pedavegi
-
ఇన్నాళ్లకు కల తీరింది..
సాక్షి, దెందులూరు: పాదయాత్ర సమయంలో ఊరూరా నిరుపేద గూడు గోడు విన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారు. పేదలు సొంత ఇల్లు కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నట్లు తెలుసుకుని “నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ వారికి అండగా నిలవాలని నిశ్చయించుకున్నారు. అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే అర్హులు ఎంతమంది ఉంటే అందరికీ ఉచితంగా స్థలం ఇవ్వడమే కాక ఇంటిని నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా డిసెంబర్ 25వ తేదీ నుంచి రాష్ట్రమంతా అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ ప్రారంభమైంది. చరిత్రలో ఎన్నడూలేని విధంగా జిల్లాలో 1,70,699 మందికి సొంత ఇంటి కల నెరవేరింది. అంతే కాకుండా ఇంటి పట్టాతో పాటు ఇల్లు నిర్మాణానికి ఒక్కొక్కరికి 1,80,000 రూపాయలు నిధులు ఉచితంగా మంజూరు చేస్తూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరిట మంజూరు పత్రాలు సైతం అందజేస్తున్నారు. ఇళ్ల నిర్మాణ విషయమై లబ్ధిదారులకు మూడు అవకాశాలు ఇచ్చారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడం, లబ్ధిదారుడే ఇల్లు నిర్మించుకుంటే నిధులు మంజూరు చేయడంతో సగం ధరకే మెటీరియల్‌కు సంబంధించి నిధులు బ్యాంక్ ఖాతాకు జమ చేస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి చొరవతో ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు ఆదర్శ గృహాల నిర్మాణం చేపట్టారు. ఇప్పటికే కొందరు లబ్ధిదారులు కొత్త ఇళ్లల్లోకి మకాం మార్చడం విశేషం. ఇంటి నిర్మాణం ఇలా.. ప్రతి ఇంట్లో వసారా, కిచెన్, రెండు బెడ్రూమ్లు, బాత్రూమ్, శ్లాబ్, ఇంటిపై వాటర్ ట్యాంక్ ఏర్పాటుతో నిర్మాణం చేసేట్లు గృహ నిర్మాణ శాఖ రూపొందించింది. సీఎం మరో నజరానా ఈ పథకానికి మరింత వన్నె తెచ్చేలా ప్రతి లబ్దిదారునికి ఉచితంగా రెండు ప్యాన్లు రెండు ట్యూబ్లైట్లను ప్రభుత్వమే సరఫరా చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారికంగా ప్రకటించారు. ఇన్నాళ్లకు కల తీరింది సొంత ఇంటిలో ఉండాలన్న నా కలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి నెరవేర్చారు. ఇంటి నిర్మాణం చేసి ప్రభుత్వం నాకు అందజేయటం, కుటుంబ సభ్యులతో మేము సొంత ఇంటిలో ఉండటం ఎన్నటికీ మరచిపోలేని విషయం. సీఎం, ఎమ్మెల్యేలకు రుణపడి ఉంటాం. – తొంటా సరస్వతి, లబ్ధిదారురాలు, పెదవేగి ఇల్లు నిర్మించి అప్పగించాం పెదవేగిలో మోడల్ హౌస్ నిర్మించి లబ్ధిదారునికి అప్పగించాం. లబ్ధిదారుడు గృహ ప్రవేశం చేసి కుటుంబ సభ్యులతో ఆ ఇంటిలో నివాసం ఉండటం చాలా సంతోషంగా ఉంది. గృహ నిర్మాణాలపై లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేందుకు సహకరించాలి. ఇళ్ల పట్టా, నిర్మాణ మంజూరు పత్రాలు ఒకేసారి అందజేస్తున్నాం. – కొఠారు అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే సమష్టి కృషితో ఇళ్ల నిర్మాణం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారుల సమష్టి సహాయ, సహకారాలు, సూచనలతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తాం. అధికారుల పర్యవేక్షణలో, పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. – పి.రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ సమష్టి కృషితో ఇళ్ల నిర్మాణం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యే, జిల్లా అధికారులు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారుల సమష్టి సహాయ, సహకారాలు, సూచనలతో ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తాం. అధికారుల పర్యవేక్షణలో, పూర్తిస్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. – పి.రామచంద్రారెడ్డి, హౌసింగ్ పీడీ -
నైజీరియా పక్షుల సందడి లేదు..
పెదవేగి మండలం కన్నసముద్రం(పెద్దచెరువు) నీరులేక ఒట్టిపోయింది. ఆక్రమణల వల్ల ఈ దుస్థితి నెలకొంది. ఫలితంగా 1800 ఎకరాల ఆయకట్టు సాగు ప్రశ్నార్థకమైంది. నీరులేక సాగుకు దూరమైన భూములను వైఎస్సార్ సీపీ నేత ఆలపాటి నరసింహమూర్తి, రైతులు చూపిస్తున్న దృశ్యమిది.. సాక్షి, పశ్చిమగోదావరి : పెదవేగి మండలంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన కన్నసముద్రం(పెద్ద చెరువు) చుక్క నీరు లేకుండా ఒట్టిపోయింది. ఈ చెరువుకు శతాబ్దాల చరిత్ర ఉంది. 1625లో నూజివీడు జమిందారు మేదిన రాయుడు తన తల్లి కన్నమాంబ పేరిట ఈ సముద్రం తవ్వించారు. అప్పటి నుంచి పెదవేగి, దెందులూరు మండలాలకు తాగు, సాగునీరు అందించేది. కాలక్రమంలో చెరువుకు నీరొచ్చే మార్గాలను కొందరు ఆక్రమించుకోవడంతో చెరువు కుంచించుకుపోయింది. ఈ చెరువుకు 600 మీటర్ల దూరంలో పోలవరం కాలువ వెళ్తున్నా.. ఆ నీటిని చెరువుకు మళ్లించే ప్రయత్నం చేయలేదు. గత టీడీపీ హయాంలో ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ చెరువు పరిధిలో అప్పట్లో 18 వందల ఎకరాలకు సాగునీరు అందేది. సర్ ఆర్ధర్ కాటన్ దొర దీనిని సందర్శించి మెచ్చుకున్నారని చెబుతారు. గతంలో కన్నసముద్రంలో ఏడాది పొడవునా నీరుండేది. నూజివీడు జమిందారు ఏనుగులకు స్నానాలు చేయించేందుకు ఇక్కడకు తీసుకొచ్చే వారంటే దీనికున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు, అలాంటి చెరువులో ఆగస్టు నెల వచ్చినా చుక్క నీరు లేకుండా పోయింది. చెరువు ఎండిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దీంతో సాగు, తాగు నీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్వాకం వల్లే.. టీడీపీ ప్రభుత్వం హయాంలో ఈ చెరువు అభివృద్ధిని కనీసం పట్టించుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం కాలువ నుంచి నీరు ఇచ్చే ఏర్పాటు చేసుంటే తమ పొలాలు సస్యశ్యామలం అయ్యేవని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి ఆలపాటి నరసింహమూర్తి చెప్పారు. నేడు నీరు లేక, భూగర్భజలాలు అడుగంటిపోయి ఒక్క ఎకరా పండని దుస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నైజీరియా పక్షుల సందడి లేదు జూన్ నెల వస్తే గతంలో ఈ చెరువు ప్రాంతానికి నైజీరియా నుంచి వివిధ పక్షులు వచ్చి నవంబర్, డిసెంబర్ వరకూ ఉండేవి. చెరువు ఒట్టిపోవడంతో నేడు ఒక్క పక్షి జాడ కూడా లేదు. అటు రైతులకు మేలు చేయడమే కాకుండా వివిధ పక్షులకు ఆవాసంగా ఉన్న ఈ కన్నసముద్రం నేడు కన్నీరు పెడుతోంది. చెరువుకు కేవలం 600 మీటర్ల దూరంలో పోలవరం కుడికాలువ నుంచి నీటిని అందించే ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. -
కన్న కొడుకే కాల యముడై..
పశ్చిమగోదావరి, పెదవేగి రూరల్: కన్న కొడుకే తండ్రి పాలిట కాలయముడైన ఘటన పెదవేగి మండలం రామశింగవరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామశింగవరం దుర్గమ్మకాలనీకి చెందిన దొండపాటి రాంబాబు (45) 13 ఏళ్ల క్రితం మొదటి భార్య సరోజినిని విడిచి లక్ష్మిని రెండో వివాహం చేసుకున్నాడు. సరోజినికి కుమారుడు కోటేశ్వరరావు ఉన్నాడు. ప్రస్తుతం సరోజిని దూరప్రాంతంలో ఉండగా కోటేశ్వరరావు తాత అంకాలు (రాంబాబు తండ్రి), మేనత్త దుక్కిపాటి సరోజినితో కలిసి గ్రామంలోని దళితవాడలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం అక్క సరోజిని ఇంటికి వచ్చిన రాంబాబు తండ్రి అంకాలుతో గొడవపడి కొట్టాడు. అదేసమయంలో బయట నుంచి ఇంటికి వస్తున్న కోటేశ్వరరావు మద్యం మత్తులో భావోద్వేగానికి గురై చిన్నపాటి పలుగుతో తండ్రి రాంబాబుపై దాడి చేశాడు. తలపై తీవ్రగాయమైన రాంబాబు అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు కోటేశ్వరరావును ఇంటిలోని ఓ గుంజకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు రూరల్ సీఐ కె.వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఇదిలా ఉండగా తన భర్త రాంబాబు నెల రోజుల క్రితం కామవరపుకోట మండలం దొండపాటవారిగూడెంలో ఉన్న 20 సెంట్ల భూమి అమ్మగా రూ.2.30 లక్షల నగదు వచ్చిందన్నారు. దీనిలో తన పెద్ద కుమార్తె పుష్పవతి కార్యక్రమానికి కొంత ఖర్చుచేశామని, మిగిలిన సొమ్ము ఇవ్వలేదని కోటేశ్వరరావు కక్ష పెంచుకుని హత్య చేశాడని ఆరోపించారు. పెదవేగి ఎస్సై వి.క్రాంతిప్రియ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంపైరింగ్‌లో ‘ సింగ్ ’..
గార్లమడుగు (పెదవేగి రూరల్) : స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.నాగేంద్రసింగ్ క్రికెట్లో అంపైర్‌గా రాణిస్తున్నారు. ఏలూరుకు చెందిన దివ్యాంగుడైన ఈయనకు చిన్నతనం నుంచి క్రికెట్ అంటే మక్కువ. ఈ క్రమంలోనే క్రికెట్లో మెళకువలు నేర్చుకుని ఎంపైర్‌గా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. గత నెల 21వ తేదీ నుంచి బరోడాలో ప్రారంభమైన గుజరాత్ విద్యుత్ శాఖ క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో అంపైరింగ్ నిర్వహిస్తున్నారు. తనతో పాటు ఏలూరుకు చెందిన గొట్టుముక్కల రామలింగ సూర్యనారాయణ, హైదరాబాద్‌కు చెందిన దీపక్, బరోడకు చెందిన యోగేశ్ షిండేలు ఈ టోర్నమెంట్‌కు అంపైర్లుగా వ్యవహరిస్తున్నారని సింగ్ ఫోన్లో తెలిపారు. ఇప్పటివరకు వికలాంగ క్రికెట్ టోర్నమెంట్లకు మాత్రమే అంపైర్‌గా వ్యవహరించిన తాను, తొలిసారిగా గుజరాత్ విద్యుత్ శాఖ నిర్వహిస్తోన్న టోర్నమెంట్లో అంపైరింగ్ చేస్తుండడం ఎంతో ఆనందాన్నించిదని తెలిపారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
ఏలూరు అర్బన్ : పెదవేగి మండలానికి చెందిన ఓ వివాహిత కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. సాయల మరియమ్మ, మంగయ్య దంపతులు పెదవేగి మండలం ముండూరులో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కొంతకాలంగా మరియమ్మ తనను ఎవరో పిలుస్తున్నారని, తమతో వచ్చేయమని చెవిలో చెబుతున్నారని కుటుంబసభ్యులతో చెబుతోంది. దీంతో కుటుంబసభ్యులు ఆమెను ఏదో పీడ ఆవరించిందని భావించి తాయిత్తులు, గండాలు కట్టించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మంగళవారం ఉదయం ఇంటిలో ఎవరూలేని సమయంలో శరీరంపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు బాధితురాలి భర్త మంగయ్య, తండ్రి బాలాస్వామికి సమాచారం అందించడంతో వారు బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
'పెద్దఅవుటపల్లి' కేసులో మరో ముగ్గురి అరెస్ట్
విజయవాడ: పెద్దఅవుటపల్లి వద్ద జరిగిన తండ్రి, ఇద్దరు కుమారుల హత్యకేసులో మనో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టు హాజరుపరిచారు. వీరికి ఈనెల 15 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఇప్పటివరకు ఈ కేసులో 21 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన తండ్రీకొడుకుల్ని ఆగస్టు 24న కృష్ణా జిల్లా పెద్దఅవుటపల్లి వద్ద తుపాకులతో కాల్చి చంపిన సంగతి తెలిసిందే. -
పామాయిల్ ధర పెంపు...కంటితుడుపే
=ఎన్నికల గిమ్మిక్కులో భాగమే =మూడేళ్లుగా అడుగుతుంటే ఇప్పుడు నిర్ణయం =రూ.57 కోట్ల బకాయిలపై మౌనం నూజివీడు, న్యూస్‌లైన్ : మద్దతు ధర లేక నష్టాల బాటలో కూరుకుపోతున్న ఆయిల్‌పామ్ రైతులను బయట పడేయాల్సిన ప్రభుత్వం కంటితుడుపు చర్యలను మాత్రమే తీసుకుంటోంది. మద్దతు ధర కల్పించాలని నాలుగేళ్లుగా ఆయిల్‌పామ్ రైతులు పోరాడుతుండగా, ఇన్నాళ్లు మిన్నకుండిన ప్రభుత్వం ఇంకా మూడు నెలల్లో కాలపరిమితి ముగియనున్న నేపథ్యంలో ధరను పెంచామని చెప్పుకోవడానికా అన్నట్లు అరకొరగా పెంచిందని రైతులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆయిల్‌పామ్ టన్ను ధర రూ.6,907 ఉంది. జాతీయ పరిశోధనా కేంద్రం చేసిన సిఫార్సే కనీసం టన్ను ధర రూ.8200 ఉండగా, ప్రభుత్వం మాత్రం కేవలం రూ.609 పెంచి చేతులు దులుపుకుంది. 2010లోనే మద్దతు ధర పెంపుపై సూచన... 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వ ధరల నిర్ణాయక కమిటీ చైర్మన్ అశోక్ గులాటి ఆయిల్‌పామ్ రైతులతో చర్చించిన మీదట క్రూడ్ పామాయిల్ ధరలో 13.54 శాతం చొప్పున రైతులకు టన్ను గెలలకు మద్దతు ధరను చెల్లించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఈ సిఫార్సులను ఇంతవరకూ ప్రభుత్వం పట్టించుకోకుండా సిఫార్సు చేసిన దానికంటే తక్కువగా 13.15 శాతం చెల్లించాలని నిర్ణయించింది. దీంతో ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం టన్ను ఆయిల్‌పామ్ ధర రూ.609 పెరగనుంది. మరోవైపు రైతు సంఘాలు గాని, ఆయిల్‌పామ్ రైతులు గాని రూ.16 శాతం చొప్పున ధరను నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయిల్‌పామ్ పంట రాష్ట్ర వ్యాప్తంగా 1.30 లక్షల హెక్టార్లలో సాగవుతుండగా కృష్ణా జిల్లాలో 8 వేల హెక్టార్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 40 వేల హెక్టార్లు, ఖమ్మం జిల్లాలో 5 వేల హెక్టార్లలో సాగుచేస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి సమీపంలోని జాతీయ పరిశోధనా కేంద్రం ఆయిల్‌పామ్ సాగును క్షుణ్ణంగా పరిశీలించి టన్ను గెలలకు రూ.8200 చొప్పున ఇవ్వాలని ఐదేళ్ల క్రితం సిఫార్సు చేసింది. ఈ ధరను ఏటా 30 శాతం చొప్పున పెంచాలని కూడా సూచించింది. అప్పుడే దీన్ని సాగు చేస్తున్న రైతు నష్టాలపాలవకుండా ఉంటాడని తేల్చిచెప్పింది. ఇప్పటికీ దీనిని అమలుచేయడం లేదు. రూ.57 కోట్ల బకాయిలపై ప్రభుత్వం మౌనం... ఆయిల్‌పామ్ రైతులకు చెల్లించాల్సిన రూ.57 కోట్ల బకాయిల విషయమై ప్రభుత్వం మౌనంగా ఉంటోంది. 2009లో ఆయిల్‌పామ్ గెలలు టన్ను ధర రూ.6440 ఉండగా అదే ఏడాది ఫిబ్రవరిలో ఒక్కసారిగా ధర పతనమై టన్ను ధర రూ.4300కు పడిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేయడంతో కేంద్రం గోధుమలకు ఇచ్చినట్లుగా ఆయిల్‌పామ్ గెలలకు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద రూ.5500 మద్దతు ధర నిర్ణయించింది. అంతకంటే తగ్గితే ఆ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించి రైతుకు చెల్లించేలా అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీనిలో భాగంగా 2009 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు సంబంధించిన మొత్తం రూ.4.60 కోట్లను అప్పట్లో చెల్లించారు. అనంతరం 2009 మే నెల నుంచి 2010 వరకు ఏప్రిల్ వరకు ఆయిల్‌పామ్ రైతులకు చెల్లించాల్సిన మొత్తం రూ.57 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని చెల్లించి తమను ఆదుకోవాలని రైతాంగం కోరినా పట్టించుకోవడం లేదు.