PD posts
-
పీడీ పోస్టులకు అనుమతించండి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఎడ్యుకేషన్ జారీ చేసిన పీడీ పోస్టుల పరీక్షకు అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ వేసిన 192 మందిని పీడీ పోస్టు పరీక్ష రాసేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే తాము వెల్లడించే వరకు ఫలితాలు విడుదల చేయవద్దని స్పష్టం చేసింది. తదుపరి విచారణను మార్చి 13కు వాయిదా వేసింది. ఎంపీఈడీ పూర్తిచేసిన తమను ఇంటర్ ఎడ్యుకేషన్ జారీ చేసిన పీడీ పోస్టుల పరీక్ష రాసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం చలకూర్తికి చెందిన ఆర్.శ్రీనుతో పాటు మరో 191 మంది పిటిషన్ దాఖలు చేశారు. ఈ పోస్టులకు గత నెల నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.. ఎంపీఈడీతోపాటు పోస్టు గ్రాడ్యుయేషన్ చేసిన వారు మాత్రమే అర్హులని పేర్కొంది. ఇది చట్టవిరుద్ధమని.. డిగ్రీ పూర్తి చేసిన తమను పరీక్ష రాసేందుకు అనుమతించాలని, ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ను కొట్టివేయాలని అభ్యర్థులు హైకోర్టును ఆశ్ర యించారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకా రాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరపున ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మా సనం.. పరీక్ష రాసేందుకు పిటిషనర్లకు అను మతి ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. -
పీడీ పోస్టులు భర్తీ చేయాలి
దేవరకద్ర : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పీడీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఎమ్మెల్సీ అభ్యర్థి హర్షవర్ద¯Œæరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాల, గోపన్పల్లి, కౌకుంట్ల, పేరూర్ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులను ఆయన కలిశారు. రాష్ట్రంలో క్రీడలను ప్రత్యేకమైన పాఠ్యాంశంగా చేర్చి ప్రతి రోజు అన్ని సబ్జెక్టుల మాదిరిగా బోధించాలని కోరారు. ఈ పద్ధతి కేరళ రాష్ట్రంలో కొనసాగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 600 పాఠశాలల్లో పీడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే వీటిని భర్తీ చేయాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రచారం నిర్వహించారు. -
పీడీలకు శారీర దారుఢ్య పరీక్షలు
సంగారెడ్డి టౌన్: జిల్లాలోని ఆదర్శ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మైదానంలో శారీర దారుఢ్య పరీక్షలు నిర్వహించామని డీఎస్డీఓ హరినాథ్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 94 మంది పురుషులు, 12 మహిళా అభ్యర్థులు హాజరయ్యారన్నారు. కార్యక్రమంలో పీడీ సురేందర్ సింగ్, వ్యాయామ ఉపాధ్యాయులు మశ్చెందర్, దుర్గాప్రసాద్, కిష్టయ్య, జిమ్నాస్టిక్ కోచ్ దేవిక తదితరులు పాల్గొన్నారు.