potaraju
-
ఇక్కడ సిట్టింగ్‌లు మాజీలే..!
వన్‌టౌన్(విజయవాడ పశ్చిమ): ప్రతిసారి కొత్త అభ్యర్థిని ఎన్నుకోవడం పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల ప్రత్యేకత. ఇక్కడ ఒకసారి గెలిచిన వారికి మరుసతి ఎన్నికల్లో టికెట్ రాకపోవటమో, గెలవకపోవడమో జరుగుతుంది. ఆ సెంటిమెంట్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పశ్చిమ నియోజకవర్గంలో 1953 నుంచి వరుసగా జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి తన తదుపరి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓడిపోతూ వచ్చారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు మంత్రులుగా కూడా చేశారు. వారు కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికై అదే హోదాలో ఎన్నికలకు వెళితే ఓటమి కావాల్సిందే. ఈ అంశాలను నియోజకవర్గ చరిత్ర పరిశీలిస్తే తెలుస్తుంది. పశ్చిమ నియోజకవర్గంలో 1953లో తొలిసారిగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగాయి. అందులో తొలిసారిగా తమ్మిన పోతరాజు ఎన్నికయ్యారు. ఆ తరువాత 1957లో పోతరాజుపై సీనియర్ కాంగ్రెస్ నేత, స్వాతంత్య్ర సమరయోధుడు మరుపిళ్ల చిట్టి ఎన్నికయ్యారు. ఆ తరువాత మరుపిళ్ల చిట్టిపై 1962 ఎన్నికల్లో పోతరాజు ఎన్నికయ్యారు. ఆయనపై మళ్లీ 1967 ఎన్నికల్లో మరుపిళ్ల చిట్టి ఎన్నికయ్యారు. ఇలా ఆసిఫ్‌పాషా (1972), పోతిన చిన్నా (1978), బీఎస్ జయరాజు (1983), ఉప్పలపాటి రామచంద్రరాజు (1985), ఎంకే బేగ్ (1989), కె.సుబ్బరాజు (1994), జలీల్‌ఖాన్ (1999), షేక్ నాసర్‌వలీ (2004), వెలంపల్లి శ్రీనివాసరావు (2009), జలీల్‌ఖాన్ (2014) ఎన్నికయ్యారు. వీరిలో చాలా మంది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా వరుసగా గెలిచిన చరిత్రలో లేదు. రెండు సార్లు ఎన్నికైన ప్రతి ఎమ్మెల్యే తప్పనిసరిగా ఈ నియోజకవర్గం లో ఓటమి పాలైన చరిత్ర కొనసాగుతూనే ఉంది. ఒకే పార్టీ వరుసగా గెలిచినా.. అభ్యర్థులు వేరు పశ్చిమ నియోజకవర్గంలో వరుసగా ఒకే పార్టీ మూడు సార్లు గెలిచిన చరిత్ర ఉంది. అయితే మూడు సార్లు ముగ్గురు వేరువేరు అభ్యర్థులు నిలబడటంతో అక్కడ ఆ విజయం సాధ్యమైందని సీనియర్ నాయకులు చెబుతుంటారు. 1967 కాంగ్రెస్ పార్టీ నుంచి మరుపిళ్ల చిట్టి ఎన్నికయ్యారు. ఆ తరువాత 1972 ఎన్నికల్లో అదే పార్టీ నుంచి ఆసిఫ్‌పాషా ఎన్నికయ్యారు. మూడో సారి అదే పార్టీ నుంచి 1978 ఎన్నికల్లో పోతిన చిన్నా ఎన్నికయ్యారు. ఒకే పార్టీ మూడు సార్లు గెలిచినా చరిత్ర ఈ నియోజకవర్గంలో అదే ఆఖరు. ఆ తరువాత ఒకే అభ్యర్థే కాకుండా పార్టీ కూడా వరుసగా రెండు సార్లు గెలిచిన దాఖలాలు లేవు. -
పోచమ్మ బోనాల సందడి
-
బోనాల పండగ ఏర్పాట్లకు లక్షల్లో ఖర్చు
బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు గ్రామీణ యువత పోటీపడుతోంది. బోనాల పండుగ పురస్కారించుకుని అమ్మవారికి తొట్టెలను సమర్పించే కార్యక్రమాన్ని ధూంధాంగా నిర్వహించేందుకు తూప్రాన్ యువజన సంఘాల వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తొట్టెల ఏర్పాట్లు, పోతరాజులు, బ్యాండు, న్యత్య కళాకారులు, వివిధ ఆకృతులతో కూడిన దేవతామూర్తుల విగ్రహాల ప్రదర్శనకు ముందస్తుగానే అడ్వాన్సులు చెల్లిస్తున్నారు. ఇందుకుగాను రూ. లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. బ్యాండు కోసం రూ.60 వేలు, పోతరాజులు, శివసత్తుల కోసం ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి 15 వేలు, నృత్యకారులకు రూ.1,500 చొప్పున దేవతామూర్తుల విగ్రహల ప్రదర్శన కోసం విగ్రహానికి ఉన్న డిమాండ్‌ను బట్టి రూ.20 వేల నుంచి రూ.35 వేల వరకు పలుకుతోంది. జిల్లాలోనే తూప్రాన్ మండల కేంద్రంలో జరిపే బోనాల పండుగ కు మంచి పేరుంది. ఆరేళ్ల క్రితం డీజే సౌండ్ సిస్టంతోపాటు మహిళా డ్యాన్సర్లను రప్పించారు. అయితే, పోలీసులు అభ్యంతరం చెప్పటంతో బ్యాండు మేళాల వైపు మళ్లారు. అప్పటి నుంచి ఏటా వివిధ హంగులతో అమ్మవారికి తొట్టెలను సమర్పిస్తున్నారు. పట్టణంలో ప్రతి ఏటా 15 సంఘాల వరకు ఉత్సవాల నిర్వహణలో పాల్గొనేవారు. అయితే హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలు ముగిసిన అనంతరమే ఇక్కడ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. కాని, ఈ ఏడు సికింద్రాబాద్ బోనాల ఉత్సవాల రోజునే తూప్రాన్‌లో ఈ నెల 31న నిర్వహించేందుకు గ్రామస్తులు నిర్ణయించారు. అయితే, ఒకే రోజున సికింద్రాబాద్, తూప్రాన్‌లో నిర్వహిస్తుండంతో బ్యాండుమేళాలు, నృత్యకళాకారులకు డిమాండ్ పెరిగిపోయింది. గతంలో కంటే రెండింతలు ఎక్కవ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని యువజన సంఘాల వారు వాపోతున్నారు. ఏది ఏమైనా బోనాల పండుగ ఘనంగా నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
జజ్జనకరి జనాలే..బోనాలు భళారే
ఆలయాలకు పోటెత్తిన భక్తజనం భారీగా బోనాలు శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు సందడిగా మారిన నగర వీధులు నేడు ఘటాల ఊరేగింపు చార్మినార్/చాంద్రాయణగుట్ట/యాకుత్‌పురా: బోనాల జాతర సందర్భంగా నగరంలోని వీధులన్నీ దద్దరిల్లాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే ఆలయాల వద్ద డీజేల హోరు మొదలైంది. డప్పుచప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు, తొట్టెల ఊరేగింపులతో నగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పాతబస్తీతోపాటు నగరంలోని మిగతా చోట్ల సందడి నెలకొంది. మహంకాళి, మైసమ్మ, ముత్యాలమ్మ అమ్మవార్ల ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయాల వద్ద భక్తులు బారులుతీరారు. లాల్‌దర్వాజా మహంకాళి దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాలను ప్రారంభించారు. ఉప్పుగూడ మహంకాళి దేవాలయంలో దేవాలయ కమిటీ చైర్మన్ శంకరయ్యగౌడ్, గౌలిపురాలోని ఆలయంలో కార్యనిర్వాహక కార్యదర్శి మల్లేశం గౌడ్, సుల్తాన్షాహి జగదాంబ దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ, మీరాలం మండిలో ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య, మేకల బండ నల్లపోచమ్మ దేవాలయంలో అక్కడి కమిటీ చైర్మన్ పొన్న సుదర్శన్, హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయంలో కమిటీ అధ్యక్షులు జి.నిరంజన్, బేలా ముత్యాలమ్మ దేవాలయంలో కమిటీ అధ్యక్షులు పొటేల్ సదానంద్ యాదవ్, హరిబౌలీ బంగారు మైసమ్మ దేవాలయంలో కమిటీ చైర్మన్ ప్రవీణ్కుమార్గౌడ్లు పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు. పురానాపూల్‌లోని గొల్లకిడికి కోట మైసమ్మ అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలతోపాటు బోనాలు సమర్పించారు. కోట మైసమ్మ దేవాలయం కమిటీ నిర్వాహకులు మక్కర యాదవ్, అనిల్ కుమార్ యాదవ్‌ల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు అధికారులతోపాటు ప్రముఖులు పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రధాన దేవాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ అధికారులు అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. జాతర సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అలరించిన పోతరాజుల విన్యాసాలు.. అమ్మవారికి ఊయల (తొట్టెల)ను సమర్పించేందుకు లాల్‌దర్వాజా, మీరాలం మండి, కసరట్ట, దూద్‌బౌలీ, ఛత్రినాక, ఉప్పుగూడ, గౌలిపురా, మేకలబండ, సీఐబీ క్వార్టర్స్, లలితాబాగ్, నరహరినగర్, కందికల్‌గేట్, అరుంధతీ కాలనీ, హరిబౌలి, అలియాబాద్ తదితర ప్రాం తాల్లోని బస్తీ కుల సంఘాల ఆధ్వర్యంలో భారీ తొట్టెల ఊరేగింపులు నిర్వహించారు. పోతరాజుల నృత్యాలను మహిళలు, పురుషులు, పిల్లలు, యువకులు ఆసక్తిగా తిలకించారు. నేడు ఘటాల ఊరేగింపు.. జాతరలో భాగంగా సోమవారం జరిగే అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపునకు ఉత్సవాల నిర్వాహకులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు. లాల్‌దర్వాజా సింహవాహిని మహం కాళి దేవాలయం, మీరాలం మండి, ఉప్పుగూడ మహంకాళి, సుల్తాన్షాహి శీతల్‌మాత, గౌలిపురా నల్లపోచమ్మ, గౌలిపురా మహంకాళి, మురాద్‌మహాల్ మహంకాళి, అక్కన్నమాదన్న మహంకాళి, బేలా ముత్యాలమ్మ, హరిబౌలి బంగారు మైసమ్మ తదితర ప్రధాన దేవాలయాల అమ్మవారి ఘటాలు ఈ ఊరేగింపులో పాల్గొననున్నాయి. సోమవారం నాటి ఘటాల ఊరేగింపు కోసం అదనపు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్టు దక్షిణ మండలం డీసీపీ ఎస్ఎస్ త్రిపాఠి తెలిపారు. నేటి సాయంత్రం 6లోగా.. పాతబస్తీలో అమ్మవారి ఘటాల ఊరేగింపు సోమవారం సాయంత్రం 6 గంటలకు చార్మినార్ దాటేలా దక్షిణ మండలం పోలీసులు కార్యాచర ణ రూపొందించారు. నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి ఉత్సవాల నిర్వాహకులతో ఇప్పటికే సమావేశమై పలు సూచనలు చేశారు. అక్కన్న మాదన్న దేవాలయం ఘటం ఊరేగింపు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5.15 గంటలకు హిమ్మత్‌పురా చౌరస్తాకు, సాయంత్రం 6 గంటలకు చార్మినార్‌కు చేరుకునేలా నిర్వాహకులకు సూచించారు. మీరాలం మండి మహాకాళి ఘటం ఊరేగింపు సాయంత్రం నాలుగు గంటలకు బయలుదేరి 6 గంటలకు చార్మినార్ చేరుకోవాల్సి ఉంటుంది. సాయంత్రం ఇఫ్తార్ విందులు కొనసాగనుండడంతో ఇరువర్గాలకు ఇబ్బందులు కలుగకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. హరిబౌలిలో స్వల్ప ఉద్రిక్తత యాకుత్‌పురా: బోనాల పండుగలో భాగంగా ఆదివారం అక్కన్న మాదన్న దేవాలయానికి బయలు దేరిన పోతరాజుల ఊరేగింపు సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. హరిబౌలి బంగారు మైసమ్మ ఆలయం నుంచి మధ్యాహ్నం బోనాలు సమర్పించేందుకు భక్తులు పోతరాజుల నృత్యాలతో ఊరేగింపుగా బయలుదేరారు. ఈ క్రమంలో నృత్యాలు చేస్తూ యువకులు మరో వర్గం వారిపై పడ్డారు. దీంతో ఇషత్ ్రమహల్ ఫంక్షన్ హాల్ వైపు కొందరు అల్లరి మూకలు రాళ్లు రువ్వగా ఉద్రిక్తతకు దారితీసింది. మహిళలు భయంతో పరుగులు తీశారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై పరిస్థితిని చక్కదిద్దారు. దక్షిణ మండలం డీసీపీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఇతర ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించారు. హరిబౌలి చౌరస్తాతోపాటు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. -
అమ్మవారికి ప్రీతిపాత్రుడు పోతరాజే..
జాతరలో చెర్నాకోలుతో విన్యాసాలు గుమ్మడికాయతో బలిదానం లాల్‌దర్వాజా ఆలయంలో ‘పోసాని’ కుటుంబం రికార్డు అమ్మవారి సేవలో తరిస్తున్న మూడు తరాలు వందేళ్లుగా కొనసాగుతోన్న ఆనవాయితీ ఈసారి కొత్తగా గజ్జె కట్టనున్న పోసాని హేమానంద్ చాంద్రాయణగుట్ట: జాతర అనగానే ప్రధానంగా గుర్తుకువచ్చేది పోతరాజు విన్యాసాలు. ఒంటి నిండాపసుపు, కుంకుమ రుద్దుకొని... చేతిలో చెర్నాకోలు... కళ్లకు కాటుక... నోట్లో నిమ్మకాయలతో నృత్యం చేస్తూ వేలాది మంది భక్తజన సందోహం నడుమ పోతరాజు చేసే సందడి అంతా ఇంతా కాదు. గజ్జెకట్టి పోతరాజు వేసే ఒక్కో అడుగుకు ఎంతో ప్రాధాన్యముంటుంది. అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయంలో అతను చేసే నృత్యాలు, హావభావాలు, కొరడా ఝుళిపించడం తదితర విన్యాసాలు అందరిని అలరిస్తాయి. లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి దేవాలయ జాతరలో ఇలాంటి ప్రధానమైన తంతును లాల్‌దర్వాజా మేకలబండకు చెందిన ‘పోసాని’ కుటుంబం నిర్వహిస్తోంది. దాదాపు వందేళ్లుగా జాతర సమయంలో అమ్మవారికి సేవలందిస్తున్నారు. పోసాని కుటుంబానికి వందేళ్ల చరిత్ర.. లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి అమ్మవారి ఆలయం తరఫున నిజాం కాలం నుంచి పోతరాజు వేషధారణలో పోసాని కుటుంబం వందేళ్ల చరిత్రను సొంతం చేసుకుంది. 1908వ సంవత్సరంలో ఆలయంలో బోనాలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత కాలంలో ఈ కుటుంబ సభ్యులు పోతరాజు వేషధారణలో సేవలందించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే వంశానికి చెందిన మూడో తరానికి చెందిన వారు ఆ ఆనవాయితీని కొనసాగించడం విశేషం. పోసాని బాబయ్య ఎలియాస్ సింగారం బాబయ్యతో పోతరాజు వేషధారణ ప్రారంభమైంది. బాబయ్య తమ్ముడు ఎట్టయ్య, బాబయ్య కుమారుడు లింగమయ్య, లింగమయ్య తమ్ముడు సత్తయ్య, లింగమయ్య కుమారుడు బాబూరావు, బాబూరావు సోదరుడు సుధాకర్ ఇలా ఇప్పటివరకు ఆరుగురు ఒకే వంశం నుంచి సేవలందించారు. ఈ సారి బోనాల ఉత్సవాల సందర్భంగా బాబూరావు తమ్ముడు పోసాని హేమానంద్ తొలిసారిగా పోతరాజు సేవలందించేందుకు ముందుకు వస్తున్నారు. దున్నపోతు నుంచి గుమ్మడికాయ వరకు.. అప్పట్లో మేకల బండనుంచి దున్నపోతుపై ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వచ్చేవారు. ఆ దున్నపోతును పన్నుతో అదిమి పట్టి అమ్మవారికి బలిచ్చేవారు. తరువాత రోజుల్లో మేకను బలిచ్చారు. జంతు బలిని నిషేధించడంతో గుమ్మడికాయతో పోతరాజు శాంతిస్తున్నాడు. పోతరాజంటే.. పోతరాజంటే ఏడుగురు అక్కల ముద్దుల తమ్ముడు. అమ్మవారిని పొలిమెర నుంచి గ్రామంలోని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు, అనంతరం సాగనంపేటప్పుడు రక్షణగా ముందు నడుస్తూ ఉంటారు. డప్పుచప్పుళ్లకనుగుణంగా ఆనందంతో నృత్యం చేస్తూ స్వాగతిస్తుంటారు. ఏడుగురు అక్కాచెల్లెల్లైన అమ్మవార్లకు ఈ పోతరాజంటే అమితానందం. ఆయన సూచించిన రహదారిలో నడుస్తూ దేవాలయానికి తరలి వస్తారు. ఆయన గావుతో శాంతించి పొలిమెర దాటుతారు. దీక్షతో... పోతరాజు వేషధారణ అంటే నియమంతో కూ డుకున్నది. ఘటాలను దేవాలయంలో ప్రతిష్ఠిం చిన నాటి నుంచి దీక్షతో ఉంటూ అమ్మవారిని పూజిస్తారు. పోతరాజుగా నృత్యం చేసేవారు ముందురోజు నుంచే ఉపవాస దీక్షలో ఉం టారు. శాంతి అయ్యే వరకు మత్తు పదార్థాలను, ఆహారాన్ని తీసుకునేందుకు వీలు లేదు. కేవలం అమ్మవారి ధ్యానంలోనే గడుపుతారు. కొరడా దెబ్బల కోసం... పోతరాజు కొరడా దెబ్బల కోసం భక్తులు పోటీపడతారు. కొరడా దెబ్బలను తింటే దుష్ట శక్తులు ఆవహించవని ప్రతీతి. దీంతో భక్తులు కొరడా దెబ్బలు తినేందుకు పోటీ పడుతుంటారు. అమ్మ ఆశీర్వాదంతోనే 30 ఏళ్లపాటు.. లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతోనే నేను 30 ఏళ్లపాటు పోతరాజుగా అలరించాను. ఘట స్థాపన నుంచి ఊరేగింపు వరకు ఎంతో నిష్టతో ఉండేవాడిని. ముఖ్యంగా వేషధారణ చేసే సోమవారం రోజున ఉపవాస దీక్ష పాటిస్తాం. అమ్మ దయతోనే ఇప్పటివరకు నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నా. దశాబ్దాలుగా పోతరాజుగా వ్యవహరించడంతో నా ఇంటిపేరు పోతరాజుగా మారింది. - పోతరాజు (పోసాని) బాబూరావు అదృష్టంగా భావిస్తున్నా.. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో వారిని పోతరాజు వేషధారణలో చూస్తున్నా. ఈ సారి నేను తొలిసారిగా పోతరాజుగా వేషం కట్టనున్నాను. మొదటిసారి అయినప్పటికీ నాకెలాంటి భయం లేదు. ఘట స్థాపన రోజు నుంచి నియమ నిష్టలతో ఉంటూ అమ్మవారి ధ్యానంలో నిమగ్నమయ్యా. అమ్మవారి కరుణతోనే ఈ సారి పోతరాజు విన్యాసాలు చేసే అవకాశం రానుంది. - పోసాని హేమానంద్ -
తల్లీ బెలైల్లినాదో..
తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా బోనాలు గోల్కొండలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లతో, బోనాలనెత్తుకున్న మహిళలతో తెలంగాణ ప్రజల సంసృ్కతి సంప్రదాయాలకు అద్దం పట్టెలా అంగరంగ వైభవంగా వేడుకలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలో కొలువుదీరిన శ్రీజగదాంబిక అమ్మవారికి మంత్రి నాయిని నర్సింహారెడ్డి అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ నృత్యాలు, పోతరాజుల విన్యాసాలతో కోట పరిసరాలలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారికి సమర్పించడానికి ఊరేగింపుగా తెచ్చిన తొట్టెలకు జనం తండోప దండాలుగా వచ్చి మొక్కారు. కోటలో శివసత్తుల పూనకాలు చూడడానికి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యువకులు డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ కోటపైకి ఎక్కారు. అంతేకాకుండా 23 కుల వృత్తుల వారు అమ్మవారికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో తమ వంతు సహాయాన్ని అందించారు. తెలంగాణలో ప్రారంభమయ్యే మొట్టమొదటి బోనాల ఉత్సవం ఇక్కడే ప్రారంభమై 9 పూజల అనంతరం ఇక్కడే ముగుస్తుంది.