pots
-
Summer Season: మట్టికుండ.. సల్లగుండ!
రాను రాను.. ఎండకాలం చాలా ముదురుతోంది. వేసవిలో పడే తిప్పలు అంతింతా కాదు. చెప్పడానికి కూడా మాటలురాని విధంగా ఓ వైపు దాహం దారుణంగా వెంటాడుతూంటుంది. ఇలాంటి దాహానికి చల్లని నీళ్లు తప్ప మరేది తాగిన ఉపశమనం లభించదనే విధంగా వేసవి విజృంభిస్తుంది. కానీ నీళ్లు మరీ చల్లగా ఉన్నా ఇబ్బందే.. చల్లగా లేకున్నా ఇబ్బందే. ఇప్పుడు కొనసాగుతున్న కాలానికి చాలా ఇళ్లల్లో ఫ్రిడ్జ్ సదూపాయాలు కలవు. మరీ చల్లటి నీరు, అందులో.. ఫ్రిడ్జ్‌లోని మెనస్ డగ్రీల వద్ద చల్లబడ్డ నీళ్లను తాగినా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని.., అందుకు బదులుగా కుండలో నిల్వచేయబడ్డ నీళ్లు ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతాయని నిపుణుల సూచనలు. ఇందుకు అనుగుణంగానే వేసవి కారణంగా మార్కెట్లలో మట్టికుండ విక్రయాలు భారీగా పెరిగాయి. వేసవిలో మట్టి కుండ చల్లని నీరందిస్తూ దాహార్తి తీరుస్తుంది. కాలక్రమంలో దీని వినియోగం నామోషీగా మారి, ఫ్రిడ్జ్ రాజ్యమేలుతున్నా.. మట్టి కుండ మాత్రం తన ఉనికి కోల్పోలేదు. ఆరోగ్యానికి ఉపయోగమని భావిస్తున్న చాలామంది వినియోగిస్తున్నారు. ఏటా వేసవిలో కుండలు ఆరోగ్య విషయంలో తమవంతు ప్రాధాన్యతను చాటుకుంటున్నాయి. ట్యాబ్‌లతో కూడిన రాజస్థాన్ కుండలు, మట్టి వాటర్ బాటిల్స్, కూజాలు, రంజన్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువవుతుండడంతో వాటి వ్యాపార స్థాయి కూడా పెరిగింది. ఈవిషయంలో కుండల తయారీదారులు సరికొత్త డిజైన్లు సృష్టిస్తుంటే.., అమ్మకందారులు మార్కెట్లలో అమ్మడానికి సిద్ధమవుతున్నారు. ఇవి చదవండి: సమ్మర్లో ఈ రైస్ తింటే..లాభాలే..లాభాలు! -
డిప్రెషన్ నుంచి బయటపడేందుకు కుమ్మరిగా మారిన సివిల్ ఇంజనీర్
ఏదైనా సమస్య ఎదురైతే చాలామంది దాని నుంచి దూరంగా పారిపోవడానికి చూస్తారు. కొంతమంది మాత్రం సమస్యను అధిగమించేందుకు రకరకాల మార్గాలు వెదుకుతారు. అలా వెతికిన వారికి .. పరిష్కారం తప్పకుండా దొరుకుతుందని చెబుతోంది సైమాషఫీ. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సైమా చేసిన ప్రయత్నం నేడు మరికొంతమందికి ఉపాధి కల్పించడంతోపాటు, కనుమరుగైపోతున్న కళకు జీవం పోస్తోంది. కశ్మీర్‌కు చెందిన 33 ఏళ్ల సైమాషఫీ జమ్ము అండ్ కశ్మీర్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో సివిల్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఎందుకో తనకి తెలియకుండానే మనసులో నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. వాటి నుంచి ఎలాగైనా బయట పడాలని రకరకాలుగా ప్రయత్నించేది. ఒకరోజు చైనా తత్త్వవేత్త చెప్పిన ‘‘మట్టిని పాత్రగా మలిచినప్పటికీ, మనం ఏం కోరుకుంటామో దానితోనే ఆ పాత్రలోని శూన్యం నిండుతుంది’’ అన్న కొటేషన్ గుర్తుకొచ్చింది. దీంతో తన డిప్రెషన్‌ను కుండలో నింపాలని నిర్ణయించుకుంది సైమా. చిన్నప్పటి నుంచి మట్టి అంటే సైమాకు ఇష్టం. డిప్రెషన్ నుంచి బయటపడేందుకు.. మట్టితో కుండలేగాక, బొమ్మలు కూడా తయారు చేయాలని నిర్ణయించుకుంది. అనుకున్న వెంటనే మట్టి కుండల తయారీకి పూనుకుంది. కశ్మీరి వ్యాలీలో కుండల తయారీ శిక్షణ ఇచ్చేవారు లేరు. పైగా కుండల తయారీ, కుండలకు వేసే రంగులకు సైతం అధునాతన పద్ధతులను జోడించాల్సిన అవసరం ఉందని గుర్తించింది. కుండల తయారీ ఒక కళే కాదు సంప్రదాయంలో భాగం. అది అంతరించకూడదు అనుకుని... కుండల తయారీకి ఎలక్ట్రిక్ చక్రం, గ్యాస్ బట్టీ తీసుకురావాలనుకుంది. కానీ కశ్మీర్‌లోయలో అవి ఎక్కడా దొరకలేదు. బెంగళూరులో శిక్షణ కుండల తయారీలో శిక్షణ తీసుకునేందుకు బెంగళూరు వెళ్లింది. అక్కడ కుండల తయారీలో క్రాష్ కోర్సు చేసి వివిధ ఆకారాల్లో కుండలు ఎలా తయారు చేయాలో నేర్చుకోవడంతోపాటు, కశ్మీరీలు వాడే సంప్రదాయ పాత్రల తయారీని సైతం నేర్చుకుని అధునాతన సాంకేతికత జోడించి కుండల తయారీని ప్రారంభించింది. రకరకాల కుండలను తయారు చేసి విక్రయిస్తూనే, మరోపక్క కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న కుండల తయారీ కేంద్రాలను సందర్శించి అనుభవం కలిగిన నిపుణులతో వర్క్‌షాపులు నిర్వహించేది. ఇలా కుండల తయారీలో సరికొత్త పద్ధతుల గురించి అవగాహన కల్పిస్తోంది. వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ కశ్మీరి కుండలను ఎలా పరిరక్షించుకోవాలో చెబుతోంది. తన కుండల తయారీ జర్నీ గురించి వివరిస్తూ... అందరిలో స్ఫూర్తి నింపుతోంది. ప్రభుత్వ సహకారంతో.. కశ్మీరీ సనాతన కుండల తయారీని కాపాడుతోన్న విషయం అక్కడి ప్రభుత్వానికి తెలియడంతో స్టేట్ హ్యాండీ క్రాఫ్ట్స్ విభాగం సైమాతో.. తన అనుభవాలను ఇతర కళాకారులకు చెబుతూ సలహాలు సూచనలు ఇప్పిస్తోంది. దీంతో కుండల పునరుద్ధరణకు మంచి స్పందన లభిస్తోంది. అంతేగాక నైపుణ్యం గల కళాకారుల డేటాను హస్తకళల శాఖాధికారులు సేకరిస్తున్నారు. సైమా గురించి తెలిసిన చాలామంది యువతీయువకులు కుండల తయారీ మొదలు పెట్టి ఉపాధి పొందుతున్నారు. -
ఎండల నుంచి ఉపశమనానికి కుండనీరు శ్రేష్టమంటున్న జనాలు
-
మట్టి కుండలకు కాలం చెల్లిందా ? ఆవేదనలో కుమ్మరులు
-
చల్ల‘కుండ’.. ఆదివాసీల స్పెషల్..
చింతూరు(అల్లూరి సీతారామరాజు జిల్లా): ఇటీవల ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు గ్రామాల్లో నిర్వహించే వారపు సంతల్లో ఛత్తీస్‌గఢ్‌లో తయారైన చలువ కుండల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ డిజైన్లలో ఎర్రగా కనిపించే ఈ కుండలు మార్కెట్లో కనువిందు చేస్తున్నాయి. ప్రత్యేకమైన మట్టితో తయారయ్యే ఈ కుండల్లో పోసిన నీరు ఫ్రిజ్‌లో పెట్టిన మాదిరిగా ఉండడంతో వీటి కొనుగోళ్లుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. మందంగా వుండే ఈ కుండలు ఎంతోకాలం మన్నడంతో పాటు నీటికి, వంటకు బాగా ఉపయోగ పడతాయని, అందుకే అధికశాతం వీటినే కొనుగోలు చేస్తామని వారు తెలిపారు. రూ.50 నుంచి రూ.700 వరకు ధర కలిగిన కుండలతో పాటు వివిధ రకాల బొమ్మలను కూడా సంతల్లో విక్రయిస్తున్నారు. చదవండి👉: అర్ధ శతాబ్దపు జ్ఞాపకం ప్రత్యేక మట్టితో తయారీ ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుకనార్‌లో ప్రత్యేకమైన మట్టితో ఈ కుండలను తయారు చేస్తామని తయారీదారుడు దసురాం తెలిపాడు. భూమి పైభాగంలో కేవలం రెండు అంగుళాల మేర లభించే ప్రత్యేకమైన మట్టిని ఈ కుండల తయారీకి వినియోగిస్తామని అతను తెలిపాడు. ఆ మట్టి జిగటగా ఉండడంతో పాటు గట్టిదనం కలిగి ఉంటుందని దీనివలన కుండలు అందంగా కనబడడంతో పాటు చాలాకాలం మన్నుతాయని తెలిపాడు. మట్టితో కుండలు తయారు చేసిన అనంతరం వాటికి ఎర్రరంగు అద్ది మార్కెట్లో విక్రయిస్తామని తెలిపాడు. తమ గ్రామంలో సుమారు వంద కుటుంబాలు కుండలు తయారు చేస్తున్నాయని, వాటిని ఛత్తీస్‌గఢ్‌లోని జగ్దల్పూర్, సుక్మాతో పాటు ఆంధ్రా సరిహద్దుల్లోని సంతలు, తెలంగాణలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం వంటి పట్టణాల్లో విక్రయిస్తామని అతను తెలిపాడు. -
ఇది నారాయణుడి సేవ
వేసవి మండుతోంది. ప్రధాని మొన్న తన ‘మన్ కీ బాత్’లో నారాయణన్ని దేశానికి గుర్తు చేశారు. పక్షులకు గుప్పెడు గింజలు వేయకపోయినా అవి ఎలాగో బతికేస్తాయి. కాని ఈ వేసవిలో నీళ్లు లేకపోతే విలవిలలాడతాయి. సొంత ఖర్చుతో ఇంటింటికి మట్టి పాత్రలు పంచి పిట్టలకు నీరు పెట్టమని కోరిన శ్రీరామ్ నారాయణన్ అంత కాకపోయినా కొంతైనా మనం చేయొచ్చు. నరుడి సేవ నారాయణుడి సేవ. అలాగే పక్షులకు నీటి సేవ కూడా. ఈ వేసవిలో ఆత్మసంతృప్తినిచ్చే ఈ పని చేద్దామా? మనుషులు వేసవి వస్తే తమ కోసం చలివేంద్రాలు పెట్టుకుంటారు. చల్లటి నీటి కుండల దగ్గర ఆగి కోరినంత నీళ్లు తాగుతారు. వీలైన వాళ్లు తమ వెంట ఎప్పుడూ నీళ్ల బాటిల్ పెట్టుకుంటారు. మరి జంతువులు, పక్షులు ఏం చేయాలి? వేసవి వస్తే అడవుల్లో కుంటలు ఎండిపోతాయి. వాగులు వంకలు మాడిపోతాయి. ఊళ్లల్లో, రోడ్ల మీద ఎక్కడా నీటి చుక్క కనిపించదు. అడవుల్లోని జంతువుల కోసం అటవీ శాఖ ట్యాంకర్లతో నీళ్లు నింపుతుంది. కాని మనిషితో కలిసి సహజీవనం చేసే పట్టణ విహంగాలు... కాకులు, పావురాలు, పిచ్చుకలు, గోరువంకలు, గువ్వలు... ఇంకా లెక్కలేనన్ని పిట్టలు దప్పిక తీర్చుకోవాలి కదా. వాటి దాహం సంగతి? పాతకాలానికి ఇప్పటి కాలానికి తేడా పాత కాలంలో బావులు ఆరుబయట ఉండేవి. వాటి పక్కనే నీటి తొట్టెలు నింపి ఉండేవి. లేదా ఇంటి పనులన్నీ పెరళ్లల్లో సాగేవి. అందుకోసమని వాడుకునేందుకు నీళ్లు కుండల్లోనో గంగాళాల్లోనో ఉండేవి లేదా పశువులున్న ఇళ్లలో కుడితి తొట్టెలు కాకుండా వేసవిలో ఒక తొట్టెనిండా నీళ్లు నింపి ఉండేవి. కాని ఇప్పుడు పల్లెల్లో తప్ప ఈ కార్యకలాపాలన్నీ టౌన్లలో నగరాల్లో నాలుగు గోడల లోపలికి మారాయి. మట్టి, నీళ్ల తడి కనిపించే పెరళ్లు లేవు. ఇక నగరాల్లో అయితే బాల్కనీల్లోని వాష్ ఏరియా దగ్గరకు కూడా రాకుండా తెరలు కట్టిన గ్రిల్స్ ఉంటాయి. మరి ఎండకు పక్షులు నీళ్లు ఎలా తాగాలి? అడుగున నీళ్లున్న కుండ అంచుపై వాలి రాళ్లు జార విడిచి నీళ్లు పైకి రాగా తెలివిగా తాగి వెళ్లిన కథలోని కాకి ఇప్పుడు ఎక్కడకు వెళ్లాలి? నారాయణన్ ఏం చేశాడు? కేరళ ఎర్నాకుళం జిల్లాలో కలంశెర్రి ఊరికి దగ్గరగా ఉండే మూపతాడంలో ఉండే శ్రీరామ్ నారాయణన్‌కు పదేళ్ల క్రితం ఈ సందేహం వచ్చింది. వేసవిలో అల్లాడుతున్న పక్షులకు నీళ్లు ఎవరు ఇవ్వాలి? ఎవరో ఎందుకు నేనే ఇవ్వాలి అనుకున్నాడు. వెంటనే సొంత డబ్బుతో మట్టి పాత్రలు తయారు చేసి ఇంటింటికి పంచసాగాడు. ‘ఇవి మీ ఇంటి బయట పెట్టి నీళ్లు నింపండి. పక్షులు తాగుతాయి’ అని అభ్యర్థించాడు. సాధారణంగా మనుషులు మంచివాళ్లే. ఎవరైనా మంచి మాట చెప్తే చేయడానికి వెనుకాడరు. నారాయణన్ ఐడియా అందరికీ నచ్చింది. అతనిచ్చిన మట్టి పాత్రల్లో నీళ్లు నింపి బాల్కనీ గోడల మీద, బయటి గోడల మీద, టెర్రస్ల మీద పెట్టసాగారు. పిట్టలు వాలి వాటిలో తమ ముక్కుల్ని ముంచి తాగడం సంతోషంతో చూశారు. నీళ్లు ఉన్న చోట పిట్టలు నిస్సంకోచంగా వాలి మీటింగ్ పెట్టుకునేవి. కొన్ని జలకాలాడేవి. ఈ మనోహర దృశ్యాలన్నీ నారాయణన్ పెట్టిన భిక్షే. ఇప్పటికి దాదాపు లక్ష పాత్రలు తొమ్మిదేళ్లుగా ఈ మట్టి పాత్రలు పంచుతున్న నారాయణన్ గాంధీజీని ఆదర్శంగా తీసుకుని ఈ పని చేస్తున్నాడు. తన ఊరిలో ఎప్పటి నుంచో ఆయన తన సొంత ఖర్చులతో గాంధీజీ ఆత్మకథ ‘సత్యశోధన’ పంచుతూ ఉన్నాడు. అతను రచయిత కూడా. పిల్లల కోసం కవితలు రాశాడు. అతడున్న ప్రాంతంలో పారిశ్రామిక కేంద్రాలున్నాయి. దాంతో అక్కడ ప్రవహించే పెరియార్ నది కాలుష్యం అవుతూ ఉంటుంది. ఆ కాలుష్యానికి వ్యతిరేకంగా పుస్తకం రాశాడు. అదే దారిలో పక్షులకు నీళ్లు పెట్టే పాత్రల పంపిణీ మొదలెట్టాడు. ఇప్పటికి పది లక్షల సొంత డబ్బు ఇందుకు ఖర్చు పెట్టాడు. నారాయణన్‌కు హోల్‌సేల్ లాటరీ ఏజెన్సీ ఉంది. ఊళ్లో చిన్న హోటల్ ఉంది. వాటి మీద వచ్చే ఆదాయం ఇందుకు ఖర్చు పెడతాడు. ‘నాకు ముగ్గురు కూతుళ్లు. నా భార్య చనిపోతే పెంచి పెద్ద చేసి పెళ్లిళ్లు చేశాను. వాళ్లంతా జీవితాల్లో హ్యాపీగా ఉన్నారు. వర్తమానం ధ్వంసం అవుతుంటే భవిష్యత్తు కోసం డబ్బు దాచుకోవడం నాకు నచ్చలేదు. అందుకే ఇలాంటి పనులకు ఖర్చు పెడుతున్నాను’ అంటాడు. ఈ నారాయణనే సొంత డబ్బుతో మొక్కలు పంచి ప్రతి ఇంట్లో ఒక చెట్టుకు కాసే పండ్లను పక్షులకు వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంటాడు. నారాయణన్ చేస్తున్న పనులు అందరూ చేయదగ్గవే. అందరూ చేయకపోవడం వల్లే చేసిన అతని గురించి ఇలా రాయాల్సి వస్తోంది. పక్షులకు నీళ్లు పెట్టడం వార్త. ఒక మొక్క పెంచడం వార్త అవుతున్నాయి. మనం నివసించే ఈ నేలకు మనకు తోడైన జీవరాశిని కాపాడుకోవడం మన విధి. ఈ వేసవి పక్షులకు చల్లగా గడిచేలా చూద్దాం. శ్రీరామ్ నారాయణన్ పంచిన మట్టిపాత్రలతో కాలనీవాసులు -
పేదోడి ఫ్రిడ్జ్‌కు భలే గిరాకీ!
దిల్సుఖ్నగర్: అప్పుడే వేసవి ఎండలు దంచి కొడుతున్నాయి... రోజు రోజుకూ పెరుగుతున్న వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. మలక్‌పేట, మహేశ్వరం, యాకత్పురా నియోజకవర్గాలలో కొందరు పేదల రిఫ్రిజిరేటర్ అయిన మట్టి కుండల్లోని శ్రేష్ఠమైన చల్లని నీటిని తాగుతూ దాహార్తి తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలో కుండలకు గిరాకీ పెరిగింది.ధనిక, పేద తారతమ్యం లేకుండా అందరూ మట్టి కుండల్లోని నీటిని తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. వినియోగదారులను ఆకర్షించడానికి మార్కెట్లలో రకరకాల డిజైన్లలో కుండలు, కూజాలను అందుబాటులో ఉంచారు. చల్లదనంతో పాటు మంచి డిజైన్లలో అందంగా ఉన్న కుండలను కొనుగోలు చేసేందుకు సామాన్యులతో పాటు ధనవంతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రూ. 60 నుంచి రూ.500 .. సరూర్‌నగర్, దిల్సుఖ్నగర్, సైదాబాద్, మాదన్నపేట ఎన్‌టీఆర్‌నగర్‌తో పాటు ప్రధాన చౌరస్తాల్లో మట్టి కుండలను విక్రయిస్తున్నారు. మార్కెట్లలో రూ. 60 నుంచి రూ.500 వరకు వివిధ ధరల్లో రకరకాల కుండలు మార్కెట్లో లభిస్తున్నాయి. అయితే ధరలు మాత్రం కొంత అధికమనే చెప్పవచ్చు. వేసవి ఎండలు ఒకవైపు కొలిమిలా కాగుతుండగా దాహం తీర్చుకోవడానికి నీరు తాగాలంటే ఈ మాత్రమైనా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. (చదవండి: సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్) -
‘ఖిల్లా’ కుండలకు క్రేజ్ కుమ్మరి
సాక్షి,ఖిల్లాఘనపురం: జిల్లాలోనే ఖిల్లాఘనపురం కుమ్మరులు తయారు చేసే కూజల(నీటి కోసం ప్రత్యేకంగా తయారు చేసే కుండల)కు ఎంతో పేరుంది. ఇక్కడి కుమ్మరులు ఎండాకాలంలో ఈ కూజలు, కుండల తయారీపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. ఎంతో అందంగా చూడముచ్చటగా ఉండే ఈ కుండలంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఏళ్లు గడుస్తున్నా వాటి క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. ఇక్కడి కుండలు మార్కెట్లో ఉంటే మరే ఇతర కుండలు కొనేందుకు ప్రజలు ఇష్టపడరు. తయారీలో ప్రత్యేక నైపుణ్యం ఖిల్లాఘనపురం కుమ్మరులు కుండల తయారీలో ప్రత్యేక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. చెరువుల నుంచి తెచ్చిన మట్టిని ఎండలో ఆరబెట్టి పొడిగా తయారు చేస్తారు. తరువాత నీటితో కలిపి పలుచగా తయారు చేసి వడబోస్తారు. మట్టిలో చిన్నపాటి ఇసుక రేనువులు కూడా ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నీటిశాతం తగ్గే వరకు ఎండలో ఆరబెట్టి రెండు రోజుల తరువాత ముద్దగా తయారు చేస్తారు. తరువాత కొద్ది కొద్దిగా మట్టిని సారి(కుమ్మరి చక్రం)పై వేసుకుని కుండలను అందంగా తయారు చేస్తారు. ఆరిన కుండలను 12గంటల పాటు ఆము(కుమ్మరి పొయ్యి)లో కాల్చడం జరుగుతుందని కుమ్మరులు తెలిపారు. ఒక్క ఆములో 250నుంచి 300 కుండల వరకు కాల్చడం జరుగుతుంది. ఈ కుండలను భార్య భర్తలు ఇద్దరు కలిసి 15 రోజుల్లో తయారు చేయడం జరుగుతుంది. హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాల నుంచి వ్యాపారులు ఒక్కో కుండను ఇంటివద్దకే వచ్చి రూ.50 నుంచి రూ.100లకు కొనుగోలు చేసి తీసుకెళ్తారని పలువురు పేర్కొన్నారు. అక్కడ ఒక్కో కుండను రూ.200 నుంచి రూ.300వరకు విక్రయిస్తారని సమాచారం. కుండల తయారీతో ఉపాధి మండలంలో మొత్తం 80శాలివాహన కుటుంబాలు ఉన్నాయి. వీరు వేసవిలో కూజలు, కుండల తయారీతో ఉపాధి పొందుతారు. కుటుంబ సమేతంగా కష్టపడి కుండలు తయారు చేసి విక్రయించడం జరుగుతుంది. ఖర్చులుపోను ఒక్కో కుటుంబం రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు సంపాదిస్తారు. అయితే, ప్రభుత్వం తమకు ఆర్థికంగా సహకారం అందిస్తే రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు కుండలను సరఫరా చేసి జిల్లాకే పేరు తెస్తామంటున్నారు ఇక్కడి కుమ్మరులు. కనీసం ప్రభుత్వం నుంచి సబ్సిడీపై రుణసౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. వృత్తిపై మక్కువ, తయారీలో నైపుణ్యం ఉన్న ఇలాంటి కుమ్మరులకు సహకారం అందిస్తే ఆర్థికంగా ఎదగడంతో పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు మంచి గుర్తింపు తెస్తారని వివిధ పట్టణాల నుండి ఇక్కడకు కుండలు తీసుకెళ్లేందుకు వచ్చే వ్యాపారులు, ప్రజలు అంటున్నారు. పేదోడి ఫ్రిజ్‌గా పేరు వేసవికాలం వచ్చిందంటే చాలు కొద్దో గొప్పో ఉన్నోళ్లు ఫ్రిజ్‌లు కొనుగోలు చేస్తారు. పేదోళ్లు మాత్రం మట్టితో తయారుచేసిన కొత్త కుండల్లో నీరు ఉంచి తాగేందుకు ఇష్టపడతారు. అందుకే కుండలను పేదవాడి ఫ్రిజ్‌గా పిలుస్తారు. అలాంటి కుండలకు ఉమ్మడి పాలమూరులోనే ఖిల్లాఘనపురం కుండలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ తయారుచేసిన కూజ, కుండలకు హైదరాబాద్‌తోపాటు కర్నూల్, మహబూబ్‌నగర్ తదితర పట్టణాల్లో మంచి గిరాకీ ఉంది. రాష్ట్ర రాజధానిలో రోజువారి కూలీలు, వలసల వచ్చిన కూలీలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడి కుండలను కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. ఉపాధి పొందుతున్నాం ఎండాకాలంలో పట్టణాలకు వలసపోకుండా కులవృత్తి ద్వార ప్రత్యేకమైన కూజలు తయారు చేసి విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాం. కుటుంబ సమేతంగా కష్టపడి రూ.70 నుంచి రూ.లక్ష వరకు సంపాదించడం జరుగుతుంది. – కుమ్మరి శ్రీనివాసులు, ఖిల్లాఘనపురం -
మట్టికుండ.. ఆరోగ్యానికి అండ
సాక్షి, మెదక్ రూరల్: వేసవిలో చల్లటి నీరు తాగేందుకు ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. అందుకు ధనవంతులు రిఫ్రిజిరేటర్లో నీటి తాగితే మధ్య తరగతి ప్రజలు కుండలోని నీటిని తాగుతారు. ఈ వేసవిలోకూడా కుండలను వ్యాపారులు అందుబాటులోకి తెచ్చారు. ఇక మారుతున్న కాలానికి అనుగుణంగా మట్టి కుండలను తయారు చేస్తున్నారు. రిఫ్రిజిరేటర్లు ఎంత సాంకేతికంగా అందుబాటులో ఉన్నా కుండలకు సాటిరావని కొనుగోలు దారుల అభిప్రాయం. మట్టితో తయారు చేసిన రంజన్లు, కుండలకు ఉన్న ప్రాధాన్యత మాత్రం తగ్గటం లేదు. జిల్లాలోని ఆయా పట్టణాలు, మండల కేంద్రాల్లో ప్రధాన రహదారుల వెంట మట్టి కుండలు విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. వేసవి ఆరంభం కావడంతో ప్రజలు చల్లటి నీటిని తాగేందుకు కుండలను, రంజన్లను కొనుగోలు చేస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు తయారుచేసిన రిఫ్రిజిరేటర్లో చల్లటి నీటిని తాగితే ఆనారోగ్య సమస్యలున్నవారికి మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుండటంతో ఆనీటిని తాగేందుకు ఇష్టపడటంలేదు. ఇక మట్టి కుండలో నీరు అన్ని విధాలుగా మంచిదని వైద్యులే చెబుతుండటంతో వీటి ప్రాధాన్యతను గుర్తిస్తున్నారు. ఆదిలాబాద్, కలకత్తా, గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రా నుంచి కుండలు, రంజన్లను తీసుకొచ్చి జిల్లాలో విక్రయిస్తున్నారు. వివిధ సైజుల్లో లభిస్తున్నాయి. ఒక్కో కుండ, «రంజన్ ధర రూ.250 నుండి రూ.800 వరకు పలుకుతు మట్టి వాటర్ బాటిల్స్ వచ్చాయి – మంజుల, వ్యాపారి, మెదక్ మట్టితో తయారు చేసిన కుండలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఎండలు ఎక్కువ కావడంతో ఇప్పుడిప్పుడే అమ్మకాలు పెరిగాయి. వివిద రకాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మట్టితో తయారు చేసిన వాటర్ బాటిల్స్ సైతం మార్కెట్లోకి వచ్చాయి. సైజును బట్టి ధర ఉంటుంది. -
మండే ఎండ.. కుండే అండ
► ఇన్ముల్‌నర్వలో ఊపందుకున్న విక్రయాలు ఇన్ముల్‌నర్వ (కొత్తూరు): పేదోడికి వేసవికాలం వచ్చిందంటే చాలు మట్టికుండలు గుర్తుకొస్తాయి. పేదలతో పాటు వైద్య పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరూ వైద్యులు సూచించిన మేరకు ఫ్రిజ్ కంటే ఎక్కువగా వేసవిలో మట్టి కుండలోని చల్లటి నీటిని తాగేందుకే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఎండలు ముందుగానే తమ ప్రతాపాన్ని చూపడంతో ప్రజలు ఉక్కపోత, దాహంతో అల్లాడుతున్నారు. ముఖ్యంగా వివిధ పనులపై బయటకు వెళ్లిన వారు ఇంటికి చేరుకోగానే ఉక్కపోతల కారణంగా చల్లని నీటిని తాగేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. దీంట్లో భాగంగానే వేసవి దృష్ట్యా మార్కెట్లో ఫ్రిజ్‌ల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో పేదలు కుమ్మరులు తయారు చేసిన కుండలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్రిజ్‌లో చల్లబర్చే నీటి కంటే మట్టి కుండలోని నిల్వ ఉన్న నీటిని తాగితే ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు సైతం పలు సందర్భాల్లో సూచిస్తున్నారు. ధరలు తక్కువగా ఉండడంతో పేదలతో పాటు వ్యాపారులు కూడా ప్రకృతి సహజ సిద్దంగా తయారు చేసిన కుండలను ఎక్కువగా కొనుగోలు ఆసక్తి కనబర్చుతున్నారు. వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి కుమ్మరులు కూడా యంత్రాలకు పోటీగా తమ హస్త నైపుణ్యంతో పలు రూపాల్లో కుండలను తయారు చేస్తున్నారు. కుండల రకాలను, సైజులను బట్టి రూ. 50 నుండి రూ. 200 వరకు విక్రయిస్తున్నారు. ప్రోత్సాహం లేక తగ్గుతోన్న ఆదరణ మండలంలో ఒకప్పుడు ప్రతి గ్రామంలో కుమ్మరులు కుండలు తయారు చేస్తూ తమ కులవృత్తిపై ఆధారపడి జీవిస్తుండేవారు. కాగా మండలంలో వచ్చిన రియల్‌బూమ్, ఇతరత్రా కారణాల వల్ల ప్రస్తుతం ఇన్ముల్‌నర్వ, సిద్ధాపూర్ గ్రామాల్లో మాత్రమే కుండలను తయారు చేస్తున్నారు. ఇన్ముల్‌నర్వ గ్రామంలో తయారు చేసే కుండలను వారు సమీపంలో జేపీ దర్గా ఆవరణలో విక్రయిస్తుంటారు.ఇక్కడ స్థానికులే కాకుండా హైదరాబాద్‌తో పాటు పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఎంతో ఇష్టంగా మట్టికుండలను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. దీంతో పలువురికి కుండల తయారీ ద్వారా ఉపాధి లభిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలగర్భంలో కలిసిపోతున్న కులవృత్తులకు తగిన ప్రోత్సాహం అందించాలని కుమ్మరులు కోరుతున్నారు. -
పూలకుండీల్లో గంజాయి సాగు..
-
పూలకుండీల్లో గంజాయి సాగు..
హైదరాబాద్: గంజాయిని పొలాల్లో సాగు చేస్తే అధికారులు పసిగడతారని ఓ వ్యక్తి కొత్త ఉపాయం కనిపెట్టాడు. తన ఇంట్లోని పూలకుండీల్లోనే సాగు చేసి దొంగచాటుగా విక్రయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గుట్టురట్టు చేశారు. గోల్కొండలోని వైకే రెసిడెన్సీలో ఉండే సయ్యద్ అనే వ్యక్తి తన నివాసంలోనే పెద్దపూలకుండీలను ఏర్పాటు చేసుకుని గంజాయిని సాగు చేస్తున్నాడు. ఆపై దొంగచాటుగా విద్యార్థులకు, ఉద్యోగులకు విక్రయిస్తున్నాడు. గత కొంతకాలంగా ఈ తంతు కొనసాగుతోంది. దీనిపై విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు సోమవారం దాడులు చేసి, సయ్యద్‌ను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి మొక్కలు సహా కుండీలను స్టేషన్‌కు తరలించారు. -
మార్కెట్లో పేదోడి ఫ్రిజ్‌లు
మొదలైన కొనుగోళ్లు నిర్మల్ అర్బన్ : వేసవి కాలం రానే వచ్చింది. చల్లని నీరు అందించే పేదోడి ఫ్రిజ్‌లుగా పేరొందిన రంజన్లు, కుండలు మార్కెట్లోకి రానే వచ్చాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు రంజన్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రజల వినియోగాన్ని దృష్టిలో పెట్టుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో వ్యాపారులు విక్రయకేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదలైన గిరాకీ.. రంజన్లు, కుండలు, కూజాలకు గిరాకీ మొదలైంది. వేసవిలో దాహాన్ని తీర్చుకునేందుకు చల్లని నీటి కోసం వీటి వాడకం తప్పనిసరి. ఫ్రిజ్‌లు లేనివారు, ఫ్రిజ్‌లు విని యోగించలేని వారంతా చల్లని నీటి కోసం మట్టితో త యారు చేసిన రంజన్లు, కుండలనే వాడతారు. చల్లని నీటి కోసం వీటిపైనే ఆధారపడతారు. దీంతో వీటికి సాధారణంగా గిరాకీ ఎక్కువనే చెప్పవచ్చు. రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఆదిలాబాద్ రంజన్లు, కుండలకు ఉన్న విషయం తెలిసిందే. వినియోగదారుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని ఆదిలాబాద్ రంజన్లు, కుండలను వ్యాపారులు అందుబాటులో ఉంచారు. మార్కెట్లో కొత్త కొత్త రకాలైన ఫ్రిజ్‌లు అందుబాటులోకి వచ్చినా.. వీటికి ఏ మాత్రం గిరాకీ తగ్గడం లేదని వ్యాపారులు చెబుతున్నా రు. రంజన్లకు ఫ్రిజ్‌లు పోటీ కాదని వినియోగదారులు చెబుతున్నారు. పేదలతో పాటు మధ్య, ఉన్నత వర్గాల వారు కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్రిజ్ నీరు ఆరోగ్యదాయకం కాదని వైద్యులు పేర్కొనడంతో ఆరోగ్యంతో పాటు చల్లని నీటిని అందించే రంజన్లు, కుండలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. అందుబాటు ధరల్లో.. ఆదిలాబాద్ నుంచి రంజన్లను నిర్మల్ పట్టణానికి తీసుకువచ్చి విక్రయదారులు అమ్మకాలు చేపడుతున్నారు. వినియోగదారులను ద ృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా దు కాణాలు వెలిశాయి. బస్టాండ్, ఎస్బీహెచ్ ముందు, రూరల్ పోలీస్‌స్టేషన్ సమీపంలో ఇతర ప్రాంతాల్లో రంజన్లు, కుండలను విక్రయిస్తున్నారు. వివిధ సైజుల్లో, డిజైన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. రంజన్లు సైజు ను బట్టి రూ.80 నుంచి రూ.120 వరకు, కుండలు రూ. 40 నుంచి రూ.60 వరకు విక్రరుుస్తున్నారు. చల్లని నీరందించే రంజన్లు, కుండల ధరలు మధ్య తరగతి, సామా న్య ప్రజలకూ అందుబాటులో ఉండడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంకా పగటి ఉష్ణోగ్రతలు పెరిగితే గిరాకీ మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
వేలాడే పూదోట
అపార్టుమెంట్లు.. ఇరుకిరుకు ఇళ్లు.. ఆహ్లాదాన్ని పంచే పచ్చందాలకు ఇక చోటెక్కడ! బాల్కనీల్లో కాస్త చోటు దొరుకుతున్నా.. అందులో ఒకటి రెండు కుండీలకు మించి పెట్టలేని పరిస్థితి. దీనికి ప్రత్యామ్నాయంగా వచ్చిందే కొకెడమా స్ట్రింగ్ గార్డెన్. ప్రస్తుతం మెట్రో నగరాల్లో ట్రెండ్ ఇదే. ఉద్యానవన నిపుణులు అభివృద్ధి చేసిన ఈ వేలాడే పూదోటలపై ఓ లుక్కేద్దాం. వేలాడే పూదోటలకి ప్రధానంగా కావల్సింది కొకెడమా. అంటే గడ్డి బంతి. కుండీల అవసరం లేకుండా పెరిగే బంతి. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందుగా స్ట్రింగ్ గార్టెన్‌కు సరిపోయే (నీడపట్టున పెరిగే) మొక్కల్ని ఎంపిక చేసుకోవాలి. అలాంటి వాటిలో ఫెర్న్, బెగోనియాలూ, ఆర్కడ్లూ ప్రధానమైనవి. ఇటీవల అందం కోసం పెంచుకునే తేలికపాటి మొక్కలతో ఇంట్లోకి అవసరమయ్యే ఔషధ మొక్కలూ ఇలా పెంచుతున్నారు. తరువాత 7:3 నిష్పత్తిలో పీట్ మాప్ (కుళ్లిన నాచు మొక్కలు), బోన్సాయ్ సాయిల్ తీసుకుని తగినన్ని నీళ్లతో మట్టి మాదిరిగానే జిగురులా అయ్యే వరకు కలపాలి. స్ఫాగ్నమ్ మాస్ (ఎండిన ఒక రకం నాచుమొక్క)ను నీళ్లలో నానబెట్టాలి. ఇది నీళ్లను పీల్చుకుని వేళ్లకు అందిస్తుంటుంది. షీట్ మాస్ (అట్ట మాదిరిగా ఉండే ఒకలాంటి నాచు) ముందు వేళ్లకు మట్టి లేకుండా చేయాలి. నీళ్లలో ముంచి తీయాలి. వేళ్ల చుట్టూ స్ఫాగ్నమ్ మాస్ ఉంచి.. దారంతో కట్టాలి. క్రమంగా దారం నాచులో కలిసిపోతుంది. దాన్నుంచి వేళ్లు ఆపైన ఉండే పీట్ మాస్ (అట్ట మాదిరిగా ఉండే ఒకలాంటి నాచు) మిశ్రమంలోకి చొచ్చుకు వస్తాయి. దీనిపైన షీట్ మాస్‌ను గుండ్రంగా చుట్టి దారంతో కట్టాలి. మరో పొడవాటి దారాన్ని మొక్కకు కట్టి కావాల్సిన చోట వేలాడదీయాలి. నీళ్ల టెన్షన్ లేదు... వీటికి రోజూ నీళ్లు పోయాల్సిన పని లేదు. వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఓ చిన్న బకెట్లో నీళ్లుపోసి, అందులో బంతి మునిగేలా ఓ పదినిమిషాలు ఉంచితే చాలు. వేలాడే కుండీల్లోనూ మొక్కల్ని పెంచుకోవచ్చు. కానీ వాటికి రోజూ నీళ్లూపోయాలి. అదే కొకెడామా అయితే ఆ అవసరం లేదు. దీనికి అవసరమైన పదార్థాలన్నీ నర్సరీల్లోనూ దొరుకుతున్నాయి. విజయారెడ్డి