
సాక్షి, అమరావతి : మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత పైడికొండల మాణిక్యాలరావు మృతిపట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టుగా చెప్పారు. మాజీ మంత్రికి ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీచేశారు. కాగా కరోనా బారినపడిన మాణిక్యాలరావు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. (మాజీమంత్రి మాణిక్యాలరావు కన్నుమూత)
పైడికొండల మాణిక్యాలరావు మృతి పట్ల ఏపీ గవర్నర్ బీబీ హరిచందన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖామంత్రిగా మాణిక్యాలరావు చేసిన సేవలు ఎనలేనివని, ఆలయాల అభివృద్ధికి అయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తు ఉంటుందని కొనియాడారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment