పెషావర్ : తాలిబన్ ఉగ్రవాదుల దాడిని పాక్ సైన్యం తిప్పికొట్టింది. బుర్ఖాలో వచ్చిన ఉగ్రవాదులు శుక్రవారం వ్యవసాయ వర్సిటీలో నిర్దాక్షిణ్యంగా కాల్పులు చేపట్టారు. ఘటనలో 12 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులను పాక్ సైన్యం హతమార్చింది.
బుర్ఖాలో మహిళలతో కలిసి ఉగ్రవాదులు కనిపించిన వారిపైనా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఓ బాంబు కూడా పేల్చినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన భద్రతాదళాలు క్యాంపస్‌ను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకుని ఎదురు కాల్పులు ప్రారంభించాయి.
ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు సైన్యం ప్రకటించింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. ప్రస్తుతం చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా దళాలు సోదాలు చేపట్టాయి. ఐఎస్‌ఐ తమను లక్ష్యంగా చేసుకున్నందునే ఈ దాడికి పాల్పడినట్లు తాలిబన్ ప్రకటించుకుంది. కాగా, ఇద్ మిలాదున్ నబీ సందర్భంగా సెలవు రోజు కావటంతో రద్దీ తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment