PM Fasal Bima Yojana
-
బీమా పరిధిలోకి 40 శాతం పంటలు
సాక్షి, హైదరాబాద్: పంటల బీమాను రైతులకు మరింత చేరువ చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై) ద్వారా మరింత పరిహా రం అందేలా చర్యలు చేపడుతున్నామని.. అందులో భాగంగా 2017–18 వ్యవసా య సీజన్లో బీమా కవరేజీ 40 శాతం లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రకటించింది. అలాగే 2018–19 నాటికి 50 శాతానికి చేరుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఇటీవల ఢిల్లీలో రెండ్రోజులపాటు జరిగిన రాష్ట్రాల వ్యవసాయ ఉన్నతాధికారుల సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ కమిషనర్ జగన్మోహన్ ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఏడాది నుంచి బీమాకు ఆధార్‌ను అనుసం ధానం చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో 2016–17 ఖరీఫ్‌లో 6.70 లక్షల మంది రైతులు బీమా ప్రీమియం చెల్లించారు. మొత్తం 14.47 లక్షల ఎకరాల్లో పంటలకు బీమా చేశారు. అంటే 15 శాతం సాగు భూమికి మాత్రమే బీమా చేయించినట్లయింది. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద పత్తికి ప్రీమియం చెల్లించే గడువును జూలై 15వ తేదీ వరకు పొడిగించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. గతంలో ఈ గడువు జూన్ 14 వరకే ఉండేది. ఇక ఇతర పంటలకు జూలై 31ని, వరికి ఆగస్టు 31ని ప్రీమియం చెల్లింపు గడువుగా నిర్ణయించారు. -
ఫసల్ బీమా గడువు పెంపు
హన్మకొండ : ప్రధానమంత్రి ఫసల్ బీమా గడువును ఈ నెల 10 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఇప్పటి వరకు ఈ పథకం లో చేరని రైతులు 10లోపు బీమా చేయిం చుకోవాలని వ్యవసాయ శాఖ జిల్లా సం యుక్త సంచాలకురాలు ఉషాదయాళ్ తెలి పారు. ఖరీఫ్‌లో సాగుచేసే పంటలు ప్రకృ తి వైఫరీత్యాలతో నష్టపోతే బీమా చేయిం చుకున్న రైతులకు పరిహారం అందుతుం దని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరి, మొక్కజొన్న, కంది, పెసర, వేరుశనగ, పసుపు పంటలకు బీమా వర్తిస్తుందని తెలిపారు. పంటరుణాలు తీసుకున్న రైతులకు సంబంధిత బ్యాంకులు ప్రీమియం చెల్లిస్తాయని, రుణం పొందని రైతులు బ్యాంకుల్లో కాని, వ్యవసాయ అధికారిని కలిసి ప్రీమియం చెల్లించవచ్చని తెలిపా రు. బజాజ్ అలియాంజ్ కంపెనీ బీమా అమలు చేస్తుందని తెలిపారు. వివరాలకు 7893802110(ఆనంద్), 9133683399 (శ్రీనివాస్), 8886221685 (పశాంత్) సెల్ నంబర్లలో సంప్రదించాలని కోరారు. వరి ఎకరాకు ప్రీమియం రూ.560, మొక్కజొన్నకు రూ.400, జొన్నకు రూ.100, కం దికి రూ.260, పెసరకు రూ.200, వేరుశనగకు రూ.320, పసుపు ఎకరాకు రూ.1100 చొప్పున ప్రీమియం చెల్లించాలని కోరారు. -
మూడు పంటలకు గ్రామం యూనిట్‌గా బీమా
మార్గదర్శకాలతో నోటిఫికేషన్ జారీ చేసిన వ్యవసాయ శాఖ సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై), వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (డబ్ల్యూబీసీఐఎస్)ను రాష్ట్రంలో అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ రెండు పథకాలు సమ్మిళితం చేసి రూపొందించిన ఏకీకృత ప్యాకేజీ బీమా పథకం (యూపీఐఎస్)ను మాత్రం ఈసారి నిజామాబాద్ జిల్లాలో పెలైట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఖరీఫ్‌లో గ్రామం, మండలం యూనిట్‌గా పంటల బీమా అమలు చేస్తారు. ఫసల్ బీమా యోజనను వరి, జొన్న, మొక్కజొన్న, కంది, పెసర, మినుము, వేరుశనగ (సాగునీటి వసతి ఉన్న ప్రాంతం), వేరుశనగ (సాగునీటి వసతి లేని ప్రాంతం), సోయాబీన్, పసుపు, మిరప (సాగునీటి వసతి ఉన్న), మిరప (సాగునీటి వసతిలేని) పంటలకు వర్తింపజేస్తారు. కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో వరిని.. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో మొక్కజొన్నను.. ఆదిలాబాద్ జిల్లాలో సోయాబీన్‌ను నోటిఫై చేసి గ్రామం యూనిట్‌గా బీమా సౌకర్యం కల్పించారు. ఫసల్ బీమా యోజనను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని వ్యవసాయ బీమా కంపెనీ (ఏఐసీ), బజాజ్ అలయంజ్ జీఏసీ లిమిటెడ్ అమలుచేస్తాయి. వాతావరణ ఆథారిత బీమాను రిలయెన్స్ జనరల్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ జీఐసీ లిమిటెడ్‌లు అమలుచేస్తాయి. బీమా అమలుకు రాష్ట్రంలో మూడు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఫసల్ బీమాను మొదటి క్లస్లర్లోని మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ సహా మూడో క్లస్టర్‌లోని ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో వ్యవసాయ బీమా కంపెనీ అమలు చేస్తుంది. రెండో క్లస్టర్‌లోని వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో బజాజ్ అలయంజ్ జీఐసీ లిమిటెడ్ అమలు చేయనుంది. వాతావరణ బీమాను మొదటి క్లస్టర్లో రిలయెన్స్, రెండు, మూడు క్లస్టర్లలో ఎస్బీఐ జీఐసీలు అమలు చేస్తాయి. జిల్లాల వారీగా ప్రీమియం ఫసల్ బీమా యోజన కింద వ రి, వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, పెసర, మినుము, సోయాబీన్, కంది పంటలకు సంబంధించి బీమా మొత్తంలో గరిష్టంగా 2 శాతం ప్రీమియం చెల్లించాలి. మిరప, పసుపు పంటలకు 5 శాతం గరిష్ట ప్రీమియం చెల్లించాలి. బీమా మొత్తం స్కేల్ ఆఫ్ ఫైనాన్స్‌కు సమానంగా ఉంటుంది. ఆ ప్రకారం బీమా మొత్తం, ప్రీమియం చెల్లింపులు జిల్లా జిల్లాకు వేర్వేరుగా ఉంటాయి. ఇక వాతావరణ ఆధారిత పంటల బీమా కింద రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పత్తికి బీమా వర్తింపజేస్తారు. మిరపకు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో.. పామాయిల్‌కు ఖమ్మం, బత్తాయికి నల్లగొండ జిల్లాలో బీమా అమలు చేస్తారు. మిరప పంట హెక్టారుకు రూ.85 వేలు, పత్తికి రూ.60 వేలు, పామాయిల్‌కు రూ.70 వేలు, బత్తాయికి రూ.70 వేలుగా బీమా మొత్తాన్ని నిర్ధారించారు. వీటికి బీమా మొత్తంలో గరిష్టంగా 5 శాతం ప్రీమియం చెల్లించాలి. ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లింపునకు జూలై 31 ఆఖరు తేదీ. వరదలు, తీవ్ర కరువు, వర్షాల మధ్య అంతరం తదితర కారణాల వల్ల పంటలు నష్టపోతే సీజన్ మధ్యలోనే తక్షణంగా 50 శాతంలోపు బీమా సొమ్ము చెల్లిస్తారు. వడగళ్లు వచ్చినప్పుడు రైతు యూనిట్‌గా బీమా అమలు చేస్తారు. వ్యక్తిగత ప్రమాద బీమా కూడా.. ఇక ఏకీకృత ప్యాకేజీ బీమా పథకం (యూపీఐఎస్)ను పైలట్ ప్రాజెక్టుగా నిజామాబాద్ జిల్లాలో అమలుచేస్తారు. ఇందులో వ్యక్తిగత ప్రమాద బీమా అవకాశాన్ని కల్పించారు. రైతులు రూ.12 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రమాదంలో ఆ రైతు మరణిస్తే వారి కుటుంబానికి రూ. 2 లక్షల బీమా సొమ్ము అందుతుంది. పూర్తిగా గాయాలపాలై ఒక కన్ను పోవడం, రెండు చేతులు పోగొట్టుకోవడం, కాళ్లు విరగడం వంటివి సంభవించినా రూ.2 లక్షలు అందజేస్తారు. పాక్షికంగా గాయాలపాలైతే రూ.లక్ష చెల్లిస్తారు. ఇక సెక్షన్ మూడు ప్రకారం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై)ను వర్తింపజేస్తారు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపు వయసున్న రైతులకు వర్తిస్తుంది. దీనికి రూ.330 ప్రీమియంగా చెల్లించాలి. సంబంధిత రైతు మరణిస్తే వారి కుటుంబానికి రూ.2 లక్షలు అందజేస్తారు. ఇక సెక్షన్ నాలుగు ప్రకారం బిల్డింగ్, కంటెంట్స్ ఇన్సూరెన్స్ పథకం, సెక్షన్ ఐదు ప్రకారం 10 హెచ్‌పీ వరకున్న వ్యవసాయ పంపుసెట్లకు బీమా అమలు చేస్తారు. సెక్షన్ ఆరు ప్రకారం విద్యార్థి భద్రత బీమా, సెక్షన్ ఏడులో ట్రాక్టర్ బీమా పథకాలు ఉన్నాయి. -
సాగు ఖర్చు తగ్గింపునకు మార్గదర్శకాలు
రాష్ట్రాలకు పంపిన కేంద్ర వ్యవసాయశాఖ - వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని సూచన - సన్న, చిన్నకారు రైతులకు సకాలంలో రుణాలు - వర్షాభావ ప్రాంతాల్లో వరి ఉత్పత్తి, ఉత్పాదకతలపై ప్రత్యేక దృష్టి సాక్షి, హైదరాబాద్: పంటల సాగు ఖర్చు తగ్గింపుపై కేంద్ర వ్యవసాయ శాఖ దృష్టి సారించింది. రైతు సంక్షేమం దృష్ట్యా రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది. సాగు ఖర్చు పెరగడం వల్లే రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారని, అందువల్ల వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని కేంద్రం పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలు పంపింది. భూసార కార్డుల ఆధారంగా ఎరువులను, సేంద్రియ ఎరువులను వాడేవిధంగా రైతులను ప్రోత్సహించాలి. దీనివల్ల అనవసర ఎరువుల వాడకం తగ్గి సాగు ఖర్చు తగ్గుతుంది. సాగునీటి యాజ మాన్య పద్ధతులు పాటించాలి. సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించాలి. రైతులకు సకాలంలో రుణాలు అందేలా చూడాలి. కౌలురైతులకూ రుణాలు అందజేయాలి. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలని, దీనివల్ల సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుందని తెలిపింది. అందుకోసం కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి రైతులకు తక్కువ అద్దెకు వ్యవసాయ యంత్రాలను సరఫరా చేయాలని స్పష్టం చేసింది. వచ్చే ఖరీఫ్ నుంచి అమలయ్యే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన(పీఎంఎఫ్‌బీవై)పై రైతుల్లో చైతన్యం తీసుకురావాలి. కేంద్ర వ్యవసాయశాఖ మార్గదర్శకాలివే... ► పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించాలంటే తక్కువ కాలపరిమితి వరి రకాలను ప్రోత్సహించాలి. ఒకే సీజన్లో రెండు రకాల పంటలను సాగు చేయవచ్చు. ► జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతుక్షేత్రాల్లో నీటి కుంటలను తవ్వించాలి. ► వర్షాభావ ప్రాంతాలు, వరదలు వచ్చే ప్రాంతాల్లో వరి ఉత్పత్తి, ఉత్పాదకతలపై దృష్టి సారించాలి. వరదల్లో మునిగిపోయినా తట్టుకోగలిగే వరి విత్తన రకాలను రైతులకు అందించాలి. ► తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పత్తిలో గులాబీ రంగు పురుగు నివారణ చర్యలు చేపట్టాలి. ► ఉద్యానవన సాగులో హైబ్రీడ్ టెక్నాలజీని ప్రోత్సహించాలి. ► ఉద్యాన పంటల్లో సూక్ష్మ పోషకాలను ప్రోత్సహించాలి. ► గడ్డిసాగును ప్రోత్సహించాలి. బై బ్యాక్ పద్ధతిన రైతుల నుంచి కొనాలి. ► రైతుల వద్దకు మొబైల్ వెటర్నరీ సేవలను అందించాలి. తద్వారా వారి పశువుల ఆరోగ్యానికి గ్యారంటీ ఇవ్వాలి.