person missed
-
డ్రైనేజీ గుంతలో గల్లంతైన వ్యక్తిని గాలిస్తున్నాం: మంత్రి సబిత
సాక్షి, హైదరాబాద్: మరోసారి హైదరాబాద్ వరదలో మునిగింది. శనివారం రాత్రి రెండు గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు మునిగాయి. చాలా చోట్ల పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి. కాగా మణికొండలో ఓ వ్యక్తి వరద నీటిలో గల్లంతయ్యాడు. బంగారు ఆలయం రోడ్డులో నడుస్తూ వెళ్తున్న ఓ వ్యక్తి ఒక చోట అడుగుపెట్టగా గుంత ఉండడంతో ఆ గుంతలో పడిపోయాడు. వరద భారీగా ఉండడంతో ఆ వరదలో కొట్టుకుపోయాడు. డ్రైనేజీ పైపులైన్ ఏర్పాటు కోసం ఇక్కడ పెద్ద ఎత్తున గుంతలు తవ్వారు. భారీ వర్షం పడడంతో వర్షపు నీరుతో గుంతలు నిండిపోయాయి. అదే సమయంలో అటుగా వచ్చిన వ్యక్తి గుంత ఉన్నట్టు తెలియకపోవడంతో అక్కడ అడుగు పెట్టగా ఒక్కసారిగా నీటిలో పడి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాలిస్తున్నారు. నీటిలో గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. కాగా ఆ వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మణికొండ ఘటన దురదృష్టకరమని తెలంగాణ మంత్రి సబితారెడ్డి తెలిపారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. ఘటన స్థలాన్ని ఆమె సందర్శించి గాలింపు చర్యలను వేగం పెంచారు. వ్యక్తి ఎవరనేది గుర్తిస్తున్నామని, గాలింపు చర్యల్లో ఎక్కడా లోపం లేదని స్పష్టం చేశారు. వర్షాకాలంలో ఎక్కడైనా పనులు చేస్తుంటే అక్కడ బారికేట్లు పెట్టాలని అధికారులను సూచిస్తున్నట్లు చెప్పారు. ఈ సంఘటనతో అధికారులను అప్రమత్తత చేస్తున్నట్లు తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం గుర్తిస్తే చర్యలు తీసుకుంటాం.. వీలైనంత త్వరగా వ్యక్తిని గాలించి పట్టుకుంటామని వివరించారు. -
సాగర్ కాలువలో రేణుకా చౌదరి పీఏ గల్లంతు!
ఖమ్మం: కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి ప్రధాన అనుచరుడు, వ్యక్తిగత సహాయకుడు నాగార్జున సాగర్ కాలువలో గల్లంతయ్యారు. ఎంత వెతికినా అతడి ఆచూకీ లభించలేదు. గజ ఈతగాడిగా పేరుపొందిన అతడు గల్లంతవడం షాకింగ్‌గా ఉంది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గత ఈతగాళ్లను రప్పించి అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే అతడికి గుండెపోటు రావడంతో కాలువలో గల్లంతై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరికి ప్రధాన అనుచరుడిగా రవి గుర్తింపు పొందాడు. దీంతోపాటు ఆమెకు వ్యక్తిగత సహాయకుడి (పీఏ) గా పని చేస్తున్నాడు. ఖమ్మం నగరంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడు కాలువలో గల్లంతైనట్టు తెలుస్తోంది. అయితే దాదాపు 11 కిలోమీటర్లు నిర్విరామంగా రవి ఈత కొడతాడని స్థానికులు చెబుతున్నారు. సాగర్ కాలువలోకి ఈతకు వెళ్లిన అనంతరం రవికి గుండెపోటు వచ్చి ఉంటుందని సమాచారం. ఆ సమయంలో అతడు కాలువలో గల్లంతై ఉంటాడని భావిస్తున్నారు. సమాచారం తెలియడంతో పోలీసులు రవి కోసం సాగర్ కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా రవి ఆచూకీ లభించలేదు. కాలువ సమీపంలో రవికి చెందిన బుల్లెట్ వాహనం, చెప్పులు, బ్యాగ్ ఉన్నాయి. -
జవాన్ స్వామి తండ్రి అదృశ్యం
సాక్షి, కామారెడ్డి: తన తండ్రి సాయిరెడ్డి మూడు రోజులుగా కనపడటం లేదని, ఎవరో కిడ్నాప్ చేసుంటారని ఆర్మీ జవాన్ స్వామి అనుమానం వ్యక్తం చేశారు. తన భూమిని కబ్జా చేశారని ఇటీవల సోషల్ మీడియాలో స్వామి వీడియో పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయన తండ్రి అదృశ్యం కావడం అనుమానాలకు తావిస్తోంది. తన తండ్రి కనపడటం లేదన్న సమాచారంతో స్వామి ఈ రోజు హుటాహుటిన తన సొంతూరు కామారెడ్డిలోని తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చేరుకున్నారు. తన తండ్రి అదృశ్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు మీడియాకువెల్లడించారు. ఈ పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కాపాడుకోవాలో లేక దేశ రక్షణ కోసం సరిహద్దులో ఉండాలో తోచడం లేదని జవాన్ స్వామి ఆందోళన చెందుతున్నారు. -
జలపాతంలో వ్యక్తి గల్లంతు
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా కొవ్వూరు సమీపంలోని గాలిగుమ్మి జలపాతంలో ప్రమాదవ శాత్తు ఓ వ్యక్తి పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. జయభేరి మారుతీ కంపెనీలో పని చేస్తున్న నవీన్(28) తోటి ఉద్యోగులతో కలసి జలపాతం దగ్గర సరదాగా గడిపేందుకు వచ్చారు. అయితే ప్రమాదవ శాత్తు నవీన్ కాలుజారి నీటి ప్రవాహంలో పడ్డాడు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ నవీన్ ఆచూకీ లభించలేదు.