Posters disputes
-
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. హైదరాబాద్‌లో పోస్టర్ల వార్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని తాజ్‌కృష్ణ హోటల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో కోసం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా హస్తం నేతలంతా విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోస్టర్ల వార్ చోటుచేసుకుంది. సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. సీడబ్య్లూసీ సమావేశాల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా హైదరాబాద్ నగర వ్యాప్తంగా పోస్టర్లు, హోర్డింగ్‌లు వెలిశాయి. సీడబ్ల్యూసీ అంటే కాంగ్రెస్ వర్కింగ్ కిమిటీ కాదని, అది కరప్ట్ వర్కింగ్ కమిటీ అంటూ రాజధాని ప్రధాన కూడళ్లలో పోస్టర్లు అంటించారు. సీడబ్ల్యూసీ సభ్యులు, వారు పాల్పడిన కుంభకోణాలకు సంబంధించిన వివరాలను వాటిలో పేర్కొన్నారు. మల్లికార్జున ఖర్గే, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ , సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా మొత్తం 24 మంది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల ఫొటోలు, వారి స్కాముల వివరాలతో పోస్టర్లు అంటించారు. ఈ సందర్భగా స్కాములు చేసే వాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి (బివేర్ ఆఫ్ స్కామర్స్) అంటూ టాగ్ లైన్‌తో గుర్తుతెలియన వ్యక్తులు పోస్టర్లు, హోర్డింగులను ఏర్పాటు చేశారు. దీంతో, ఈ పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా.. సీఎం కేసీఆర్‌పై కూడా పోస్టర్లు కనిపించడం సంచలనంగా మారింది. హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్ ఫొటోతో ఓ స్కానర్‌ను రూపొందించారు. దీనిపై బుక్ మై సీఎం.. డీల్స్ అవాలబుల్.. 30 శాతం కమీషన్ అని రాసుకొచ్చారు. దీంతో, ఈ పోస్టర్లు నగరంలో చర్చనీయాంశంగా మారింది. అయితే, రెండు పార్టీలకు చెందిన పోస్టర్లు అంటించడంపై పోలీసులు దృష్టిసారించినట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: హైదరాబాద్‌లో సీడబ్ల్యూసీ.. హస్తం నేతలు బిజీబిజీ -
దిండుగల్‌లో పోస్టర్ల హల్చల్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సీఎం వివాదం రోజుకో రూపంలో తెరపైకి వస్తోంది. దిండుగల్‌లో సీఎం పన్నీరు.. డిప్యూటీ పళని అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇది దిండుగల్ అన్నాడీఎంకే గ్రూపువార్‌ను తెరపైకి తెచ్చింది. 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి అంటూ మంత్రులు సెల్లూరు రాజు, కేటీ రాజేంద్ర బాలాజీల భిన్న వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇది కాస్త సీఎం, డిప్యూటీ సీఎం శిబిరాల మధ్య చిచ్చుకు దారి తీసింది. బుధవారం దిండుగల్ జిల్లాలో సీఎంపన్నీరు..డిప్యూటీ పళని అంటూ పోస్టర్లు వెలిశాయి. దిండుగల్ జిల్లా అన్నాడీఎంకేలో మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్, మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ కీలకం. ఇది వరకు పన్నీరు విశ్వాసపాత్రుడి ఉన్న విశ్వనాథన్, ప్రస్తుతం సీఎం పళనికి నమ్మకస్తుడయ్యారు. ఇది దిండుగల్ శ్రీనివాసన్ మద్దతుదారుల్ని కలవరంలో పడేసింది. నత్తం రూపంలో శ్రీనివాసన్‌కు చిక్కులు తప్పవన్న ఆందోళన బయలుదేరింది. ఈ పరిస్థితుల్లో రెండు శిబిరాల వివాదం కాస్త సీఎం ఎవరో చర్చను మరోమారు తెరపైకి తెచ్చింది. 2021 ఎన్నికల్లో గెలుపుతో సీఎంగా పన్నీరు, డిప్యూటీ సీఎంగా పళని వ్యవహరించడం ఖాయం అంటూ వెలిసిన ఈ పోస్టర్లు దిండుగల్ రాజకీయ గ్రూప్ వార్‌ను తెర పైకి తెచ్చింది. -
‘ఆ పోస్టర్లు మా పని కాదు’
పట్నా : కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ర్యాలీకి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీని మహిషాసురుడిగా, రాహుల్‌ను శివుడిగా వర్ణిస్తూ వెలిసిన పోస్టర్లపై కాంగ్రెస్ పార్టీ ప్రతిస్పందించింది. ఈ పోస్టర్లను కాంగ్రెస్ మద్దతుదారులే ఏర్పాటు చేశారని బీజేపీ చేసిన ఆరోపణలను తోసిపుచ్చింది. రాహుల్‌ను రాముడిగా, ప్రియాంక గాంధీని దుర్గామాతగా అభివర్ణించే మరికొన్ని పోస్టర్లనూ ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లపై స్ధానిక నివాసి ఫిర్యాదు మేరకు సివిల్ కోర్టులో కేసు నమోదు చేశారు. రాహుల్, బిహార్ కాంగ్రెస్ చీఫ్ మదన్ మోహన్ ఝాపై హిందువుల మనోభావాలను గాయపరిచారంటూ ఫిర్యాదు చేశారు. కాగా బీజేపీ నేతల ఆరోపణలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ఈ పోస్టర్లను కాంగ్రెస్ ఏర్పాటు చేయలేదని, ఎవరో రూపొందించిన పోస్టర్లపై తమను నిందించడం తగదని మదన్ మోహన్ ఝా వివరణ ఇచ్చారు. పార్టీ నేతలెవరైనా ఈ పోస్టర్ల ఏర్పాటు వెనుక ఉన్నట్టు తమ విచారణలో వెల్లడైతే వారిపై కఠిన చర్యలు చేపడతామని పార్టీ ఎమ్మెల్సీ ప్రేమ్ చంద్ర మిశ్రా వెల్లడించారు. -
ఆ వర్సిటీ తాలిబన్‌కు వత్తాసు..
లక్నో : యూపీ బీజేపీ ఎంపీ సతీష్ కుమార్ గౌతమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) తాలిబన్ సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటోందని దుయ్యబట్టారు. ఏఎంయూ క్యాంపస్‌లో జమ్ము కశ్మీర్ లేని భారత మ్యాప్‌ను చూపుతున్న పోస్టర్లు దర్శనమిచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఏఎంయూ వైస్ చాన్సలర్‌కు ఈ మేరకు అలీగఢ్ ఎంపీ గౌతమ్ లేఖ రాశారు. భారత మ్యాప్‌లో జమ్ము కశ్మీర్, ఈశాన్య భారత్‌లో కొంత ప్రాంతం లేకుండా పోస్టర్లను వర్సిటీ క్యాంపస్‌లో ప్రదర్శించారని మీడియా ద్వారా తన దృష్టికి వచ్చిందని లేఖలో ఎంపీ పేర్కొన్నారు. ఏఎంయూలో దేశ వ్యతిరేక శక్తులు ఇటీవల పేట్రేగిపోతున్నాయన్నది వెల్లడవుతోందన్నారు. హతమైన హిజ్బుల్ ఉగ్రవాది మనన్ వనీ కోసం వర్సిటీలో ప్రార్థన సమావేశాలు జరిగినప్పుడే కఠిన చర్యలు చేపడితే ఇలాంటి చర్యలు జరిగిఉండేవి కావన్నారు. కాగా దేశ విభజనకు వ్యతిరేకంగా క్యాంపస్‌లో నిర్వహించ తలపెట్టిన డ్రామా కోసమే ఈ పోస్టర్లను డ్రామా సొసైటీ రూపొందించిందని ఏఎంయూ అధికారులు వివరణ ఇచ్చారు. -
పోస్టర్ల చింపివేత నిలిపివేయాలి : విమలక్క
సాక్షి, హైదరాబాద్ : అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు చెందిన బహుజన బతుకమ్మ పోస్టర్లు చించివేయడంపై విమలక్క ఫైర్ అయ్యారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ ఉద్యమంలో ముందుండి తెలంగాణను సాధించిందని, ప్రతి సంవత్సరం బహుజన బతుకమ్మను జరుపుతామని తెలిపారు. దీనిలో భాగంగానే ఈ సంవత్సరం కూడా కష్టపడి పోస్టర్లను ప్రింట్ చేయించామని అయితే వాటిని చించివేయడం బాధాకరమని ఈ విషయంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. తాము ఏ పార్టీకి మద్దతునివ్వడం లేదని, ఎన్నికలకు తమ సంస్థ దూరమని, పోస్టర్లు చించివేయడం అన్యాయమని, వెంటనే పోస్టర్ల చించివేతను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. -
అమిత్ షా ర్యాలీ.. బెంగాల్లో ఉద్రిక్తత..!
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ యువమోర్చా శనివారం (ఆగస్టు 11) చేపట్టనున్న ర్యాలీలో పాల్గొననున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిశాయి. మరి కొద్ది గంటల్లో షా బెంగాల్ చేరుకోనుండగా ‘బెంగాల్ వ్యతిరేకులు గో బ్యాక్’ అని రాసి ఉన్న పోస్టర్లు రోడ్ల వెంట దర్శనమిస్తున్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన అస్సాం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) తుది ముసాయిదాపై మమత ఎక్కువగా స్పందించడంతో బీజేపీ టీఎంసీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగాల్లో మమత ప్రాబల్యం తగ్గించే వ్యూహంలో భాగంగానే అమిత్ షా ఈ ర్యాలీ ఉపయోగించుకోనున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఈ ర్యాలీ దోహదపడుతుందని అమిత్ షా భావిస్తున్నట్టు తెలిసింది. తొలుత ఈ ర్యాలీకి అనుమతినివ్వబోమని బెంగాల్ ప్రభుత్వం ప్రకటించగా.. దమ్ముంటే అరెస్టు చేసుకోండని అమిత్ షా స్పందించిన విషయం తెలిసిందే. అయితే, ర్యాలీకి బెంగాల్ బీజేపీ అనుమతి కోరడంతో పోలీసులు అనుమతినిచ్చారు. కాగా, ఎన్నార్సీ నివేదిక ఇప్పటికే ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు రేపగా.. ర్యాలీతో మరింత వేడి రాజుకోనుంది. -
చిరు పోస్టర్లపై నల్లరంగు పూసిన టిడిపి కార్యకర్తలు
నెల్లూరు: నగరంలో పోస్టర్ల వివాదం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి చిరంజీవి ఉన్న పోస్టర్లపై టిడిపి కార్యకర్తలు నల్లరంగు పూశారు. నెల్లూరు నగర శాసన సభ్యుడు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి టిడిపిలో చేరనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్కృష్ణా రెడ్డి, బండారు సత్యానందరావులు ఆ పార్టీకి రాజీనామ చేసిన విషయం తెలిసిందే. వారిలో శ్రీధర్ కృష్ణారెడ్డి టిడిపిలో చేరుతున్న సందర్భంగా పోస్టర్లు వేయించారు. ఆ పోస్టర్లే వివాదానికి దారితీశాయి. ఆయన వేయించిన పోస్టర్లలో చిరంజీవి ఫొటో ఉంది. ఆయన ఇక్కడ నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున గెలుపొందారు. ఆ అభిమానంతో ఆయన చిరంజీవి ఫొటో పోస్టర్లో వేయించినట్లున్నారు. అది టిడిపి కార్యకర్తలకు గిట్టలేదు. వారు అభ్యంతరం చెప్పారు. అంతేకాకుండా ఆ పోస్టర్లపై నల్లరంగు పూశారు.