'వారంతా క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం' | we hope they will be back safely who were in plain clash: ysrcp mps | Sakshi
Sakshi News home page

'వారంతా క్షేమంగా రావాలని కోరుకుంటున్నాం'

Published Mon, Jul 25 2016 8:08 PM | Last Updated on Tue, May 29 2018 2:59 PM

we hope they will be back safely who were in plain clash: ysrcp mps

న్యూఢిల్లీ: విమాన ప్రమాదంలో గల్లంతైనవారు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, బుట్టా రేణుక అన్నారు. చెన్నైలో గల్లంతైన విమానం ఆచూకీపై వివరాలు తెలుసుకునేందుకు వారు సోమవారం కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ను కలిశారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సబ్ మెరైన్ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని రక్షణమంత్రి చెప్పినట్లు తెలిపారు. బాధితులందరికీ అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చినట్లు చెప్పారు. గల్లంతైన విమానం కండీషన్ లోనే ఉందని కేంద్ర మంత్రి చెప్పినట్లు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement