pay scale hike
-
14లోగా కేసీఆర్ సర్కారు స్పందిస్తుందా?
సాక్షి, హైదరాబాద్: గ్రామ రెవెన్యూ సహాయకులు(వీఆర్ఏ)గా పనిచేస్తున్న రాష్ట్రంలోని 23వేల మంది రెవెన్యూ సిబ్బంది కష్టాలు ఎప్పటికి తీరుతాయో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏళ్లు గడుస్తున్నా.. నిరవధిక సమ్మె చేపట్టినా.. నిర్వేదంతో ప్రాణాలపై ఆశలు వదులుకుంటున్నా ప్రభు త్వం మాత్రం తమపై కనికరం చూపడం లేదని వీఆర్ఏలు వాపోతున్నారు. సమ్మె పూర్తయి ఆరునెలలవుతున్నా నేటికీ తమ డిమాండ్లు హామీలుగానే మిగిలిపోయాయని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నారు. మూడే ప్రధాన డిమాండ్లు వీఆర్ఏలు ప్రధానంగా మూడు డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు పేస్కేల్ వర్తింపజేయాలని, అర్హులైన వీఆర్ఏలకు పదోన్నతులు కలి్పంచాలని, 50 ఏళ్లుపైబడిన వీఆర్ఏల వారసులకు కారుణ్య ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలు, మంత్రి కేటీఆర్, అప్పటి సీఎస్ సోమేశ్‌కుమార్ సమక్షంలో జరిగిన చర్చలు ఫలితాన్ని ఇవ్వకపోగా, గత ఏడాదిలో 80 రోజుల పాటు చేసిన నిరవధిక సమ్మె తర్వాత కూడా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చందంగా మిగిలిపోయిందని వాపోతున్నారు. ఇన్నాళ్లూ తమ గోడు ప్రభుత్వానికి చెప్పే ఉన్నతాధికారి (సీసీఎల్ఏ) లేరని భావించామని ఇప్పుడు కొత్త సీసీఎల్ఏగా నవీన్ మిత్తల్ బాధ్యతలు చేపట్టినా పరిస్థితి అలానే ఉందంటున్నారు. అంబేడ్కర్ జయంతి నాటికి రాష్ట్ర ప్రభుత్వంపై మరోమారు ఒత్తిడి పెంచాలని వీఆర్ఏల జేఏసీ భావిస్తోంది. అంబేడ్కర్ జయంతి (ఏప్రిల్14) సందర్భంగానైనా తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించని పక్షంలో మరోసారి ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని భావిస్తున్నారు. ఏప్రిల్15న సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించాలనే యోచనలో ఉన్నారు. సీఎంపై ఇంకా నమ్మకముంది తరతరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్న తమను గుర్తించి తెలంగాణ రాగానే జీతాలు పెంచింది సీఎం కేసీఆరే. వీఆర్ఏలను పేస్కేల్ ఉద్యోగులుగా గుర్తిస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చింది కూడా ఆయనే. కొన్ని అనివార్య పరిస్థితుల దృష్ట్యా ఆలస్యం జరుగుతున్నప్పటికీ మాకు కేసీఆర్‌పై నమ్మకం ఉంది. రాష్ట్రంలోని 23వేల మంది వీఆర్ఏలకు ఆయన న్యాయం చేస్తారనే భరోసాతో ఉన్నాం. – కర్ణకంటి రాజేశ్, డైరెక్ట్ రిక్రూటీ వీఆర్ఏల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ -
గుడ్‌న్యూస్: ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే పేస్కేల్
తిరుపతి అర్బన్: ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే పేస్కేల్ ప్రకటించనున్నట్లు ప్రజా రవాణా సంస్థ(ఆర్టీసీ) ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గురువారం ఆయన తిరుపతి, అలిపిరి, మంగళం, చంద్రగిరి బస్టాండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అదేవిధంగా త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులకు నూతన పే స్కేల్స్ కూడా ప్రకటించనున్నారని చెప్పారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆ మేరకు చర్యలు చేపట్టామని.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి బస్సులను వినియోగిస్తున్నారో అదే తరహాలో 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నట్లు చెప్పారు. జూలై 1న తొలి బస్సు అలిపిరి డిపోకు చేరుకుంటుందన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మిగిలిన బస్సులను కూడా తిరుపతి జిల్లాకు తీసుకొస్తామన్నారు. తిరుమల ఘాట్ రోడ్డు కోసం 30–50 బస్సులు, రేణిగుంట ఎయిర్‌పోర్టు, నెల్లూరు, కడప, ప్రముఖ దేవాలయాలున్న పట్టణాలకు మరో 50 బస్సులు కేటాయిస్తామని చెప్పారు. బస్సులకు చార్జింగ్ పాయింట్లు, విద్యుత్ చార్జీలు, కండక్టర్లను ఆర్టీసీ ఏర్పాటు చేసుకుంటుందని.. డ్రైవర్లు, బస్సుల మరమ్మతులను మాత్రం యజమానులే చూసుకుంటారని వెల్లడించారు. రాష్ట్రంలో తొలి ఎలక్ట్రిక్ బస్సుల బస్టాండ్‌గా అలిపిరి నిలుస్తుందన్నారు. అలాగే ఆర్టీసీకి చెందిన డీజిల్ బస్సులను కన్వర్షన్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తిరుపతి డిపోకు చెందిన సప్తగిరి బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్పు చేయించామని పేర్కొన్నారు. అనంతరం ద్వారకా తిరుమలరావు అలిపిరి డిపోలో ఏర్పాటు చేసిన 48 చార్జింగ్ పాయింట్లను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు కృష్ణమోహన్, గోపినాథ్‌రెడ్డి, రవివర్మ, బ్రహ్మానందయ్య, చెంగల్‌రెడ్డి పాల్గొన్నారు. -
ఆర్మీ వైద్యులకు వేతనాల పెంపు.. కేంద్రం ఓకే
న్యూఢిల్లీ: ఆర్మీలో పనిచేస్తున్న వైద్యాధికారులు, వైద్య నిపుణులకు పెరిగిన వేతనాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మొదటి సంవత్సరంలో ఓఐసీ (ఆఫీసర్ ఇంచార్జ్ పాలీక్లినిక్స్), దంత, వైద్య అధికారులకు రూ.75 వేలు, మిగతా నిపుణులందరికీ రూ. 87 వేలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ఈసీహెచ్ఎస్ (ఎక్స్–సర్వీస్‌మెన్ కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్) పాలీక్లినిక్స్కు రెండో ఏడాది రూ.లక్ష చెల్లించనున్నట్లు పేర్కొంది. ఈ పెంచిన వేతనాలు ఆగస్ట్ 17 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. కాగా, మెరుగైన వైద్యుల కోసం ఈసీహెచ్ఎస్ ఎదురుచూస్తోందని ఆర్మీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అడిషన్ డైరెక్టరేట్ జనరల్ పేర్కొన్నారు.