివక్ష చూపారు. ఇరిగేషన్ నిధులకు భారీగా కొత పెట్టారు. టీడీపీ మెతకవైఖరి మాని, కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగి, రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టాలి. కార్పొరేట్ సంస్థలకు ట్యాక్స్‌లు తగ్గించి, సాధారణ ప్రజలకు ఇవ్వాల్సిన సబ్సిడీలపై మాత్రం దాడి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నిజ స్వరూపం ఏమిటో బయటపడింది. -గేయానంద్, ఎమ్మెల్సీ బడ్జెట్ ఆశాజనకంగా ఉంది ఎంతో అనుభవమున్న మంత్రుల బృందం ఉండడంతో కేంద్రప్రభుత్వం ప్రవేశపెడుతున్న పలు పథకాలు ఆశాజనకంగా ఉంటున్నాయి. ముఖ్యంగా కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లు సామాన్యులకు అండగా నిలుస్తున్నాయి. మేక్ ఇన్ ఇండియా, జన్‌పథ్, స్వచ్ఛభారత్ లాంటి పథకాల ద్వారా నిరుద్యోగులు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే మహిళలు, చిన్నారుల అభివృద్ధిని కాంక్షించే విధంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది. ఏది ఏమైనా దేశ ఆర్థిక వ్యవస్థను గాడీలో పెట్టేలా బడ్జెట్ సాగడం ఆహ్వానించదగిన విషయం. -అంకాళ్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు -
8 రోజులు అడ్డుకుంటే చాలు
సీమాంధ్ర ఎంపీల వ్యూహం సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటే ప్రస్తుతానికి రాష్ట్ర విభజన ప్రక్రియను నిలిపివేయగలుగుతామని పలువురు సీమాంధ్ర ఎంపీలు అభిప్రాయపడ్డారు. సమావేశాల గడువు ఇంకా ఎనిమిది రోజులే ఉన్నందున ఈ లోపు నిరసనలు, ఆందోళనలు... ఇలా ఏ పద్ధతిలోనైనా సభను అడ్డుకునేందుకు పార్టీలకతీతంగా సీమాంధ్ర ప్రాంత ఎంపీలంతా సిద్ధంగా ఉన్నారని వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై లోక్‌సభ, రాజ్యసభల్లో చర్చ తదితర అంశాలపై ఢిల్లీలోని వైఎంసీఏ కాన్ఫరెన్స్హాల్లో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం (ఏపీజేఎఫ్) ఆధ్వర్యంలో ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణాంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన సెమినార్లో కాంగ్రెస్‌పార్టీ ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బంహరి, టీడీపీ ఎంపీలు నిమ్మల కిష్టప్ప, మోదుగుల వేణుగోపాలరెడ్డి, సుజనాచౌదరి, సీఎం రమేశ్, ఏపీఎన్జీఓల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు, పలు సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సభలో కేవీపీ మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలోనే తెలుగువారి అభివృద్ధి సాధ్యమని నమ్మే వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి పొందిన స్ఫూర్తితోనేతాను ఉద్యమంలో పాల్గొంటున్నానని చెప్పారు. ఉండవల్లి మాట్లాడుతూ రాజ్యసభలో బిల్లుపెడితే దానికి ఎప్పటికీ కాల దోషం ఉండదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ముందుగా అక్కడ ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు.