poor farmers
-
మాయోపాయాలు.. బెదిరింపులు
► చంద్రబాబు అల్లిన ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో ట్విస్టుల మీద ట్విస్టులు.. కుట్రల మీద కుట్రలు.. పదేళ్లు అధికారానికి మొహం వాచి.. ఒక్క దెబ్బకు వేల కోట్లు ఎలా కొల్లగొట్టాలో పచ్చ దండు పన్నాగం ఈ డ్రామాకే హైలైట్. రాజధానిగా రోజుకో పేరు తెరపైకి తెచ్చి రియల్టర్లు, సామాన్యులకు నిజంగానే సినిమా చూపించారు. అసలు రాజధాని ఎక్కడో తన పరివారం చెవిలో బాబు ముందే ఊదేయడంతో అమరావతి ప్రాంతంలో పచ్చదండు వాలి గద్దల్లా భూములు తన్నుకెళ్లింది. ఇతర ప్రాంతాల్లో భూములు కొన్న రియల్టర్లు, సామాన్యులు ఘొల్లుమంటే.. బాబు అనుచరగణం పండుగ చేసుకుంది. ► విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన చంద్రబాబు.. రావడమే రాజధాని పాటందుకున్నారు. సింగపూర్‌ను తలదన్నేలా రాజధానిని కట్టేస్తాను.. బడుగుల బతుకుల్ని బాగుచేస్తానంటే నిజమనుకున్నారు. తెరవెనుక ఆ బడుగుల భూములపై కన్నేసిన చంద్రబాబు పన్నాగాన్ని వారు పసిగట్టలేకపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలు తేరుకునేలోపు వారి అసైన్డ్ భూముల్ని బినామీల రూపంలో గద్దల్లా తన్నుకుపోయారు. కుట్రలను పక్కాగా అమలు చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు భూదాహానికి బలయ్యింది నిరుపేద రైతులే.. ► రూ.3,737.30 కోట్ల విలువైన 617.70 ఎకరాల భూ దోపిడీ సమిధలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే సాక్షి, అమరావతి : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే చులకన భావన అడుగడుగునా జీర్ణించుకున్న చంద్రబాబు కన్ను వాళ్ల భూములపై పడింది. కేటగిరీ 1 నుంచి 4 కింద వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల అసైన్డ్ భూములను అడ్డగోలుగా కాజేయడానికి చట్టాన్ని తన చుట్టంగా మలచుకుని కోర్టులను కూడా బురిడీ కొట్టించారు. రాజధానిలో 617.70 ఎకరాల అసైన్డ్ భూ దోపిడీలో రూ.3,737.30 కోట్లను స్వాహా చేసి దేశ చరిత్రలోనే అతిపెద్ద భూకుంభకోణానికి పాల్పడ్డారు. అసైన్డ్ భూముల పరిరక్షణ కోసం చేసిన అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి భూముల్ని చెరబట్టారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల భూముల దోపిడీకి రోడ్ మ్యాప్ ముందుగానే సిద్ధం చేసుకున్నారు. భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జీవో నెంబరు 1 జారీ చేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ఇస్తామని, అసైన్డ్ భూములకు ప్యాకేజీ లేదని ముందుగా సిద్ధం చేసుకున్న ప్లాన్‌ను బయటపెట్టారు. అప్పుడే చంద్రబాబు, నారాయణ బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లు రంగంలోకి దూకారు. తమకు అసైన్డ్ భూములు విక్రయిస్తే ఎంతో కొంత డబ్బులొస్తాయని, లేదంటే భూములు కోల్పోతారని భయపెట్టారు. దీంతో ఆందోళనకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద రైతులు ఎకరా కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే అసైన్డ్ భూములను బాబు బినామీలకు సేల్ డీడ్ ద్వారా విక్రయించారు. అనంతరం వాటిని ఆరు కేటగిరీలుగా విభజిస్తూ భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 17న జీవో నెంబరు 41 జారీ చేశారు. వాటికి భారీ ప్యాకేజీ దక్కేలా చూసుకున్నారు. రాజధానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ పేద రైతులకు స్థానం లేకుండా చేశారు. అధికారుల అభ్యంతరాలూ బేఖాతరు అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించడానికి వీల్లేదు. 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన భూములు మాత్రమే ఇతరులకు విక్రయించుకోవచ్చు. ఆ విషయాన్ని రె వెన్యూ ఉన్నతాధికారులతో పాటు అడ్వకేట్ జన రల్ సైతం గుర్తిస్తూ భూసమీకరణ ప్యాకేజీని వ్యతిరేకించారు. ఉన్నతాధికారులు తాము చెప్పినట్లు చేయాల్సిందేనని చంద్రబాబు, నారా యణ హుకుం జారీ చేశారు. కోర్టుల్ని బురిడీ కొట్టించి.. అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఏకంగా కోర్టునే మోసం చేశారు. అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను చంద్రబాబు, నారాయణ మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీ లేవని కోర్టుకు నివేదిక ఇచ్చారు. 1954 తరువాత చాలాసార్లు పేదలకు అసైన్డ్ భూ ములు పంపిణీ చేశారు. వైఎస్సార్ ప్రభుత్వ హ యాంలో 2004–05లో అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. ఆ రికార్డులు మాయం చేశారు. అసైన్డ్ భూ ముల్లో 1954 తరువాత పంపిణీ చేసిన భూము లు ఉన్నాయన్న విషయం సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇలా 617.70 ఎకరాల అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణలు బినామీల పేరిట దోపిడీ చేశారు. ఈ భూములకు ప్యాకేజీ ద్వారా వారి గ్యాంగ్ ఏకంగా రూ.3,737.30 కోట్లు కొల్లగొట్టింది. పచ్చ కుట్ర బట్టబయలు ప్రభుత్వ అసైన్డ్ భూముల కేటగిరీ 5, 6లో చూపించిన 522 మంది రైతుల్లో ఒక్కరూ అసలు అమరావతి గ్రామాల్లోనే లేరన్న నిజం సిట్ దర్యాప్తులో బృందాన్ని నివ్వెరపరిచింది. కేవలం భూసమీకరణ ప్యాకేజీ కింద రాజధానిలో అత్యంత విలువైన స్థలాలను కొల్లగొట్టేందుకే చంద్రబాబు ముఠా ఈ పన్నాగానికి పాల్పడిందన్నది ఆధారాలతో సహా తేటతెల్లమయింది. ప్రభుత్వ భూములకు ఎసరు ప్రభుత్వ అసైన్డ్ భూములను దర్జాగా దోచేశారు. 29 గ్రామాల పరిధిలోని ప్రభుత్వ స్థలాలు తమ బినామీలైన ప్రైవేటు వ్యక్తుల అనుభవంలో ఉన్నాయని తప్పుడు రికార్డులు సృష్టించి వాటిని గుప్పిట పట్టారు. ఏకంగా 328 ఎకరాల ప్రభుత్వ భూమిని 522 మంది బినామీల పేరిట చూపిస్తూ హస్తగతం చేసుకున్నారు. భూసమీకరణ ప్యాకేజీలో రూ.760.25 కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వ భూములన్నీ గుర్తు తెలియని వ్యక్తుల ఆ«దీనంలో ఉన్నట్టుగా రికార్డుల్లో చూపించారు. అందుకోసం అసైన్డ్ భూముల జాబితాను 5, 6 కేటగిరీలుగా పేర్కొన్నారు. అన్యాక్రాంతమైనప్పటికీ అభ్యంతరాలు లేని భూములను కేటగిరీ 5గా, అన్యాక్రాంతమైన, అభ్యంతరాలు ఉన్న భూములను కేటగిరీ 6గా చూపిస్తూ జీవో 41 జారీ చేశారు. కేటగిరీ 5లో 237.60 ఎకరాలు గుర్తించారు. ఆ భూములన్నీ 295 మంది ఆదీనంలో ఉన్నట్లుగా చూపించారు. కేటగిరీ–6లో 90.52 ఎకరాలు చూపి అవి 227 మంది స్వా«దీనంలో ఉన్నట్టు కనికట్టు చేశారు. వాస్తవానికి అవి ఎవరి ఆధీనంలోనూ లేవు. -
పెద్దలను ముట్టుకోరు... పేద రైతులపైనే ప్రతాపం
న్యూఢిల్లీ: బ్యాంకుల పనితీరును ఆక్షేపిస్తూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ‘‘భారీ మొత్తాల్లో రుణాలు ఎగ్గొడుతున్న పెద్దలను నిలదీయడానికి, వాళ్లమీద కేసులు పెట్టడానికి మీకు చేతులు రావు. పేద రైతులను మాత్రం వెంటపడి వేధిస్తారు’’ అంటూ తప్పుబట్టింది. మోహన్‌లాల్ పటీదార్ అనే రైతు తీసుకున్న రుణానికి సంబంధించి మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సుప్రీంకోర్టులో సవాలు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తీరును తీవ్రంగా తప్పుబడుతూ సునిశిత విమర్శలు చేసింది. ‘‘పెద్దవాళ్లు తీసుకునే భారీ రుణాల వసూలుకు మీరు ప్రయత్నం చేయరు. రైతుల విషయంలో మాత్రమే మీకు చట్టం గుర్తొస్తుంది. ఓటీఎస్ పథకం కింద రూ.36.5 లక్షలు కట్టాలని ఆ రైతుకు మీరే ఆఫర్ చేశారు. అతను 95 శాతం పైగా చెల్లించాక కట్టాల్సిన మొత్తాన్ని రూ.50.5 లక్షలకు పెంచారు. పైగా దాన్ని వసూలు చేసుకునేందుకు కోర్టుకెక్కారు. మేమలాంటి ఏకపక్ష నిర్ణయం వెలువరించే సమస్యే లేదు. అది అర్థరహితమే కాదు, సహజ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం’’ అంటూ తలంటింది. కేసును కొట్టేస్తున్నట్టు ప్రకటించింది. ఇలాంటి తీర్పు ఇస్తే అది అందరికీ సాకుగా మారుతుందన్న బ్యాంకు తరఫు న్యాయవాది గరిమా ప్రసాద్ చేసిన వాదనను తోసిపుచ్చింది. బ్యాంకు విజ్ఞప్తిని అంగీకరిస్తే పేద రైతు ఆర్థికంగా చితికిపోతాడని జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వెలిబుచ్చారు. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. -
బడుగు రైతుకు ఆదాయ భద్రత!
కేవలం 5 గుంటల(12.5 సెంట్లు) స్థలం..రూ. 3 లక్షల బ్యాంకు రుణంతోనెట్ హౌస్ నిర్మాణం..రైతు వాటా రూ. 35 వేలతోపాటు రోజుకు 2 గంటలు శ్రమ..అతి తక్కువ నీటితో, మార్కెట్లో గిరాకీ ఉన్న పంటలు కరువు కాలంలోనూనిశ్చింతగా పండించడం..పొలం దగ్గరే రైతులకుగిట్టుబాటు ధర చెల్లించడం..ప్రతి వంద రోజులకో పంట..ప్రతి సారీ పంటల మార్పిడి..పంట పంటకూ రూ. 50 వేల నికరాదాయం..ఇదంతా అందమైన కల లాగా ఉందా?కల కాదు.. నిజమే. నిజంగా నిజమే!చిన్న, సన్నకారు రైతుల అనుభవంలో నిగ్గుతేలిన విషయమిది. ‘ఖేతీ’ అనే లాభాపేక్ష లేని సంస్థ మార్గదర్శనంలో పలువురు రైతులు ఏడాది పొడవునా, తీవ్ర కరువు కాలంలోనూ, ఆదాయ భద్రత పొందుతున్నారు!! మెతుకు సీమ మెదక్ జిల్లా ఇప్పుడు భూగర్భ జలాలు ఇంకిపోయి కరువు సీమగా మారింది. నాలుగైదు వందల అడుగుల లోతుకు బోరు వేస్తే కానీ నీరు రాని పరిస్థితి.. వేసిన బోర్లలో కూడా సక్రమంగా నీరు వస్తుందనే నమ్మకం లేదు. ఒకటికి పది బోర్లు వేసినా నీటి కొరత తీరక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఈ ప్రాంతంలోనే అధికంగా ఉన్నారు. అందుకోసమే నష్టాలతో సాగు చేయలేక హైదరాబాద్, ముంబై, దుబాయ్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లి బతుకు జీవుడా అని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఏడారిలో ఒయాసిస్సులాగా ‘ఖేతీ’ లాభాపేక్ష లేని సంస్థ రైతులకు అండగా నిలుస్తోంది. వ్యవసాయం దండుగ అన్న చోటనే పండుగలా చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అన్నీ తానై చిన్న, సన్నకారు రైతులతో లాభసాటి వ్యవసాయం చేయిస్తోంది. 5 గుంటల (12.5 సెంట్లు) భూమిలో బ్యాంకు రుణం రూ. 3 లక్షల(8.8% వడ్డీ)తో నెట్ హౌస్ నిర్మిస్తోంది. రైతు వాటా రూ. 35 వేలు చెల్లించాలి. చుట్టూ పురుగులను లోనికి రానీయకుండా నెట్ ఉంటుంది. లోపల పంటల పైన షేడ్ నెట్ ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉండే రోజుల్లోనే ఈ షేడ్‌నెట్‌ను వాడుతుంటారు. ఎండ తీవ్రతను 2 డిగ్రీల సెల్షియస్ మేరకు తగ్గిస్తే 20% దిగుబడి పెరుగుతుందని ‘ఖేతీ’ చెబుతోంది. ఆరు బయట డ్రిప్ ద్వారా వాడే నీటిలో కేవలం 10 శాతం నీటిని (రోజుకు వెయ్యి లీటర్లు) మాత్రమే వాడుతుండడం మరో విశేషం. 100 రోజుల్లో రూ. 90 వేల విలువైన కనీసం 3 టన్నుల కీర దోస వంటి స్వల్పకాలిక పంటలు పండించేలా బడుగు రైతులకు ‘ఖేతీ’ మార్గదర్శనం చేస్తున్నది. ఆరుబయట డ్రిప్‌తో ఇంత దిగుబడి తీయడానికి రోజుకు పది వేల లీటర్ల నీరు, అదే నీరు పారగట్టే పద్ధతిలో అయితే 50 వేల లీటర్ల నీరు అవసరమవుతుందని ‘ఖేతీ’ అంచనా. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం 90% తగ్గించగలుగుతోంది. పండించడం వరకే కాదు.. పంటను మార్కెట్ ధర చెల్లించి పొలం దగ్గరే మార్కెట్ ధరకే కొంటున్నది. మార్కెట్లో ధర మరీ తగ్గినప్పుడు కూడా కిలోకు రూ. 20 చొప్పున రైతులకు చెల్లించడం విశేషం. ఉన్న కొద్దిపాటి నీటి వనరులను ఉపయోగించుకొని కీరదోస సాగు లాభసాటిగా ఉందని సిద్ధిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం రైతులు చెబుతున్నారు. 1హెచ్‌పి మోటర్, వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ నుంచి డ్రిప్ ద్వారా నీరు, ద్రవరూప ఎరువులు అందిచడంతో పంట దిగుబడి అధికంగా వస్తున్నదని రైతు గుండ తిరుమలగిరి, వజ్రమ్మ దంపతులు చెబుతున్నారు. పంట నాటిన నెల రోజుల నుంచి దిగుబడి మొదలైందన్నారు. పంటలు వేసి నష్టపోయిన రైతులకు ‘ఖేతీ’ స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. సంస్థ అధ్యక్షులు సత్య రఘు రైతులను కలిసి, ఉమ్మడి మెదక్, మేడ్చల్ జిల్లా పరిధిలో 500 మంది రైతులను ఎంపిక చేశారు. కీర పంట నాటిన నెల రోజులకు దిగుబడి ప్రారంభమవుతుంది. రోజు తప్పి రోజు కీర దోసకాయలను రైతులు కోస్తున్నారు. ‘ఖేతీ’ సంస్థ ప్రతినిధులు నెట్ హౌస్ వద్దకే వచ్చి కాంటా పెట్టుకొని ఆన్లైన్ మార్కెట్లలో ఆ రోజు ఉన్న రేటుకు కొనుగోలు చేసి.. నగరాల్లోని మాల్స్‌కు సరఫరా చేస్తున్నారు. రైతులకు నెలకోసారి డబ్బు చెల్లిస్తున్నారు. గరిష్టం ఐదేళ్లలో బ్యాంకు రుణం తీరిపోతుంది. అప్పటి వరకూ ‘ఖేతీ’ సంస్థ రైతులకు వెన్నుదన్నుగా ఉంటుంది. ఆ తర్వాత రైతులే నిర్వహించుకోవాలి. – ఈరగాని బిక్షం, సాక్షి, సిద్ధిపేటఫొటో జర్నలిస్టు : కె. సతీష్ పనులు మేమే చేసుకుంటాం..! నాకు మూడున్నర ఎకరాల భూమి ఉంది. బోరు కొద్డిగా పోయడంతో పంటలు మధ్యలోనే ఎండిపోయేవి. కానీ ఈ సార్లు వచ్చి కొద్దిపాటి నీళ్లతో 5 గుంటల్లో పంటలు సాగు చేసుకోవచ్చని చెప్పారు. మా వాటా రూ. 35 వేలు ఇచ్చాం. బ్యాంకు లోన్ వచ్చింది. నెట్ హౌస్ వేశాం. పంటలు వేయడం, మందులు వాటం అంతా వారే చెప్పారు. రోజు వారీగా తోటలో పనులు మేమే చేసుకుంటున్నాం. ఇప్పుడు రెండు నెలలైంది. మాకు 2 టన్నుల కీర దోస పండింది. కిలో రూ. 32 నుండి రూ. 35 వరకు పలుకుతున్నది. ఇప్పటి వరకు మాకు రూ. 60 వేలు వచ్చినయి. మరో టన్ను దిగుబడి వస్తుంది. వంద రోజుల్లో రూ. 90 వేల పంట పండుతుంది. ప్రతి రోజూ పని చేస్తే మంచి లాభాలు వస్తాయి.– గుండ తిరుమలగిరి, కీర రైతు,(88976 74823), దాచారం, గజ్వేల్ మండలం, సిద్ధిపేట జిల్లా తక్కువ విస్తీర్ణం.. ఎక్కువ లాభం! తక్కువ విస్తీర్ణంలో చిన్న, సన్నకారు రైతులతో లాభసాటి వ్యవసాయం చేయించడం, వ్యవసాయం దండుగ కాదని రుజువు చేయడమే మా సంస్థ లక్ష్యం. కేవలం 5 గుంటల స్థలంలో నెట్ హౌస్ నిర్మించడంతో పాటు డ్రిప్ తదితర వసతులన్నీ కల్పించాం. మా వ్యవసాయ నిపుణులు రైతుల పొలాల వద్దకు వెళ్లి ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నాం. తీవ్ర కరువులోనూ మంచి దిగుబడి వస్తున్నది. మార్కెటింగ్ ఇబ్బందులు లేకుండా పొలం వద్దకే వెళ్లి మేమే కొనుగోలు చేస్తున్నాం. కీర దోస, క్యాప్సికం, చెర్రీ టమాటా, కర్బూజ, మిర్చి పంటలను పంటల మార్పిడి పద్ధతిలో సాగు చేయిస్తున్నాం. రైతులకు లాభసాటిగా ఉంది.– దిలీప్ (83400 65000),ఖేతీ సంస్థ ప్రతినిధి రోజుకు 2 గంటలు పని! నేను ఉదయం మిల్క్ డైరీలో పనిచేస్తా.. నాకు వ్యవసాయం ఉంది. కానీ దిగుబడి రాక వ్యవసాయం చేయడంలేదు. ‘ఖేతీ’ సంస్థ వారు చెప్పిన మాటలు విని 5 గుంటల్లో నెట్ హౌస్ వేసి కీర దోస వేశాను. ఉదయం గంటసేపు, సాయంత్రం గంటసేపు పంట బాగోగులు చూసుకుంటున్నా. డ్రిప్ ద్వారా నీళ్లు, మందులు వేస్తాం. పంట వేసి 70 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు నాకు రూ. 68 వేల ఆదాయం వచ్చింది. కాయలు కోయగానే పొలం దగ్గరకు వచ్చి వాళ్లే కొనుగోలు చేస్తారు. అమ్ముకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. మంచి సౌకర్యంగా, లాభంగా ఉంది. పాల డైరీ పనిచేసుకుంటూనే ఈ కీర దోస పండించిన. ఈ పంట అయిపోగానే క్యాప్సికం లేదా చెర్రీ టమాటా వేస్తాం.– వెంకటస్వామి, కీర రైతు(9030189288), దాచారం, గజ్వేల్ మండలం, సిద్ధిపేట జిల్లా -
లీజు కాదు.. అమ్మకమే
పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులకు భూముల విక్రయం * అయినకాడికి విక్రయిద్దామన్న సీఎం * పారిశ్రామిక విధానంలో సవరణలు తెస్తూ జీవో 48 జారీ * ఇక ప్రైవేట్ సంస్థలు ఇష్టానుసారంగా ఆ భూములను అమ్మేసుకోవచ్చు * మూడు సంస్థలకు ఇప్పటికే 1,617.56 ఎకరాల విక్రయం సాక్షి, హైదరాబాద్: పేద రైతుల పొట్ట కొట్టి పెద్దలకు విందు భోజనం పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీఐఐసీని అడ్డుపెట్టుకుని రైతులనుంచి నామమాత్రపు ధరకు సేకరించిన వేలాది ఎకరాల భూములను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు సంతర్పణ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. లీజుకు ఇవ్వాల్సిన భూములను అన్ని హక్కులతో అమ్మేసేందుకు సవరణలు తీసుకువస్తూ సీఎం చంద్రబాబు స్వయంగా జీవో జారీ చేయించేశారు. దీనిపై అధికార వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. పరిశ్రమలు, పర్యాటక ప్రాజెక్టులకు భూములను 99 ఏళ్ల పాటు లీజుకు ఇవ్వాలని పారిశ్రామిక, పర్యాటక విధానంలో ఉంది. అలాగే వెనుకబడిన ప్రాంతంగా ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రాంతంలో రూ.100 కోట్లకు పైగా పెట్టుబడితో ఏర్పాటు చేసే మెగా ప్రాజెక్టులకు అన్ని హక్కులతో భూములు విక్రయించే విషయాన్ని సీఎం అధ్యక్షతన జరిగే పారిశ్రామిక ప్రోత్సాహక మండలి పరిశీలించవచ్చునని 2015 ఏప్రిల్ 29వ తేదీన ప్రకటించిన పారిశ్రామిక విధానంలో పేర్కొన్నారు. ఆ భూములను తమకు పూర్తిగా విక్రయించకపోతే పెట్టుబడులు తీసుకురావడం కష్టంగా ఉందని కొందరు ప్రైవేట్ వ్యక్తులు ముఖ్యమంత్రిని కలిసి విన్నవించారు. దీంతో చంద్రబాబు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం పారిశ్రామిక విధానంలోనే సవరణలు తేవాలని గత నెల 2వ తేదీన జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఆ మేరకు ‘ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మండలి సమావేశం’ అనే పదాన్ని తొలగించేశారు. లీజుకు ఇవ్వాల్సిన భూములను సర్వ హక్కులు కల్పిస్తూ పారిశ్రామికవేత్తలకు విక్రయించడాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)తో పాటు సంబంధిత శాఖల అధికారులు వ్యతిరేకించిన నేపథ్యంలో ఏకంగా నూతన పారిశ్రామిక విధానంలోనే సవరణలు తీసుకువచ్చారు. సీఎస్ అధ్యక్షతన జరిగిన ఎంపవర్డ్ కమిటీ ఆఫ్ కార్యదర్శుల సమావేశంలో కూడా ఔట్ రైట్ సేల్‌ను వ్యతిరేకించారు. అయినాసీఎం అధ్యక్షతన జరిగిన పారిశ్రామిక పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఔట్ రైట్ సేల్కు నిర్ణయం తీసుకుని జీవో-48 జారీ చేయించారు. భూములు విక్రయించాలంటూ క్యూ ఎటువంటి షరతులు లేకుండా భూములపై పారిశ్రామిక వేత్తలకు సర్వహక్కులు కల్పిస్తూ అమ్మేయడానికి జీవో-48 మార్గం సుగమం చేయడంతో ఏపీఐఐసీ చెలరేగింది. కాకినాడలోని ఓ సంస్థకు గతంలో కేటాయించిన 1,563 ఎకరాలను ఔట్ రైట్ సేల్ కింద విక్రయించేసింది. ఆ భూములను షరతులు లేకుండా రిజిస్ట్రేషన్ చేయాలని ఆ సంస్థ కోరుతోంది. మరోవైపు చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో నాలుగు మొబైల్ సెల్‌ఫోన్ కంపెనీలకు 69.56 ఎకరాలను ఎకరం రూ.20 లక్షల చొప్పున అమ్మేయాలని ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంది. ఓ సెల్‌ఫోన్ సంస్థకు 19.28 ఎకరాలను, మరో సంస్థకు 15 ఎకరాలను, ఓ కంపెనీకి 15 ఎకరాలను, మరో పారిశ్రామిక సంస్థకు 19.28 ఎకరాలను ఔట్ రైట్ సేల్కు ఇచ్చేశారు. అనంతపురం జిల్లా గుడిపల్లి గ్రామంలో ఓ కంపెనీకి 25 ఎకరాలను ఎకరం రూ. పది లక్షల చొప్పున ఏపీఐఐసీ ఔట్ రైట్ సేల్కు ఇచ్చేసింది. కర్నూలు జిల్లాలో ఫుడ్ పార్కు ఏర్పాటుకు ఓ సంస్థకు ప్రభుత్వం 623 ఎకరాలను లీజుకు కేటాయించింది. ఆ సంస్థ కూడా లీజును తొలగించి ఔట్ రైట్ సేల్ కింద ఇవ్వాలని కోరింది. త్వరలోనే 623 ఎకరాలను ఔట్ రైట్ సేల్కు ప్రభుత్వం ఇచ్చేయనుందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరికొన్ని సంస్థలు ఔట్రైట్ సేల్ కోసం ఇక క్యూ కట్టనున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. భూములను అమ్మేయడం దారుణం రైతుల నుంచి పరిశ్రమల కోసం అని తీసుకున్న భూములను పరిశ్రమలు స్థాపించకుండానే పారిశ్రామిక వేత్తలకు విక్రయ హక్కులు కట్టబెట్టడం దారుణమని ఉన్నతాధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో ఏర్పాటయ్యే ప్రత్యేక ఆర్థిక జోన్ల విధానంలో భూములను లీజుకు మాత్రమే ఇవ్వాలని ఉందని, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా అమ్మేయడం, అదీ రాయితీ ధరలతో ఇవ్వడం అన్యాయమని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. పరిశ్రమల కోసం భూములు తీసుకున్న సంస్థలు... రైతుల నుంచి కారు చౌకగా తీసుకున్న భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సొమ్ములు చేసుకున్నా అడిగే అధికారం ప్రభుత్వానికి ఉండదని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏపీఐఐసీని దళారీగా పెట్టి రైతుల నుంచి నామమాత్రపు ధరకు సేకరించి, అధిక ధరలకు వాటిని అమ్ముకునే అధికారం ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టడం కంటే దారుణం ఏముంటుందని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. -
బడుగు రైతు బలి
-
పేద రైతులను ప్రభుత్వం భయ పెడుతోంది
-
సర్కారు భూదాహానికి రైతులు బలి
- ప్రభుత్వ భూవ్యాపారంతో పెరుగుతున్న ఆత్మహత్యలు - భోగాపురం ఎయిర్‌పోర్టు పరిధిలో ఇద్దరు ఆత్మహత్య - గుండెపోటుతో మరో ఇద్దరు మృతి - వీధిన పడుతున్న కుటుంబాలు - భూసేకరణ వెనుక చంద్రబాబు స్వలాభమే ఎక్కువని విమర్శలు సాక్షి, హైదరాబాద్: టీడీపీ ప్రభుత్వ భూదాహం రాష్ట్రంలో మరణమృదంగం సృష్టిస్తోంది. విమానాశ్రయాలు, పోర్టుల పేరు చెప్పి అవసరానికి మించి భారీగా భూములు లాక్కునేందుకు సర్కారు ఎత్తులు వేస్తుండటంతో పేద రైతులు భయంతో దిక్కుతోచక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కుటుంబ పెద్దల బలవన్మరణాలతో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. అయినా ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా అన్పించడం లేదు. ప్రజాసంక్షేమం లక్ష్యంగా పనిచేయాల్సిన ప్రభుత్వం ఫక్తు రియల్ ఎస్టేట్ సంస్థలా మారి రైతుల భూములతో వ్యాపారానికి తెరలేపింది. రాజధాని అమరావతి భూ సమీకరణ/సేకరణతో బాబు సర్కారు శ్రీకారం చుట్టిన ‘రియల్ వ్యాపారం’ ఇప్పుడు పోర్టులు, విమానాశ్రయాలకు పాకుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వమే భూములు లాక్కుంటూ రైతుల ఉసురు తీస్తుండటంపై అన్ని రాజకీయపక్షాలతోపాటు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు విమర్శలు చేస్తున్నా సర్కారు తీరు మార్చుకోవడంలేదు. విమానాశ్రయాలు, పోర్టుల పేరిట అవసరానికి మించి రెండు మూడు రెట్లుపైగా భూములను బలవంతంగా రైతుల నుంచి స్వాధీనం చేసుకుని ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టే కుట్ర వెనుక చంద్రబాబు స్వలాభమే అధికమనే విమర్శలు న్నాయి. ఈ ఆత్మహత్యలకు బాధ్యులెవరు? భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి తాము సమిథలవుతున్నామనే భయంతో ఇప్పటికే నలుగురు యువ రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ ఎయిర్పోర్టుకోసం ప్రభుత్వం బలవంతంగా తమ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తుంటే ఏమి చేయాలో దిక్కుతోచక బతుకుదెరువు మార్గం తెలియక విజయనగరం జిల్లా గూడెపువలసకు చెందిన పెదకృష్ణమూర్తి (31) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. రావివలసకు చెందిన వెంపాడ రామసూరి (30) ఇదే టెన్షన్‌తో గుండెపోటుతో మరణించారు. ఎయిర్‌పోర్టుకు తమ భూములు లాక్కుంటే ఎలా బతకాలనే మానసిక ఆందోళన, వీధిన పడాల్సి వస్తుందనే భయంతో రామచంద్రపేటకు చెందిన ముక్కాల త్రినాథ్, గూడెపువలసకు చెందిన వెంపాడ సూరి గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఇలా భోగాపురం విమనాశ్రయ భూసేకరణ ఆరంభం కాకముందే కొద్దిరోజుల వ్యవధిలోనే నాలుగు ప్రాణాలు బలిగొంది. దీంతో వీరి కుటుంబాలు వీధినపడి విలపిస్తున్నాయి. తమ కుటుంబాల ఉసురు చంద్రబాబుకు తప్పకుండా తగులుతుందని మృతుల సంబంధీకులు శాపనార్థాలు పెడుతున్నారు. -
రైతు ప్రయోజనాలపై రాజీ లేదు: కేంద్రం
ప్రపంచ వాణిజ్య సంస్థకు ఇదే చెప్పాం కేంద్ర మంత్రి సీతారామన్ వెల్లడి న్యూఢిల్లీ: నిరుపేద రైతులు, వినియోగదారుల ప్రయోజనాల విషయంలో ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)తో రాజీ పడబోమని కేంద్రం చెప్పింది. ధాన్యాల భారీ నిల్వ అంశంపై పూర్తి తీర్మానాన్ని అందజేయూల్సిందిగా డబ్ల్యూటీవోను కోరామంది. దేశ ఆహార భద్రతా కార్యక్రమాన్ని అవరోధాలూ లేకుండా అమలు చేయడానికి ఇది అవశ్యకమని పేర్కొంది. అనిశ్చితి, అస్థిరత్వం కూడిన ప్రస్తుత పరిస్థితుల్లో ఆహార భద్రత అనేది మానవతా పరమైన అంశమని, వ్యాపారపరమైన సౌలభ్యాల కోసం దాన్ని పణంగా పెట్టలేమని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభకు తెలిపారు. ఇటీవలి డబ్ల్యూటీవో జెనీవా చర్చలు విఫలం కావడానికి కారణమైన ప్రభుత్వ వైఖరిని సమర్థించుకున్నారు. సంపన్న దేశాలకు ప్రీతిపాత్రమైన ట్రేడ్ ఫెసిలిటేషన్ అగ్రిమెంటును (టీఎఫ్ఏ) అంగీకరించరాదని నిర్ణరుుంచినట్లు తెలిపారు. ఆహార సబ్సిడీ అనేది ఆహార ధాన్యాల మొత్తం ఉత్పత్తి విలువలో 10 శాతం మేరకే ఉండాలని ప్రస్తుత డబ్ల్యూటీవో నిబంధనలు స్పష్టం చేస్తున్నారుు. అరుుతే ఎలాంటి జరిమానాలకు ఆస్కారం లేకుండా.. కనీస మద్దతు ధరకు ఆహారధాన్యాలు సేకరించి వాటిని చవక ధరలకు విక్రరుుంచేందుకు వీలు గా వ్యవసాయ సబ్సిడీల లెక్కింపు నిబంధనలు సవరించాలని మన దేశం డిమాండ్ చేస్తోంది. ప్రజలకు చేరవేయండి: బీజేపీ రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం అనుసరించిన వైఖరిని ప్రజలకు తెలియజేయూలని బీజేపీ తమ ఎంపీలను కోరింది. ఆహార భద్రత అంశంపై డబ్ల్యూటీవోతో జరిగిన చర్చల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు వివరించారు. ఇలావుండగా సీశాట్‌పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయూన్ని కూడా ఆయన వెల్లడించారు. ఈ సమావేశం వివరాలను బీజేపీ ఉపాధ్యక్షుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ విలేకరులకు తెలియజేశారు. -
రైతులకు బాసట
వ్యవసాయ భూములున్నా అందులో ఎలాంటి సారం లేక, పంటలు పండక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నిరుపేద రైతులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నాడు ఓ యువకుడు. బీడు భూములను సారవంతంగా మార్చేందుకు నడుం బిగించాడు. ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి నిస్సారంగా ఉన్న భూముల్లో చెరువు మట్టి నిపోయిస్తూ సాగులోకి తెస్తున్నాడు. ఆయనే మండల కేంద్రానికి చెందిన రవికుమార్. - న్యూస్‌లైన్, మునుగోడు మునుగోడుకు చెందిన రాధాకృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతుల కుమారుడు రవికుమార్. ఈయన యూకేలో ఎంఎస్ (పబ్లిక్‌హెల్త్ రీసర్చ్)చదువుకున్నాడు. పేద ప్రజలకు సేవచేయాలనే తపనతో 2005లో ఫ్రీడం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశాడు. బీడుభూముల్లో చెరువుమట్టిని పోసి సాగులోకి తేవాలన్న ఆలోచనతో ముందడుగువేస్తున్నాడు. తానే స్వయంగా రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నాడు. జిల్లాలోని పలు మండలాల్లో నిరుపేద రైతుల భూములను ఎంపికచేసుకుని సాగులోకి తేవడానికి కృషిచేస్తున్నాడు. -
నకిలీలలు!
మంచాల, న్యూస్‌లైన్: పేద రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ఉద్దేశించిన భూ పంపిణీ అక్రమాలకు నిలయంగా మారింది. భూ పంపిణీ ముసుగులో క్షేత్రస్థాయి అధికారులు స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు. అవకతవకలకు, నకిలీ పాస్ పుస్తకాలకు మంచాల మండలం అడ్డాగా మారింది. ప్రభుత్వ భూముల్లో కబ్జాలో లేని వారికి, స్థానికేతరులకు ఎడాపెడా పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసేశారు. గతంలో ఇక్కడ పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన తహసీల్దార్ల పేరిట నకిలీ ప్రొసీడింగ్‌లు తయారుచేసి వాటి ఆధారంగా పట్టా పుస్తకాలు ఇస్తున్నారు. రెవెన్యూ చట్టంలోని లొసుగులను ఆధారం చేసుకొని అందినకాడికి దండుకుంటున్నారు. ఎవరు రూ.10వేలు ఇస్తే వారికి 5ఎకరాల పట్టా పాస్ పుస్తకాలు జారీ చేస్తున్నారు. వాటిని బ్యాంకులో తాకట్టు పెడితే రుణాలు పొందే అవకాశం ఉండటంతో అధికారుల చేతులు తడుపుతూ పలువురు పోటీపడి అక్రమ పట్టాలు చేయించుకుంటున్నారు. ఇలా భూమి లేకుండానే ఆరుట్ల, లోయపల్లి, దాద్‌పల్లి, చిత్తాపూర్ గ్రామాల్లో వందలాది మంది నకిలీ పట్టా పుస్తకాలు పొందారు.. మిగులు భూమి అక్రమార్కుల పరం... ఆరుట్ల గ్రామం సర్వే నంబర్ 1363లో ప్రభుత్వానికి చెందిన 1527ఎకరాల 36గుంటల భూమిలో 387మంది లభ్ధిదారులకు 741.28 ఎకరాలు పంచారు. మిగతా భూమిలో 523 ఎకరాలు అక్రమార్కుల పరమైంది. స్థానికులతో పాటు ఇతర మండలాలకు చెందిన వారు రెవెన్యూ అధికారుల ప్రాపకం తో ఇక్కడ పట్టాలు పొందారు. అదే విధంగా దాద్‌పల్లి గ్రామంలోని 1వ సర్వే నంబర్లో 44.17ఎక రాల ప్రభుత్వ భూమిలో వాస్తవంగా 13మందికి పట్టాలు ఇచ్చారు. కానీ ప్రస్తుతం దాదాపు 40మంది దాకా ఈ భూమికి సంబంధించి అక్రమ పట్టాలు పొందారు. వీరిలో ఒకరు పట్టా పాస్ పుస్తకం బ్యాంకులో తాకట్టు పెట్టి రుణం తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆరుట్ల గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీ ఐదేళ్ల క్రితం దాద్‌పల్లి గ్రామానికి వచ్చారు. ఆయన భార్య పేరిట 5ఎకరాల భూమిని బి/2702/1992 నంబర్‌తో నకిలీ ప్రొసీడింగ్ అధారంగా పట్టా పుస్తకం జారీ అయ్యింది. దీన్ని తాకట్టు పెట్టి బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాంకు నుంచి పంట రుణం తీసుకున్నారు. విషయం బయటికి పొక్కడంతో రెవెన్యూ అధికారులు ఆ పాస్ పుస్తకాన్ని స్వాధీనం చేసుకున్నారు. పుట్టగొడుగుల్లా నకిలీ పాస్ పుస్తకాలు... ఇక లోయపల్లి రెవెన్యూ పరిధిలోని 334 సర్వే నంబర్లో 220.14 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా 127 ఎకరాలు పంచారు. కానీ ఈ సర్వే నంబర్లో 78మందికి 242.14 ఎకరాలకు సంబంధించి పాస్‌పుస్తకాలు ఉన్నాయి. భూమి ఉన్న దానికంటే 22.14 ఎకరాలు ఎక్కువగా కేటాయించినట్టు ఉండటం గమనార్హం. చిత్తాపూర్ గ్రామంలోని 92 సర్వే నంబర్లో 86.16 ఎకరాల ప్రభుత్వ భూమిలో 32మందికి 56 ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. మిగిలిన భూమిలో 25 ఎకరాల వరకూ 12మంది రైతులు కబ్జాలో ఉన్నారు. వాస్తవంగా మిగిలింది కేవలం 5.6 ఎకరాలు కాగా, మరో 22మంది ఎకరంన్నర చొప్పున 33 ఎకరాలు అక్రమ పట్టాలు చేసుకున్నారు. ఇలా భూమిలేకున్నా పట్టా పాసుపుస్తకాలు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి. ప్రభుత్వ భూముల విషయమై తహసీల్దార్ వెంకటేశ్వర్లును వివరాల కోసం సంప్రదించగా... రికార్డులను ఉన్నతాధికారులు తీసుకెళ్లారని చెప్పారు. ఇదిలా ఉంటే నకిలీ పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టి ఆరుట్ల ఎస్బీహెచ్, బోడకొండ దక్కన్ గ్రామీణ బ్యాంకుల నుంచి పలువురు రుణాలు పొందారు. ఈ విషయమై ఆరుట్ల ఎస్బీహెచ్ మేనేజర్ విజయలలితను వివరణ కోరగా... స్థానిక రెవెన్యూ అధికారులు పట్టాలు నిజమైనవేనని ధ్రువీకరిస్తుండటంతో రుణాలు ఇవ్వాల్సి వస్తోందని చెప్పారు. -
రైతుల కుటుంబాల్లో ఎంఐఈసీ వెలుగులు
నాగపూర్: పంటలు పండక ఆర్థికంగా చితికిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్న రైతుల కుటుంబాలకు జీవితంపై ఆశలు రేపేందుకు మంట్‌ఫోర్ట్ ఇంటిగ్రేటేడ్ ఎడ్యుకేషన్ల్ సెంటర్(ఎంఐఈసీ) కృషి చేస్తోంది. రెండేళ్ల క్రితం సర్ దొరబ్జి టాటా ట్రస్టు(ఎస్‌డీటీటీ) సహకారంతో సవోనర్ తాలూకా పటన్సొవంగి గ్రామంలో నెలకొల్పిన ఈ కేంద్రం అందరి మన్ననలను అందుకుంటోంది. కేవలం ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాల పిల్లలకు మాత్రమే వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తోంది. ఆరు నెలలపాటు రెసీడెన్సీ వసతి కల్పించి వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇస్తోంది. ఇప్పటివరకు ఈ ప్రాంతం నుంచి 200 మంది యువకులకు శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు వీరంతా వివిధ కంపెనీలలో ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో యావత్మల్, వార్ధా జిల్లాలకు చెందిన వారు కూడా ఉన్నారని ఎంఐఈసీ డెరైక్టర్ బ్రదర్ మాథ్యూ అలెగ్జాండర్ మంగళవారం విలేకరులకు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని మండ్ల జిల్లాకు చెందిన పిల్లలు కూడా ఇక్కడ శిక్షణ తీసుకున్నారని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పిల్లలు ఎవరైనా ఉంటే తమ భాగస్వామ్యులు, స్వచ్ఛంద సేవా సంస్థలు గుర్తించి తమ కేంద్రానికి పంపుతాయని తెలిపారు. టైలరింగ్, బ్యూటీ కేర్, కార్పెంటరీ, వెల్డింగ్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ రిపేర్, మోటార్ మెకానిక్స్, ఎలక్ట్రిసియన్ తదితర రంగాల్లో వీరికి శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. తమ కేంద్రానికి వచ్చేవారికి ఆరు నెలల హాస్టల్ వసతిని కూడా కల్పిస్తున్నామని వివరించారు. తమ ఈ కార్యక్రమాలకి కొన్ని పెద్ద పారిశ్రామిక కంపెనీలు సహకారం అందిస్తున్నాయని చెప్పారు. మహీంద్రా నవిస్టర్ ద్వారా ఒక మోటార్ మెకానిక్ ల్యాబ్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ఏర్పాటుచేసిందన్నారు. రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషనింగ్ రిపేర్ కోర్సుకు గోద్రెజ్ కంపెనీ ఆర్థిక సహాకారాన్ని అందిస్తుందని వివరించారు. అలాగే బ్యూటిషియన్ కోర్సు పూర్తి చేసిన వారికి కిట్లను కూడా పంపిణీ చేస్తుందని తెలిపారు. అలాగే విద్యార్థులకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంప్యూటర్లను అందిస్తుందని చెప్పారు. ఈ కేంద్రంలో శిక్షణ పొందిన కొంత మంది విద్యార్థులను గత వారంలో ముంబైలోని గోద్రెజ్ కంపెనీ నియమించుకుందని చెప్పారు.