ఐటీడీఏ పీఓ ఇంట్లో ఏసీబీ సోదాలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట ఐటీడీఏ పీఓ జల్లేపల్లి వెంకటరావు ఇంటిపై మంగళవారం అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దాడులు జరిపారు. ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో జరిపిన ఈ దాడుల్లో ఇప్పటివరకు ఐదు ఫ్లాట్లు, ఒక కారు, రెండిళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉంది. మొత్తం కోటి రూపాయల ఆస్తులున్నట్లు ఇప్పటివరకు చేసిన తనిఖీలలో తేలింది. శ్రీకాకుళంతో పాటు ఆముదాలవలస, వైజాగ్లలోని అతనికి చెందిన ఇళ్లపై కూడా ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు చేసి తనిఖీలు నిర్వహించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.