PM visit
-
మోదీ పర్యటనలు.. మహారాష్ట్రకు సురక్షితం కాదు: సంజయ్ రౌత్
ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ‘ఏక్ హై తో సేఫ్ హై’(మనం ఐక్యంగా ఉంటే సురక్షితం) నినాదంపై శివసేన (యూబీటీ)నేత సంజయ్ రౌత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ఇప్పటికే చాలా సురక్షితమైన రాష్ట్రమని అన్నారు. కానీ, ప్రధాని మోదీ రాష్ట్రాన్ని సందర్శించినప్పుడల్లా అస్థిరతకు గురువుతుందని మండిపడ్డారు. విభజనలు సృష్టించి అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నాలతోనే ప్రధాని మోదీ పర్యటనలు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రధాని మోదీ ఎందుకు ఇలాంటి భాష వాడుతున్నారో అర్థం కావడం లేదు. మహారాష్ట్రలో ప్రజలు ఇప్పటికే సురక్షితంగా ఉన్నారు. కానీ మోదీ ఎప్పుడు పర్యటించినా.. విభజన, అశాంతిని రెచ్చగొట్టడం వల్ల రాష్ట్రం అభద్రతకు గురవుతోంది. రాష్ట్రానికి నిజంగా భద్రత కావాలంటే.. మేం బీజేపీని ఓడించాలి’’ అని అన్నారు.కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఒక కులానికి మరొక కులాన్ని వ్యతిరేకంగా ఉంచుతున్నాయని శుక్రవారం ప్రధాని మోదీ ఆరోపణలు చేశారు. ‘ఏక్ హై, తో సేఫ్ హై’(ఐక్యంగా ఉంటేనే సురక్షింతంగా ఉంటాం) అని ప్రజలు ఐక్యంగా ఉండాలని కోరారు. ‘‘ కాంగ్రెస్ పార్టీ ఏకైక ఎజెండా ఒక కులాన్ని మరో కులానికి వ్యతిరేకంగా ఉంచటం. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు అభివృద్ధి చేందటం.వారికి తగిన గుర్తింపు రావడం కాంగ్రెస్‌కు ఇష్టం లేదు. మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం గుర్తుపెట్టుకోండి’’ అని ధూలేలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ మోదీ అన్నారు. ఇక.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మూడు రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు జరుగుతుంది. -
మోదీ సభలో కేసీఆర్‌కు 7 నిమిషాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు సంబంధించి సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ప్రధాని పాల్గొననున్నవి కేంద్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కావడంతో ప్రోటోకాల్ ప్రకారం సీఎం, ఇతర ప్రముఖులకు హోదాల ప్రకారం ఆహ్వానించారు. ఈ మేరకు షెడ్యూల్లోనూ చేర్చారు. ఇందులోభాగంగా సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా పాల్గొనే బహిరంగసభలో సీఎం కేసీఆర్ ప్రసంగం కోసం ఏడు నిమిషాలు కేటాయించారు. ఇక ప్రధాని రాష్ట్ర పర్యటన కేవలం రెండు గంటల్లోనే ముగియనుంది. శనివారం ఉదయం 11.30కు హైదరాబాద్‌కు చేరుకోనున్న మోదీ.. 1.30 గంటల సమయంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు. కేసీఆర్ హాజరవుతారా? కొంతకాలం నుంచి ప్రధాని మోదీ పాల్గొంటున్న ఏ ప్రభుత్వ, ఇతర కార్యక్రమాల్లోనూ సీఎం కేసీఆర్ పాల్గొనలేదు. ఇంతకుముందు పలుమార్లు మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చినా.. స్వాగతం పలకడానికి సీఎం వెళ్లలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులనే పంపారు. అయితే ఈ నెల 8న పరేడ్‌గ్రౌండ్స్ సభలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, భూమిపూజ, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారికంగా షెడ్యూల్ విడుదల చేశారు. ఇందులో పరేడ్‌గ్రౌండ్స్ సభలో కేసీఆర్ ప్రసంగానికి ఏడు నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రధాని కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారా? లేక గతంలో లాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ మంత్రిని ప్రతినిధిగా పంపుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. శనివారం మోదీ షెడ్యూల్ ఇదీ.. ► ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేటకు రాక ► 11.45కు రోడ్డు మార్గాన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ప్రధాని.. ► 11.45 నుంచి 12 గంటల దాకా అక్కడే కార్యక్రమాలు. సికింద్రాబాద్–తిరుపతి మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం ► మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకోనున్న మోదీ ► 12.20 నుంచి 12.30 గంటల వరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగాలు ► 12.30 నుంచి 12.37 గంటల దాకా సీఎం కేసీఆర్ ప్రసంగం ► 12.37 నుంచి 12.50 గంటల వరకు ఎంఎంటీఎస్ ఫేజ్–2తోపాటు పలు రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ► మధ్యాహ్నం 12.50 నుంచి 1.20 వరకు ప్రధాని మోదీ ప్రసంగం ► 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగుప్రయాణం కానున్న ప్రధాని. ఎయిమ్స్ వసతులతో తెలంగాణకు లబ్ధి: ప్రధాని సాక్షి, న్యూఢిల్లీ: బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో మౌలిక సదుపాయాలు పెంపొందించడం వల్ల తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని, ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని సృష్టించే ప్రయత్నాలకు మరింత ఊపునిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నెల 8న బీబీనగర్ ఎయిమ్స్‌లో నూతన అత్యాధునిక సౌకర్యాలకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయా చేసిన ట్వీట్‌కు.. ప్రధాని మోదీ గురువారం ఈ మేరకు రీట్వీట్ చేశారు. -
మోదీ కార్యక్రమానికి యడ్డి డుమ్మా
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లి (హుబ్లీ) నగరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న అధికారిక కార్యక్రమానికి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప గైర్హాజరయ్యారు. ఆయన గైర్హాజరు ప్రస్తుతం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గురువారం హుబ్లీ రైల్వే మైదానంలో జాతీయ యువ జనోత్సవానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. పలువురు బీజేపీ సీనియర్ నాయకులు పాల్గొన్నప్పటికీ బీఎస్ యడియూరప్ప మాత్రం కనిపించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన కొన్ని నెలలుగా పార్టీ వైఖరి పట్ల అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతోంది. బీజేపీ తనను నిర్లక్ష్యం చేస్తోందని, ప్రజల్లో వ్యక్తిగతంగా బలమున్న తనను రాజకీయంగా ఎవరూ అంతం చేయలేరని పలు సందర్భాల్లో అనుచరుల వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. తన రాజకీయ జీవితానికి ఎవరూ ఫుల్స్టాప్ పెట్టలేరని యడియూరప్ప ఒకసారి బహిరంగంగా వ్యాఖ్యానించారు. మరోవైపు ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, యూడియూరప్ప మధ్య విభేదాలు ముదురుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా తప్పించారని యడియూరప్ప రగిలిపోతున్నారు. తన అనుచరుడైన బొమ్మైని సీఎం కుర్చీలో కూర్బోబెట్టడం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వంలో పదవి లేకపోవడం వల్లే.. యడియూరప్ప అసంతృప్తిని గుర్తించిన బీజేపీ అధిష్టానం గత ఏడాది పార్టీ పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యుడిగా నియమించింది. అయితే, రాష్ట్ర బీజేపీలో ఆశించిన గౌరవం దక్కకపోవడంతో జనసంకల్ప యాత్రలో ఆయన పాల్గొనలేదు. పార్టీ పెద్దలు దిగివచ్చి బుజ్జగించాల్సి వచ్చింది. ఇటీవలే మాండ్య జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటనకు యడియూరప్ప డుమ్మా కొట్టారు. తాజాగా ప్రధాని మోదీ హుబ్లీ పర్యటనకు సైతం దూరంగా ఉండిపోయారు. రాష్ట్ర బీజేపీ వాదన మరోలా ఉంది. జాతీయ యువజనోత్సవానికి మాజీ సీఎంకు ఆహ్వానం అందించలేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ అధికారిక కార్యక్రమం కావడంతో ఆహ్వానించలేదని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వంలో యడియూరప్పకు ప్రస్తుతం ఎలాంటి పదవి లేదని, అందుకే ఆహ్వానం పంపలేదని కర్ణాటక బీజేపీ వెల్లడించింది. -
పచ్చ నేతల పనికి ఇబ్బందులు పడ్డ అధికారులు
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన నేపథ్యంలో టీడీపీ మరో రాజకీయ హైడ్రామాకు తెరతీసింది. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ విజయవాడ, గుంటూరులలో హోర్డింగులను ఏర్పాటు చేసింది. ప్రధాని మోదీ ఆదివారం గుంటూరులో పర్యటించనున్నారు. పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం గుంటూరులో బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఈ నేపథ్యంలో మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ టీడీపీ గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ మీదుగా గుంటూరు వరకు పలుచోట్ల హోర్డింగులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించింది. ‘మోదీ గో బ్యాక్’ అంటూ ఉన్న పెద్దపెద్ద హోర్డింగులను శుక్రవారం అర్ధరాత్రి తరువాత ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం హోర్డింగులు, కరపత్రాల కింద వాటిని ముద్రించినవారి పేర్లు, ముద్రణ సంస్థల పేర్లు ఉండాలి. అయితే ఆ హోర్డింగులు ఎవరు ఏర్పాటు చేశారో వారి పేర్లుగానీ, వాటిని రూపొందించిన ప్రచురణ సంస్థల పేర్లుగానీ లేవు. కొన్నాళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, టీడీపీ కార్యక్రమాల ప్రచారం కోసం ఏర్పాటు చేసిన హోర్డింగుల స్థానంలోనే ‘మోదీ గో బ్యాక్’ హోర్డింగులు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రచార కాంట్రాక్టు పొందిన సంస్థతోనే ఈ హోర్డింగులు ఏర్పాటు చేయించారని సమాచారం. సందిగ్ధంలో అధికారులు అనుమతుల్లేకుండా ఏర్పాటు చేసిన ఈ హోర్డింగులపై ఎలా స్పందించాలో అర్థమవక అధికారులు మల్లగుల్లాలు పడ్డారు. రాష్ట్రప్రభుత్వమే తెరవెనుక ఉండి ఏర్పాటు చేయడంతో.. వాటిని తొలగించేందుకు అధికారులు శనివారం సాయంత్రం వరకూ సాహసించలేకపోయారు. అయితే ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు వచ్చిన కేంద్ర ప్రభుత్వ, ఎస్పీజీ ఉన్నతాధికారులు ఈ హోర్డింగులపై తీవ్రంగా స్పందించినట్లు సమాచారం. వాటిని ఎవరు ఏర్పాటు చేశారో తెలపాలని కృష్ణా, గుంటూరు జిల్లాల రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులను సూటిగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీనిపై ఏం చెప్పాలో తెలియక రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఇబ్బందిపడ్డారు. దీనిపై తీవ్రంగా స్పందించిన కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే ఆ హోర్డింగులను తొలగించాలని ఆదేశించారు. దాంతో తర్జనభర్జనల అనంతరం రాష్ట్ర పోలీసు, రెవెన్యూ అధికారులు శనివారం సాయంత్రం తరువాత ఆ హోర్డింగులలో కొన్నింటిని తొలగించారు. -
ప్రధాని పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు
కేసీఆర్‌తో కలిసి ‘మిషన్ భగీరథ’ను ప్రారంభించనున్న నరేంద్రమోడీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న మంత్రి హరీశ్‌రావు.. ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష గజ్వేల్: ప్రధాని నరేంద్రమోడీ ఆగస్టు 7న మెదక్ జిల్లా గజ్వేల్‌లో ‘మిషన్ భగీరథ’ పథకం ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో రాష్ట్ర, జిల్లా స్థాయి యంత్రాంగం రేయింబవళ్లు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి. ఆ రోజు ప్రధాని కోమటిబండ అటవీ ప్రాంతంలోని గుట్టపై ఉన్న ‘మిషన్ భగీరథ’ హెడ్వర్క్క్స ప్రాంగణంలో పథకం ప్రారంభసూచికగా నల్లాను ఆన్ చేస్తారు. ఆ తరువాత గుట్ట కింది భాగంలో బహిరంగ సభ జరుగనున్నది. సుమారు 2లక్షలకుపైగా జనసమీకరణ లక్ష్యంగా ఉండగా... అందుకు తగ్గట్లు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో సభా స్థలిలో పూర్తిగా రెయిన్ ప్రూఫ్ టెంట్లు వేయడానికి నిర్ణయించారు. ప్రధాని సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు కేంద్ర మంత్రులు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ప్రత్యేకంగా గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. అంతేగాకుండా వీవీఐపీల రాజీవ్ రహదారి నుంచి సింగాయపల్లి స్టేజీ, చౌదర్పల్లి మీదుగా కోమటిబండలోని సభాస్థలికి చేరుకునే విధంగా ఆ మార్గాన్ని కేటాయించబోతున్నారు. మరోవైపు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖుల కోసం వేర్వేరుగా హెలిపాడ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ హెలిపాడ్ ఏర్పాట్లను ఆర్అండ్బీ అధికారులు నిర్వహిస్తున్నారు. ఆ శాఖ జిల్లా ఎస్ఈ రాధాకృష్ణ, సిద్దిపేట ఈఈ బాల్నర్సయ్యలు ఇక్కడే ఉంటూ పనులు పర్యవేక్షిస్తున్నారు. సభావేదిక డిజైన్ సిద్ధం సభావేదిక కోసం ఇప్పటికే డిజైన్ సిద్ధం చేశారు. మరో రెండ్రోజుల తర్వాత సభాస్థలిని, ‘మిషన్ భగీరథ’ ప్రారంభోత్సవ ప్రదేశాన్ని కేంద్రానికి చెందిన ఎస్పీజీ బలగాలు ఆధీనంలోకి తీసుకునే అవకాశముంది. శనివారం ఏర్పాట్లన్నింటినీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యవేక్షించారు. బహిరంగ సభాస్థలి చదును పనులను పరిశీలించారు. అంతకుముందు కోమటిబండ హెడ్వర్క్క్స ప్రాంతాన్ని సందర్శించి, ఏర్పాట్లపై కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తో చర్చించారు. సభావేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, డీఐజీ అకున్ సబర్వాల్, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావుతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో 3 గంటలకుపైగా ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. సమీక్ష అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని ముందుగా హెడ్వర్క్క్స ప్రాంతంలో నల్లాను ప్రారంభించిన అనంతరం సభావేదిక వద్దకు చేరుకుంటారని తెలిపారు. ఆ తర్వాత ఎన్టీపీసీకి చెందిన 1600 మెగావాట్ల పవర్‌స్టేషన్, ఎఫ్‌సీఐఎల్‌కు చెందిన రామగుండం ఫెర్టిలైజర్ ప్లాంట్, వరంగల్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్స్, మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేమార్గం పనులకు ప్రధాని శంకుస్థాపన ఇక్కడే చేస్తారని వెల్లడించారు. వర్షాల వల్ల సభకు అంతరాయం కలగకుండా రేయిన్‌ప్రూఫ్ టెంట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రజలను ఇక్కడకు తరలిస్తామన్నారు. -
తిరుమల ఘాట్‌లో చైన్ లింక్ కంచె నిర్మాణం
సాక్షి, తిరుమల: తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే రెండో ఘాట్ రోడ్డులో రాళ్లు కూలే ప్రాంతం పరిస్థితులపై టీటీడీ దృష్టి సారించింది. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాలు, ప్రధాని పర్యటన ముగిసిన మరుసటి రోజే ఆయా ప్రాంతాల్లో కొత్తగా చైన్‌లింక్ కంచె నిర్మాణం పనులు చేపట్టింది. ఇక్కడి 16వ కిలోమీటరు ప్రాంతంలో శిథిలావస్థకు చేరిన ఇనుప కంచెను టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు తొలగించారు. కొత్త చైన్‌లింక్ కంచె నిర్మించే పనులు శనివారం చేపట్టారు. ఇదే తరహాలోనే పలు ప్రాంతాల్లో శిథిలావస్థకు చేరిన పాత కంచెల్ని తొలగించి కొత్తవి నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.