Physiotherapy treatment
-
దీర్ఘకాలిక నొప్పి నుంచి బాధపడుతున్నారా? ఫిజియోథెరపీతో మీ సమస్యకు చెక్
శరీర పనితీరును మెరుగుపరచడంలో ఫిజియోథెరపీ ఏ విధంగా ఉపయోగపడుతుంది? కంకషన్ నుంచి కోలుకోవడానికి చేయాల్సిన వ్యాయామాలు ఏంటి? అన్నది ఇప్పుడ చూద్దాం. మెదడుకు గాయం తగిలిన తర్వాత తక్షణ వైద్య సహాయం తప్పనిసరి. సరైన చికిత్స,త్వరగా కోలుకోవడానికి, కంకషన్ల కోసం ఫిజియోథెరపీ వ్యాయామాల కోసం నిపుణుడిని సంప్రదించాలి. 1.కంకషన్ అంటే ఏమిటి? తలకు నేరుగా గాయం తగిలినప్పుడు లేదా మెదడు వేగంగా కదిలినప్పుడు కంకషన్ సంభవిస్తుంది. కంకషన్ అంటే మెదడు వాస్తవానికి "చెడిపోలేదు", కానీ మెదడులోని రక్త ప్రవాహం మరియు సెల్యులార్ పనితీరు మార్చబడతాయి. గాయపడిన ప్రాంతంపై ఆధారపడి, ఇది తాత్కాలిక లేదా శాశ్వత మెదడు పనితీరు సమస్యలకు దారితీయవచ్చు.వికారం, తలనొప్పి, మైకము, అస్పష్టమైన దృష్టి కంకషన్ యొక్క శారీరక లక్షణాలు. 2.కంకషన్ కోసం ఫిజియోథెరపీ వ్యాయామాలు ఫిజియోథెరపిస్ట్ కార్డియోవాస్కులర్, న్యూరోలాజికల్,ఆర్థోపెడిక్ వ్యవస్థలను పరిశీలిస్తాడు. ఒక ఫిజియోథెరపిస్ట్ రోగి కంకషన్ నుంచి కోలుకోవడానికి సహాయం చేస్తాడు. 3.విశ్రాంతి విశ్రాంతిని నిర్ధారించడానికి కంకషన్ తర్వాత శారీరక శ్రమను పరిమితం చేయడం ముఖ్యం. విశ్రాంతి మెదడును రికవరీ మోడ్‌లోకి పంపుతుంది. 4.మెడ పునరావాసం చాలా తరచుగా.. కంకషన్‌కు ముందు, ఆ తర్వాత మెడ గట్టిగా లేదా ఉద్రిక్తంగా ఉంటుంది. ఫలితంగా దీర్ఘకాలిక నొప్పి భుజాలకు చేరుకోవచ్చు. ఫిజియోథెరపిస్ట్ వ్యాయామాలు నొప్పి,అసౌకర్యాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా గర్భాశయ థొరాసిక్ వెన్నెముక కదలికను ప్రోత్సహిస్తాయి. 5. శక్తి పునరుద్ధరణ ఒక కంకషన్ తర్వాత కండరాల బలహీనత,శారీరక ఓర్పును తగ్గిస్తుంది. అందువల్ల, ఫిజియోథెరపిస్ట్ లక్షణాలను మరింత దిగజార్చకుండా బలాన్ని పునరుద్ధరించడంపై దృష్టి పెడతారు. 6.తలనొప్పి చికిత్స కంకషన్ల యొక్క చెత్త లక్షణాలలో తలనొప్పి ఒకటి. తలనొప్పి చికిత్స కోసం ఫిజియోథెరపీలో ప్రత్యేకమైన మసాజ్, స్ట్రెచ్‌లు, కంటి వ్యాయామాలు,విద్యుత్ ప్రేరణ వంటివి ఉంటాయి. 7.ఏరోబిక్ వ్యాయామ కార్యక్రమం ఫిజియోథెరపిస్టులు బఫెలో కంకషన్ ట్రెడ్మిల్ పరీక్ష వంటి గ్రేడెడ్ వ్యాయామ పరీక్షలను ఉపయోగిస్తారు. తేలికపాటి కంకషన్ ఉన్న రోగులలో రికవరీ ప్రక్రియలో ఈ పరీక్షను ఉపయోగించవచ్చు. ఇది ముఖ్యంగా నిరంతర లక్షణాలు ఉన్నవారికి బాగా పనిచేస్తుంది. 8.అటానమిక్ నాడీవ్యవస్థ పునరావాసం తలను పైకి లేపడం.కంప్రెషన్ మేజోళ్ళు ధరించడం.ఆహారంలో ఉప్పు కలపడం. ఒక రోగి నిరంతర అటానమిక్ డిస్ఫంక్షన్ లక్షణాలను అనుభవిస్తే, కింది వ్యాయామాలతో కూడిన ఫిజియోథెరపిస్ట్ ఏరోబిక్ వ్యాయామ కార్యక్రమం సిఫార్సు చేస్తారు.ట్రెడ్మిల్ వ్యాయామం,నడక / జాగింగ్,మెట్లు ఎక్కడం.. ఈ వ్యాయామాలు వారానికి మూడుసార్లు 30 నుంచి 60 నిమిషాలు చేయాలి.ఇవి మెదడు,నాడీ వ్యవస్థను ఓవర్‌లోడ్ చేయని విధంగా చేయాలి.ఇది మెదడు కణజాలం యొక్క సరైన వైద్యంలో సహాయపడుతుంది. -
నర్వ్ స్టిమ్యులేషన్‌తో... పక్షవాతానికి చెక్!
జెనీవా: పక్షవాత రోగులకు శుభవార్త. నర్వ్ స్టిమ్యులేషన్ చికిత్స, మెరుగైన ఫిజియోథెరపీ ద్వారా పక్షవాతానికి చెక్ పెట్టడంలో వైద్య పరిశోధక బృందం విజయం సాధించింది. తొమ్మిది మంది పక్షవాత రోగులు ఈ రెండు చికిత్సల ద్వారా పూర్తిగా కోలుకుని తిరిగి నడవగలిగారు! వీరంతా వెన్నుముక తీవ్రంగా దెబ్బతినడం వల్ల పక్షవాతం బారిన పడ్డవారే! ఈ ప్రయోగాత్మక చికిత్స ఫలితం పట్ల పరిశోధకులు, వైద్యులు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ ప్రయోగం... ‘స్విస్ రీసెర్చ్ గ్రూప్ న్యూరో రీసెర్చ్’ అనే పరిశోధక బృందం ఇటీవల ఓ ప్రయోగం జరిపింది. దీన్ని తొలుత ఎలుకలపై జరిపిన అనంతరం మనుషులను ఎన్నుకుంది. వీరంతా ప్రమాదాల్లో నడకకు తోడ్పడే వెన్నెముక చివరి భాగంలోని కీలక నరాల సమూహమైన లంబార్ న్యూరాన్లు దెబ్బతిన్నవారే. దాంతో నడివాల్సిందిగా మెదడు ఇచ్చే ఆదేశాలు కాళ్లను చేరవు. ఫలితం...? శాశ్వత పక్షవాతం! ఇలాంటి 9 మంది రోగులకు స్వీస్ ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లాసెన్నేకు చెందిన క్లాడియా కేథీ అనే న్యూరో సైంటిస్ట్ బృందం ఎపిడ్యూరల్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇచ్చింది. తద్వారా నడకకు తోడ్పడే నరాలను ఉద్దీపింపజేసింది. ఇందుకోసం శస్త్రచికిత్స ద్వారా వెన్నుపాములో న్యూరో ట్రాన్స్మిటర్ అమర్చారు. దాని ద్వారా వెన్నెముక ఉత్తేజితమయ్యేలా చూశారు. దీంతోపాటు రొబో టిక్ ప్రక్రియలతో ఫిజియోథెరపీ అందిస్తూ వచ్చారు. వారిని పలు దిశల్లో కదిలించడంతోపాటు నడిపించారు. దాంతో రోగులు ఐదు నెలల్లోనే నడవడం,వాకర్ సాయంతో మెట్లెక్కడం మొదలుపెట్టారు. కొత్త మార్గం దొరికినట్టే... ఎలుకలపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్‌తో పాటు అక్కడి కణజాలం పనితీరుపై స్పేషియల్ ట్రాన్స్క్రిప్టోమెటిక్స్ టెక్నిక్ సాయంతో కేథీ బృందం అవగాహనకు వచ్చింది. ‘‘వెన్నెముకకు గాయమయ్యాక కోలుకునేందుకు ఎస్సీ బీఎస్‌ఎక్స్2, హెచ్ఓఎక్స్10 అనే న్యూరాన్లతో తయారైన కణజాలం సాయపడుతుందని గుర్తించాం. బ్రెయిన్‌స్టెమ్ నుంచి అందే ఆదేశాలను అమల్లో పెట్టేందుకు వీలుగా ఈ నాడీ కణజాలం చాలా విలక్షణమైన రీతిలో అమరి ఉంది. నడకకు అవే దోహదపడ్డాయి’’ అని కేథీ వివరించారు. అయితే, ‘అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియలో ఇది భాగం మాత్రమే. ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎస్సీ టు ద పవర్ ఆఫ్ బీఎస్‌ఎక్స్2, హెచ్ఓఎక్స్10 కణజాలం పక్షవాతం తర్వాత కోలుకుని నడకకు దోహదపడే ప్రాథమిక అంశాలన్నది మా పరిశోధనలో తేలింది. పక్షవాత చికిత్సలో కొత్త పద్ధతులకు ఈ అవగాహన మార్గాలు తెరచినట్టే’’ అంటూ ముక్తాయించారు. -
పల్లె సారూ.. ఆదుకోండి!
మంత్రి పల్లె కళాశాలలో పని చేస్తూ గాయపడిన కార్మికుడు కేసు నమోదు చేయకుండా మాయమాటలు చెప్పిన అనుచరులు ఆర్థికసాయం చేస్తామని పట్టించుకోని వైనం న్యాయం చేయాలంటున్న బాధిత కుటుంబ సభ్యులు అనంతపురం మెడికల్ :రాష్ట్ర పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి చెందిన పీవీకేకే కళాశాలలో పని చేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి మంచానికే పరిమయ్యాడో యువకుడు. ప్రమాదం జరిగిన సమయంలో అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చి ఆపై పట్టించుకోక పోవడంతో ఆ యువకుడి బాధ వర్ణణాతీతం. బాధితుడు తెలిపిన మేరకు.. అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లిలో నివాసం ఉంటున్న ఓబుళపతి (31) గత ఏడాది ఫిబ్రవరిలో కక్కలపల్లిలోని పీవీకేకే కళాశాలలో రెండో అంతస్తు ఎక్కి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. దీంతో వెన్నెముక విరిగింది. వెంటనే కళాశాలలోని వారు అతడిని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఈ క్రమంలో కేసు నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు. అనంతరం ఎంత ఖర్చయినా భరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత అనంతలో వెన్నెముకకు సంబంధించి శస్త్ర చికిత్స లేదని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ కూడా వైద్యం అందకపోవడంతో చివరకు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో మంత్రి ఎలాంటి ఆర్థికసాయం చేయకపోగా బాధితుడికి రూ.1.50 లక్షల వరకు ఖర్చయింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశాక ఓబుళపతిని అనంతపురం తీసుకొచ్చారు. ఫిజియోథెరపీ చేయించినా ఫలితం లేకపోగా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో తల్లి సరోజమ్మ, భార్య స్నేహలత సపర్యలు చేస్తున్నారు. కాగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న బిల్లులను మంత్రి పల్లె రఘునాథరెడ్డికి ఇదివరకే అందజేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజుల తర్వాత వెళ్లి ఆర్థికసాయం చేయాలని అడిగితే ఆ బిల్లులు తన వద్ద లేవని, మరోసారి ఇవ్వాలని మంత్రి చెబుతున్నట్లు బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. కేవలం బిల్లు డబ్బులు చెల్లించాల్సి వస్తుందనే ఇలా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒరిజినల్‌తో పాటు జిరాక్స్ బిల్లులు మూడు సార్లు ఇచ్చామని, మంత్రి మాత్రం స్పందించడం లేదన్నారు. ఇప్పటికే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని, తమకు నష్టపరిహారం అందించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు సైతం వెనుకాడమని ఓబుళపతి, ఆయన భార్య స్నేహలత, తల్లి సరోజమ్మ అంటున్నారు. మంత్రి సతీమణి చెప్పడంతోనే తాను పై అంతస్తుకు ఎక్కి పనులు చేశానని, ఈ క్రమంలోనే జారిపడినట్లు ఓబుళపతి తెలిపారు.