Pie
-
వరిగమలు!
మ్యూజిక్ మంచి మెడిసిన్. అలాగే వరిగలు. మైండ్‌కు సరిగమలు ఎలాగో... బాడీకి వరిగలు అలాగ! మ్యూజిక్ లవర్స్ ఎప్పుడూ ఎంగ్గా ఉంటారు. వరిగలు తిన్నా అంతే.. ఎవర్ గ్రీన్‌గా కనిపిస్తారు. ఎంజాయ్ దీజ్ ‘వరిగ’మలు. వరిగ మురుకులు కావలసినవి: వరిగలు- ఒక గ్లాసు, శనగపప్పు- పావు గ్లాసు, మినప్పప్పు- పావు గ్లాసు, పెసర పప్పు- పావు గ్లాసు, వరిబియ్యం- పావు గ్లాసు, జీలకర్ర- రెండు చెంచాలు, వాము- ఒక చెంచా, కారం- రెండు చెంచాలు, ఉప్పు- తగినంత, నూనె- మురుకులు కాలడానికి సరిపడినంత తయారు చేయాల్సిన పద్ధతి: వరిగలు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, వరి బియ్యం అన్నింటినీ మందపాటి బాణలిలో (నూనె లేకుండా) సన్నమంట మీద దోరగా వేయించాలి. ఒక్కొక్క దానిని విడిగా వేయించుకోవచ్చు. కలిపి వేయించాలనుకుంటే ముందుగా శనగలు వేసి అవి ఒక మోస్తరుగా వేగిన తర్వాత మిగిలిన ధాన్యాలను వేయాలి. చల్లారిన తర్వాత మరపట్టించి జల్లించాలి. పై పిండిలో జీలకర్ర, వాము, కారం, ఉప్పు, రెండు చెంచాల వేడినూనె వేసి బాగా కలపాలి. అందులో ఒక కప్పు వేడి నీరు పోసి కలపాలి. చివరగా తగినంత చన్నీళ్లతో పిండిని ముద్దగా చేయాలి. బాణలిలో నూనె వేడి చేసి కాగిన తర్వాత పిండిని మురుకుల (జంతికల) గొట్టంలో పెట్టి నూనెలోకి వత్తాలి. మీడియం మంట మీద మురుకులను దోరగా వేయించాలి. మురుకులు వేగిందీ లేనిదీ తెలియాలంటే చిల్లుల గరిటెతో మురుకుల మీద చిన్నగా తడితే తీగ లోపల మెత్తగా ఉందా గట్టి పడిందా అనే అంచనా వస్తుంది. గమనిక: కలిపిన పిండి ఆరిపోకూడదు. తడివస్త్రంతో కప్పి ఉంచి గొట్టంలో పట్టేంత పిండిని విడిగా తీసుకుంటూ మురుకులు చేయాలి. వరిగ తీపి అప్పం కావలసినవి: వరిగపిండి- ఒక కప్పు, కొబ్బరి కోరు- ఒక కప్పు, కొబ్బరి ముక్కలు- పిడికెడు, బెల్లంపొడి- ముప్పావు కప్పు, పటిక బెల్లం పొడి- ఒక చెంచా, ఈస్ట్- అర చెంచా, జీడిపప్పు, కిస్మిస్ - గుప్పెడు, నెయ్యి - ఒక చెంచా, యాలకుల పొడి- అర చెంచా తయారు చేయాల్సిన పద్ధతి: వరిగ పిండిని మందపాటి బాణలిలో వేసి (నూనె లేకుండా) సన్నమంట మీద దోరగా వేయించాలి. అర కప్పు వేడి నీటిలో ఈస్ట్, పటిక బెల్లం పొడి కలిపి పక్కన ఉంచాలి. బెల్లం పొడిలో పావు కప్పు నీరు పోసి సన్న మంట మీద ఐదు నిమిషాల సేపు మరిగించి దించాలి. ఇందులో వేయించి చల్లార్చిన వరిగపిండి, ఈస్ట్- పటికబెల్లం నీటిని వేసి కలిపి రెండు గంటల సేపు పక్కన పెట్టాలి. జీడిపప్పు, కొబ్బరి ముక్కలు, కిస్మిస్ని నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. రెండు గంటల తర్వాత ఈ మిశ్రమంలో యాలకులపొడి, కొబ్బరి కోరు వేసి అవసరమైతే మరికొంత నీటిని చేర్చి గరిటె జారుడుగా (ఇడ్లీ పిండిలా) కలుపుకోవాలి. అంచులు ఎత్తుగా ఉన్న పళ్లేనికి నెయ్యిరాసి పై మిశ్రమాన్ని పోసి సమంగా సర్దాలి. పైన వేయించిన జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు సర్దాలి. ఇడ్లీ పాత్రలో అడుగున నీరు పోసి పైన పళ్లేన్ని పెట్టి 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. చల్లారిన తర్వాత తీసి ముక్కలుగా కోసి వడ్డించవచ్చు. గమనిక: మిశ్రమంలో పళ్లెంలో సగానికి మించరాదు. ఉడికేటప్పుడు మిశ్రమం గుల్లగా పొంగి అప్పం పళ్లెం నిండుగా వస్తుంది. ఈస్ట్ లేకపోతే ఒక స్పూను పులిసిన పెరుగు కలుపుకోవచ్చు. వరిగ పుట్టు కావలసినవి: వరిగ బియ్యం- ఒక గ్లాసు, కొబ్బరి కోరు- అరకప్పు, ఉప్పు- అర చెంచా తయారు చేయాల్సిన పద్ధతి: వరిగబియ్యాన్ని ఐదు గంటల సేపు నానబెట్టి నీరంతా పోయేవరకు వడపోయాలి. ఆ బియ్యాన్ని పొడి వస్త్రం మీద పోసి నీడన ఇరవై నిమిషాల సేపు ఆరబెట్టి మరపట్టించాలి. ఆ పిండిని వెడల్పాటి పళ్లెంలో పోసి అందులో ఉప్పు వేసి కొద్దిగా నీటిని వేసి తడిపొడిగా కలుపుకోవాలి. మిశ్రమం ముద్దగా కాకూడదు. పిండి అంతటికీ నీరు అందాలి, చేత్తో నలిపితే పొడిగా రాలిపోతున్నట్లు ఉండాలి. ఇలా కలుపుకుని ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచాలి. కలిపేటప్పుడు నీటిని ఒకేసారి పోస్తే ఒక చోట ముద్దయి మిగిలిన పిండి అంతా పొడిగా ఉండిపోతుంది. కాబట్టి పిండిలో కొద్దికొద్దిగా నీటిని చిలకరించుకుంటూ కలుపుకోవాలి. పుట్టు తయారు చేసే గొట్టంలో కొంచెం కొబ్బరి కోరు కూరాలి, ఆ పైన పుట్టు పిండిని కూరాలి. ఆ పైన కొబ్బరికోరు, తర్వాత పిండి... అలా పొరలు పారలుగా నింపాలి. దీనిని ఆవిరి మీద ఆరేడు నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇది చాలా బలవర్ధకమైన ఉపాహారం. వరిగ దిబ్బరొట్టె కావలసినవి: వరిగలు- ఒక గ్లాసు, కందిపప్పు- పావు గ్లాసు, శనగపప్పు- పావు గ్లాసు, మినప్పప్పు- పావు గ్లాసు, పెసరపప్పు- పావు గ్లాసు, పుల్లటి పెరుగు- పావు గ్లాసు, అల్లం, పచ్చిమిర్చి ముద్ద- రెండు చెంచాలు, పసుపు- ఒక చెంచా, కారం- ఒక చెంచా, ఉప్పు - తగినంత, సొరకాయ తురుము- అరకప్పు, క్యాబేజ్ తురుము- అరకప్పు, మెంతికూర- అరకప్పు, కొత్తిమీర- పావు కప్పు, వంటసోడా- అరచెంచా; పోపుకోసం: ఆవాలు- రెండు చెంచాలు, కరివేపాకు- రెండు రెమ్మలు, నువ్వులు- మూడు చెంచాలు, నూనె- పావు కప్పు తయారు చేయాల్సిన పద్ధతి: వరిగలు, కందిపప్పు, శనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పును నాలుగు గంటల సేపు నానబెట్టాలి. నానిన తర్వాత మెత్తగా రుబ్బాలి. అందులో పెరుగు, కారం, ఉప్పు, అల్లం పచ్చిమిర్చి ముద్ద, పసుపు, సొరకాయ తురుము, క్యాబేజ్ తురుము, మెంతికూర, కొత్తిమీర వేసి రెండు గంటల సేపు పక్కన ఉంచాలి. ఒక బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత పోపు దినుసులన్నీ వేసి వేగనివ్వాలి. ఇప్పుడు పై మిశ్రమంలో వంటసోడా కలిపి పోపు బాణలిలో పోయాలి. బాణలి అంతటా సమంగా సర్ది మీడియం మంట మీద కాలనివ్వాలి. ఒక వైపు కాలిన తర్వాత తిరగేసి రెండో వైపు కూడా కాలనివ్వాలి. దీనిని పుదీన చట్నీ లేదా పెరుగు చట్నీతో తినవచ్చు. వరిగ పరమాన్నం కావలసినవి: వరిగ బియ్యం- ఒక గ్లాసు, బెల్లం పొడి - ఒక గ్లాసు, పాలు- అరగ్లాసు, నెయ్యి- రెండు చెంచాలు, యాలకుల పొడి- అర చెంచా, శొంఠి- చిటికెడు జీడిపప్పు, కిస్మిస్- గుప్పెడు, కర్జూరం ముక్కలు- రెండు చెంచాలు తయారు చేయాల్సిన పద్ధతి: వరిగ బియ్యాన్ని కడిగి రెండు గంటల సేపు నానబెట్టాలి. తర్వాత మూడు గ్లాసుల నీరు పోసి మెత్తగా ఉడికించాలి. ఈ లోపు పాలను మరిగించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించాలి. అన్నం ఉడికిన తర్వాత కర్జూరం ముక్కలు, బెల్లం పొడి కలిపి సన్నమంట మీద ఉడికించాలి. చివరగా యాలకుల పొడి వేసి మంట ఆపేయాలి. ఇప్పుడు పాలు పోసి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్, శొంఠి వేసి కలపాలి. గమనిక: పరమాన్నం మందపాటి పాత్రలో వండితే అడుగున అంటుకోకుండా, మాడకుండా ఉంటుంది. -
సంపూర్ణం
పండుగ స్టార్ట్ అవ్వాలంటే... స్వీట్ చిన్నముక్కైనా పడాలి. పండగ కంప్లీట్ అవ్వాలంటే మాత్రం పూర్ణం పడాల్సిందే. ఈ దసరాను పరిపూర్ణం, సంపూర్ణం చేసే పూర్ణాలివి! వెయ్యండి. పండుగను ఎంజాయ్ చెయ్యండి. పెసర పూర్ణాలు కావలసినవి: పెసర పప్పు - అర కేజీ బెల్లం తురుము లేదా పంచదార - అర కేజీ ఏలకుల పొడి - టీ స్పూను మినప్పప్పు - అర కేజీ (తగినన్ని నీళ్లు జత చేసి సుమారు మూడు గంటలు నానబెట్టాలి బియ్యప్పిండి - 100 గ్రా. బియ్యపురవ్వ - 50 గ్రా. ఉప్పు - కొద్దిగా నూనె - డీప్ ఫ్రైకి తగినంత తయారి పెసరపప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి రెండు విజిల్స్ రాగానే దించి, మెత్తగా మెదపాలి. బెల్లం తురుము, ఏలకులపొడి జత చేసి బాగా కలిపి (మిశ్రమం గట్టిగా ఉండాలి). చల్లారాక చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన ఉంచాలి. మినప్పప్పులో నీళ్లు వంపి, మిక్సర్‌లో వేసి మెత్తగా అయ్యేవరకు గ్రైండ్ చేయాలి. బియ్యప్పిండి, బియ్యపురవ్వ, ఉప్పు జత చేసి దోసెల పిండిలాగ కలిపి, సుమారు అరగంటసేపు పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పెసర పూర్ణం ఉండలను ఒక్కొక్కటిగా మినప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. బాగా వేగిన తరవాత పేపర్ నాప్కిన్ మీదకు తీసుకోవాలి. పూర్ణం బూరెలు కావలసినవి: మినప్పప్పు - పావు కేజీ బియ్యం - 100 గ్రా.; ఉప్పు - చిటికెడు పూర్ణాల కోసం: సెనగ పప్పు - పావు కేజీ బెల్లం తురుము - పావు కేజీ పచ్చి కొబ్బరి తురుము - అర కప్పు ఏలకుల పొడి - టీ స్పూను నూనె - వేయించడానికి తగినంత తయారి సెనగపప్పును శుభ్రంగా కడిగి, మూడు గంటలసేపు నానబెట్టాలి. మినప్పప్పు, బియ్యం కడిగి 5 గంటలు నానిన తర్వాత నీళ్లు ఒంపేసి దోసెల పిండిలా రుబ్బుకోవాలి. మధ్యమధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు జత చేయాలి. సెనగపప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉడికించి తీయాలి. నీళ్లు పూర్తిగా ఇగిరిపోయేవరకు స్టౌ మీద ఉంచాలి. బెల్లం తురుము జత చేసి మరోమారు కలిపి ఉడికించాలి. మిశ్రమంలో తడిపోయే వరకు ఉడికించి, దింపి, చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా ముద్ద చేయాలి. కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి బాగా కలిపి చిన్న చిన్న ఉండలు (పూర్ణాలు) చేసి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె కాగాక పూర్ణాలను మినప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి. చిలగడ దుంప పూర్ణాలు కావలసినవి: చిలగడ దుంపలు - 2 బెల్లం తరుగు - పావు కేజీ; నూనె - వేయించ డానికి తగినంత; ఏలకుల పొడి - అర టీ స్పూను, బియ్యం - పావు కేజీ; మినప్పప్పు - 150 గ్రా. నెయ్యి - 4 టేబుల్ స్పూన్లు తయారి బియ్యం, మినప్పప్పు మిశ్రమానికి తగినన్ని నీళ్లు జత చేసి, ఐదారు గంటలు నానబెట్టి, నీళ్లు ఒంపేసి గ్రైండర్లో వేసి మెత్తగా రుబ్బాలి. చిటికెడు ఉప్పు జత చేయాలి. చిలగడ దుంపలను శుభ్రంగా కడిగి, పైన తొక్క తీసి, సన్నగా తురమాలి. స్టౌ మీద బాణలిలో నెయ్యి కరిగాక చిలగడదుంప తురుము వేసి, పచ్చి వాసన పోయేవరకు అంటే బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఏలకుల పొడి, బెల్లం తురుము జత చేసి, చిక్కగా అయ్యేవరకు ఉడికించి దింపేయాలి. బాగా చల్లారాక చిన్నచిన్న ఉండలు చేసి పక్కన ఉంచాలి. బాణలిలో నూనె కాగాక ఈ ఉండలను బియ్యప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేయాలి. బాగా వేగాక పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి. కేసరి పూర్ణాలు కావలసినవి: మినప్పప్పు - అర కేజీ బియ్యప్పిండి - పావు కేజీ రవ్వకేసరి కోసం: బొంబాయి రవ్వ - అర కేజీ (నూనె లేకుండా వేయించాలి) పంచదార - కేజీ; నెయ్యి - పావు కేజీ జీడిపప్పు - 100 గ్రా.; కిస్మిస్ - 100 గ్రా నీళ్లు - లీటరు కంటె తక్కువ; నూనె - వేయించడానికి సరిపడా ఏలకుల పొడి - 2 టీ స్పూన్లు; కేసరి రంగు - చిటికెడు తయారి మినప్పప్పును సుమారు ఐదు గంటలు నానబెట్టి, నీరు ఒంపేసి గ్రైండర్లో వేసి, బజ్జీల పిండిలా రుబ్బుకోవాలి. బియ్యప్పిండి, చిటికెడు ఉప్పు జత చేసి బాగా కలిపి పక్కన ఉంచాలి. బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి. ఒక గిన్నెలో బొంబాయి రవ్వ, పంచదార వేసి బాగా కలిపి, మరుగుతున్న నీటిలో వేస్తూ ఉండకట్టకుండా కలుపుతుండాలి. మధ్యమధ్యలో నెయ్యి వేస్తూ ఉడికించాలి. జీడిపప్పులు, కిస్మిస్, ఏలకుల పొడి వేసి మరోమారు కలపాలి. అర టీ స్పూను కేసరి రంగును నీళ్లలో వేసి బాగా కలిపి, ఉడుకుతున్న కేసరిలో వేసి కలిపి, కేసరి ఉడికి, గట్టిపడగానే దించేయాలి. చల్లారాక చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఒక్కో ఉండను తీసుకుని మినప్పిండి మిశ్రమంలో ముంచి నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి, పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి. కొబ్బరి బూరెలు కావలసినవి బియ్యం - పావు కేజీ బెల్లం తరుగు - అర కేజీ నీళ్లు - కప్పున్నర క్యారట్ తురుము - కప్పు నెయ్యి - కప్ప పచ్చి కొబ్బరి తురుము - కప్పు ఏలకుల పొడి - టీ స్పూను నూనె - డీప్ ఫ్రైకి సరిపడా తయారి బాణలిలో నెయ్యి కరిగాక క్యారట్ తురుము వేసి పచ్చివాసన పోయేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి. సుమారు గంటసేపు బియ్యం నానబెట్టి, నీళ్లు ఒంపేసి పొడి వస్త్రం మీద ఆరబోయాలి. తడి పూర్తిగా పోయాక మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి. పిండిని జల్లించి, మెత్తటి పిండిని పక్కన ఉంచుకోవాలి. మందపాటి పాత్రలో కొద్దిగా నీళ్లు, బెల్లం వేసి ఉండ పాకం వచ్చేవరకు ఉడికించి దించేయాలి. దీంట్లో బియ్యప్పిండి, క్యారట్ తురుము, పచ్చి కొబ్బరి తురుము, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. మరోమారు స్టౌ మీద ఉంచి ఐదు నిమిషాలపాటు ఉడికించి తీసేయాలి. చిన్న చిన్న ఉండలు చేసి, చేతితో వడల మాదిరి ఒత్తి, బాణలిలో నూనె కాగాక వేసి, రెండు పక్కలా బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసేయాలి. పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకుని, చల్లారాక తినాలి. -
దోశా.. దోశా..ఎందుకు దిగిరావడం లేదు?
పెనమే కారణమంటున్న ఆర్బీఐ గవర్నర్ రాజన్ కోచి: ఒకపక్క ఆర్బీఐ ఏమో ధరలను కట్టడి చేయడంలో విజయం సాధించామని చెప్పుకుంటోంది. మరి వస్తువుల ధరలు తగ్గినప్పటికీ.. పెరిగిన దోశ రేట్లు మళ్లీ ఎందుకు తగ్గడం లేదు? ఇది ఒక ఇంజనీరింగ్ విద్యార్థిని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను అడిగిన ప్రశ్న. మరి ఆయన దీనికి చెప్పిన ఆసక్తికరమైన కారణం ఏంటో తెలుసా.. ‘పెనం’! అదేంటి పెనం ఏం చేసిందనేగా ఇప్పుడు మీ ప్రశ్న. అవును మరి దోశను వేసేందుకు ఎప్పటిలాగే ఇంకా సాంప్రదాయబద్దమైన పెనంనే ఉపయోగిస్తున్నారని.. ఈ విషయంలో టెక్నాలజీని అందిపుచ్చుకోలేకపోవడంవల్లే రేట్లు దిగిరావడం లేదనేది రాజన్ లాజిక్. అంతేకాదు దోశలు వేసే వంటవాళ్ల జీతాలు పెరిగిపోవడం వల్ల కూడా దోశ రేట్లు తగ్గడం లేదన్నారు ఆర్బీఐ గవర్నర్. ఫెడరల్ బ్యాంక్‌కు చెందిన ఒక కార్యక్రమంలో ఒక విద్యార్థిని ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావిస్తూ ఈ ‘దోశ’ ప్రశ్న అడిగింది. ఏ రంగమైనా ఇంతే... టెక్నాలజీ వినియోగంతో ఉత్పాదకత పెరుగుతుందని.. ఉదాహరణకు బ్యాంకింగ్ రంగంలో ఐటీ(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) వాడకంతో ఒక క్లర్క్ మరింత ఎక్కువ మందికి సేవలు అందించగలుగుతున్నాడని రాజన్ వివరించారు. ‘ఒకపక్క, ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న తరుణంలో కొన్ని రంగాలు టెక్నాలజీని సమర్థంగా ఉపయోగించుకుంటుంటే.. మరికొన్ని వెనుకబడుతున్నాయి. ఇలా టెక్నాలజీని మెరుగుపరుచుకోలేని రంగాలకు చెందిన వస్తువుల రేట్లు అంతకంతకూ పెరుగుతూనే ఉంటాయి. దోశ విషయంలో మీరు ఇప్పుడు చూస్తున్నది ఇదే’ అంటూ రాజన్ ముగించారు.