poothala pattu
-
ప్రేమ పేరుతో మోసం.. రెండోసారి గర్భం దాల్చడంతో పెళ్లి.. ఆపై
చిత్తూరు కార్పొరేషన్: తొలుత ప్రేమపేరుతో తల్లిని చేసి తర్వాత పెళ్లిపేరుతో నాటకమాడి పరారయ్యాడని దళితయువతి మౌనిక (21) కన్నీటిపర్యంతమైంది. చిత్తూరులోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. పూతలపట్టు మండలం మద్దలయ్యగారిపల్లె దళితవాడకు చెందిన మౌనిక ఏడాది కిందట బంగారుపాళ్యంలోని ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో పనిచేసేటప్పుడు బంగారుపాళ్యం మండలం వెలుతురుచేనుకు చెందిన వినోద్ పరిచయమయ్యాడు. ప్రేమపేరుతో కలిసి తిరిగారు. మౌనిక గర్భం దాల్చడంతో వినోద్ మాత్రలు ఇచ్చి అబార్షన్ చేయించాడు. మళ్లీ రెండోసారి గర్భం దాల్చడంతో వీరి ప్రేమ వ్యవహారం బాధితురాలి ఇంట్లో తెలిసింది. వారి కుటుంబసభ్యులు నిలదీయగా ఈ ఏప్రిల్ 17వ తేదీన బంగారుపాళ్యం మండలం నలగలంపల్లె వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నాడు. వారం పాటు మౌనిక ఇంటికొచ్చి ఉండి.. తర్వాత పనికి వెళ్తానని చెప్పి వినోద్ పరారయ్యాడు. ఈ క్రమంలో మౌనిక జూన్ 4వ తేదీన ఓ పాపకు జన్మనిచ్చింది. బిడ్డతో వినోద్ ఇంటికి వెళ్తే.. అత్తామామలు రానివ్వలేదు. దీంతో న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేదని బాధితురాలు వాపోయింది. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని వేడుకుంది. -
టీడీపీ రౌడీయిజం
ఐరాల: సార్వత్రిక ఎన్నికల్లో దళితులను ఓట్లు వేయనీయకుండా తామే ఓట్లు వేసుకుంటున్న టీడీపీ నాయకులు ఈ పర్యాయం మరింత రెచ్చిపోయారు. ఏకంగా పూతలపట్టు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థినిని చుట్టుముట్టి దాడికి తెగబడ్డారు. వారి దాడి నుంచి ఎలాగో బైటపడి వెళ్తున్న అభ్యర్థిని మళ్లీ అడ్డగించి పిడిగుద్దుల వర్షం కురిపించారు. తీవ్రగాయాలతో ఆయన ఆస్పత్రి పాలయ్యారు. తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన ఈ సంఘటన గురువారం మండలంలోని పి.కట్టకిందపల్లె పోలింగ్ కేంద్రం వద్ద చోటుచేసుకుంది. వివరాలు.. పోలింగ్ కేంద్రం నంబర్ 8లో అగ్రకులాల వారు తమను ఓట్లు వేయనీయడం లేదని దళితవాడ ప్రజలు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబుకు ఫోన్లో చెప్పడంతో ఆయన దళితులతో ఆ కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికి సమయం 11.30 గంటలు. ఎంఎస్ బాబు సమస్యపై పోలింగ్ అధికారులతో మాట్లాడుతుండగా అక్కడే ఉన్న టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దళితులు ఓటు వేయడానికి వీల్లేదంటూ వాగ్యుద్ధానికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈవీఎం ను ధ్వంసం చేశారు. దాదాపు 70మంది టీడీపీకి చెందిన వారు కర్రలు, కమ్మీలతో వారిపై దాడికి తెగబడ్డారు. దీంతో ఎంఎస్ బాబు తల, ముఖం, వీపు, ఛాతీ, కాలుకు తీవ్రగాయాలయ్యాయి. దాదాపు 40 నిమిషాల టీడీపీ నేతలు వారిపై రెచ్చిపోయారు. మండల కన్వీనర్ పి.చంద్ర శేఖర్ రెడ్డి సర్దిచెప్పేందుకు యత్నించినా ఆయనపై సైతం దాడి చేశారు. వారి దాడి నుంచి ఎలాగో బైట పడి కారులో బాబు వెళ్తుండగా అరకిలోమీటరు దూరంలోనే ఎదురుగా వాహనాలలో వచ్చి టీడీపీ నాయకులు మరోసారి అడ్డుకున్నారు. కారు వెళ్లనీయకుండా రాళ్లు అడ్డుపెట్టి, మళ్లీ దాడి చేశారు. రాళ్లతో కారు అద్దాలను రాళ్లతో పగులగొట్టారు. అభ్యర్థి బాబు, ఆయన కుమారుడు ప్రవీణ్‌ను వెంటాడి మరీ ఇష్టానుసారంగా కొట్టారు. బాబు వద్ద రూ.40వేల విలువ చేసే సెల్‌ఫోన్‌ను సైతం లాక్కున్నారు. గన్‌మెన్ వారిని అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. స్థానిక వైఎస్సార్ పార్టీ నాయకులు అక్కడికి చేరుకుని గాయపడిన బాబును మరో వాహనంలో ఐరాల ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. బాబుపై దాడి ఘటనను నిరసిస్తూ చిత్తూరు ప్రభుత్వాస్పత్రి వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు ఆందోళన చేశారు. సాక్షి రిపోర్టర్‌గా భావించి... కట్టకిందపల్లె వద్ద టీడీపీ నేతల దాడి ఘటనను చిత్రీకరించేందుకు యత్నించిన ఓ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధిని సైతం టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. నువ్వు సాక్షి విలేకరివా? అంటూ అతని కడుపులో తన్నారు. ముఖంపై పిడిగుద్దులు గుద్దారు. పోలీసుల వైఫల్యం పోలింగ్ కేంద్రం వద్ద బాబుపై టీడీపీ నాయకులు దాడి చేశారని ఎన్నోసార్లు ఎస్ఐ ప్రసాద్‌రావుకు ఫిర్యాదు చేసినా సకాలంలో ఆయన రాలేదని గ్రామస్తులు, వైఎస్సార్ సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘటన జరిగిన ప్రాంతం పోలీస్ స్టేషన్‌కు పది కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా 2.15 గంటల సమయంలో ఎస్ఐ రావడం విమర్శలకు తావిచ్చింది. అప్పటికే బాబును చిత్తూరుకు తరలించారు. నియోజకవర్గ ఎన్నికల అధికారిపై దాడి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పి.కట్టకిందపల్లె పోలింగ్ కేంద్రానికి వెళుతున్న నియోజకవర్గ ఎన్నికల అధికారి రవీంద్రను మార్గమధ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. వాహనం అద్దాలు పగుల కొట్టారు. వీటిని చిత్రీకరిస్తున్న వీడియో గ్రాఫర్ నుంచి కెమెరా లాక్కొని వాటిని మూడు ముక్కలు చేశారు. కలెక్టర్‌కు ముందే ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం కట్టకిందపల్లె పోలింగ్ బూత్‌లో గత ఎన్నికల్లో అగ్రకులాల వారు తమను ఓటు వేయనీయడం లేదని నెల్లిమందపల్లె దళితవాడకు చెందిన పలువురు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న్యకు గత నెలలో ఫిర్యాదు చేశారు. అధికారులు సైతం ఆ ప్రాంతాల్లో పర్యటించారు. ఎవరైనా దళితులకు అవరోధాలు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, ఎన్నికల వేళకు సీన్ మారిపోయింది. అధికారులు ఏ చర్యలూ తీసుకోకపోవడంతో ప్రజాస్వామ్యాన్ని టీడీపీ నేతలు కాలరాచారు. -
ఓటుపై కత్తుల వేట!
జిల్లాలో టీడీపీ నేతలు సహనం కోల్పోయారు. ఓటమి భయంతో హింసాత్మక చర్యలకు ఒడిగట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు. పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థిని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి చితకబాదారు. తంబళ్లపల్లెలో ఓ కార్యకర్తను రాళ్లతో కొట్టి, కాళ్లతో తొక్కి చంపేశారు. అడ్డొచ్చిన వారిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. కవరేజ్‌కు వెళ్లిన మీడియానూ వదల్లేదు. కెమెరాలు లాక్కుని, ఐడీ కార్డులు చింపేసి అరాచకం సృష్టించారు. కొందరు నేతలు క్యూల్లోకి వెళ్లి యథేచ్ఛగా ప్రచారాలు చేస్తున్నా పోలీసులు అడ్డుచెప్పకపోవడం గమనార్హం. సాక్షి, తిరుపతి/చిత్తూరు అర్బన్: జిల్లాలోని ఓటర్లలో చైతన్యం కట్టలు తెంచుకుంది. ఉదయం 6 గంటలకే పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం కనిపించింది. పోలింగ్ ప్రారంభ సమయానికే కేంద్రాల వద్ద భారీ ఎత్తున ఓటర్లు బారులు తీరారు. అనేక చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు కుట్రలకు పదునుపెట్టారు. తంబళ్లపల్లి నియోజకవర్గం పీటీఎం పరిధిలో ఆ పార్టీ నేతలు దాడులకు పూనుకున్నా రు. నియోజకవర్గంలోని అన్ని బూత్‌లలో వైఎస్సార్సీపీకే అనుకూలంగా ఓట్లు వేస్తుండడంతో ఒకింత అసహనానికి లోనయ్యారు. టిసదుం జెడ్పీ హైస్కూల్ వద్ద ఉన్న పోలింగ్ బూత్‌లో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఓటర్లు కొందర్ని బలవంతంగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు వారికి అడ్డుతగిలారు. రెచ్చిపోయిన టీడీపీ నేతలు రామాపు రం గ్రామానికి చెందిన ఆర్సీ వెంట్రామిరెడ్డి (68), మరికొందరు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. వెంకట్రామిరెడ్డిని రాళ్లతో కొట్టి చంపేశారు. ఎంఎస్ బాబుపై హత్యాయత్నం పూతలపట్టు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంఎస్.బాబును హత్య చేయడానికి టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. సీఎం సామాజికవర్గానికి చెందిన పలు గ్రామాల్లో దళితులను ఓట్లు వేయనివ్వకుండా అడ్డుకున్నారు. తొలుత బందార్లపల్లెలో దళితులను ఓటు వేయడానికి అగ్రవర్ణాలు అంగీకరించలేదు. దీన్ని ప్రశ్నించడానికి వెళ్లిన ఎంఎస్ బాబుపై అక్కడే దాడిచేసి మట్టుబెట్టాలని టీడీపీ నేతలు ప్రణాళిక రచించారు. కానీ పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పచ్చ ముసుగు ధరిం చిన అల్లరిమూలు పారిపోయాయి. అటునుంచి ఐరాల మండలంలోని కట్టకిందపల్లెకి వెళ్లిన బాబు దళితులను ఎందుకు ఓటు వేయనివ్వడం లేదని ప్రశ్నించారు. అప్పటికే కాపుకాచిన టీడీపీ నేతలు బాబుతో పాటు ఆయన గన్‌మన్, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయాలతో తప్పించుకుని వెళుతున్న బాబు వాహనాన్ని అడ్డగించి, ధ్వంసం చేశారు. ఆయన్ను కిడ్నాప్‌చేసి మామిడితోపులోకి తీసుకెళ్లిన టీడీపీ కార్యకర్తలు మారణాయుధాలతో హత్య చేయడానికి ప్రయత్నించారు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన అనుచరులు చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలిం చారు. తెల్లగుండ్లపల్లెలో వైఎస్సార్సీపీ ఏజెంటుగా ఉన్న బాబ్జి అనే యువకుడ్ని టీడీపీ నేతలు కొట్టుకుంటూ లాక్కొచ్చారు. దాదాపు 300 మందిని ఓట్లు వేయనివ్వకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రెడ్డెప్పపై దాడికి యత్నం కుప్పం మండలంలోని కృష్ణదాసనపల్లెలో పోలింగ్ సరళి పరిశీలించడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డెప్పపై టీడీపీ నాయకులు దాడి చేయడానికి ప్రయత్నిం చారు. చిత్తూరు రూరల్ మండలంలోని చెర్లోపల్లెలో స్థానికేతరులు ఓట్లు వేయడానికి వస్తుంటే అడిగిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ వాళ్లు రాళ్లు రువ్వడంతో పలువురు గాయపడ్డారు. కుప్పంలో కుట్రలు కుప్పం నియోజకవర్గ పరిధిలో టీడీపీ నేతల కుట్రలు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి రెడ్డెప్ప పోలింగ్ బూత్‌ల వద్దకు రాకుండా అడ్డుకున్నారు. దళవాయికొత్తపల్లి, కృష్ణదాసనపల్లిలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఇదిలావుంటే కుప్పం పరిధిలో టీడీపీ, బీజేపీ కుమ్మక్కయ్యాయి. బీజేపీ అభ్యర్థి ఎక్కడా తన ఏజెంట్లను నియమించకుండా చంద్రబాబుకు ఓట్లు వేసేలా కృషి చేశారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని కేవీబీపురం రాగిగుంట బూత్‌లో ఉన్న వైస్సార్సీపీ ఏజెంట్లను బయటకు వెళ్లాలంటూ టీడీపీ నేతలు, అధికారులు బెదిరింపులకు దిగారు. వైఎస్సార్సీపీ ఏజెంట్లు పోలింగ్ బూత్‌లో ఉండకూడదట తిరుపతి ఎన్జీఓ కాలనీలోని బూత్ నంబర్ 40లో టీడీపీ ఏజెంట్లను లోపల కూర్చో బెట్టి వైఎస్సార్సీపీ ఏజెంట్లను రానివ్వకుండా అడ్డుకున్నారు. అదేమిటని అడిగితే లోపల స్థలం చాల్లేదని చెప్పుకొచ్చారు. తిరుపతి స్కావెంజర్స్ కాలనీలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. రేణిగుంట మండలం ఎస్ఎన్ పురం బూత్ పరిధిలో ఓటర్ల జాబితాలో ఫొటోలు లేవు. గుడిమల్లంలో పోలింగ్ బూత్ వద్ద టీడీపీ కార్యకర్తలు ప్రచారం చేయడం కనిపించింది. వైస్సార్సీపీకి ఓట్లు పడుతున్నాయని ఓ కార్యకర్త చేత ఈవీఎంని గట్టిగా ఒత్తి మిషన్ పనిచెయ్యకుండా చేశారు. పోలింగ్ ప్రారంభమయ్యేసరికి మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్తులు రేణిగుంట మండలం గాజులమండ్యం, నల్లపాళెం గ్రామస్తులు ఓటింగ్‌ను బహిష్కరించారు. గాజులమండ్యం పారిశ్రామికవాడ నుంచి వెలువడే వ్యర్థాల కారణంగా రెండు గ్రామాలతో పాటు మరికొన్ని పల్లెలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దీనిపై ఎవ్వరూ స్పందించకపోవడంతో వారు ఓటింగ్‌కు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. తర్వాత సమస్య సర్దుమణిగింది. చంద్రగిరిలో తమ్ముళ్లు దాష్టీకం వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారన్న నెపంతో రామచంద్రాపురం మండలానికి చెందిన దళితులను పోలింగ్ కేంద్రాలకు రాకుండా అడ్డుకున్నారు. రావిళ్లవారిపల్లి, కమ్మపల్లి, కమ్మకండ్రిగ, టీటీకండ్రిగ, ఎన్ఆర్ కమ్మపల్లి, గణేశ్వరపురంలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డేలేకుండా పోయింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ దాడికి తెగబడ్డారు. టీడీపీ ఏజెంట్లు మినహా మిగిలిన పార్టీలకు సంబంధించిన ఏజెంట్లను కూడా గ్రామంలోకి అడుగుపెట్టనివ్వకపోవడం గమనార్హం. కవరేజ్ కోసం వెళ్లిన సాక్షి విలేకరులు ప్రకాష్, శివశంకర్, రాజారెడ్డి, మరో ఫొటోగ్రాఫర్‌ను అడ్డుకున్నారు. సాక్షి విలేకరి శివశంకర్‌పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇతని వద్ద, రాజారెడ్డి వద్ద ఉన్న సెల్ఫోన్లు, ఐడీ కార్డులను లాక్కుని తరిమారు. సొరకాయలపాళెం గ్రామానికి చెందిన ఇరువర్గాల వారు రాళ్లు, రప్పలు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. మండల పరిధిలోని అనేక గ్రామాల్లో టీడీపీ నేతలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. పాకాల మండలంలో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని భాస్కరనాయుడుపై చేయిచేసుకున్నారు. తమ్ములగుంటలో పులివర్తి నాని భార్య హల్చల్ చేశారు. మొరాయించిన ఈవీఎంలు జల్లా వ్యాప్తంగా సుమా రు 2,350 ఈవీఎంలు మొరాయించినట్లు అధికారులు వెళ్లడించా రు. వీటిని సకాలంలో సరిచేయడంతో సమస్య తప్పినట్లయింది. -
పార్టీ ఫిరాయిస్తే రూ.40 కోట్లు
సాక్షి, రొంపిచెర్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించి టీడీపీలోకి వస్తే రూ. 40 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నాయకులు తనతో బేరాలు ఆడారని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సునీల్‌కుమార్ వెల్లడించారు. ఒప్పుకోకపోతే తప్పుడు కేసులు పెడతామని కూడా బెదిరించారని ఆయన ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ బండమీద చల్లావారిపల్లెలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ వారికి ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై లేదని ఆయన దుయ్యబట్టారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెరవనని, తాను ఎప్పటికీ తన గురువు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెంటే ఉంటానని స్పష్టం చేశారు. -
ప్రమాదంలో ఇద్దరి మృతి
ఆటోలో ఎర్రచందనం దుంగలు బయటపడడంతో మృతులు స్మగ్లర్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూతలపట్టు, న్యూస్‌లైన్: పోలీసుల కథనం మేరకు.. ఏపీ04 7083 నంబర్ గల ఆటో ఐదు ఎర్రచందనం దుంగలతో గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో తిరుపతి వైపు నుంచి చిత్తూరు వైపునకు బయలుదేరింది. అలాగే ఏపీ16 టీఎక్స్ 8193 నంబర్ గల లారీ చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళుతోంది. పి.కొత్తకోట బ్రిడ్జి సమీపంలో ఆటో ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించబోయి ఎదురుగా వస్తున్న లారీ వెనుక చక్రాన్ని వేగంగా ఢీకొంది. తర్వాత ఇన్నోవా కారును ఢీకొని పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని రామాంజనేయులు, గంగేష్ అక్కడికక్కడే మృతి చెందారు. మల్లికార్జున, శివశంకర్ తీవ్రంగా గాయపడ్డారు. సుమారు 30 నిమిషాలు పూతలపట్టు 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో క్షతగాత్రులు నరకయాతన అనుభవించారు. సంఘటన స్థలానికి పాకాల సీఐ వెంకటనారాయణ, పూతలపట్టు ఎస్ఐ నిత్యబాబు చేరుకున్నారు. మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతులు వైఎస్ఆర్ జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని తిమ్మరాజుపల్లెకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఇదిలావుండగా తిరుపతి నుంచి చిత్తూరుకు వస్తున్న వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గాయత్రీదేవి సంఘటనను చూసి వెంటనే 108 వాహనానికి సమాచారమిచ్చారు. సుమారు 30 నిమిషాలకూ 108 వాహనం రాకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.