Pathapatnam Assembly Constituency
-
‘సొమ్ము’ సిల్లెను బాబయో!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆడిన డబుల్ గేమ్‌కు కీలక నాయకులు బలయ్యారు. నిర్వీర్యమైన పార్టీ కోసం ఇన్నాళ్లూ డబ్బులు ఖర్చుపెట్టిన నేతలు ఇప్పుడు టికెట్ కోసం అర్రులు చాస్తున్నారు. అధిష్టానం పెడుతున్న కండిషన్లు, చేస్తున్న పైరవీలు చూసి ఖిన్నులవుతున్నారు. రొక్కమాడితేనే రాజకీయం, భారీగా ముట్టజెప్పినోడికే టికెట్లు అనే పరిస్థితి పార్టీలో నెలకొనడంతో తీవ్రంగా కలత చెందుతున్నారు. ప్రస్తుతానికి వారు నిశ్శబ్దంగా ఉన్నా.. టికెట్లు ఖరారు చేశాక పార్టీలో ముసలం తప్పదనే వాదన అంతర్గతంగా వ్యక్తమవుతోంది. గుండ, గొండుల్లో ఎవరికి! శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, యువ నాయకుడు గొండు శంకర్ టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటివరకు వీరిలో ఒకరిని చంద్రబాబు, మరొకరిని లోకేశ్ ప్రోత్సహించారు. ఇద్దరూ పార్టీ కోసం గట్టిగానే ఖర్చు పెట్టారు. అయితే ఇప్పుడు ఎక్కువ ఖర్చుపెట్టిన వారికే టికెట్ అంటూ లీకులు ఇస్తుండడంతో లక్ష్మీదేవి, శంకర్ ఖిన్నులవుతున్నారు. ‘గోవిందా’.. వెంకటరమణ పాతపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ, యువ నాయకుడు మామిడి గోవిందరావు టికెట్ రేసులో ఉన్నారు. వీరిలో కలమట వెంకటరమణను కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు ప్రోత్సహిస్తుండగా, మామిడి గోవిందరావును లోకేశ్ ప్రోత్సహిస్తున్నారు. వీరిలో మామిడి గోవిందరావుతో చాలా ఖర్చు పెట్టించారు. ఇప్పుడు టికెట్‌కు రేటుగట్టి బేరసారాలకు దిగడంతో ఆశావహులు బిత్తరపోతున్నారు. కలిశెట్టి ‘కళా’విహీనం ఎచ్చెర్ల నియోజకవర్గంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కళా వెంకటరావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడి మధ్య టికెట్ పోరు నడుస్తోంది. 2019లో అధికారం కోల్పోయాక కొన్నాళ్లు కళా స్తబ్ధుగా ఉండిపోవడంతో కలిశెట్టి క్రియాశీలకం అయ్యారు. పార్టీ కోసం భారీగా ఖర్చుపెట్టారు. ఒక దశలో టికెట్‌కు హామీ కూడా లభించింది. ఇప్పుడు అధిష్టానం మాట మార్చడంతో కలిశెట్టి అప్పలనాయుడు సందిగ్ధంలో పడ్డారు. ‘బగ్గు’.. భగ్గు నరసన్నపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తిని ఒకవైపు ప్రోత్సహిసూ్తనే మరోవైపు మాజీ ఎమ్మెల్యే బగ్గు లక్ష్మణరావు కుమారుడు, డాక్టర్ బగ్గు శ్రీనివాసరావును చంద్రబాబు, లోకేశ్ తెరపైకి తెచ్చారు. తండ్రీకొడుకులు చెరోవైపున ఉండి గేమ్ ఆడారు. చివరకు ఇప్పుడు ఎంతైనా ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని బగ్గు శ్రీనివాస్‌వైపే మొగ్గు చూపిస్తుండడంతో బగ్గు రమణమూర్తి ఆందోళన చెందుతున్నారు. వద్దన్న వజ్జ.. తాతారావు టాటా.. పలాస నియోజకవర్గంలో గౌతు శిరీష, వజ్జ బాబూరావు, జుత్తు తాతారావులను టికెట్ ఆశ చూపి పెదబాబు, చినబాబు ప్రోత్సహించారు. అయితే ఇప్పుడు భారీగా డబ్బులు పెట్టాలి్సన వ్యవహారం కావడంతో వజ్జ బాబూరావు, జుత్తు తాతారావు వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఆశ చూపిన తండ్రీకొడుకులు ఇన్నాళ్లూ ఒక్కో నియోజకవర్గంలో ఇద్దరు, ముగ్గురికి టికెట్ల ఆశ చూపిన టీడీపీ అధినేత బాబు, ఆయన తనయుడు లోకేశ్ ఇప్పుడు డబ్బుంటేనే తమ వద్దకు రావాలని కరాఖండీగా చెబుతున్నారు. పార్టీకెంత ఇస్తారు? ఎంత ఖర్చుపెడతారంటూ బేరసారాలు ఆడుతున్నారు. దీంతో విస్తుపోవడం నేతల వంతవుతోంది. ఇప్పటివరకు పార్టీ కోసం ఖర్చు పెట్టించి ఇప్పుడు ఇలా చేయడం న్యాయం కాదని కొందరు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఆయనకు టికెట్ ఇస్తే నేనే ఓడిస్తా
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: పాతపట్నంలో టీడీపీ నాలుగు స్తంభాలాట ఆడుతోంది. తనకు టికెట్ ఖాయమైపోయిందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ప్రచారం చేస్తుండగా.. ఆయనకు టికెట్ ఇస్తే తానే ఓడిస్తానని మామిడి గోవిందరావు హెచ్చరిస్తున్నారు. ఈ గొడవతోనే ఆ పార్టీకి తలనోప్పి కడుతుంటే ఆ పార్టీ పాత నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు తాజాగా తెరపైకి వచ్చి తానూ ఇండిపెండెంట్‌గా అయినా పోటీలో ఉంటానని చెబుతున్నారు. ఈ జంఝాటం మధ్య జనసేన ఇన్చార్జి గేదెల చైతన్య తనకు కూడా సీటిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇలా గొడవలు, అభిప్రాయ భేదాలు, మాట పట్టింపులతో పాతపట్నంలో టీడీపీ రాజకీయం పతనావస్థకు చేరుకుంది. బలంగా వైఎస్సార్సీపీ.. పాతపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.1200కోట్లకు పైగా సంక్షేమ పథకా లు, రూ.800కోట్లకు పైగా నాన్ డీబీటీ పథకాలు అందించడంతో పాటు రూ. వేల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. దానికి తోడు వంశధార నిర్వాసితులందరికీ చక్కగా పరిహారం అందజేసింది. దీంతో వైఎస్సార్సీపీ చాలా బలంగా కనిపిస్తోంది. మరోవైపు టీడీపీ, జనసేన తమలో తాము కొట్టుకుంటూ ప్రభుత్వంపై బురద జల్లే పని పెట్టుకున్నాయి. కానీ సమన్వయంలోపం కారణంగా ఆ పని కూడా చేయలేక చతికిలపడుతున్నారు. అంతటా అయోమయం.. టీడీపీకి అలవాటైన డబుల్ గేమ్ పాతపట్నంలో వికటించే పరిస్థితి కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన కలమట వెంకటరమ ణ పార్టీ ఫిరాయించి టీడీపీకి వెళ్లడంతో ఆ పారీ్టలో ముసలం పుట్టింది. ఆయన అప్పటికే వంశధార నిర్వాసితుల పరిహారం, ఇసుక, ఇతరత్రా ప్రభుత్వ పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. కోట్ల రూపాయల కోసమే కలమట పార్టీ మారారన్న విషయం అందరికీ అర్థమైపోయింది. దీంతో 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన కలమట ఘోరంగా ఓడిపోయారు. ఇలాంటి వ్యక్తికి మరోసారి టికెట్ ఇస్తే ఓడించి తీరుమతామని మరో నేత మామిడి గోవిందరావు అండ్ కో బాహాటంగానే చెబుతోంది. కాకపోతే, కలమట వల్ల ఎంత లబ్ధిపొందారో.. ఏ రకంగా ప్రయోజనం కలిగిందో తెలీదు గానీ కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు ఫ్యామిలీ మాత్రం కలమటకు అండగా నిలుస్తోంది. వారి అండదండలే తనకు ఆశీస్సులని, అవే సీటు తెచ్చి పెడతాయని కలమట కొండంత ఆశతో ఉన్నారు. అందుకు తగ్గ సంకేతాలు వస్తున్నాయి. మామిడి గోవిందరావు తనకు పోటీ ఏంటని, వాడుకుని వదిలేస్తామని కలమట బాహాటంగానే చెప్పుకొస్తున్నారు. టిక్కెట్ ఇవ్వకుంటే.. టీడీపీలో మరో కీలక నేతగా ఎదిగిన మామిడి గోవిందరావు నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఈసారి సీటు తనకే వస్తుందని చెబుతున్నారు. తర చూ చంద్రబాబును, లోకేష్ ను కలిసి ప్రసన్నం చేసుకుంటున్నారు. వెళ్లిన ప్రతి సారి రూ. లక్షల్లో పార్టీకి చదివించుకుంటున్నారు. ఇలా ఆయన అధిష్టానం దృష్టిలో పడ్డారు. కాకపోతే, ఆయన ఆశలను కింజరాపు ఫ్యామిలీ అడియాశలు చేస్తోంది. మామిడి గోవింద్‌ను వాడుకుంటామని, ఖర్చు పెట్టిస్తామని, అంతమాత్రాన టిక్కెట్ ఇచ్చేస్తామా అని ఒకానొక సందర్భంలో అచ్చెన్నాయుడు బహిరంగంగా చెప్పేశారు. అయినప్పటికీ మామిడి.. లోకేష్ తదితరులకు టచ్‌లోకి వెళ్లి, కింజరాపు ఫ్యామిలీ వ్యతిరేక గ్రూపులో రాజకీయాలు నెరుపుతున్నారు. కానీ ఈయనకు ఇప్పటివరకు స్పష్టమైన హామీ రాలేదు. ఒకవేళ తనకు కాకుండా కలమటకు టిక్కెట్ ఇస్తే నియోజకవర్గమంతా తిరిగి ఓడిస్తానని చెప్పకనే చెబుతున్నారు. కాకపోతే ఇటీవల ఆయనలో స్పీడు తగ్గింది. కార్లు ఇచ్చి డబ్బులిచ్చి తిప్పించడం వంటి పనులు కూడా తగ్గించేశారు. కలవరం.. ఇదంతా ఓ వైపు సాగుతుండగా.. ఒకప్పుడు టీడీపీలో కొనసాగి, తర్వాత స్తబ్దతగా ఉన్న సిరిపురంతేజేశ్వరరావు ఇండిపెండెంట్‌గా అయినా పోటీ చేస్తానని నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇప్పుడిది టీడీపీని కలవరపెడుతోంది. మరో మిత్రపక్షమైన జనసేన పరిస్థితి మరోలా ఉంది. తమకే టిక్కెట్ వస్తుందని ఆశపడుతూనే కలమటతో కలిసి పనిచేయలేమంటూ తమ వైఖరి ద్వారా తెలియజే స్తోంది. ఆ పార్టీ ఇన్చార్జి గేదెల చైతన్య తొలుత కొన్ని సార్లు కలమట వెంకటరమణతో కలిసి వేదిక లు పంచుకున్నా ఆ తర్వాత దూరం పాటిస్తున్నారు. గతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న వారితో కలిసి పనిచేయలేమని జనసేన కేడర్ కూడా అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తోంది. -
‘ఏపీ ప్రజల ఆకాంక్షలు సీఎం జగన్ నెరవేర్చారు’
సాక్షి, శ్రీకాకుళం జిల్లా: సీఎం జగన్ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నిలిపిన వైనాన్ని వివరిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. బుధవారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో సామాజిక సాధికార బస్సు యాత్ర సాగింది. పాతపట్నంలో నిర్వహించిన బహిరంగ సభలో వైస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు, జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణ దాస్, ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, వి.కళావతి, గొర్లె కిరణ్, కంబాల జోగులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ, చంద్రబాబుకు అధికారం ఇస్తే దుర్వినియోగం చేశారని, దోచుకున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ప్రజల ఆకాంక్షలు తీర్చారు. వంశధార నిర్వాసితులకు 216 కోట్లు అదనపు పరిహారం ఇచ్చారు. హిర మండలం వద్ద 176 కోట్ల తో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మిస్తున్నాం. పాడు పడిన పాఠశాలలు బాగు చేసి మంచి బడులు గా తీర్చి దిద్దారు. కొత్తూరు లో 132/33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టాం. గత ప్రభుత్వం కిడ్నీ రోగులకు నెఫ్రాలజిస్టులను కనీసం నియమించ లేకపోయింది. జగనన్న ఏకంగా కిడ్నీ రీసెర్చ్ స్టేషన్ నిర్మించారు’’ అని ఆమె పేర్కొన్నారు. గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా చూడండి.. జన్మభూమి కమిటీల ద్వారా గత ప్రభుత్వం ప్రజల సొమ్ము దోపిడీ చేసిది. అవినీతి లేకుండా వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2లక్షల 45 వేల కోట్ల రూపాయిలు ప్రజల ఖాతా ల్లో జమ చేసింది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూడండి. సంక్షేమ పథకాలు గౌరవంగా ఇస్తున్న విషయం గమనించండి. చంద్ర బాబు అభివృద్ధి లేదంటున్నాడు. ప్రతి గ్రామంలో సచివాలయం, ఆరోగ్య కేంద్రం నిర్మించడం అభివృద్ధి కాదా?. ప్రజల అవసరాలు వైద్యం, విద్య, ఉపాధి కల్పించకుండా రోడ్డులు వేస్తే అభివృద్ధి జరిగినట్టా?. సంక్షేమ పథకాలు ఇవ్వకూడదు అని చంద్రబాబు చెప్పాడు. ఇప్పుడు ఎన్నికల ముందు అవే ఇస్తానంటున్నాడు. మూడు సార్లు చంద్రబాబుకి అధికారం ఇచ్చారు. ఏమి చేశారు?. వైస్సార్సీపీ ప్రభుత్వం పాలనలో సంస్కరణలు తెచ్చింది. సచివాలయాలు ఏర్పాటు చేసింది. అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తే పేదలు కోటీశ్వర్లు అయ్యారు. పేదల జీవన ప్రమాణాలు పెంచే పనులు చేసింది ఈ ప్రభుత్వం -మంత్రి ధర్మాన ప్రసాద రావు ప్రజల సొమ్మును చంద్రబాబు దోచుకున్నారు.. సీఎం జగన్ నాలుగున్నరేళ్లు పాలనలో ఎంతో మార్పు తెచ్చారు. సచివాలయాల ద్వారా అవినీతి లేకుండా పథకాలు ఇస్తున్నాం. ప్రతి గ్రామంలో ఏమి చేశామో సచివాలయం వద్ద దాపరికం లేకుండా ధైర్యంగా బోర్డు పెట్టాం. ఈ బోర్డుల్లో ఎక్కడైనా అబద్ధం ఉంటే నిలదీయండి. ప్రజలకు డబ్బులు పంపిణీ చేయడం తప్పు అని చంద్రబాబు అంటున్నాడు. అప్పట్లో చంద్రబాబు అలీబాబా 40 దొంగల్లా దోచుకొని ప్రజల సొమ్ము తిన్నారు. పేద పిల్లాడికి మంచి యూనిఫార్మ్, స్కూల్ బ్యాగ్, బూట్లు కొని ఇస్తే తప్పా. తమ బిడ్డ నీట్‌గా తయారై స్కూల్‌కి వెళ్తుంటే తల్లి కళ్లల్లో సంతోషం చూడటం అభివృద్ధి కాదా? -స్పీకర్ తమ్మినేని సీతారాం