‘ఘోర విమానం ప్రమాదంలో రష్యాదే తప్పు’.. ఇదిగో సాక్ష్యం
బాకో: ల్యాండింగ్ సమయంలో అజర్ బైజాన్ ఎయిర్‌లైన్స్ (Azerbaijan Airlines)కు చెందిన జె2-8243 విమానం కజకిస్థాన్ కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో 38 మంది మృతి చెందగా..29 మంది తీవ్రంగా గాయపడ్డారు.అయితే, ఈ ప్రమాదంపై ఆదివారం (డిసెంబర్ 29) అజర్ బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలీయేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా ప్రాంతం నుంచి జరిపిన కాల్పుల వల్లే అజర్ బైజాన్ విమానం ప్రమాదానికి గురైందని చెప్పారు. విమాన ప్రమాదానికి గల కారణాల్ని మాస్కో దాచే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అమాయకుల ప్రాణాల్ని బలి తీసుకున్న రష్యా అందుకు బాధ్యత వహిస్తూ.. చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.‘అజర్ బైజాన్ ఎయిర్‌లైన్స్ ప్రమాదానికి గల కారణాల్ని దాచేందుకు రష్యాలోని ఓ వర్గం అసత్య ప్రచారం చేస్తుందని, తప్పుడు కథనాలతో మసిపూసి మారేడు కాయ చేస్తుంది. విమాన ప్రమాదం జరిగిన కారణ వేరయితే, దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మాస్కో చెబుతున్న కారణాలు వేరేలా ఉన్నాయి. చేసిన తప్పును అంగీకరించడం, అజర్ బైజాన్‌కు క్షమాపణలు చెప్పడం, విమాన ప్రమాదం జరిగిన తీరుతెన్నుల గురించి ప్రజలకు వివరించాలి అని’ఇల్హామ్ అలీయేవ్ రష్యాకు సూచించారు. President Aliyev: “First, Russia must apologize to Azerbaijan. Second, it must admit its guilt. Third, it must punish the culprits, hold them criminally responsible, and pay compensation to the Azerbaijani state as well as to the affected passengers and crew members. These are… pic.twitter.com/5N16w4Zhfw— Nasimi Aghayev🇦🇿 (@NasimiAghayev) December 29, 2024కాగా, ప్రమాదం జరిగిన రోజున ఉక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు గ్రోజ్ని సమీపంలో రష్యా గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులను ప్రయోగిస్తోంది. ఆ సమయంలో రష్యా క్షిపణి తాకడం కారణంగా విమానం కూలిందంటూ ఉక్రెయిన్‌తో పాటు అజర్ బైజాన్ కూడా ఆరోపించింది. ఈ క్రమంలోనే అజర్ బైజాన్ విమాన ప్రమాదాన్ని రష్యా ‘విషాదకరమైన సంఘటన’ అని పిలిచినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అజర్బైజాన్ ప్రెసిడెంట్ ఇల్హామ్ అలీయేవ్‌ను క్షమాపణలు కోరారు. కానీ, రష్యా జరిపిన క్షిపణుల ప్రయోగం వల్లే విమానం కూలినట్లు ఎక్కడా ప్రస్తావించలేదు.