patan kumar poddar naik
-
పతన్ కుమార్ కేసులో అసిఫ్ అలీ అరెస్ట్
హైదరాబాద్ : ఫేస్బుక్ పరిచయంతో సైనిక రహస్యాలను విదేశీయులకు చేరవేసిన ఆర్మీ అధికారి పతన్ కుమార్ పోద్దార్ కేసుకు సంబంధించి రెండో నిందితుడు అసిఫ్ అలీని ...సీసీసీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పీటీ వారెంట్‌పై అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ యూనిట్లో ఆసిఫ్ అలీ ఆర్మీ జవాన్. కాగా పతన్ కుమార్ పోద్దార్‌ను అనుష్క అగర్వాల్ మహిళ పేరుతో నమ్మించి, మోసం చేసింది ఆసిఫ్ అలీయేనని పోలీసుల విచారణలో తేలిన విషయం విదితమే. పోద్దార్తో ఫోన్లో మాట్లాడే మహిళ ఆసిఫ్అలీ భార్య అని విచారణలో వెల్లడి అయ్యింది. ఆసిఫ్ అలీ భార్య పాకిస్తాన్‌కు చెందిన మహిళగా విచారణలో తేలింది. దాంతో అసిఫ్ అలీని యూపీ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
అనుష్క కాదు అలీ!
హైదరాబాద్: సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సైనికాధికారి పటన్ కుమార్ పోద్దార్ సైనిక రహస్యాలను బహిర్గతం చేసిన కేసులో అనుష్క అనే మహిళే లేదని సైనికాధికారుల విచారణలో తేలింది. పటన్ కుమార్‌ను మహిళ పేరుతో నమ్మించి, మోసం చేసింది అసిఫ్ అలీ అనే మరో సైనికుడేనని అధికారులు నిర్ధారణకు వచ్చారు. మీరట్ సైనిక విభాగంలో పని చేస్తున్న అలీని అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు విషయాలు వెల్లడయ్యాయి. అలీ భార్య పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి. ఆమె ద్వారా ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థతో అలీకి సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అనుష్క అనే పేరుతో సికింద్రాబాద్‌లోని ఈఎంఈ యూనిట్లో సుబేదార్‌గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన పటన్‌కుమార్ పొద్దార్ నాయక్‌ను పరిచయం చేసుకున్నాడు. అప్పుడప్పుడు అతని బ్యాంకు ఖాతాలో డబ్బు కూడా జమ చేస్తూ ఉండేవాడు. విశ్వసనీయ సమాచారం మేరకు వీరి మధ్య ఫేస్బుక్ సంభాషణే ఎక్కువగా జరిగేది. ఒక్కసారి మాత్రం ఫోన్లో మాట్లాడారు. అయితే అప్పుడు అలీనే ఓ మహిళతో మాట్లాడించాడు. ఆ మహిళ అలీ భార్యగా భావిస్తున్నారు. అలీ భార్య పాకిస్తాన్‌కు చెందిన మహిళ. అలీనే మహిళగా చెప్పి, తరచూ డబ్బు ఇస్తూ పటన్‌కుమార్ నుంచి దేశ మిలటరీకి సంబంధించిన కీలకమైన రహస్యాలను తెలుసుకున్నాడు. ఏడాది కాలంగా పటన్ 104 పేజీల రహస్యాలను పంపినట్లు విచారణలో తేలింది. అయితే అలీకి సంబంధించి, అతని భార్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. మిలటరీ, పోలీసు అధికారులు ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. -
విచారణ చేపట్టిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో
-
ఎంతమంది జవాన్లు ‘బుక్’ అయ్యారు!
* విచారణ చేపట్టిన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో * ఫేస్బుక్ నుంచి వివరాలు తొలగించిన అనుష్క సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్ సుబేదార్ పటన్‌కుమార్ పొద్దార్ నుంచి మిలటరీ స్థావరాల రహస్యాలు సంపాదించిన అనుష్క (ఐఎస్ఐ ఏజెంట్) ఫేస్బుక్లో ఉన్న మిగతా 20 మంది సైనికాధికారులపై కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) కన్నేసింది. పటాన్ ఉదంతం వెలుగు చూడగానే అనుష్క తన ఫేస్బుక్లో ఉన్న ఆ 20 మంది సైనికాధికారుల పేర్లు, ఫొటోలను శుక్రవారం తొలగించింది. అయితే అప్పటికే ఆమె ఫేస్బుక్లో ఉన్న ఆ అధికారుల పేర్లు, ఫొటోలను నగర సైబర్ క్రైం పోలీసులు వెలికితీశారు. వారి వివరాలను ఐబీకి పంపినట్లు తెలిసింది. ఈ వివరాలతో దేశంలోని అన్ని ఆర్టిలరీ సెంటర్లలో నిఘాను కట్టుదిట్టం చేశారు. పటన్ ఉదంతంపై మిలటరీ ఉన్నతాధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్లు తెలిసింది. పటన్ బ్యాంకు అకౌంట్‌ను సీజ్ చేయాల్సిందిగా సీసీఎస్ పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. రెండు రోజుల్లో ఫొరెన్సిక్ రిపోర్టు... పటన్ నుంచి స్వాధీనం చేసుకున్న కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లో నిక్షిప్తమై ఉన్న సమాచారాన్ని వెలికి తీసేందుకు రామంతాపూర్‌లోని సెంటర్ ఫర్ ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (సీఎఫ్ఎస్ఎల్) నిపుణులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రెండు మూడు రోజుల్లో పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పటన్ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన వివరాలతో పాటు అతని ఈ మెయిల్లో డిలీట్ చేసిన మెసేజ్‌లు సైతం బయట పడనున్నాయి. ఈ మెసేజ్‌లను పరిశీలిస్తే అనుష్క, పటన్ల మధ్య నడిచిన వ్యవహారం పూర్తిగా బట్టబయలయ్యే అకాశాలు ఉన్నాయి. సీసీఎస్ పోలీసులు, మిలటరీ అధికారులు, ఎన్ఐఏ, ఐబీ అధికారులు ఈ ఫొరెన్సిక్ నివేదిక కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ వివరాల ఆధారంగానే పటన్‌ను పోలీసు కస్టడీకి తీసుకున్న తరువాత సీసీఎస్ అధికారులు అతన్ని తిరిగి విచారించనున్నారు. అయితే పోలీసు కస్టడీకి ఇచ్చే విషయంపై సోమవారం తుది తీర్పు రానుంది. పటాన్పై ఎన్ఐఏ దృష్టి... సీసీఎస్ పోలీసులు పటన్‌ను కస్టడీకి తీసుకుని విచారించిన తరువాత నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ఉగ్రవాద కేసులను దర్యాప్తు చేసే సంస్థ అధికారులు కూడా విచారించాలని నిర్ణయించారు. ఈ మేరకు పటన్ కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. వీరితో పాటు ఐబీ అధికారులు కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. -
ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న నిజాలు!
హైదరాబాద్: తీగలాగితే డొంక కదిలినట్లు మిలటరీ అధికారి పటన్ కుమార్ పొద్దార్ నాయక్‌ను ప్రశ్నిస్తుంటే అనేక విషయాలు బయటపడుతున్నాయి. గతంలో జమ్మూకాశ్మీర్, నాసిక్‌లలో పనిచేసిన పటన్ పోలీసుల విచారణలో పలు కీలక వివరాలు తెలిపాడు. పాకిస్థాన్ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలకు అనుష్క అగర్వాల్ అనే మహిళా ఉగ్రవాది ద్వారా దేశ మిలటరీ రహస్యాలను చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై సికింద్రాబాద్‌లోని ఈఎంఈ యూనిట్లో సుబేదార్‌గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన పటన్‌కుమార్ పొద్దార్ నాయక్‌ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పోలీసుల విచారణలో వెల్లడైన అంశాలు: పొద్దార్ నాయక్‌కు అనుష్క అగర్వాల్‌తో 2013 నుంచి ఫేస్బుక్లో చాటింగ్ చేస్తున్నాడు. ఆర్మీ మిస్సైల్, ఆయుధ నిల్వల కర్మాగారం వివరాలను, ఫోటోలను పంపాలని అనుష్క అతనిని కోరింది. ఆర్మీకి సంబంధించిన కీలక వివరాలు, అధికారుల కదలకలను అతను అనుష్కకు పంపాడు. 40 మంది కీలక విభాగాల్లో అధికారుల వివరాలను కూడా అతను ఆమెకు తెలిపాడు. పతాన్ అకౌంట్లో ఆమె 5 సార్లు పది లక్షల రూపాయలను డిపాజిట్ చేసింది. దేశంలో ఉన్న 12 యూనిట్ల బ్రిగేడియర్ల పేర్లు, వారు ఉండే ప్రదేశాల వివరాలను ఆమెకు పంపాడు. పశ్చిమ సరిహద్దు ప్రాంతంలో మోహరించిన ఆర్మీ సమాచారాన్ని కూడా నాయక్ ఫోన్లో ఆమెకు చెప్పాడు. భారత ఆర్మీ కీలక వివరాలు వెల్లడిస్తే లండన్ తీసుకెళ్తానని అతనికి అనుష్క చెప్పింది. పటన్ మల్టీలెవల్ మార్కెటింగ్ వ్యాపారం చేస్తుంటాడు. చైనాలో విదేశీ రాయబార కార్యాలయంలో ఉండే ధరమ్వీర్ సింగ్, సుబేదార్ బీఎస్ రెడ్డిలు అతనిని ఎమ్ఎల్ఎమ్ సెక్యూర్డ్ లైఫ్ వ్యాపారంలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే పోద్దార్ నాయక్ నుంచి పోలీసులు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నారు. అతని బ్యాంకు ఖాతాలోని 3 లక్షల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. అతనిపై అఫిషియల్ సీక్రెట్ యాక్ట్ 3,4,5 సెక్షన్లు,1977 ప్రైజ్ చిట్స్ మనీ సర్క్యులేషన్ బాన్నింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అయితే అనుష్క అగర్వాల్ ఫేస్ బుక్ అకౌంట్ రాజస్థాన్ రాజధాని జైపూర్ అడ్రస్‌తో ఉందని పోలీసులు వెల్లడించారు. ఆమె భారత్‌కు చెందిన వ్యక్తా? లేక పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తా? అనేది తెలియవలసి ఉంది. ఈ కేసుకు సంబంధించి అన్ని విషయాలను ఎప్పటికప్పుడు ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతునట్లు నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. -
ఏడాదిగా సుబేదార్కు అనుష్కతో ఆర్థిక లావాదేవీలు
ఫేస్బుక్ పరిచయంతో సైనిక రహస్యాలను విదేశీయులకు చేరవేసిన ఆర్మీ అధికారి పతన్కుమార్ పొద్దార్ నాయక్ (40)ను తమకు ఏడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సీసీఎస్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాదాపు ఏడాది కాలం నుంచి అపరిచిత వ్యక్తితో పతన్కుమార్కు ఆర్థిక లావాదేవీలు కొనసాగుతున్నాయని, మూడు నాలుగు నెలల నుంచి వీరిమధ్య ఫేస్బుక్లో చాటింగ్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. పతన్కుమార్ నుంచి రెండు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్‌లు స్వాధీనం చేసుకున్నామని, వాటన్నింటినీ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపించామని సీసీఎస్ పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే.. ఇంతకీ అసలా అపరిచిత వ్యక్తి పాకిస్థాన్ వ్యక్తా, ఇండియా వ్యక్తా అనేది తేలాల్సి ఉందన్నారు. కాగా ఎన్ఐఏ, ఐబీ, ఆర్మీ, ఇంటెలిజెన్స్, సీఐఎస్ఎఫ్లు కూడా పతన్ కుమార్‌ను తమకు అప్పగించాలని ఇప్పటికే కోరుతున్న విషయం తెలిసిందే.