కెనడాలో ఉద్యోగం కావాలా? 10 లక్షలపైగా ఖాళీలు..ఇంకా పెరగొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి గుడ్ న్యూస్. లక్షల ఉద్యోగాలు భర్తీకి కెనడా రారమ్మని ఆహ్వానిస్తోంది. కెనడాలో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, భవిష్యత్తులో మరింత పెరగొచ్చని తాజా సర్వే వెల్లడించింది. దేశంలో పెద్దవాళ్లు ఎక్కువగా ఉండటం, ఎక్కువమంది రిటైర్మెంట్కు దగ్గర పడుతున్నకారణంగా భారీగా ఖాళీలు ఏర్పడ్డాయట. ఈ నేపథ్యంలో కెనడా ప్రస్తుతం 2022లో అత్యధిక సంఖ్యలో శాశ్వత నివాసితులను స్వాగతించడానికి సిద్ధమవుతోంది. సో..కెనడాకు ఎగిరిపోయి అక్కడే స్థిరపడేలా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పొందాలనుకునేవారికి ఇదే సువర్ణావకాశం.
(చదవండి: Hyderabad Student Vedant Anandwade: హైదరాబాదీకి బంపర్ ఆఫర్..సుమారు కోటిన్నర స్కాలర్షిప్)
మే 2022 నాటి లేబర్ ఫోర్స్ సర్వే అనేక పరిశ్రమలలో పెరుగుతున్న కార్మికుల కొరతను హైలైట్ చేసింది. 2021, మే నుండి ఖాళీల సంఖ్య 3 లక్షలకు పైగా పెరిగిందని తెలిపింది. వృత్తిపరమైన, శాస్త్రీయ , సాంకేతిక సేవలు, రవాణా , గిడ్డంగులు, ఫైనాన్స్ , భీమా, వినోదం, రియల్ ఎస్టేట్ ఇలా ప్రతీ రంగంలోనూ రికార్డు స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. వలసదారులు ఓపెన్ స్థానాలకు పర్మినెంట్ వీసాలకు డిమాండ్ పెరగనుందని వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో గతంలో కంటే ఇప్పుడు మరిన్ని పోస్టులు అందుబాటులో ఉన్నాయని మరో సర్వే తెలిపింది. (CSIR: టాప్ సైంటిఫిక్ బాడీకి తొలి మహిళా హెడ్‌గా కలైసెల్వి రికార్డు)
అల్బెర్టా , అంటారియోలో, ఏప్రిల్‌లో ప్రతి ఓపెన్ పొజిషన్‌కు 1.1రేషియోలో నిరుద్యోగులు ఉన్నారు,ఈ నిష్పత్తి అంతకు ముందు సంవత్సరం 1.2 పోలిస్తే, ఈ మార్చికి 2.4 కు పెరిగింది. న్యూఫౌండ్‌ల్యాండ్, లాబ్రడార్లో ఖాళీగా ఉన్న ప్రతి స్థానానికి, దాదాపు నలుగురు నిరుద్యోగులు ఉన్నారు. నిర్మాణ పరిశ్రమలో ఖాళీలు కూడా ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 89,900కి చేరుకున్నాయి, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 45 శాతం,మార్చి నుండి 5.4 శాతం పెరిగాయి. నోవా స్కోటియా, మానిటోబా రెండింటిలోనూ లాడ్జింగ్ , ఫుడ్ సర్వీసెస్ సెక్టార్లో 1,61 లక్షల ఓపెన్ పొజిషన్లు ఉన్నాయి. అలాగే వసతి, ఆహార సేవలు వరుసగా 13వ నెలలో కూడా అత్యధిక సంఖ్యలో ఖాళీలుండటం విశేషం.2022లోకెనడా రికార్డు స్థాయిలో 431,645 కొత్త శాశ్వత నివాసితులకు తలుపులు తెరవనుంది. 2022 మొదటి అర్ధభాగంలోనే, కెనడా ఇప్పటికే దాదాపు 2 లక్షలమందికి పర్మినెంట్ రెసిడెన్సీలుగా అవకాశం ఇచ్చింది. 2024 నాటికి 4.5 లక్షల టార్గెట్‌గా పెట్టుకుందని నివేదిక పేర్కొంది.
తక్కువ మంది వ్యక్తులు వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించడంతోపాటు, 55 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్నవారు ముందుగానే రిటైర్ అవుతున్నారట. దీంతో కెనడా లేబర్ మార్కెట్ ఈ ఏడాది దారుణంగా పడిపోయింది. ఇటీవలి ఆర్బీసీ సర్వే ప్రకారం, కెనడియన్లలో మూడింట ఒక వంతు మంది ముందుగానే పదవీ విరమణ చేస్తున్నారు . పదవీ విరమణకు దగ్గరగా ఉన్న 10 మందిలో ముగ్గురు కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యంగా రిటైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే కెనడాలో 2020లో, సంతానోత్పత్తి రేటు 1.4 రేషియోలో రికార్డు స్థాయికి పడిపోయింది.
ఇదీ చదవండి : మీరు పీఎఫ్ ఖాతాదారులా? యూఏఎన్ నెంబరు ఎలా పొందాలో తెలుసా?