person suicide
-
ప్రియురాలికి మరొకరికితో పెళ్లి నిశ్చయమైందని..
సాక్షి, శాంతినగర్ (అలంపూర్): తాను ప్రేమించిన యువతికి మరొకరితో వివాహం నిశ్చయమైందని తెలుసుకున్న ఓ యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శాంతినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కలుకుంట్లలో చోటుచేసుకుంది. ఏఎస్ఐ నర్సింహారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కలుకుంట్లకి చెందిన నరేష్‌కుమార్‌గౌడ్ (28) వనపర్తిలో ఐదేళ్లక్రితం పాల డెయిరీ నడిపేవాడు. వనపర్తిలో అప్పట్లో ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ప్రస్తుతం అతను కర్నూలులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే, ఇటీవల తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైందని తెలుసుకొని మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం సాయంత్రం కలుకుంట్లలోని సొంత ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు తాగాడు. అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటీన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. మృతుడి అన్న ప్రేమ్‌కుమార్‌గౌడ్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ పేర్కొన్నారు. -
కొండూరులో వికలాంగుడు ఆత్మహత్య
-
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
హసన్‌పర్తి: చేసిన అప్పులు తీర్చలేనని ఆందోళనకు గురైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన వరంగల్ రూరల్ జిల్లా హసన్‌పర్తి మండలం బైరాన్‌పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైరి గణేష్‌రెడ్డి(40) కుటుంబ పోషణతోపాటు వ్యాపారం నిమిత్తం వివిధ వర్గాల నుంచి అప్పులు చేశాడు. అయితే సుమారు రూ.10 లక్షలు అప్పులు చేయగా వాటిని తీర్చలేనని మనోవేదనకు గురైన గణేష్ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య రేణుక, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. -
ప్రాణం తీసిన వెలి
లంకమాలపల్లి (పెరవలి): కులపెద్దలు వెలి వేయడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెరవలి మండలం లంకమాలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాతా సంజీవ్ (28)పై 2012లో పశువుల పాక దహనం చేసాడని ఆరోపణ ఉంది. దీనిపై నాలుగేళ్లుగా కుల పెద్దల వద్ద పంచాయితీ జరిగింది. ఈ నేపథ్యంలో ఈనెల 11న సంజీవ్ కుటుం బాన్ని కుల పెద్దలు వెలి వేశారు. వీరితో ఎవరూ మాట్లాడకూడదని, సహాయం చేయకూడదని తీర్పు చెప్పారు. అయితే ఈనెల 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా గ్రామంలో జరిగిన వేడుకల్లో సంజీవ్ డ్యాన్సులు వేశాడు. దీనిని చూసిన కుల పెద్దలు సంజీవ్‌ను రానివ్వద్దని హుకుం జారీ చేశారు. దీంతో సంజీవ్ కన్నీటి పర్యంతమయ్యాడు. అవమాన భారం భరించలేక రోజుపాటు ఇంటి నుం చి బయటకు రాలేదు. ఎవరితో మాట్లాడకుండా ఉండలేనని, ఈ బతుకు తనకు వద్దని, పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి కుటుంబ సభ్యుల వద్ద ఆదివారం ఉదయం బోరున విలపించాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దూలానికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయంత్రం 4 గంటల సమయంలో కుటుంబసభ్యులు తలుపులు బద్దలు కొట్టి సంజీవ్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెరవలి ఎస్సై సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల ను విచారించారు. ‘కులపెద్దలే చంపేశారు’ తన తమ్ముడిని కులపెద్దలే పొట్టన పెట్టుకున్నారని మృతుని అన్న రాజీవ్ కన్నీరుమున్నీరుగా విలపించారు. అంబేడ్కర్ జయంతి వేడుకల్లో తన తమ్ముడు పా ల్గొంటే కుల పెద్ద బీరా చంద్రయ్య తీవ్రంగా అవమానపర్చాడని ఎస్సై నాగరాజుకు ఫిర్యాదు చేశాడు. మిన్నంటిన రోదనలు ‘నాన్నా లే నాన్నా’ అంటూ మృతుని కుమారుడు, కుమార్తె బోరున విలపిం చారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతు ని భార్య అనూష ఉపాధి కోసం కువైట్‌లో ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు చెప్పారు. -
భార్యను హత్యచేసి.. భర్త ఆత్మహత్య
-
భార్యను హత్యచేసి.. భర్త ఆత్మహత్య
వేముల: అనుమానం పెనుభూతమై ఒక కుటుంబాన్ని కాటువేసింది. ఫలితంగా అమాయకుడైన బాలుడు అనాథగా మారాడు. ఈ విషాద ఘటన మంగళవారం తెల్లవారుజామున వైఎస్సార్ జిల్లా వేముల మండలం నల్లచెరువుపల్లి గ్రామంలో జరిగింది. నల్లచెరువుపల్లి ఎస్సీ కాలనీకి చెందిన రామాంజనేయులు, కవిత దంపతులు కూలీపని చేసుకుని జీవించేవారు. కొంతకాలం నుంచి రామాంజనేయులు భార్యపై అనుమానం పెంచుకుని వేధించడం మొదలుపెట్టాడు. దాంతో కుటుంబంలో కలహాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో రామాంజనేయులు తాగుడుకు బానిసయ్యాడు. ఈ క్రమంలో తెల్లవారుజామున గొడ్డలితో భార్య కవితను నరికి దారుణంగా హతమార్చాడు. అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులిద్దరూ చనిపోవడంతో వారి ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మారాడు. ఈ సంఘటన స్థానిక ఎస్సీ కాలనీలో కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం వేముల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య
తిర్యాణి: ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం సోనాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన వి.భూమయ్య (35) కుటుంబ కలహాల కారణంగా మంగళవారం అర్ధరాత్రి పురుగుల మందు తాగాడు. దీంతో అతడిని హుటాహుటిన తిర్యాణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
జైలు భయంతో ఆత్మహత్య
చెన్నూర్‌రూరల్: జైలుకు వెళ్లాల్సి వస్తుందనే భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని కత్తెరసాల గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కత్తెరసాల గ్రామానికి చెందిన పంచిక మల్లయ్య(50)కు కరీంనగర్ జిల్లా మంథని మండలం బట్వాన్పల్లి గ్రామానికి చెందిన లక్ష్మితో పదిహేనేళ్ల క్రితం వివాహం జరిగింది. మూడేళ్లపాటు వీరి కాపురం సజావుగా సాగింది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో భార్య లక్ష్మి పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. అప్పటి నుంచి మల్లయ్య ఒంటరిగా ఉంటున్నాడు. భార్య తన ఇంటికి రావాలంటూ మల్లయ్య పలుమార్లు అత్తవారింటికి వెళ్లి తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం మల్లయ్య తన బావమరిదితోపాటు తోడల్లుడుని హత్య చేశాడు. దీంతో అతడిపై కరీంనగర్ పోలీసులు హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. మూడు నెలలపాటు కరీంనగర్ జైలులో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చాడు. హత్య కేసుల్లో మల్లయ్య కోర్టు పేషీలకు సరిగా హాజరు కాలేదు. ఈ కారణంగా తనను జైల్లో పెడుతారని, వారెంట్లు వస్తాయని బంధువులు, గ్రామస్తులతో చెబుతూ భయాందోళనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో మల్లయ్య ఆదివారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. బంధువులు సోమవారం ఉదయం ఇంటి తలుపులు తెరిచి చూడగా మృతిచెంది ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ శ్రీలత తెలిపారు.