police martyrs day
-
ఉగ్రవాదంపై రాజీలేని పోరు: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్, ఈశాన్య భారతం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాపేక్షంగా శాంతిని నెలకొల్పినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఉగ్రవాదం, చొరబాట్లు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలపై పోరాటం కొనసాగుతుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసు అమరుల త్యాగం వృథా కాదన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ భద్రత కోసం 36,438 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. గతేడాదే 216 మంది ప్రాణాలు కోల్పోయారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. కొత్త నేర న్యాయ చట్టాలతో భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారిందన్నారు. పోలీసు సిబ్బంది, కుటుంబీకులు ఇక ఏ ఆయుష్మాన్ ఆసుపత్రిలోనైనా ఉచిత చికిత్స పొందవచ్చని హోం మంత్రి తెలిపారు. ‘‘సీఏపీఎఫ్ సిబ్బంది కోసం 13 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చాం. వచ్చే మార్చి నాటికి 11,276 ఇళ్లు సిద్ధమవుతాయి’’ అని వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. -
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ ట్వీట్
-
ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదు: అమిత్ షా
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలనే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. సోమవారం ఉదయం ఢిల్లీలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో భాగంగా.. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరులకు అమిత్ షా నివాళులర్పించారు.అనంతరం అమిత్ షా మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కార్యకలాపాలను అణచివేయడానికి భారత బలగాలు గత పదేళ్లుగా శాయశక్తులా కృషి చేస్తున్నాయని.. అయినప్పటికీ ఉగ్రవాదంపై యుద్ధం ఇంకా ముగియలేదని తెలిపారు.2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే తమ లక్ష్యమన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశాన్ని రక్షించడానికి 36,468 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాల వల్లే దేశం సురక్షితంగా ఉందని అన్నారు. గత ఏడాది కాలంలో దాదాపు 216 మంది పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీరి త్యాగాలను దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు.On #PoliceCommemorationDay, laid a wreath at the National Police Memorial and offered my solemn tributes to the martyrs of the nation’s police forces.They have scripted an indelible history of patriotism with their selfless service and supreme sacrifice. Their lives will remain… pic.twitter.com/LihvtR9CiT— Amit Shah (@AmitShah) October 21, 2024 ‘మా పదేళ్ల పాలనలో జమ్ము కశ్మీర్, వామపక్ష అతివాద ప్రభావిత ప్రాంతాల్లో శాంతి నెలకొంది. అయినా మా పోరాటాన్ని ఆపం. కశ్మీర్లో మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలు, చొరబాట్లకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటాము’’ అని షా అన్నారు. కాగా 1959లో లడఖ్‌లో చైనా సైనికులు జరిపిన ఆకస్మిక దాడిలో మరణించిన పోలీసులు, ఇతర అధికారుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. -
Police Commemoration Day: ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాద ఘటనల్లో పదేళ్లలో 65% తగ్గుదల
న్యూఢిల్లీ: దేశంలో ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య రాష్ట్రాల్లో విద్రోహ చర్యలు గత దశాబ్ద కాలంలో 65 శాతం మేర తగ్గుముఖం పట్టాయని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలోని మూడు హాట్ స్పాట్లుగా ఉన్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతం, జమ్మూకశ్మీర్‌ల్లో పరిస్థితులు ప్రశాంతంగా మారాయన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావడంతోపాటు ఉగ్రవాదాన్ని కఠినంగా అణచివేస్తుండడమే దీనికి కారణమన్నారు. శనివారం నేషనల్ పోలీస్ మెమోరియల్ వద్ద పోలీసు సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో మంత్రి అమిత్ షా మాట్లాడారు. పోలీస్ టెక్నాలజీ మిషన్ ఏర్పాటు చేసి పోలీసు బలగాలను తీవ్రవాదులను ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే అత్యుత్తమంగా తయారు చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. దాదాపు 150 ఏళ్లనాటి క్రిమినల్ జస్టిస్ విధానాన్ని సమూలంగా మార్చేందుకు ప్రభుత్వం పార్లమెంట్లో మూడు బిల్లులను ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి విధి నిర్వహణలో 36,250 మంది పోలీసులు ప్రాణాలర్పించారు. 2022 సెప్టెంబర్ నుంచి 2023 ఆగస్ట్ వరకు 188 మంది పోలీసులు విధుల్లో ఉండగా అమరులయ్యారు. పోలీసు స్మారకం కేవలం చిహ్నం కాదు, దేశ నిర్మాణం కోసం పోలీసు సిబ్బంది చేసిన త్యాగం, అంకితభావానికి గుర్తింపు’అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అంతర్గత రక్షణతోపాటు దేశ సరిహద్దుల భద్రతకు సైతం సమర్థమంతమైన పోలీసు విధానం అవసరం ఎంతో ఉందని చెప్పారు. -
త్యాగాల నుంచే గొప్ప విజయాలు
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): పౌరులకు అందించే పోలీసు సేవల్లో తెలంగాణ ముందంజలో ఉందని రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. శనివారం గోషామహల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్యాగాల నుంచే గొప్ప విజయాలు లభిస్తాయని అన్నారు. దేశంలోనే ఉత్తమ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. షీటీమ్స్, భరోసా కేంద్రాలు, పాస్‌పోర్టు క్లియరెన్స్, సీసీటీవీ ప్రాజెక్టుల నిర్వహణ వంటి విషయాలు ఇందుకు ఉదాహరణగా నిలుస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రత, శిశుసంక్షేమం వంటి అంశాలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అలాగే దేశంలోనే అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. రాష్ట్రంలో క్రైమ్‌రేటు తగ్గుతూ వస్తోందని, తెలంగాణను నేరరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. పౌర రక్షణ విధులలో అమరులైన 189 మంది పోలీసులకు నివాళులర్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ‘అమరులు వారు’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అదేవిధంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఏడీజీ శ్రీనివాస్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య, అడిషనల్ డీజీలు సౌమ్యమిశ్రా, శివధర్‌రెడ్డి, సంజయ్‌కుమార్ జైన్, మహేశ్ భగవత్‌లతో పాటు పలువురు సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు, విశ్రాంత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
గోషామహాల్ పోలీస్ స్టేడియంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం
-
తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమాలు
-
నేడు పోలీస్ అమరవీరుల సంస్మరణదినానికి ఏర్పాట్లు
సాక్షి, అమరావతి: పోలీస్ అమరవీరుల సంస్మరణదినం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో శనివారం నిర్వహించనున్నారు. సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొని అమరులైన పోలీసులకు నివాళులర్పించనున్నారు. ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణదినం దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ వారం రోజుల పాటు పలు కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఆదివారం నుంచి 31 వరకు విజయవాడలో ‘ఓపెన్ హౌస్’ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించనుంది. అక్టోబర్ 24 నుంచి 27వరకు పోలీసు ఉద్యోగుల పిల్లలకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు, 28న జిల్లా, రాష్ట్ర పోలీస్ కార్యాలయాల్లో వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. వారి వైద్య, ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ..ఆరోగ్య భద్రత పథకాన్ని అమలు చేస్తోంది. ఏపీతోపాటు హైదరాబాద్‌లో గుర్తించిన 283 ఆసుపత్రుల ద్వారా చికిత్స పొందే అవకాశాన్ని కల్పించింది. గతేడాదిలో 11,486 మంది పోలీసు కుటుంబాలు నగదు రహిత విధానంలో రూ.42.40 కోట్ల విలువైన వైద్య సేవలను పొందాయి. పోలీస్ శాఖ భద్రతా పథకం ద్వారా పోలీసులకు రుణాలు అందిస్తోంది. ఈ ఏడాది కాలంలో గృహ నిర్మాణ రుణాలు రూ.98.85 కోట్లు, ఉన్నత చదువుల కోసం రూ.11.66 కోట్లు, వివాహ రుణాలు రూ.3.95 కోట్లు, వ్యక్తిగత రుణాలు రూ.99.20 కోట్లు మంజూరు చేసింది. పోలీస్ ప్రమాద బీమా పథకం కోసం ఎస్బీఐ, యాక్సిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎస్బీఐ ఖాతా ఉన్నవారికి రూ.40 లక్షలు, యాక్సిస్ ఖాతా ఉన్నవారికి రూ.60 లక్షలు, హెచ్డీఎఫ్సీ ఖాతా ఉన్నవారికి రూ.70 లక్షలు బీమా పరిహారం కోసం ఒప్పందాలు చేసుకుంది. బీమా పరిహార మొత్తాన్ని రూ.85 లక్షలకు పెంచేందుకు ఆయా బ్యాంకులతో పోలీస్ శాఖ సంప్రదింపులు జరుపుతోంది. వాటితోపాటు సాధారణ మృతికి రూ.5 లక్షలు పరిహారం అందిస్తోంది. సర్విస్‌లో ఉంటూ చనిపోయిన పోలీసుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య నియామకం కింద పోస్టింగులు కల్పిస్తోంది. గతేడాదిలో 244 మంది పోలీసులు చనిపోగా వారిలో 186 కుటుంబాల నుంచి కారుణ్య నియామకాల కోసం దరఖాస్తులు వచ్చాయి. వాటిలో అర్హులైన 436 మందికి ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన ధరఖాస్తులు పలు దశల్లో ఉన్నాయి. వారికి కూడా త్వరలోనే ఉద్యోగాలు కల్పించనున్నారు. -
21 నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్టు డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్‌ను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. అలాగే 21 నుంచి 31 వరకు పోలీసు ఫ్లాగ్‌డే పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు గురువారం ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు, విధినిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు, పోలీసుల నుంచి ప్రజలు ఇంకా ఏ రకమైన సేవలు ఆశిస్తున్నారన్న అంశాలపై ఈ పది రోజులలో అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు వివరించారు. రాష్ట్రంలోని ప్రతీ పోలీసు స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించి, పోలీసు శాఖ కృషిని, సేవలను పౌరులకు తెలియచెబుతామన్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ‘పోలీసులకు–పని జీవిత సమతుల్యత’, ’సమాజంలో లింగ సమానత్వాన్ని కాపాడటంలో పోలీసుల పాత్ర’ అనే అంశాలపై ఎస్సై, ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ స్థాయి అధికారులకు కూడా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సీనియర్ పోలీసు అధికారులు అమరుల ఇళ్లను సందర్శించి వారి కుటుంబాల బాగోగులు, వారి అవసరాలను తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేయాలని డీజీపీ ఆదేశించారు. -
Police Commemoration Day: ఉగ్రవాదమే అతిపెద్ద హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: ఉగ్రవాదమే అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. విదేశీ గడ్డ నుంచి ఆన్లైన్ ద్వారా జరిగే ఉగ్ర భావజాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా గుర్తించలేమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అమిత్ షా 90వ ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ ముగింపు సమావేశంలో ప్రసంగించారు. ‘ఉగ్రవాదం, ఉగ్రవాదులకు సంబంధించిన స్పష్టమైన ఉమ్మడి నిర్వచనం ఇచ్చేందుకు అన్ని దేశాలు కలిసి రావాలి. అలా జరిగినప్పుడే ఉగ్రవాదులపైనా, ఉగ్రవాదంపైన అంతర్జాతీయంగా కలిసికట్టుగా పోరాడగలం. ఉగ్రవాదంపై చిత్తశుద్ధితో పోరాటం సాగించడం, మంచి, చెడు ఉగ్రవాదాల మధ్య తేడాను గుర్తించడం, ఉగ్ర దాడులను చిన్నవి, పెద్దవి అంటూ వర్గీకరించడం ముందుగా జరగాలి’అని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా సాగే ఉగ్రవాద సిద్ధాంతాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా భావించలేమంటూ ఆయన...ఉగ్రవాదంపై దీర్ఘకాలంలో నిబద్ధత, సమగ్రతతో కూడిన పోరాటం సాగించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. ‘చాలా దేశాల్లో ఇంటర్‌పోల్ ఏజెన్సీ, ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదంపై పోరాటం కొనసాగాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద వ్యతిరేక సంస్థలన్నీ ఏకతాటిపైకి రావాలి’అని అమిత్ షా అభిప్రాయ పడ్డారు. దీనికోసం ఇంటర్‌పోల్ శాశ్వత కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా నిఘా సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకుంటూ ఉండాలన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ అవసరమైన సాంకేతిక, మానవ వనరులను ఇంటర్‌పోల్‌తో పంచుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య ఉమ్మడి, పరస్పర సహకారం అవసరమని సీబీఐ డైరెక్టర్ సుబోధ్ జైశ్వాల్ అన్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలు తగ్గుముఖం దేశంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు హాట్స్పాట్లుగా పేరున్న చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడ్డాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అశాంతికి నెలవైన ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు నేడు 70% వరకు తగ్గుముఖం పట్టాయన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలతోపాటు జమ్మూకశ్మీర్లోనూ భద్రతాపరంగా ఇదే రకమైన పురోగతి కనిపిస్తోందని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
పోలీస్ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన ముఖ్యమంత్రి
-
దేశంలోనే రాష్ట్ర పోలీస్ భేష్: హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని గోషామహల్ స్టేడియంలోని అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఘననివాళులు అర్పించారు. గురువారం గోషామహల్లో నిర్వహించిన ప్లాగ్ డే కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డితోపాటు పలువురు రిటైర్డ్ డీజీపీలు, సీనియర్ పోలీసు అధికారులు, రిటైర్డ్ పోలీసు అధికారులు, అమర పోలీసుల కుటుంబ సభ్యులు హాజరై విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ‘అమరులు వారు’పుస్తకాన్ని హోంమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అమలవుతున్న పటిష్టమైన పోలీసింగ్ వల్లనే మెరుగైన శాంతి భద్రతలున్నాయని, భద్రతలో పోలీస్ శాఖ రాజీలేని పోరాటం చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగ్గా ఉందని, ఇతర రాష్ట్రాలతో పోల్చిచూస్తే మన రాష్ట్రంలో క్రైమ్ రేటు అతి తక్కువగా ఉందని వివరించారు. కరోనా కారణంగా విధినిర్వహణలో రాష్ట్రంలో మొత్తం 62 మంది పోలీసులు మరణించారని, వీరి కుటుంబాలకు అండగా ఉంటామని హోంమంత్రి హామీ ఇచ్చారు. పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న హోంమంత్రి మహమూద్ ప్రాణత్యాగానికి వెనుకాడం... అమరవీరుల దినోత్సవం సందర్భంగా డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైతే ప్రాణత్యాగం చేయడానికి కూడా పోలీసులు వెనుకాడరన్న విషయాన్ని అమరులైన పోలీసులు సమాజానికి గుర్తుచేస్తున్నారని పేర్కొన్నారు. సాంకేతికత ద్వారా శాంతి భద్రతలను కాపాడుతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 8.25 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. -
AP: రాష్ట్ర ప్రతిష్టపై దాడి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న కొత్త తరహా నేరాలు, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించి శాంతి భద్రతలను పరిరక్షించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసులకు దిశానిర్దేశం చేశారు. గురువారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల పుస్తకాన్ని ఆవిష్కరించారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీసుల సేవలను స్మరించుకుంటూ ఏటా అక్టోబర్ 21న దేశ వ్యాప్తంగా అమర వీరుల సంస్మరణ దినం నిర్వహించుకుంటున్నామని గుర్తు చేశారు. 1959 అక్టోబర్ 21న చైనా సైనికులను ఎదిరించి పోరాడిన ఎస్సై కరణ్‌సింగ్, ఆయన సహచరుల ధైర్యం, ప్రాణత్యాగాన్ని అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా 62 ఏళ్లుగా గుర్తు చేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఇలా దూషించడం సమంజసమా? ► మావాడు అధికారంలోకి రాకపోతే ప్రతిరోజూ అబద్ధాలే వార్తలుగా, వార్తా కథనాలుగా ఇస్తాం.. అబద్ధాలనే డిబేట్లుగా ప్రతిరోజూ నడుపుతామని చెబుతున్న పచ్చ పత్రికలు, పచ్చ చానెళ్లను కూడా చూస్తున్నాం. ► మావాడు అధికారంలో లేకపోతే ముఖ్యమంత్రిని కూడా బోసిడీకే అంటే లంజాకొడుకు అంటామని దారుణమైన బూతులు వాడుతున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని, ఆయన తల్లినుద్దేశించి ఇలాంటి మాటలు, బూతులు తిట్టడాన్ని అంతా చూస్తున్నాం. ఇలా దూషించడం కరెక్టేనా..? ► ఇలా తిట్టినందుకు ముఖ్యమంత్రిని అభిమానించేవాళ్లెవరైనా తిరగబడాలి.. వాళ్లు రెచ్చిపోవాలి.. రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలి.. దానివల్ల గొడవలు సృష్టించాలని ఆరాట పడుతున్నారు. ఇదంతా సమంజసమేనా? అందరూ ఒక్కసారి ఆలోచించాలి. ‘అమరులు వారు’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం జగన్, హోం మంత్రి సుచరిత, సీఎస్ సమీర్‌శర్మ, డీజీపీ సవాంగ్ ఇక గెలవలేమని బెరుకు ► మునిసిపల్, కార్పొరేషన్, జెడ్పీటీసీ, మండల పరిషత్ ఎన్నికలు, చివరికి ఉప ఎన్నికల్లో కూడా అధికార పార్టీ పాలనను మెచ్చుకుంటూ ప్రజలు అఖండ విజయాన్ని అందించారు. దీంతో ఇక తమకు అధికారం దక్కే అవకాశం లేదని వారికి తెలిసిపోయింది కాబట్టే ఇలా చేస్తున్నారు. ► చివరకు మన రాష్ట్రం పరువు, ప్రతిష్టలను కూడా దిగజారుస్తూ లేనిది ఉన్నట్లు డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్ అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. వీరు టార్గెట్ చేస్తోంది ముఖ్యమంత్రిని, మనందరి ప్రభుత్వాన్ని మాత్రమే కాదు.. రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబాన్నీ కూడా. ఇది నామీద దాడి కాదు. మనం రాష్ట్రం మీదా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీదా దాడి. ► మన పిల్లలను డ్రగ్ అడిక్టŠస్‌గా ప్రపంచానికి చూపించేలా దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. అది ఇది పచ్చి అబద్ధమని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వానికి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వివరణ ఇచ్చినా... విజయవాడ పోలీస్ కమిషనర్ ఆ వివరణను చూపిస్తూ మళ్లీ చెప్పినా.. చివరకు డీజీపీ పదేపదే ఇదే విషయాన్ని స్పష్టం చేసినా వినిపించుకోవడం లేదు. అక్కసుతో ఒక పథకం ప్రకారం క్రిమినల్ బ్రెయిన్‌తో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. పౌరుల రక్షణలో రాజీ పడొద్దు.. ► నేరం ఎప్పటికప్పుడు కొత్త కొత్త రూపాల్లో దాడి చేస్తోంది. శాంతి భద్రతలు మనకు అత్యంత ప్రాధాన్యత అంశం. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదు. ఏమాత్రం రాజీపడొద్దని స్పష్టం చేస్తున్నా. ► బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారిపై కులపరమైన దాడులు, హింసకు పాల్పడితే కారకులు ఎవరైనా సరే ఉపేక్షించొద్దు. తీవ్రవాదం, అసాంఘిక శక్తులు, సంఘ విద్రోహ కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించొద్దు. పోలీసు అమర వీరులకు శ్రద్ధాంజలి ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులు కాగా అందులో 11 మంది మన రాష్ట్రానికి చెందినవారున్నారు. ప్రజాసేవలో అమరులైన ప్రతి పోలీసు సోదరుడికి, సోదరికి నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అధికారం చేపట్టిన నాటి నుంచి సమాజం పట్ల బాధ్యతతో మా పరిపాలన సాగుతోంది. పోలీసుల పట్ల కూడా అదే చిత్తశుద్ధి, బాధ్యతను చేతల్లో చూపిస్తూ వచ్చాం. భారీగా పోలీసు నియామకాలు ► పోలీసుల సంక్షేమానికి గత సర్కారు 2017 నుంచి బకాయి పెట్టిన రూ.15 కోట్లు నిధులు కూడా విడుదల చేశాం. త్వరలో భారీగా ఉద్యోగ నియామకాలను చేపట్టబోతున్నాం. హోంగార్డుల గౌరవ వేతనం పెంచాం. 16 వేల మంది మహిళా పోలీసులను గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలోనే నియమించాం. వారందరికీ శిక్షణ కార్యక్రమం కూడా మొదలవుతుంది. ► కరోనా వల్ల మృతి చెందిన పోలీసు కుటుంబాలకు పోలీసు శాఖ నుంచి రూ.5 లక్షలు మంజూరు చేస్తే దానికి మ్యాచింగ్ గ్రాంట్‌గా మరో రూ.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇవ్వాలని ఆదేశించాం. చికిత్స పరంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్స్‌గ్రేషియా ఇతర సదుపాయాలను అందించి ఆదుకున్నాం. నవంబర్ 30లోగా కారుణ్య నియామకాలు కరోనాతో మృతి చెందిన పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల కుటుంబాలకు ఊరట కల్పిస్తూ కారుణ్య నియామకాలన్నీ నిర్ణీత కాలపరిమితితో నవంబర్ 30వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశాం. అక్కచెల్లెమ్మల భద్రత కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. దిశ బిల్లును ఉభయ సభల్లో ఆమోదించి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం ఇప్పటికే పంపించాం. బాలికలు, మహిళల సంరక్షణ కోసం మహిళామిత్ర, సైబర్‌మిత్ర కార్యక్రమాలను వార్డు, గ్రామ స్ధాయిలోకి తీసుకువెళ్లాం. మహిళా హోంమంత్రి ఆధ్వర్యంలో పటిష్టంగా అమలు చేస్తున్న ఈ రక్షణ చర్యలకు జాతీయ స్థాయిలో ప్రశంసలు, పురస్కారాలు కూడా లభించాయి. కొత్త నేరగాళ్లు అధికారం దక్కలేదన్న అక్కసుతో రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారు. రెండేళ్లుగా రాష్ట్రంలో నేరాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. కొత్త నేరగాళ్లు వస్తున్నారు. చీకట్లో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు. రథాలు తగలబెడుతున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. కోర్టుల్లో కేసులు వేయించి సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలనూ ఆపేయించారు. పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం చదువులు అందడానికి వీల్లేదని అంటున్నారు. చివరికి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని బోసిడీకే.. అంటే లంజాకొడకు అని బూతులు తిడుతున్నారు. ఇది నాపై దాడి కాదు.. రాష్ట్రంపైన దాడి. మన రాష్ట్రం, మన పిల్లలపై డ్రగ్స్ కళంకం మోపుతూ వారి భవిష్యత్తును నాశనం చేయాలని కుట్ర పన్నుతున్నారు. – ముఖ్యమంత్రి జగన్ ఆవేదన -
పోలీసు అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ (ఫోటోలు)
-
అధికారం దక్కలేదని చిచ్చుపెడుతున్నారు: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: ‘‘ముఖ్యమంత్రిని దారుణంగా బూతులు తిడుతూ.. సీఎంను అభిమానించే వాళ్లు తిరగబడి.. తద్వారా గొడవలు సృష్టించాలని కొందరు కుట్రలు చేస్తున్నారని’’ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘నేరాల్లో కొత్త కోణం కనిపిస్తోంది. అధికారం దక్కలేదని చీకట్లో విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.. ఆలయాల రథాలను తగలబెట్టారు. అధికారం దక్కలేదని సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారు.. కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు.. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియాన్ని అడ్డుకున్నారు. చివరకు ముఖ్యమంత్రిని కూడా దారుణమైన బూతులు తిడుతున్నారు. ఇది కరెక్టేనా.. ఇలా తిట్టడం కరెక్టేనా.. ఆలోచించండి. సీఎంను అభిమానించే వాళ్లు తిరగబడాలి.. తద్వారా గొడవలు సృష్టించాలని కుట్రలు చేస్తున్నారు. ఇది అనైతికం.. అధర్మం.. పచ్చి అబద్ధం’’ అన్నారు. (చదవండి: సంక్షేమ పాలనను చూసి టీడీపీ ఓర్వలేకపోతోంది: సీఎం జగన్) పథకం ప్రకారం రాష్ట్రం పరువు తీస్తున్నారు.. ‘‘పథకం ప్రకారం.. అక్కసుతో రాష్ట్రం పరువు తీస్తున్నారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని చూడటం సమంజసమేనా. అధికార పార్టీ పాలన మెచ్చుకుంటూ ప్రజలు అన్ని ఎన్నికల్లో గెలిపించారు. తనవాడు గెలవలేదని రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటూ రాష్ట్రంలో నేరాలు చేసేందుకు యత్నిస్తున్నారు. డ్రగ్స్‌తో ఏపీకి ఎలాంటి సంబంధం లేదని ఏపీ డీజీపీ, డీఆర్ఐ చెప్పినా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. డ్రగ్స్ ఏపీ అంటూ పచ్చి అబద్ధాలను గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కొందరు రాష్ట్ర పరువు, ప్రతిష్టలను దిగజారుస్తున్నారు. రాష్ట్రంలో భావోద్వేగాలు పెరగాలని చూస్తున్నారు’’ అని తెలిపారు. చదవండి: దుర్మార్గం.. దిగజారుడుతనం -
పోలీస్ అమరవీరులకు నివాళులు అర్పించిన సీఎం జగన్
-
పోలీసు అమరుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ
సాక్షి, అమరావతి: కోవిడ్ విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10 లక్షల రూపాయల చెక్కులను అందజేసింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా అమరులైన కుటుంబాలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చెక్కులను అందజేశారు. పోలీస్ అమరవీరులు సంస్మరణ దినోత్సవ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్.. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత అమరులైన పోలీసులకు సీఎం వైఎస్ జగన్, హోంమంత్రి మేకతోటి సుచరిత, రాష్ట్ర సెక్రటరీ నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే కోవిడ్ విధి నిర్వహణలో అమరులైన కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం తరపున 10 లక్షల రూపాయల చెక్కులను సీఎం వైఎస్ జగన్ అందజేశారు. కాగా, 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న పోలీసు సంక్షేమ గ్రాంట్‌ను అధికారులు సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లగానే 15 కోట్ల గ్రాంట్‌ను మంజూరు చేశారు. తద్వారా దాదాపు 206 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 1. వాసు గారి భార్య శ్రీమతి భాగ్యలక్ష్మీ భవాని గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 2. శ్రీరాములు (ఏఆర్ఎస్సై)గా అమరులయ్యారు. ఆయన భార్య ఝాన్సీరాణి గారు 10 లక్షల చెక్కు అందుకున్నారు. 3. నాగేశ్వర్రావు (ఏఆర్ఎస్సై)గా అమరులయ్యారు. ఆయన సతీమణి సి.హెచ్.విశ్వశాంతి గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 4. రామారావు గారి సతీమణి శ్రీమతి లక్ష్మీ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 5. పద్మ(వుమెన్ హోంగార్డు)అమరులయ్యారు. ఆమె భర్త టీ. చంద్రశేఖర్ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 6. ప్రసాద్‌రావు (హెడ్ కానిస్టేబుల్)అమరులయ్యారు. ఆయన భార్య బి. లక్ష్మీ గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 7. సయ్యద్ జలాలుద్దీన్ (ఏఆర్ఎస్పై)అమరులయ్యారు. ఆమె సతీమణి సయ్యద్ ఉమే సల్మా గారు గ్రాంట్‌ను అందుకున్నారు. 8. హరిబాబు గారు అమరులయ్యారు. ఆయన భార్య నిర్మల గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. 9. రత్నంరాజు గారు (హెడ్ కానిస్టేబుల్)అమరులయ్యారు. ఆయన సతీమణి కె. సుజాతావాణి గారు 10 లక్షల చెక్కును అందుకున్నారు. చదవండి: నేటి నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు: సీఎం జగన్ -
ఏడాది కాలంలో అసువులు బాసిన అమరవీరులకు శ్రద్ధాంజలి
-
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
-
నేటి నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు
-
నేటి నుంచి పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు: సీఎం జగన్
సాక్షి, విజయవాడ: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఉదయం 8 గంటలకు స్టేడియం చేరుకుని.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరవీరులు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. గత 62 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. గత ఏడాది కాలంగా దేశ వ్యాప్తంగా 377 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులైతే.. మన రాష్ట్రానికి చెందిన వారు 11 మంది ఉన్నారు. ఈ అమరవీరులందరికి నేడు రాష్ట్రప్రభుత్వం తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అన్నారు. ‘‘పోలీసుల బాగోగుల గురించి ఆలోచించి.. దేశంలోనే మొట్టమొదటిసారిగా వారికి వీక్లీఆఫ్ ప్రకటించిన ప్రభుత్వం మనదే అని తెలుపుతున్నాను. కోవిడ్ కారణంగా దీన్ని అమలు చేయలేకపోయాం. ఇప్పుడు వైరస్ ప్రభావం తగ్గింది కనుక నేటి నుంచి దీన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టనున్నాం’’ అని సీఎం జగన్ తెలిపారు. ‘‘పోలీసు శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడతాం. కోవిడ్ వల్ల చనిపోయిన పోలీసులకు 10 లక్షల రూపాయలు మంజూరు చేశాం. కరోనా బారిన పడిన పోలీసులకు ప్రత్యేక వైద్య సేవలు అందించాం. హోంగార్డుల ప్రత్యేక వేతనాన్ని కూడా పెంచాం. గత ప్రభుత్వం పోలీసుశాఖకు బకాయి పెట్టిన 15 కోట్ల రూపాయలు విడుదల చేశాం’’ అని సీఎం జగన్ తెలిపారు. తప్పు చేస్తే ఎవర్ని వదలొద్దు: సీఎం జగన్ ‘‘రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అతి ముఖ్యమైన విషయం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. పోలీసులు ఎక్కడా రాజీ పడొద్దు. తప్పు చేస్తే ఎవర్నీ వదలొద్దు. చట్టం ముందు నిలబెట్టండి. మహిళలు, చిన్నపిల్లలు, బడుగు, బలహీన వర్గాల విషయంలో రాజీ పడొద్దు. రాజకీయ నేతల్లో కూడా అసాంఘిక శక్తులను చూస్తున్నాం. అలాంటి వారిని ఏమాత్రం ఉపేక్షించొద్దు’’ అని సీఎం జగన్ సూచించారు.