peppers spray
-
కిచిడీ: పెప్పర్ స్ప్రే గురించి నిజాలు!
స్త్రీలు ఒంటరిగా ఉన్నపుడు తమను తాము రక్షించుకునే ఆయుధంగా ఇటీవల పెప్పర్ స్ప్రే మంచి ఆదరణ పొందుతోంది. పార్లమెంటులో దీని ప్రస్తావన వచ్చాక ఇది ఒక్కసారిగా విపరీతమైన ప్రచారం పొందింది. ఈ నేపథ్యంలో పెప్పర్ స్ప్రే గురించి కొన్ని వాస్తవాలు.. పెప్పర్ అంటే మిరియాలు. పేరు పెప్పర్ స్ప్రే అయినా అందులో పెప్పర్ ఉండదట. ఇందులో ఉండే పదార్థం ఘాటు మిరపకాయల నుంచి తీసినది గాని లేక మిరప జాతికి చెందిన కొన్ని ఇతర రకాల వాటి నుంచి సేకరించినది గాని అయిఉంటుంది. సుమారు పది అడుగుల నుంచి ప్రయోగించినా కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అత్యాచార ప్రమాదం గ్రహించినపుడు స్త్రీలు దీనిని ప్రయోగిస్తే నిందితుడు కనీసం ఓ గంట పాటు తేరుకోలేడు. పెప్పర్ స్ప్రే ప్రయోగిస్తే సరిగా ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుంది. దగ్గు వస్తుంది. తట్టుకోలేని కళ్ల మంట, గొంతులో విపరీతమైన ఇరిటేషన్ వస్తుంది. అంటే నిందితుడు కోలుకునే లోపు మహిళలు ఈజీగా ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. పెప్పర్ స్ప్రే వాడకం మొదలై చాలారోజులు అయినా ఇది మార్కెట్లో ఆదరణ పొందింది మాత్రం ఢిల్లీలో నిర్భయ ఉదంతం వెలుగులోకి వచ్చిన తర్వాతే. ఇటీవలి కాలంలో హైదరాబాదులో ఓ అమ్మాయి దీనిని ఉపయోగించి ప్రమాదం నుంచి తప్పించుకుంది. వీటి ధర 200-500 వరకు ఉంది. పెప్పర్ స్ప్రే ఆధారంగా దేశంలో పదికోట్ల వ్యాపారం జరుగుతోందట. ఇక నుంచి ఇది పుంజుకునే అవకాశం కూడా ఉండొచ్చు. -
హక్కుల సంఘానికి 'పెప్పర్ స్ప్రే '
-
ఉరికంబంపై ఊగిసలాట
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలపై నారాయణ ఎద్దేవా పార్లమెంట్లో దాడిచేసిన వారు ఉగ్రవాదులే మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉరికంబంపై ఊగిస లాడుతున్నాయని సీపీఐ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఎద్దేవాచేశారు. పార్లమెంట్లో మైకులు విరగ్గొట్టి కత్తులుగా వాడటం, పెప్పర్ స్ప్రే చల్లి వీధిరౌడీలకంటే హీనంగా తన్నుకోవ డం ప్రపంచ చరిత్రలో ఎప్పు డూ జరగలేదన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆదివారం ఆయన విలేకరుతో మాట్లాడారు. గతంలో పార్లమెంట్ భవనంపై దాడిచేసిన వారిని ఉరితీయాలని అందరం డిమాండ్ చేశామని, కానీ లోక్‌సభలో తోటి ఎంపీలపై దాడిచేసిన వారి సంగతేమిటని ప్రశ్నించారు. వారు ముమ్మాటికి ఉగ్రవాదు లేనని ఆరోపించారు. వీడియో పుటేజ్‌లను పరిశీలించి సంఘటనకు బాధ్యులైన వారిని ఉరితీసినా పాపం లేదన్నారు. దోషులను శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించాలని, లేకుంటే రిలయన్స్, అంబానీ, ప్రపంచ బ్యాంకులు దేశ సార్వభౌమత్వాన్ని శాసిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. అన్నిపార్టీల అభిప్రాయాలు, పలు కమిషన్ల నివేదికలు, జీఓఎం సిఫార్సులాంటి అన్ని చర్చలు, ఇతర ప్రక్రియలు పూర్తయ్యాయని, అందుకే పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తెలంగాణ బిల్లును చర్చ లేకుండానే ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ర్ట విభజన పట్ల రాజకీయ పార్టీలు చేసిన నిర్ణయాలకు కట్టుబడకపోవడమే ఈ అరాచకాలకు మూలమన్నారు. తెలంగాణకు కట్టుబడి ఉన్నామన్న బీజేపీ, చంద్రబాబు సావాసదోషంతో మాటమారుస్తోందని దుయ్యబట్టారు. జాతీయస్థాయిలో చక్రం తిప్పగలనన్న ఫోజులకు మాత్రమే బాబు ఇతర రాష్ట్రాల నేతలు కలిసి సమన్యాయం అంటున్నారని విమర్శించారు. సమస్యను రాష్ట్రంలో సృష్టించి ఢిల్లీలో పరిష్కారాన్ని వెదుకులాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి పడమటి ఎద్దులా మొండికేస్తున్నాడని ధ్వజమెత్తారు. -
హక్కుల సంఘానికి 'పెప్పర్ స్ప్రే '
పరిశీలించి నివేదిక ఇవ్వాలని కోరిన లోక్‌సభ స్పీకర్ నేడు పార్లమెంటు భద్రతా కమిటీ అత్యవసర భేటీ పార్లమెంటులోకి వెళ్లేముందు ఎంపీలను తనిఖీ చేసే అంశంపై చర్చ! న్యూఢిల్లీ: లోక్‌సభలో పెప్పర్ స్ప్రే(మిరియాల ద్రావకం) చల్లిన ఉదంతంపై స్పీకర్ మీరాకుమార్ స్పందించారు. దీనికి సంబంధించిన విషయాలను పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదివారం సభా హక్కుల కమిటీకి నివేదించారు. సభా వ్యవహారాలు, ప్రవర్తనా నియమావళిలోని 227 నిబంధన కింద ఆమె ఈమేరకు నివేదించారని లోక్‌సభ సెక్రటేరియట్ ఓ ప్రకటనలో తెలిపింది. కాంగ్రెస్ సీనియర్ నేత పీసీ చాకో నేతృత్వంలోని 15 మంది సభ్యులు గల సభాహక్కుల కమిటీకి హక్కుల ఉల్లంఘనకు పాల్పడిన వారిని శిక్షించే అధికారాలు ఉన్నాయి. జైలు శిక్ష విధించాలని, బహిష్కరించాలని సిఫార్సు చేయడం వంటివి అందులో ఉన్నాయి. గత గురువారం లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టకుండా అడ్డుకునే క్రమంలో కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పెప్పర్ స్ప్రే చల్లడం, ఇతరత్రా ఘటనలు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ భద్రతా కమిటీ భేటీ నిర్వహించాలని స్పీకర్ ఆదే శించడమూ విదితమే. పెప్పర్ స్ప్రే ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో భద్రతా కమిటీ సోమవారం అత్యవసరంగా భేటీ కానుంది. పార్లమెంటు ఆవరణలో జరగనున్న ఈ భేటీలో.. పార్లమెంటులోకి ప్రవేశించే సమయం లో ఎంపీలను తనిఖీ చేసే అంశంపై చర్చించే అవకాశముంది. హక్కులకు కోత! ఎంపీల ద్వారా సభలోకి ప్రమాదకరమైన, ప్రాణాలకు ముప్పు కలిగించే వస్తువులను తీసుకురాకుండా నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలతోసహా భద్రతకు సంబంధించిన సమస్త విషయాలను భద్రతా కమిటీ పరిశీలించనుంది. సభ్యులకున్న హక్కులను తగ్గించాలన్న డిమాండ్లను సైతం కమిటీ పరిశీలించేందుకు ఆస్కారమున్నట్టు సమాచారం. 2001 ఉగ్రవాద దాడి అనంతరం పార్లమెంటు భద్రతను పలు దఫాలుగా పటిష్టం చేశారు. అత్యాధునిక సాంకేతిక పరికరాలను, మెటల్ డిటెక్టర్లను అమర్చారు. పెద్ద ఎత్తున పోలీసు, పారామిలటరీ బలగాలను మోహరించారు. స్టేషనరీ మొదలుకుని తినుబండారాల వరకు ప్రతి ఒక్కదానినీ తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. ఎంపీలను మాత్రం ఈ తనిఖీల నుంచి మినహాయించారు. అంతేగాక వారు మెటల్ డిటెక్టర్ల నుంచి కాకుండా విడిగా వెళ్లేం దుకు నిబంధనలు అనుమతిస్తున్నాయి. అయితే తాజా ఘటన తో ఎంపీలను సైతం తనిఖీ చేయాలన్న వాదన తలెత్తింది. ‘పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగాక అలాంటివి పునరావృతం కాకుం డా గట్టి చర్యలు తీసుకుంటున్నాం. అయితే కుటుంబ సభ్యుడే ఇంటికి నిప్పు పెట్టేందుకు యత్నిస్తే ఎవరేం చేయగలరు?’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని కమిటీ సభ్యుడొకరు అన్నారు.