Pasting
-
పండంటి ఉపవాసంతో.. ఆరోగ్య లాభాలు!
ఉపవాసాలు రకరకాలు. ఒక రోజంతా కేవలం నీటిని తాగుతూ ఇతర ఏ ఆహారమూ తీసుకోకుండా ఉపవసించడాన్ని జలోపవాసం అంటారు. ఒక రోజంతా పండ్లను మాత్రమే తీసుకుంటూ ఇతర ఏ ఆహారపదార్థాలను తీసుకోకుండా ఉండడాన్ని ఫలోపవాసం అంటారు.వారం లేదా రెండు వారాలకో రోజు ఏదో ఒక ఉపవాసాన్నిపాటించడం వల్ల దేహం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తశుద్ధి జరిగి చర్మం నిగారిస్తూ ఉంటుంది. ఉపవాసాలు రకరకాలు. ఒక రోజంతా కేవలం నీటిని తాగుతూ ఇతర ఏ ఆహారమూ తీసుకోకుండా ఉపవసించడాన్ని జలోపవాసం అంటారు. ఒక రోజంతా పండ్లను మాత్రమే తీసుకుంటూ ఇతర ఏ ఆహారపదార్థాలను తీసుకోకుండా ఉండడాన్ని ఫలోపవాసం అంటారు. వారం లేదా రెండు వారాలకో రోజు ఏదో ఒక ఉపవాసాన్నిపాటించడం వల్ల దేహం ఆరోగ్యంగా ఉంటుంది. రక్తశుద్ధి జరిగి చర్మం నిగారిస్తూ ఉంటుంది.ఇవి చదవండి: జాను శీర్షాసనం.. తల నుంచి మోకాలి వరకు! -
Ramzan: సుర్మాతో.. కంటి సంబంధిత వ్యాధులకు చెక్!
ముస్లింలు పవిత్ర మాసంగా భావించే రంజాన్ మాసంలో ‘సుర్మా’ ఆద్యంతం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ప్రత్యేకత చాటుతోంది. ఈ మాసంలో ముస్లింలు వయోభేదం లేకుండా త్రికరణ శుద్ధితో ఉపవాసం(రోజా)ఉంటారు. ఖురాన్ పఠిస్తూ ఐదు పూటలా నమాజ్ ఆచరిస్తారు. మహ్మద్ ప్రవక్త బాటను అనుసరిస్తూ నిష్టగా ఉంటారు. ఈ క్రమంలో ఈ మాసంలో ముస్లింల నేత్రాలకు అలంకరించే సుర్మాకు ఎంతో విశిష్టత ఉంది. విధిగా కళ్లకు సుర్మా అలంకరించడం పవిత్ర కార్యంగా భావిస్తారు. సువాసన వెదజల్లే అత్తర్లకు ప్రాధాన్యమిస్తారు. ఇదీ.. సుర్మా ప్రశస్తి.. నిత్యం అల్లాహ్ నామస్మరణలో గడిపే దైవప్రవక్త హజ్రత్ మూసా అలైహిసలా తుస్సలాంకు అల్లా ప్రసన్నం పొంది అతడిని అల్లా ఎక్కడున్నాడో చూపించమని అనునయులు కోరుతారు. దీంతో ఈజిప్టు, సిరియా ప్రాంతాలకు చెందిన పెద్దలను సమీపంలోని కోహితూర్ పర్వతం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఒక్కసారి అల్లాహ్ నూర్ (ఓ వెలుగు)ప్రత్యక్షంకావడం చూసి ఆశ్చర్యానికి గురవుతారు.అప్పుడే కోహితూర్ పర్వతం భస్మమై బూడిదగా(చూర్ణంగా) మారుతుంది. దైవసంకల్పం కళ్లెదుట సాక్షాత్కరించడంతో తమలోని భక్తి ఉప్పొంగి ఆ చూర్ణాన్ని వారు కళ్లకు అద్దుకుంటారు. ఈ సమయంలో తమ కళ్లకు సుదూరంలోని చీమల కదలికలను సైతం పసిగట్టే విధంగా ప్రకాశవంతం కావడం గమనించి అల్లాహ్ కృపవల్లనే సాధ్యపడిందని భావిస్తారు. అప్పటి నుంచి కోహితూర్ పర్వతానికి చెందిన రాళ్ల చూర్ణమే క్రమంగా సుర్మాగా రూపాంతరం చెందిందనేది ముస్లింల ప్రగఢ నమ్మకం. కళ్లకెంతో మేలు..! భక్తితోపాటు వైద్యపరిభాషలోనూ ఈ సుర్మాకు ఆరోగ్యప్రదాయినిగా పేరుంది. కంటికి సంబంధించిన వ్యాధులకు నివారణగా, కళ్లకు చలువగా పనిచేస్తుంది. నమాజ్ చేయడానికి ముందు వజూ ఆచరించాక మహ్మద్‌ప్రవక్త కంటికి సుర్మా పెట్టుకునే వారని ప్రతీతి. రాత్రివేళ నిద్రపోయేముందు కళ్లకింద సుర్మ రాసుకోవడం సంప్రదాయంగా వస్తోంది. సుర్మాతో కంటికి సంబంధించిన వ్యాధులు రావని నిరూపి తం కావడంతో ఇతరులు కూడా సుర్మాను రా సుకోవడానికి ఆకర్షితులవుతున్నారు. మహిళలు కళ్లకు కాటుక బదులు సుర్మా వాడడానికి ఇష్టపడుతున్నారు. అతిథులకు సుర్మ, అత్త ర్లు పూయడం ద్వారా గౌరవించే సంప్రదాయాన్ని ముస్లింలు కొనసాగిస్తున్నారు. సుర్మ, అత్తర్ల విక్రయాలు..! అనేక గ్రామాల్లో రంజాన్ సందర్భంగా అత్తర్లు, సుర్మా విక్రయాలకు గిరాకీ ఉంటుంది. దీనికోసం జిల్లాలో పలు అత్తర్లు, సుర్మా అమ్మకాల దుకాణాలు వెలిశాయి. సుర్మా కిలో పొడి ధర రూ.175 నుంచి రూ.550 వరకు ఉంటుంది. వీటిని చిన్న సీసాల్లో నింపి విక్రయిస్తుంటారు. ఇవి రూ10 నుంచి రూ . 100 విక్రయిస్తున్నారు. కంపెనీని బట్టి వీటి ధరలు నిర్ణయిస్తున్నారు. సుర్మాను భద్రపరచడానికి ఆకర్షణీయమైన ఆకారాల్లో సుర్మేన్లు (భరిణె) మార్కెట్లో ఉన్నాయి. వీటి ధర రూ.50 నుంచి రూ.300 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇవి చదవండి: HOLI 2024: జీవితం వర్ణమయం -
రంజాన్ షురూ !
- పుణ్యాల మూటకట్టుకునే సీజన్ పవిత్ర రంజాన్ మాసం - నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కర్నూలు(ఓల్డ్‌సిటీ): పుణ్యాలు మూట కట్టుకునే పవిత్ర రంజాన్ మాసం ఇది. అల్లా ఆరాధనలో గడిపే మాసం కావడంతోనే దీనికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. పవిత్ర ఖురాన్లో పేర్కొన్న ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాస వ్రతం. దీనినే పార్సీ భాషలో రోజా, అరబ్బీలో సౌమ్ అంటారు. పవిత్ర ఖురాన్ సంపూర్ణంగా భువిపైకి అవతరించిన దినం కూడా రంజాన్ మాసంలోనే ఉండటం విశేషం. కలిమా, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనేవి ఇస్లాంకు మూలస్తంభాలు. వీటిలో హజ్ తప్ప మిగతా నాలుగు మూల సూత్రాలు అమలయ్యేది ఒక్క రంజాన్ నెలలో మాత్రమే. ఆర్థిక స్థోమత కలిగిన వారు తప్పకుండా హజ్ యాత్ర నియమాన్ని కూడా సంపూర్ణం చేయాలి. ఇస్లాంలోకి ప్రవేశించే మార్గమే కలిమా. లాఇలాహ ఇల్లాల్లాహ్, ముహమ్మదుర్ రసూలుల్లాహ్ (సొల్లెల్లాహు అలైహివసొల్లం). ఆ సృష్టికర్తే (అల్లాయే) సమస్త సృష్టికి దైవం. ఆయన ప్రవక్త ముహమ్మద్ (సొ.అ.స.) అని అర్థం. ఈ సూత్రాన్ని విశ్వసించడమే కాకుండా ఆచరించాలి. రెండో మూలస్తంభం నమాజ్. నమాజ్‌ను నిత్యజీవితంలో రోజుకు ఐదుపూటలు పాటించాలి. రోజా, జకాత్ (దానధర్మాలు) వంటివాటికి రంజాన్ మాసంలోనే గొప్ప అవకాశం. మరో మూల సూత్రమైన నమాజు లేనిదే రోజా సంపూర్ణం కానేరదు. ప్రతి నమాజులోనూ కలిమా పఠనం జరుగుతుంటుంది. ఒక్క హజ్ తప్ప మిగతా మూల స్తంభాలను నిలబెట్టడంలో రంజాన్ మాసం ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ఇందులో ఉపవాసాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. సమయపాలన ముఖ్యం: ధర్మనిష్ఠతో ఉపవాసాలు ఉండాలి. నిర్ణీత సమయాల్లోనే సహెర్, ఇఫ్తార్లు పాటించాలి. అందరూ ఒకేసారి కచ్చితమైన వేళలు పాటించేందుకు వీలుగా కర్నూలు నగరంలో ఔటు పేల్చే విధానం ఉంది. ఉపవాసంలో శరీరానికే కాకుండా మనసుకూ కళ్లెం వేయాల్సి ఉంటుంది. మంచి దృష్టితో చూడాలి. మంచినే పాటించాలి. చెడుకు దూరంగా ఉండాలి. ఐదుపూటలా విధిగా నమాజు చేయాలి. ఖురాన్ పఠనం, సారాంశంపై అవగాహన, అల్లా నామస్మరణ, అల్లాచింతన వంటివి విరివిగా చేయాలి. రంజాన్ నెలలో చేసే ఏ పవిత్ర కార్యానికైనా 70 రెట్ల పుణ్యం అధికంగా లభిస్తుంది. దీంతో ఈ మాసంలో దాన ధర్మాలు విరివిగా చేస్తారు. మాసపు చివర్లో ప్రతి ముస్లిం ఫిత్రా దానం చెల్లించుకోవాలి. ఆర్థికస్థోమత కలిగిన వారు జకాత్ దానం చేయాలి. ప్రతి మసీదులోనూ తరావీలో ఖురాన్ పఠనం కర్నూలు నగరంలోని ప్రతి మసీదులోనూ ఇటీవల తరావీలో ఖురాన్ పఠనం తప్పనిసరి చేశారు. పవిత్ర ఖురాన్లో 30 పారాలు ఉంటాయి. రోజుకో పారా చొప్పున నెల మొత్తాన్ని పఠిస్తారు. గతంలో బహు కొద్ది మసీదుల్లో మాత్రమే తరావీలో ఖురాన్ పఠనం పఠించే వారు. ప్రస్తుత కాలంలో ఖురాన్ కంఠస్థం చేసే (హాఫిజ్ల) సంఖ్య మెరుగ్గా ఉండటంతో ప్రతి మసీదులోనూ రంజాన్ మాసంలో ఒక హాఫిజ్‌ను ఏర్పాటు చేసుకుని నెలమొత్తం మసీదుల్లో సంపూర్ణం ఖురాన్ పఠనంతోనే తరావీ నమాజులు పాటిస్తున్నారు. నియమాలు.. మతగ్రంథాల ప్రకారం వయోజనులైన స్త్రీపురుషులందరూ విధిగా రోజా దీక్ష పాటించాలి. వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్థులు, ప్రయాణంలో ఉన్న వారికి మాత్రమే మినహాయింపు ఉంటుంది. అయితే వ్యాధిగ్రస్థులు కూడా ఆరోగ్యం చేకూరిన తర్వాత ఆ రోజాలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. రంజాన్ అంటే పాపాలను దహించివేయుట అనే అర్థం వస్తుంది. ఉపవాసదీక్షలు అనేవి మనిషిలోని చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపేవిగా ఉండాలి. సాధ్యమైనంత మేరకు పుణ్యకార్యాలు చేపడుతుండాలి. -
రేపటి నుంచి రంజాన్ ఉపవాసాలు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ఆకాశంలో నెలవంక శుక్రవారం సాయంత్రం కనిపించకపోవడంతో.. శనివారం తప్పనిసరిగా కనిపించే అవకాశాలు ఉన్నాయని.. ఆదివారం నుంచి రంజాన్ మాసం ప్రారంభమవుతున్నట్లు కర్నూలు ప్రభుత్వ ఖాజీ సలీంబాషా ఖాద్రి ప్రకటించారు. హిలాల్ కమిటీ తీర్మానం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రంజాన్ మాసపు ఉపవాసాలు అల్లాకు అత్యంత ప్రీతిపాత్రమైనవన్నారు. ఐదుపూటలా నమాజుతో పాటు తరావీ నమాజు చేయాలని, ఉపవాసాల్లో ధర్మనిష్ఠ పాటించాలని సూచించారు. -
తుప్పు ఆయుధం
జీవన కాలమ్ మనం రాజకీయ నాయకుల నిరాహార దీక్షలను చూస్తుంటాం. ప్రజలూ, ప్రభుత్వ యంత్రాంగం వణికి పోతూంటుంది. ఆ మహానుభావుడి ఔన్నత్యానికి కాదు. ఆయనకేదయినా అయితే ఎంత కల్లోలం, ఎంత అనర్థం చేస్తారోనని. పత్రికల్లో చాలామంది దృష్టిని ఈ వార్త దాటిపోయి ఉంటుంది. ఈమధ్య తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య నదీజలాల తగువు సాగుతోంది. లోగడ రెండు రాష్ట్రాలూ చేసుకున్న ఒడం బడిక ప్రకారం కావేరీ నీరు తమిళనాడుకు కర్ణాటక వదిలిపెట్టాలి. ఈసారి వదలలేదు. తగాదా కేంద్రమంత్రి ఉమాభారతి దాకా వెళ్లింది. చర్చలు విఫలమయ్యాయి. ఏకీభావం కుదరలేదు. ‘‘ఈ విషయంలో ఉద్రిక్తతలు తగ్గకపోతే నేను నిరాహార దీక్ష చేస్తాను’’ అన్నారు కేంద్రమంత్రి ఉమాభారతి. ఇది పాఠకుల దృష్టిని దాటిపోయిన మెరుపు. ఇదేమిటి? కాషాయ వస్త్రాలు ధరించిన యోగిని- చాలా మెట్లు దిగివచ్చి - లౌకిక ప్రపంచంలో - కాదు రాజకీయ ప్రపంచంలో కేంద్రీకృతమైన అధికారపీఠంలో కూర్చున్నారు. రాష్ట్రాల తగవులు, అసందర్భా లను సరిచెయ్యాల్సిన అధికారమూ, శక్తీ ఉన్న గద్దె అది. కాని సమస్య పరిష్కారం కాకపోతే ‘నిరాహార దీక్షని చేస్తానంటారేం!’ ఇదీ విషయం. మంత్రుల పని నిరాహార దీక్షలు చేయడం కాదు. పాలించడం. పాలనకు అవసరమయితే అధికారాన్ని వినియోగించడం. ఉమాభారతిగారు భోజనం మానేస్తే సిద్ధరామయ్య, జయలలిత గారు మనసు మార్చుకుంటారనీ, వందల బస్సులు తగులబెట్టిన దౌర్జన్యకారులు కన్నీళ్లపర్యంతమయి కాషాయ వస్త్రాలు ధరిస్తారని మనం ఊహించలేము. కాని ఒకనాడు ఓ మహానుభావుడు సరిగ్గా అదే పనిచేశాడు. మానవతా విలువలకీ, రాజకీయ సమస్యకీ వంతెన వేసి ఫలితాలను రాబట్టగలిగాడు. ఆయన పేరు మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. ఎలా? వ్యక్తిస్థాయిలో, మానవీయమయిన స్థాయిలో, నైతికమయిన స్థాయిలో - వ్యవస్థ అంతా గర్వించగల, వ్యవస్థకి ఆరాధ్యస్థానంలో ఉన్న ఒక వ్యక్తి- కాదు- ఆ వ్యవస్థ ఆరాధించే ‘శక్తి’ ఆ పనిచేస్తే అది ఆయుధ మవుతుంది. ఆరోజు మహాత్ముడు నిరాహార దీక్ష చేస్తే రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య సింహాసనం పునాదుల్లో కదిలింది. ఆ కర్తృత్వానికి బలం ‘నిరా హారం’ కాదు. ఆ వ్యక్తి వ్యక్తిత్వబలం. ఒక వ్యక్తిని సమాజం ప్రేమించి, ఆరాధించి, అక్కున చేర్చుకున్న ప్పుడే ఆయన్ని నష్టపోకుండా కాపాడుకుంటుంది. ఆయన కోసం తిరగబడుతుంది. ఆయన్ని రక్షించుకోవడానికి అపురూపమయిన త్యాగాలు చేస్తుంది. నాకు బాగా నచ్చిన, పులకించిన సన్నివేశం-‘గాంధీ’ చిత్రంలో ఒకటుంది. కార్యకర్తల హింసకి పోలీసులు బలి అయినప్పుడు మహాత్ముడు నిరాహార దీక్ష చేశారు. దేశం చలించిపోయింది. ఒక మహనీయుడి ప్రాణాలను కాపాడుకోవడం కోసం- సౌహార్దాన్ని ఎల్లెడలా భారతీయులు కుమ్మరించారు. ఆనందంగా వచ్చి నెహ్రూ మహాత్మునికి చెప్పారు. చెప్తూ ‘భోరుమన్నారు’. అదీ దృశ్యం. మహాత్ముడు నిరాహార దీక్షని చేసినప్పుడు కాదు- దాని ఫలితాన్ని దేశమంతటా గమనించినప్పుడు నెహ్రూ ఆవేశంతో చలించి పోయాడు. దీక్ష ఆయన్ని ఆర్ద్రం చెయ్యలేదు. దీక్ష ప్రభావం గుండెల్ని పిండింది. అది ఓ మహాత్ముని వ్యక్తిత్వానికి నివాళి. మనం రాజకీయ నాయకుల నిరాహార దీక్షలను చూస్తుంటాం. ప్రజలూ, ప్రభుత్వ యంత్రాంగం వణికి పోతూంటుంది. ఆ మహానుభావుడి ఔన్నత్యానికి కాదు. ఆయనకేదయినా అయితే ఆ పార్టీవారో, ఆ వర్గం వారో, ఆ కులం వారో ఎంత కల్లోలం, ఎంత అనర్థం చేస్తారోనని. ఇది నిఖార్సయిన బ్లాక్మెయిల్. నిరాహార దీక్షకు ఈ నాయకులే మరుగుజ్జులు. వారి ‘బెల్లింపు’కి ఆ ‘దీక్ష’ కేవలం ముల్లును తీసే ఇనుప ముక్క. ఇనుపముక్క గుచ్చుకుంటే సెప్టిక్ అవుతుంది. అదే యంత్రాంగం భయం. వారి భయం ఇనుపముక్క చేసే హాని కాని, వారి ఉదాత్తత కాదు. వినోబా భావే 87వ ఏట-తన అనారోగ్యాన్ని కాపాడేందుకు మందులు ఉపయోగపడలేదన్న విష యాన్ని గ్రహించి-‘ఈ శరీరం నాకు ఇన్నాళ్లూ సహక రించింది. ఇప్పుడు దాని శక్తి సన్నగిల్లింది. సహకరించలేనంటోంది. దానిని ఇక శ్రమపెట్టను’ అని స్వచ్ఛం దంగా ఆహారం తీసుకోవడం నిలిపివేశారు. న్యాయంగా 1982లో ఇందిరాగాంధీ ‘ఆత్మహత్య’ నేరానికి ఆయన్ని అరెస్టు చేసి ఉండవచ్చు. కానీ ఆయనని ఎవరూ ముట్టుకోలేదు. స్వచ్ఛందంగా వెళ్లిపోయాడు ఆ మహర్షి. దరిమిలాను ఆయన్ని ఈ దేశం భారతరత్నను చేసింది-తమని తాము గౌరవించుకోవడానికి. దీక్షని ఆకాశంలో నిలిపేది- ఆ దీక్ష లక్ష్యం. మహాత్ముడు ఆనాడు జాతి సమైక్యతకు నిరాహార దీక్ష చేశాడు. వినోబా భావే-మృత్యువుని ఆహ్వానించ డానికి. నీళ్ల కోసం బస్సులు తగలబెట్టే దౌర్జన్యకారుల దురాగతాలకి, రైళ్లు తగలబెట్టే నేరగాళ్లని జైళ్ల నుంచి విడిపించడానికి, తమ వర్గానికి మేలు జరగాలని బెల్లిం చడానికి కాదు. ఏతావాతా - పదవిలో ఉన్న మంత్రి- కాషాయం తొడిగినా- ఆధ్యాత్మిక నైరాశ్యం ఆవహిం చినా- లక్ష్యం కురచగా, నేలబారుగా, కేవలం ‘రాజకీ యం’ అయిన కారణానికి- ఒకనాటి పవిత్రమైన, అతి శక్తిమంతమయిన ఆయుధం తుప్పు పట్టిపోయింది. - గొల్లపూడి మారుతీరావు