Peshawar attack
-
బుర్ఖాలో ఉగ్రవాదులు.. అగ్రికల్చర్ వర్సిటీపై దాడి
పెషావర్ : తాలిబన్ ఉగ్రవాదుల దాడిని పాక్ సైన్యం తిప్పికొట్టింది. బుర్ఖాలో వచ్చిన ఉగ్రవాదులు శుక్రవారం వ్యవసాయ వర్సిటీలో నిర్దాక్షిణ్యంగా కాల్పులు చేపట్టారు. ఘటనలో 12 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులను పాక్ సైన్యం హతమార్చింది. బుర్ఖాలో మహిళలతో కలిసి ఉగ్రవాదులు కనిపించిన వారిపైనా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఓ బాంబు కూడా పేల్చినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన భద్రతాదళాలు క్యాంపస్‌ను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకుని ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు సైన్యం ప్రకటించింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. ప్రస్తుతం చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా దళాలు సోదాలు చేపట్టాయి. ఐఎస్ఐ తమను లక్ష్యంగా చేసుకున్నందునే ఈ దాడికి పాల్పడినట్లు తాలిబన్ ప్రకటించుకుంది. కాగా, ఇద్ మిలాదున్ నబీ సందర్భంగా సెలవు రోజు కావటంతో రద్దీ తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. -
ఆర్మీ దాడులు: 50 మంది తాలిబన్లు మృతి
పాకిస్థాన్: పెషావర్‌లో ఆర్మీ స్కూల్‌పై తీవ్రవాదులు సృష్టించిన నరమేధంతో పాక్ ప్రభుత్వం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అందులోభాగంగా పాకిస్థాన్‌లోని గిరిజన ప్రాంతమైన ఖైబర్‌లోని తాలిబన్ స్థావరాలపై సైన్యం గురువారం ముకుమ్మడి దాడులు చేసింది. ఆ దాడుల్లో దాదాపు 50 మంది తాలిబన్ తీవ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పాక్ సైనిక అధికారులు వెల్లడించారు. తాలిబన్ తీవ్రవాదుల ఆత్మాహుతి దళం సైనిక దుస్తుల్లో మంగళవారం పెషావర్ ఆర్మీ స్కూల్లో ప్రవేశించారు. పాఠశాలలోని విద్యార్థులు, సిబ్బంది, ఉపాధ్యాయులపై విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 148 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దారుణంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాలిబన్లను ఏరివేసేందుకు పాక్ ప్రభుత్వం నడుం బిగించింది. -
వెనక్కు తగ్గిన ఇమ్రాన్ ఖాన్
ఇస్లామాబాద్: నాలుగు నెలలుగా నవాజ్ షరీఫ్ ప్రభుత్వంపై పోరాటం సాగిస్తున్న పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు ఇమ్రాన్ ఖాన్ వెనక్కుతగ్గారు. తన పోరాటాన్ని విరమించుకున్నారు. పెషావర్ లో ఆర్మీ స్కూల్ పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో ఆయనీ నిర్ణయం తీసుకున్నారు. తీవ్రవాదంపై ప్రభుత్వం జరిపే పోరుకు సహాయ పడాలని నిర్ణయించుకున్నట్టు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా 126 రోజులుగా చేస్తున్న పోరాటాన్ని విరమించుకున్నామని చెప్పారు. ఎన్నికల అక్రమాలపై ఇప్పటికైనా ప్రభుత్వం నిష్పక్షపాత దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆగస్టు 14న లాహోర్ లో ఆయన ఆందోళన ప్రారంభించారు. -
పెషావర్ స్కూలు రాక్షసులు వీరే!