Peela Govind
-
కుప్పకూలిన మాజీ ఎమ్మెల్యే అక్రమ నిర్మాణం
భారీ గెడ్డ పక్కన కనీసం చిన్న పాటి నిర్మాణం కూడా చేపట్టకూడదు.. కానీ అడ్డగోలుగా భారీ బహుళ అంతస్తుల భవనం నిర్మించేశారు.. స్థలం 300 గజాలే.. అందులో భవన నిర్మాణానికి తీసుకున్న అనుమతులు జీ ప్లస్ 2కే.. కానీ జీ ప్లస్ 4.. అంటే అదనంగా రెండంతస్తులు కట్టేశారు. అంతేనా.. ఏ చిన్నపాటి నిర్మాణమైనా రోడ్డు నుంచి కనీసం పది అడుగులు వదిలి కట్టుకోవాలి.. కానీ ఇక్కడ మెయిన్‌రోడ్డుకు ఆనుకునే నిర్మాణం చేసేశారు.. ఇన్ని ‘కానీ’లు ఉన్నాయంటేనే అర్థమై ఉంటుంది.. అప్పటి టీడీపీ పాలనలో అనకాపల్లి ఎమ్మెల్యేగా వెలగబెట్టిన పీలాగోవింద్ అడ్డగోలు నిర్వాకం ఇదని.. ఇంత అక్రమంగా అన్యాయంగా కట్టేసింది ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. విశాఖ నగర నడిబొడ్డున ద్వారకానగర్ బీవీకే కళాశాల రోడ్డులో.. ఈ అడ్డగోలు భాగోతాన్ని నిర్మాణ సమయంలోనే.. అంటే 2017 జనవరిలో ‘సాక్షి’ వెలుగులోకి తీసుకువచ్చింది. అయితే అప్పటి అధికారులు ‘కాణీ’లకు కక్కుర్తి పడ్డారో.. ‘పచ్చ’పాతానికి తలొంచారో గానీ.. నిర్మాణాన్ని నిలువరించలేకపోయారు. సాక్షి వరుస కథనాలతో ఎట్టకేలకు నిర్మాణ పనుల దూకుడుకు బ్రేక్ పడింది కానీ మొత్తంగా అక్రమాలను అడ్డుకోలేకపోయారు. ఇప్పుడు పాలన మారింది.. నిబంధనలకు విరుద్ధంగా తప్పుచేసిన వాళ్లు ఎవరైనా.. ఎంతటి వారైనా ఉపేక్షించవద్దన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జీవీఎంసీ అధికారులు కొరడా ఝుళిపించడం మొదలుపెట్టారు. ఆ క్రమంలోనే శనివారం తెల్లవారుజాము నుంచి ఈ అక్రమ కట్టడాన్ని కూ ల్చే పని మొదలుపెట్టారు. అయితే పీలా స్టే తెచ్చుకోవడంతో సాయంత్రం నిలిపి వేశారు. సీతంపేట(విశాఖ ఉత్తర): నిబంధనలు పాటించకుండా.., జీవీఎంసీ నుంచి కనీస అనుమతులు తీసుకోకుండా టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ నగరంలోని సీతంపేట మెయిన్రోడ్లో అడ్డగోలుగా నిర్మించిన బహుళ అంతస్థుల భవంతిని జీవీఎంసీ యంత్రాంగం ఎట్టకేలకు కూల్చివేసింది. ‘‘అధికార పార్టీ ఎమ్మెల్యేని.. నన్ను ఎవరు ప్రశ్నిస్తారు.. నిబంధనలు నేనెందుకు పాటించాలి.. నేను అక్రమంగా ఇల్లు కడితే ఆపే దమ్ము ఎవరికి ఉందంటూ’’ అధికార మదంతో తనే దగ్గరుండి అక్రమాల భవంతిని నిర్మిచాండు పీలా. సర్వే నంబరు 32/3లో పీలా గోవిందు భార్య విజయలక్ష్మికి 280 గజాల స్థలం ఉన్నట్టు వారి వద్ద డాక్యుమెంట్ ఉందని సమాచారం. కానీ టౌన్‌ప్లానింగ్ నుంచి కనీస అనుమతులు కూడా లేకుండా గెడ్డ స్థలాన్ని, వంద అడుగుల ప్రధాన రహదారిని ఆక్రమించి 340 గజాల స్థలంలో జీ ప్లస్ 4 తరహాలో భవంతిని 2016 సంవత్సరంలో నిర్మించాడు. సెల్లార్‌ను సైతం విడిచిపెట్టకుండా కమర్షియల్ షాపులు నిర్మించేశారు. పీలా అనధికార కట్టడంపై 2017 జనవరి 6న ‘నిబంధనలు గోవిందా’ శీర్షికతో ‘సాక్షి’ పత్రికలో కథనం ప్రచురితమైంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై రెండు సార్లు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు పీలా సమాధానం ఇవ్వలేదు. తన అక్రమ భవంతిని కాపాడుకోవడానికి చేయని ప్రయత్నం లేదు. అప్పటి జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్పై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అయినప్పటికీ అక్రమంగా నిర్మిస్తున్న భవంతి పనులను మధ్యలో ఆపివేయించారు. నిర్మాణ పనులను అడ్డుకున్నారు. సెల్లార్‌ను పార్కింగ్‌కే కేటాయించాలని, షాపులు నిర్మించరాదని ఆదేశించారు. అలాగే 5వ అంతస్థులో నిర్మించిన పెంట్‌హౌస్‌ను, సెల్లార్ చుట్టూ ఉన్న ప్రహరీని కూల్చివేయించారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే అక్రమ భవంతి సగంలోనే ఆగిపోయింది. సాక్షి కథనం ప్రజాప్రతినిధి అక్రమాన్ని అడ్డుకోగలిగింది. కూల్చివేతకు కమిషనర్ ఆదేశం... ప్రస్తుతం అధికారం మారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అక్రమ, అనధికార నిర్మాణాలను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ సృజన కూల్చివేతకు ఆదేశించారు. గురుద్వారా కూడలి నుంచి ఆర్టీసీ కాంప్లెక్సుకు వెళ్లే రహదారి మాస్టర్ ప్లాన్‌లో 100 అడుగుల రోడ్‌గా ఉంది. ఆ రహదారిని అక్రమించి నిర్మాణం చేపట్టడం, అలాగే పక్కనే ఉన్న గెడ్డ స్థలాన్ని (బఫర్‌జోన్) అక్రమించి నిర్మాణం చేపట్టడం వంటి కారణాలతో బీపీఎస్ కూడా తిరస్కరణకు గురైంది. దీంతో పీలా గోవిందు తన భార్య విజయలక్ష్మి పేరుతో నిర్మించిన భవనం పూర్తిగా అనధికార నిర్మాణంగా నిర్ధారించి కూల్చివేతకు జీవీఎంసీ కమిషనర్ సృజన టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లత ఆదేశాలతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది శనివారం ఉదయం 4 గంటల నుంచే బిల్డింగ్ తొలగింపు చేపట్టారు. తొలగింపు సందర్భంగా అల్లర్లు జరగకుండా సీతంపేట మెయిన్‌రోడ్‌ను ఒకవైపు బ్లాక్ చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంతలో కోర్టు నుంచి పీలా గోవిందు స్టే తీసుకురావడంతో సాయంత్రం 4 గంటల తర్వాత కూల్చివేత నిలిపివేశారు. -
జిల్లా అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్
విశాఖ రూరల్ : జిల్లా సమగ్రాభివృద్ధి బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ అన్నారు. భవిష్యత్తులో జిల్లా ఆర్థికాభివృద్ధి, ప్రజా శ్రేయస్సుకు తోడ్పడే అంశాలపై విశ్వవిద్యాలయాల నిపుణులు దృష్టి సారించి సమగ్ర ప్రణాళిక రూపొందిం చాలని కోరారు. రాష్ట్ర విభజన తర్వాత అందరి దృష్టి విశాఖపైనే ఉందని, జిల్లాలో ఐటీ, పరిశ్రమలు, వ్యవసాయం, పర్యాటకం, విద్య, ఆరోగ్యం తదితర ఏర్పాట్లు, వాటి అభివృద్ధికి సలహాలు, సూచనల కోసం మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో మేధావులు, పారిశ్రామిక వేత్తలతో సమావేశం నిర్వహించారు. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఏయూ రిజిస్ట్రార్ రామ్మోహనరావు మాట్లాడుతూ విశాఖ జిల్లాలో గ్రీన్, బ్లూ, వైట్ రివెల్యూషన్ అంతగా అభివృద్ధి చెందలేదన్నారు. వాటి అభివృద్ధికి పుష్కలంగా వనరులున్నాయని తెలిపారు. గీతం యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలని సూచించారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత మాట్లాడుతూ విశాఖ నుంచి అరకుకు అద్దాల రైలు వేయాలని సూచించారు. ఆంధ్రా సిమ్లాగా పేరొందిన లంబసింగిని కూడా పర్యాటకంగా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని తెలిపారు. అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ తయారు చేయాలని చెప్పారు. మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు నమ్మకాన్ని కలిగించాలని సూచించారు. పరిశ్రమలకు అవసరమైన నీటి వనరులు లేవని, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. జిల్లా సగటు జాతీయోత్పత్తిని పెంచుకోవాలని పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ విశాఖను స్పోర్ట్స్ సిటీగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఊటీ మారిదిగా అరకును డీనోటిఫై చేయాలని సూచించారు. దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ విశాఖ పోర్టు నుంచి వెలువడే కాలుష్యం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పోర్టు కనీసం నియమాలు పాటించడం లేదని, సంస్థ విస్తరణకు వ్యతిరేకంగా అవసరమైతే కోర్టుకు వెళతామని తెలిపారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు జాప్యం జరగకుండా వారం రోజుల్లో సింగిల్ విండో పద్ధతిలో అన్ని అనుమతులు మంజూరు చేసేలా విధానాన్ని రూపొందించాలని సూచించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు వ్యవసాయ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పాయకరావుపేట ఎమ్మెల్యేల వంగలపూడి అనిత అన్నారు. యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్లరమేష్‌బాబు మాట్లాడుతూ చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద్ మాట్లాడుతూ అప్రెంటిస్ సీట్ల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26న ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చే అవకాశాలు ఉన్నాయని, ఈలోగా ప్రాథమిక అభివృద్ధి ప్రణాళికను రూపొందిస్తే ఆయన దృష్టికి వెళ్లవచ్చని సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ, ఏజేసీ నరిసింహారావు పాల్గొన్నారు. గ్రామ స్థాయి నుంచే వ్యవసాయ ప్రణాళిక వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను గ్రామ స్థాయి నుంచే రూపొందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ సూచించారు. వ్యవసాయాధికారులతో జిల్లాలో ఖరీఫ్ 2014కు సంబంధించిన గ్రామ స్థాయి వ్యవసాయ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిక చేసిన గ్రామాల్లో ముఖ్యమైన పంటల్లో ఉత్పాదకతను పెంచి వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గించాలని చెప్పారు. వ్యవసాయ పనులను గ్రామీణ ఉపాధిహామీ పథకాలతో అనుసంధానం చేయాలని, పంటలు కోసిన తర్వాత వచ్చే నష్టాలను నివారించాలన్నారు. వ్యవసాయ శాఖద్వారా అమలవుతున్న పథకాలన్నింటినీ ఎంపిక చేసిన గ్రామాల్లో అమలు చేయాలని సూచించారు. రాయితీపై విత్తనాలు, ఎరువులు సరఫరాచేయాలన్నారు. -
తిరుగుబావుటా
టీడీపీలో అసమ్మతి సెగలు ఎక్కడికక్కడ తిరుగుబాట్లు బెడిసికొడుతున్న బుజ్జగింపు యత్నాలు తల పట్టుకుంటున్న ముఖ్య నేతలు అభ్యర్థుల్లో గుబులు సాక్షి, విశాఖపట్నం : జిల్లా టీడీపీలో అసమ్మతి బుసలుకొడుతోంది. సగం నియోజక వర్గాల్లో పార్టీ దిక్కుతోచని దుస్థితి ఎదుర్కొంటోంది. పార్టీ ముఖ్య నేతలు బుజ్జగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. నియోజక వర్గాల వారీగా అసంతృప్తులను దారికితెచ్చే వ్యుహాలు పన్నుతున్నా తిరుగుబాటు నేతలు తమదారి తమదేనని ఖరాకండీగా చెప్పేస్తున్నారు. దీంతో ఏంచేయాలో అర్థంకాక ముఖ్య నేతలు,అభ్యర్థులు తల పట్టుకుంటున్నారు. ఇలాగైతే తమకు అపజయం ఖాయమని గుబులు చెందుతున్నారు. అనకాపల్లి, యలమంచిలి, పాడేరు, గాజువాక, పాయకరావుపేట, భీమిలి, విశాఖ ఉత్తరం నియోజక వర్గాల్లో పార్టీకి ముచ్చెమటలు పడుతున్నాయి. దారికి తేవడం కష్టమే... నాన్చినాన్చి తీవ్ర కసరత్తు అనంతరం పార్టీ అభ్యర్థులను ప్రకటించినా టీడీపీలో అసమ్మతి మాత్రం ఉవ్వెత్తున లేస్తోంది. చంద్రబాబు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నియోజక వర్గాల్లో తిరుగుబాట్లు తప్పనిసరవుతున్నాయి. ‘నియోజక వర్గంలో పనిచేసుకోండి టికెటిస్తాం’ అని ప్రతి ఒక్కరికి చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పుడు అబద్దాలుగా తేలిపోయాయి. దీంతో ఏళ్ల తరబడి నియోజక వర్గ ఇన్చార్జులుగా పనిచేసి డబ్బు ఖర్చుపెట్టిన నేతలంతా ఇప్పుడు తమ సంగతి ఏమిటంటూ నిప్పులు కక్కుతున్నారు. పాడేరు అసెంబ్లీ టికెట్ ఆశించిన మాజీ మంత్రి మణికుమారి పార్టీ ఉత్తరాంధ్ర రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త నారాయణ ముందు తన నిరసన వెలిబుచ్చారు. ‘టికెట్ ఇవ్వలేమని ముందే చెబితే మా దారి మేం చూసుకునే వాళ్లం కదా?’ అని ప్రశ్నించారు. కానీ అటునుంచి సమాధానం రాలేదు. అనకాపల్లిలో చాలా కాలం కిందట అయిదుగురు సభ్యులతో ఫైవ్‌మన్ కమిటీ వేశారు. వీరిలో ఒకరికి టికెట్ గా్యారెంటీ అని హామీ ఇచ్చారు. తీరా ఇప్పుడు బయటి నుంచి పీలా గోవింద్ అనే కొత్త నేతను తెచ్చి అనకాపల్లి అసెంబ్లీకి రుద్దారు. దీంతో ఇప్పుడు బుద్ధ నాగ జగదీష్, మళ్ల సురేంద్ర వంటి టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు తిరుగుబాట్లు లేవదీస్తున్నారు. పోటాపోటీగా నామినేషన్లు వేసి పార్టీ అభ్యర్థిని ఓడించడానికి కంకణం కట్టుకున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థి ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారా? అని ఎదురుచూస్తున్నారు. చివరకు పార్టీ ముఖ్య నేతలైన ఎం.వి.వి.ఎస్.మూర్తి, నారాయణ కూడా ఏం చేయలేని పరిస్థితి. యలమంచిలిలో నియోజక వర్గ ఇన్చార్జి సుందరపు విజయకుమార్‌ను పక్కనపెట్టి బయటినేత పంచకర్లకు టికెట్ ఇవ్వడం తీవ్రస్థాయిలో నిరసనాగ్నులు రగులుతున్నాయి.