pidikondala manikyala rao
-
మాణిక్యాలరావు మృతి: సీఎం జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, అమరావతి : మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. మాజీ మంత్రికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు. కాగా కరోనా బారినపడిన మాణిక్యాలరావు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. (మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత) పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల ఏపీ గవర్నర్ బీబీ హరిచందన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖామంత్రిగా మాణిక్యాలరావు చేసిన సేవలు ఎనలేనివని, ఆలయాల అభివృద్ధికి అయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తు ఉంటుందని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. -
నాపై చేసిన ఆరోపణలు అవాస్తవం: నిట్ డైరెక్టర్
సాక్షి, అమరావతి : మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని తాడేపల్లిగూడెం నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సి. సూర్య ప్రకాష్ రావు స్పష్టం చేశారు. యూట్యూబ్‌లో వచ్చిన ఫేక్ వీడియో ఆధారంగా పీహెచ్డీ పట్టాలకు అయిదు లక్షలు డిమాండ్ చేసినట్లు, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆదివారం పైడికొండల మాణిక్యాల రావు ఆరోపణలు చేశారు. సోమవారం తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ)లో విలేకరుల సమావేశంలో ఈ విషయంపై సూర్యప్రకాశ్ మాట్లాడుతూ..తమ వాళ్లకు ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇవ్వడం లేదనే దురుద్ధేశంతోని తనను ఉద్యోగం నుంచి తప్పించడానికి బురద చల్లుతున్నారని మండిపడ్డారు. ఓ వీడియోను పూర్తిగా ట్యాపింగ్ చేసి, మాటలను ఎడిట్ చేసి యూట్యూబ్‌లో పెట్టారని విమర్శించారు. ఎవరో చెప్పిన మాటలను, ఎడిట్ చేసిన వీడియోలను నమ్మి మాజీ మంత్రి పైడి కొండల ఇలా ఆరోపణలు చేయడం దారుణమన్నారు. మీమీద విమర్శలు వస్తున్నాయని తనను పిలిచి అడిగి ఉంటే బాగుండేదన్నారు. ఒకవేళ తన మీద వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే పదవి నుంచి వైదులుగుతానని పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్డీకి లేఖ రాశానని తెలిపారు. స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఈ వీడియో పంపిస్తున్నట్లు, దీనిపై సైబర్ కక్రైం కేసు పెట్టనున్నట్లు వెల్లడించారు -
‘మాకూ రోషముంది.. రాజకీయ రోషం మాత్రం కాదు’
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కారణంగానే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని బీజేపీ ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు విమర్శించారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీని అంగీకరించింది చంద్రబాబేననీ, దానిని అమలుచేయటం రాష్ట్ర ప్రభుత్వానికి చేతకాలేదని మండిపడ్డారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై దర్యాప్తుకు టీడీపీ ఎందుకు భయపడుతోందని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం మాణిక్యాలరావు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎవరిపైనా అయినా సీబీఐ సోదాలు జరిపితే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోందన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా నిధులు మంజూరు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు గల నియోజకవర్గాలకు నిధులు నిలుపుదల చేస్తోందని అన్నారు. దేశంలో రాష్ట్రంగా అభివృద్ధి చెందాలన్నదే తమ ఆకాంక్ష అని తెలిపారు. చందబ్రాబు కారణంగా ఏపీకి ఇంత అన్యాయం జరగుతుంటే తాము చాలా బాధపడుతున్నామని విచారం వ్యక్తం చేశారు. తమకు కూడా రోషం ఉందని, కానీ అది రాజకీయ రోషం మాత్రం కాదని, నిజమైన రోషమని మాణిక్యాలరావు పేర్కొన్నారు. -
పేరుకే మంత్రి.. పాపం మాట వినేవారులేరు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు పేరుకే మంత్రి కానీ ఆయన మాట వినేవారు లేరు. దేవాదాయ శాఖలో అధికారులదే ఆధిపత్యం. అటు ప్రభుత్వం కానీ, ఇటు అధికారులు కానీ మాణిక్యాలరావును పూర్తిగా పక్కనబెట్టినట్టు సమాచారం. మాణిక్యాలరావుకు తెలియకుండానే దేవాదాయ శాఖలో జీవోలు జారీ చేస్తున్నారు. మాణిక్యాల రావు దేవాదాయ శాఖ మంత్రి హోదాలో ఇచ్చిన లేఖలను టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదు. దర్శనం కోసం ఇచ్చిన సిఫారసు లేఖలను పక్కనపడేస్తున్నారు. ఇక దేవుడి డైరీలు దేవాదాయ శాఖ మంత్రికి పంపడంలోనూ ఇదే తీరు. 100 చొప్పున టీటీడీ డైరీలు, క్యాలెండర్లకు మంత్రి ఆర్డర్ ఇవ్వగా, టీటీడీ అధికారులు మాత్రం పదేసి పంపారు. గోదావరి పుష్కరాల్లోనూ మంత్రి ప్రమేయం పరిమితం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నుంచి బీజేపీ తరపున శాసనసభకు ఎన్నికైన మాణిక్యాల రావు.. మిత్రపక్షం టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కినా, ఆయన మాట వినేవారే లేకపోవడంతో అసంతృప్తితో ఉన్నారు.