pollution levels
-
Delhi: దేశ రాజధానికి మరో అప్రతిష్ట..
న్యూఢిల్లీ: కాలుష్యకాసారంగా మారిన ఢిల్లీ పరువు మరోసారి పోయింది. గతంలోనూ కాలుష్యమయ నగరంగా పేరుమాసిన ఢిల్లీ తాజాగా 2022 ఏడాదికి దేశంలోనే అత్యంత కాలుష్యమయ నగరంగా రికార్డులకెక్కింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఈ గణాంకాలతో ఒక నివేదిక విడుదలచేసింది. దీని ప్రకారం ఢిల్లీలో 2.5 స్థాయి(పీఎం) సూక్ష్మ ధూళి కణాలు నాణ్యత పరిమితికి మించి రెట్టింపు స్థాయిలో ఉన్నాయి. 10 గాఢత విభాగంలో దేశంలో ఢిల్లీ మూడో స్థానంలో నిలిచిందని గణాంకాలు వెల్లడించాయి. అయితే, నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే కాలుష్యం 7 శాతంపైగా తగ్గడం కాస్త ఊరట కలిగించే విషయం అని ఈ గణాంకాలను ఎన్సీఏపీ ట్రాకర్ విశ్లేషించింది. 2.5 స్థాయి సూక్ష్మధూళి కణాల విభాగంలో ఢిల్లీ తొలి స్థానంలో నిలవగా, హరియాణాలోని ఫరీదాబాద్ రెండో ర్యాంక్‌లో, ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ మూడో ర్యాంక్‌లో నిలిచిందని గణాంకాలు పేర్కొన్నాయి. 10 పీఎం విభాగంలో దేశంలో ఘజియాబాద్ తొలిస్థానంలో నిలిచింది. తర్వాత ఫరీదాబాద్, ఢిల్లీ ఉన్నాయి. కనీసం 20–30 శాతం కాలుష్యం తగ్గాలన్న జాతీయ స్వచ్ఛ వాయు పథకం(ఎన్సీఏపీ) లక్ష్యాలకు ఈ గణాంకాలు సుదూరంగా ఉండటం విషాదకరం. ఈ పథకం లక్ష్యాలను సాధించడంలో దేశ పురోగతిని గణిస్తూ ‘ఎన్సీఏపీ ట్రాకర్’ ఈ లెక్కలను విడుదలచేసింది. 131 నగరాల్లో కాలుష్యాన్ని 30 శాతం మేర తగ్గించాలన్న కేంద్ర ప్రభుత్వం గతంలో నిర్దేశించుకుంది. అయితే 2026కల్లా కాలుష్యం 40 శాతం తగ్గించుకోవాలని 2022 సెప్టెంబర్‌లో కొత్తగా లక్షించింది. 2.5 స్థాయి కణాలు అత్యంత సూక్ష్మంగా ఉండి నేరుగా ఊపిరితిత్తుల్లో అక్కడి నుంచి రక్తంలో కలిసిపోగలవు. ‘నగరాల్లో కఠిన నిబంధనలను ఖచ్చితంగా అమలుచేయలేకపోతే లక్ష్యాలను సాధించడం చాలా కష్టం’ అని క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ డైరెక్టర్ ఆర్తీ ఖోస్లా విచారం వ్యక్తంచేశారు. -
ఢిల్లీలో నిర్మాణ కార్యకలాపాలు బంద్
న్యూఢిల్లీ: ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరగడంతో నివారణ చర్యలకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఢిల్లీలో శనివారం సాయంత్రం నాలుగింటికి 24 గంటల సగటు వాయు నాణ్యత సూచీ 397కు పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి చూస్తే ఇంతగా గాలి కాలుష్యం నమోదవడం ఇదే తొలిసారి. దీంతో సూక్ష్మ ధూళి కణాలు గాల్లో మరింతగా పెరగకుండా చూసేందుకు నిర్మాణ కార్యక్రమాలను ఆపాలని, కూల్చివేతలకు స్వస్తిపలకాలని కమిషనర్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్(సీఏక్యూఎం) శనివారం ఆదేశాలు జారీచేసింది. దేశ భద్రత, రక్షణ, రైల్వే, మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులకు మినహాయింపునిచ్చింది. బీఎస్–3 పెట్రోల్, బీఎస్–4 డీజిల్ వాహనాల రాకపోకల నిషేధానికి నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధి రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సీఏక్యూఎం సూచించింది. చలి పెరగడం, ఢిల్లీ పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంతో వెలువడే పొగ ఢిల్లీని కమ్మేస్తోంది. నిషేధకాలంలో బోర్లు వేయడం, డ్రిల్లింగ్, వెల్డింగ్, రోడ్ల నిర్మాణం, మరమత్తు, ఇటుకల తయారీ, తదితర నిర్మాణరంగ పనులను చేయకూడదు. -
నగరం..ఊపిరిపీల్చుకుంది
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి మెజార్టీ సిటిజన్లు సొంతూరు బాటపట్టారు. రోడ్లెక్కే వాహనాలు తగ్గడంతో దుమ్ము, ధూళి కాలుష్యం కూడా సగానికంటే ఎక్కువగానే తగ్గింది. ఈసారి పండుగకి సుమారు 25 లక్షల మంది నగరం నుంచి సొంతూళ్లకు ప్రయాణం కావడంతో.. ప్రధాన రహదారులపై వాహనాల సంచారం అరకొరగానే కనిపించింది. గ్రేటర్ పరిధిలో నిత్యం 50 లక్షల వాహనాలు తిరుగుతుండగా.. మంగళ, బుధవారాల్లో ఆ సంఖ్య 15 లక్షలకు మించకపోవడం గమనార్హం. దీంతో దుమ్ము, ధూళి కాలుష్యంతో పాటు మోటార్ వాహనాల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ తదితర కాలుష్య ఉద్గారాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఈ రెండు రోజులు నగరం స్వచ్ఛ ఊపిరి పీల్చుకుంది. కాలుష్యం తగ్గింది ఇలా... కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల మేరకు ప్రతి ఘనపు మీటర్ గాల్లో ధూళి కణాలు 60 మైక్రో గ్రాములకు మించి ఉండరాదు. కానీ సాధారణ రోజుల్లో పలు ప్రధాన రహదారులు, కూడళ్లలో 90 నుంచి 100 మైక్రోగ్రాముల మేర ధూళి కాలుష్యం నమోదవుతోంది. భోగి, సంక్రాంతి పండగ సందర్భంగా మంగళ, బుధవారాల్లో వాయు కాలుష్యం సగానికంటే తక్కువ నమోదవడం విశేషం. మోటారు వాహనాల నుంచి వెలువడే కాలుష్య ఉద్గారాలు కూడా.. సగానికంటే తక్కువ మోతాదులో నమోదు కావడం విశేషం. నగరవాసులు సైతం పండగ వేళ ఇళ్లకే పరిమితం కావడంతో వాహనాల సంచారం గణనీయంగా తగ్గడం కాలుష్య ఉద్గారాలు పడిపోవడానికి మరో కారణం. -
ఏడేళ్లలో 48కోట్ల మంది చనిపోతారా?
ఢిల్లీ : ప్రసుత్తం మనం జీవిస్తున్న ఆధునిక జీవనంలో కాలుష్యం అనేది ఈ భూమండలం మీద ఎంత ప్రభావం చూసిస్తుందో మనందరికి తెలిసిందే. కాలుష్యం అనేది రకరకాలుగా ఉన్నా ప్రభావం చూసిస్తున్నది మాత్రం సగటు జీవరాశి మీదే అన్న సంగతి చెప్పనవసనం లేదు. ఈ కాలుష్య ప్రభావాన్ని తగ్గించేందుకు ఏకంగా ప్రపంచదేశాలన్ని ఒక్క తాటి మీదకు వచ్చి వేడెక్కిన భూగోళాన్ని 2 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు తగ్గించాలని ప్యారిస్ వాతావరణ ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే. కాలుష్యానికి మచ్చుతునక.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫరీదాబాద్ ప్రాంతం ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే తాజాగా యునివర్సిటీ ఆఫ్ చికాగోకు చెందిన ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్(ఎపిక్) చేపట్టిన కాలుష్యం ప్రభావం సర్వేలో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. మొత్తం 225 దేశాలలో కాలుష్య ప్రమాణాలను 2.5 పర్టికులేట్ మాటర్లో పరిగణలోకి తీసుకొని సర్వే చేపట్టారు. ఈ జాబితాలో అత్యంత కాలుష్య ప్రభావ దేశంగా భారతదేశం రెండో స్థానంలో నిలిచింది. కాగా మొదటి స్థానంలో నేపాల్ దేశం ఉన్నట్లు సర్వే పేర్కొంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచించిన పరిధి మేరకు కాలుష్యాన్ని నియంత్రించడంలో భారతదేశం విఫలమైందని సర్వేలో బహిర్గతమైంది. తాజా అధ్యయనాల ప్రకారం దేశంలో 48 కోట్ల మంది అంటే దేశ జనాభాలో 40శాతం మంది ప్రజలకు వారి ఆయుష్‌లో ఏడేళ్లు తగ్గిందని పేర్కొంది. 2013-17 శాంపిల్ సర్వే ప్రకారం భారతదేశం ఆయుర్దాయం 67 ఏళ్ల నుంచి 69 ఏళ్లకు పెరిగినా కాలుష్య ప్రభావంతో అది ఏడేళ్లకు తగ్గి 60 నుంచి 62 ఏళ్ల దగ్గర ఆగిపోయింది. ముఖ్యంగా ఇండో- గాంగటిక్ ప్రాంతంలో ఉన్న పంజాబ్, చంఢీఘర్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ ప్రభావం స్పష్టంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది. కాగా, ఈ రాష్ట్రాల్లో విపరీత కాలుష్య ప్రభావం వల్ల అక్కడి ప్రజల ఆయుర్దాయం 62 ఏళ్లుగా ఉందని పేర్కొంది. అయితే ఇదంతా కేవలం 18 ఏళ్లలోనే జరిగినట్లు ఎపిక్ తన రిపోర్ట్‌లో స్పష్టం చేసింది. 1998కి ముందు ఇంత కాలుష్యం లేదని, 1998-2016 వరకు 72 శాతం మేర కాలుష్యం పెరిగిందని తమ అధ్యయనంలో నివేదించింది. తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం పైన పేర్కొన్న ఏడు రాష్ట్రాల్లోని కాలుష్య ప్రమాణాలను పరిగణనలోకి తీసుకొని చూస్తే 1998-2016 మధ్య కాలంలో మిగతా అన్నిదేశాల కంటే రెండు రెట్లు ఎక్కువ ఉండడం గమనార్హం. అయితే ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన (10మైగ్రా.మీటర్ క్యూబ్) ప్రమాణాలు పాటిస్తే కొంతమేర ప్రభావం తగ్గి భారతదేశంలో 4.3 సంవత్సరాల ఆయుశ్శు పెరిగే అవకాశం ఉందని తన రిపోర్ట్‌లో వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కాలుష్యాన్ని అరికట్టేందుకు నేషనల్ క్లీన్ ఎయిర్ ఇండియా ప్రోగ్రామ్(ఎన్‌క్యాప్) పేరుతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీని వల్ల వచ్చే ఐదేళ్లలో 20-30 శాతం మేర కాలుష్యాన్ని తగ్గించే పనిగా పెట్టుకుంది. ఈ ప్రోగ్రామ్‌ను కచ్చితంగా అమలు చేస్తే సగటు భారతీయుడు ఆయురార్ధం 1.3, ప్రభావితమైన ఏడు రాష్ట్రాల్లో 2ఏళ్లకు పెరుగుతుందని నివేదికలో వెల్లడించింది. -
మళ్లీ కాలుష్య మేఘాలు
న్యూఢిల్లీ: ఢిల్లీని మరోమారు కాలుష్య మేఘాలు కమ్మేశాయి. ఆదివారం ఉదయం కాలుష్య తీవ్రత రికార్డు స్థాయిని దాటి నమోదైంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న వాయు నాణ్యత అత్యంత ప్రమాదకరంగా ఉందని, దీనిని పీల్చడం ఆరోగ్యంగా ఉన్న వారికి కూడా మంచిది కాదని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ను పర్యవేక్షించే సెంట్రల్ కంట్రోల్ రూమ్‌లో ఆదివారం ఉదయం ఓ గంటలోనే వాయు నాణ్యత తీవ్రత ప్రమాదకర స్థాయిని మించిపోయినట్టు తేలింది. ఈ గ్రాఫ్‌లో ఒక క్యూబిక్ మీటర్‌కు పీఎం2.5.. 478 మైక్రోగ్రాములుగా, పీఎం10.. 713 మైక్రోగ్రాములుగా నమోదైంది. చాలా ప్రాంతాల్లో దగ్గరలోని వాహనాలు కూడా కనిపించనంతగా విజిబులిటీ స్థాయి పడిపోయింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ స్కోరు 460గా నమోదైంది. శనివారం ఇది 403గా ఉంది. సీపీసీబీ ఎయిర్ బులెటిన్ ప్రకారం పీఎం2.5 తీవ్రత ప్రమాదకరంగా ఉందని తేలింది. దీంతో కళ్లు విపరీతంగా మండటంతో పాటు ఊపిరి తీసుకోవడానికి కూడా ఢిల్లీ వాసులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. పీఎం2.5, పీఎం10 మరో 24 గంటల పాటు ఇదే స్థాయిలో నమోదైతే.. ఢిల్లీలో మరోసారి సరి–బేసి విధానం అమలు చేయాల్సి రావొచ్చని వాతావరణ కాలుష్య నియంత్రణ అథారిటీ నేతృత్వంలోని గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(జీఆర్ఏపీ) పేర్కొంది. 48 గంటల వ్యవధిలో పీఎం10 స్థాయి ఒక క్యూబిక్ మీటర్‌కు 500 మైక్రోగ్రాములకంటే దాటినా.. పీఎం2.5 స్థాయి క్యూబిక్ మీటర్‌కు 300 మైక్రోగ్రాములకంటే దాటినా సరి–బేసి విధానాన్ని అమలులోకి తీసుకురావొచ్చని శనివారం జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితికి దుమ్ము, ధూళి, పొగ మంచు మిళితం కావడమే కారణమని డీపీసీబీ చీఫ్ దీపాంకర్ సాహా పేర్కొన్నారు. కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడం.. పొగ మంచుతో కూడిన దట్టమైన మేఘాలు కమ్మేయడం కూడా దీనికి కారణమని వెల్లడించారు. -
ముంబై వెళ్లారో.. ఇక అంతే!
ఏదైనా మంచి ఉద్యోగం ఆఫర్ ఉందని ముంబై వెళ్లాలనుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే అక్కడ బతకడం అంటే పొగగొట్టంలో కాపురం ఉన్నట్లేనట. ప్రపంచంలో కాలుష్యం బాగా ఎక్కువగా ఉన్న నగరాల జాబితాలోంచి ఢిల్లీ తప్పుకొందని సంతోషపడుతుంటే.. ఆ జాబితాలోకి ముంబై వచ్చిచేరింది. అత్యంత కలుషిత మెగాసిటీలలో ముంబై ఐదోస్థానాన్ని ఆక్రమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) తెలిపింది. పీఎం 10 స్థాయిని బట్టి చూస్తే ఈ విషయం తెలుస్తోంది. డబ్ల్యుహెచ్ఓ పర్యవేక్షిస్తున్న 122 భారతీయ నగరాలలో పీఎం 2.5 స్థాయిలో అయితే 39వ స్థానంలో ముంబై ఉంది. నవీ ముంబై 36వ స్థానంలోను, థానె 87వ స్థానంలోను ఉన్నాయి. మహారాష్ట్ర పీసీబీ సియాన్, బాంద్రా ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన కాలుష్య పర్యవేక్షణ కేంద్రాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చారు. డబ్ల్యుహెచ్ఓ ప్రమాణాల ప్రకారం పీఎం 10 స్థాయి క్యూబిక్ మీటరుకు 20 మైక్రోగ్రాముల వరకు ఉండొచ్చు. కానీ ముంబైలో మాత్రం సగటున 117 మైక్రోగ్రాములు ఉంది. అయితే 2014 నాటి స్థాయి 136 మైక్రోగ్రాముల కంటే మాత్రం కొంతవరకు పరిస్థితి మెరుగైనట్లే చెప్పుకోవాలి. వాహనాల సంఖ్య గణనీయంగా పెరగడంతో కాలుష్యం బాగా పెరుగుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిగత వాహనాల సంఖ్యమీద పరిమితి లేకపోవడం.. ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో వాహనాల కొనుగోళ్లు పెరగడం కారణంగానే కాలుష్యం కూడా పెరుగుతోందంటున్నారు. -
పెట్రోలు కావాలా.. సర్టిఫికెట్ చూపించండి!!
మీ వాహనానికి పెట్రోలు గానీ, డీజిల్ గానీ పోయించాలనుకుంటున్నారా? అయితే ఇక మీదట పొల్యూషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా చూపించాల్సిందే. మీ వాహనం నుంచి వెలువడుతున్న ఉద్గారాలు పరిమితిలోనే ఉన్నాయని ధ్రువీకరించే 'పొల్యూషన్ అండర్ కంట్రోల్' సర్టిఫికెట్ తీసుకొస్తేనే ఇంధనం నింపాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశ రాజధాని నగరంలో కాలుష్యం స్థాయి విపరీతంగా పెరిగిపోవడంతో ఈ నిబంధనను అమలుచేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే శ్రీవాత్సవ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి మరో రెండు నెలల వరకు సమయం పట్టేలా ఉంది. ఈలోపు ముందు విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజల్లో అవగాహన పెంచి అప్పుడు అమలుచేయాలని ఢిల్లీ సర్కారు భావిస్తోంది. ఇందుకోసం ముందుగానే అన్ని పెట్రోలు బంకుల వద్ద కూడా కాలుష్య తనిఖీ వాహనాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. అప్పటివరకు పొల్యూషన్ సర్టిఫికెట్ తీసుకోనివాళ్లు ఆ వాహనం వద్ద తనిఖీ చేయించుకోవచ్చు. ఆ తర్వాత మాత్రమే వాళ్లకు పెట్రోలు లేదా డీజిల్ పోస్తారు.