petitions inquiry
-
ప్రభుత్వ భూముల కబ్జాపై 33 జిల్లాల్లో వెంటనే సర్వే చేపట్టాలి: హైకోర్టు
హైదరాబాద్: ఓయూ భూములు కబ్జా అవుతున్నాయన్న ఓయూ విద్యార్థి పి.రమణారావు లేఖపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సుమారు 3 వేలకు గజాలకుపైగా భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ చేసి ఆక్రమిస్తున్నారని పి.రమణారావు లేఖలో హైకోర్టుకు తెలిపాడు. అయితే కబ్జా కాకుండా చర్యలు తీసుకున్నట్లు ఏజీ తెలిపింది. తులసి హౌజింగ్ సొసైటీపై పోలీసులకు ఓయూ ఫిర్యాదు చేసిందని ఏజీ తెలిపింది. ఇక దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకండా హైదరాబాద్ సీపీ, అంబర్‌పేట పోలీసులను హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై తదుపరి విచారణ అక్టోబర్ 20కి వాయిదా వేసింది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్..! వీధి కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్‌కు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీధికుక్కల నియంత్రణపై జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టారు. వీధికుక్కల నియంత్రణకు చర్యలపై కలెక్టర్లు నివేదికలు సమర్పించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నాలుగు వారాల్లో 33 జిల్లాల కలెక్టర్లను నివేదికలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదికలు సమర్పించని కలెక్టర్లపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు హెచ్చరించింది. 3 వారాల్లో నియమించి నోటిఫికేషన్ ఇవ్వాలి: తెలంగాణ హైకోర్టు తెలంగాణ బీసీ కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకంపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సీజే జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టారు. కాగా, మరో 4 వారాల సమయం కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. అయితే 3 వారాల్లో నియమించి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 25కి వాయిదా వేశారు. హెల్మెట్ ఫైన్ల విధింపుపై హైకోర్టు విచారణ వాహనం వెనుక కూర్చున్న వ్యక్తికి.. హెల్మెట్ ఫైన్ల విధింపుపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర మోటార్ వాహనాల చట్ట సవరణను రాష్ట్రం స్వీకరించకముందే ఫైన్లు విధిస్తున్నారన్న పిటిషనర్ పేర్కొన్నాడు. అయితే దీనికి సంబంధించిన వివరాలను తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 2కి వాయిదా వేసింది. 33 జిల్లాల్లో వెంటనే సర్వే చేపట్టాలన్న హైకోర్టు తెలంగాణలో ప్రభుత్వ భూములను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ భూముల అక్రమాలకు సంబంధించి ఫిర్యాదులు తరచూ తమ దృష్టికి వస్తున్నట్లు హైకోర్టు తెలిపంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వెంటనే సర్వే చేపట్టాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్ 27కి వాయిదా వేసింది. -
అర్ధగంట చదివినా అర్థంకాలేదు
న్యూఢిల్లీ/శ్రీనగర్: రాజ్యాంగంలోని 370వ అధికరణం రద్దును వ్యతిరేకిస్తూ వచ్చిన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరిస్తూ, ఆ పిటిషన్లలో అనేక లోపాలు ఉన్నాయనీ, ముందు వాటిని సరిచేసుకోవాలని సూచించింది. ఇంతటి తీవ్రమైన, ప్రధానమైన అంశానికి సంబంధించిన పిటిషన్లలో అనేక తప్పులు, లోపాలు ఉండటంపై సుప్రీంకోర్టు విచారం వ్యక్తం చేసింది. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం ఈ నెల 5న రద్దు చేయడం తెలిసిందే. ఈ చర్యను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్లు వేశారు. న్యాయవాది ఎంఎల్ శర్మ మొట్టమొదటగా, ఆగస్టు 6నే వేసిన పిటిషన్‌ను కోర్టు పరిశీలించింది. శర్మ పిటిషన్‌పై జస్టిస్ గొగోయ్ వ్యాఖ్యానిస్తూ ‘ఈ పిటిషన్‌ను అర్ధగంటపాటు చదివాను. కానీ ఈ పిటిషన్ ఎందుకు వేశారో అర్థం కాలేదు. పిటిషనర్ ఏం కోరుతున్నారో తెలియలేదు. ఏం అడుగుతున్నారో స్పష్టంగా తెలియడం లేదు. ఏం పిటిషన్ ఇది?’ అని అన్నారు. మరికొంత సమయం ఇస్తాం.. జమ్మూ కశ్మీర్లో మీడియాపై ఆంక్షలను ఎత్తివేయాలంటూ వచ్చిన పిటిషన్‌ను కూడా ఇదే ధర్మాసనం విచారించింది. ఆంక్షలను క్రమక్రమంగా ఎత్తివేస్తున్నామని కేంద్రం తరఫు న్యాయవాది చెప్పడంతో ఈ అంశంలో ఏదైనా ఆదేశం జారీ చేసే ముందు తాము మరికొంత సమయం వేచిచూడనున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదిస్తూ క్రమక్రమంగా ఆంక్షలను ఎత్తివేస్తున్నామని చెప్పారు. ఇరు పక్షాల వాదనలనూ విన్న అనంతరం ధర్మాసనం స్పందిస్తూ, ‘ ఆంక్షల ఎత్తివేతపై కేంద్ర ప్రభుత్వానికి మేం మరికొంత సమయం ఇవ్వదలచుకున్నాం’ అని తెలిపింది. ఎవ్వరూ చనిపోలేదు జమ్మూ కశ్మీర్లో ఆగస్టు 5న ఆంక్షలు విధించినప్పటి నుంచి ఇప్పటివరకూ ఒక్క ప్రాణం కూడా పోలేదనీ, ఎవరికీ పెద్ద గాయాలు కాలేదని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం చెప్పారు. కశ్మీర్లో ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్లను పునరుద్ధరించే పని శుక్రవారం రాత్రి నుంచే ప్రారంభమవుతుందనీ, శనివారం ఉదయానికే శ్రీనగర్‌లోని అత్యధిక భాగం ఫోన్లు పనిచేస్తుంటాయని ఆయన తెలిపారు. కశ్మీర్లో పాఠశాలలను వచ్చే వారంలో పునఃప్రారంభిస్తామనీ, దశల వారీగా ఆంక్షలను ఎత్తివేస్తామన్నారు. కశ్మీర్ లోయలోని ప్రభుత్వ కార్యాలయాల్లో శుక్రవారం బాగా ఎక్కువగానే హాజరు నమోదైందని సుబ్రహ్మణ్యం తెలిపారు. జమ్మూ కశ్మీర్లో 22 జిల్లాలు ఉండగా, ప్రస్తుతం 12 జిల్లాల్లో ఫోన్ కనెక్షన్లన్నీ సాధారణంగా పనిచేస్తున్నాయనీ, మరో ఐదు జిల్లాల్లో కేవలం రాత్రి వేళల్లోనే ఆంక్షలు ఉన్నాయని సుబ్రహ్మణ్యం చెప్పారు. కశ్మీర్ లోయలో 11 రోజులు ఉన్న అనంతరం జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ శుక్రవారం ఢిల్లీకి తిరిగొచ్చారు. మరోవైపు కశ్మీర్లో ఫోన్లైన్లు, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు పనిచేయకపోవడంతో.. బయటి ప్రాంతాల్లోని వ్యక్తులు తమ సందేశాలను టీవీ చానెళ్లకు పంపితే, చానెళ్లు వాటిని టీవీల్లో టిక్కర్ (స్క్రోలింగ్) రూపంలో కశ్మీర్‌లోని వారికి అందిస్తున్నాయి. అయితే కశ్మీర్‌లోని వారంతా ఈ మెసేజ్‌లను టీవీల్లో చూడగలరు తప్ప తిరిగి సమాధానం పంపలేరు. థార్ లింక్ ఎక్స్‌ప్రెస్ రద్దు థార్ ఎక్స్‌ప్రెస్ ద్వారా కరాచీ వెళ్లేందుకు జీరోపాయింట్ వరకూ నడుపుతున్న లింక్ ఎక్స్‌ప్రెస్‌ను భారత ప్రభుత్వం రద్దు చేసింది. శుక్రవారం ప్రారంభం కావాల్సిన ఈ రైలు ఆగిపోయిందని వాయువ్య రైల్వే అధికారి అభయ్‌శర్మ అన్నారు. అటునుంచి రావాల్సిన రైలు కూడా నిలిచిపోయిందని తెలిపారు. ట్రంప్‌కు ఇమ్రాన్‌ఖాన్ ఫోన్ పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ శుక్రవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కశ్మీర్ సమస్యపై ఫోన్లో చర్చించినట్లు పాక్ విదేశాంగ మంత్రి తెలిపారు. కశ్మీర్ విషయంలో ఐరాసలో రహస్య భేటీ జరుగుతున్న సందర్భంగా ట్రంప్–ఇమ్రాన్ మాట్లాడుకున్నారని చెప్పారు. -
జల్లికట్టు పిటిషన్ల విచారణ 31న
- సుప్రీంకోర్టు యూఢిల్లీ, సాక్షి, చెన్నై: జల్లికట్టుపై దాఖలైన అన్ని పిటిషన్లను జనవరి 31న విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జల్లికట్టును అనుమతిస్తూ తమిళనాడు అసెంబ్లీ చేసిన చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ కొనసాగింది. జల్లికట్టుపై మధ్యంతర దరఖాస్తులకు అనుమతించిన జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనం అన్నింటిని జనవరి 31న విచారిస్తానని తెలిపింది. మరోవైపు జల్లికట్టును అనుమతిస్తూ జనవరి 6 ఇచ్చిన నోటిషికేషన్ ను ఉపసంహరించుకుంటామని జస్టిస్ దీపక్ మిశ్రా ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. ఇప్పటికే కోర్టుకు ఆ విషయాన్ని వెల్లడించామని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ గుర్తు చేశారు. ఆ అంశంపై వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనమే విచారణ కొనసాగిస్తుందని జస్టిస్ మిశ్రా చెప్పారు. హింసకు విద్రోహ శక్తులే కారణం: పన్నీరు సెల్వం జాతి, సంఘ విద్రోహ శక్తులతో పాటు అతివాద శక్తులే జల్లికట్టు ఆందోళనల్లో హింసకు కారణమని తమిళనాడు ఆరోపించింది. ప్రదర్శనను పక్కదారి పట్టించిన దుష్ట శక్తుల్ని గుర్తించి చట్టం ముందు నిలబెడతామని సీఎం పన్నీర్ సెల్వం చెప్పారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రశ్నకు బదులిస్తూ చెన్నై నగరంలోని పలు ప్రాంతాల నుంచి విద్రోహ శక్తులు ఉద్యమకారులతో కలిసిపోయి ఆందోళన విరమణకు అంగీకరించలేదన్నారు. వారిలో కొందరు ప్రత్యేక తమిళనాడు డిమాండ్‌ను లేవనెత్తారని, మరికొందరు ఒసామా బిన్ లాడెన్ ఫొటోలు చూపుతూ రిపబ్లిక్ డేను బహిష్కరించాలంటూ నినాదాలు చేసినట్లు ఆధారాలున్నాయని పేర్కొన్నారు. సీఎం సమాధానం సంతృప్తికరంగా లేదంటూ స్టాలిన్ సహా డీఎంకే సభ్యులంతా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.