Power Loom
-
పవర్ లూమ్ చేనేతలకు ఏపీ సర్కార్ భారీ ఊరట
సాక్షి, విజయవాడ: పవర్ లూమ్ చేనేతలకు ఏపీ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. పవర్ లూమ్‌లకు విద్యుత్ సబ్సిడీ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్‌కి 94 పైసలు రాయితీ కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.1 నుంచి 6 పైసలకి తగ్గించింది. పవర్ లూమ్స్ నిర్వహించే చేనేతలకు మేలు చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదీ చదవండి: ఒక్క హామీతో...మారిన జీవన రేఖ -
దొంగతనానికి వచ్చి..డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు
ఒక ఇంటిలో దొంగతనం చేసేందుకు వచ్చిన ఒక దొంగ ఏమి దొరక్కా.. ఆ ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన మరువక మునేపే అలాంటి మరో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. చోరీ చేసేందుకు వచ్చి డోర్లో తల ఇరుక్కుని చనిపోయాడు ఒక దొంగ. ఈ ఘటన వారణాసిలో సార్నాథ్ ప్రాంతంలోని డానియాల్‌పూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలపిని కథనం ప్రకారం....నిజాం అనే వక్తి విద్యుత్ యంత్రాలతో పనిచేసే మగ్గం సెంటర్లోకి చోరబడేందుకు యత్నించాడు. వాస్తవానికి ఆ సెంటర్ సరైన పని లేక గత రెండు రోజులుగా మూతబడి ఉంది. ఐతే ఈ దొంగ ఆ సెంటర్లో చోరీ చేసేందుకు వచ్చాడు. ఐతే ఆ సెంటర్‌ను బద్దలుగొట్టే ప్రయత్నంలో భాగంగా అక్కడ ఉన్న తలుపుల్లో దొంగ తన తలను పెట్టడంతో అతడి తల ఇరుక్కుపోయింది. ఆ తలుపులు పైన తాళం వేసి ఉందని తెలియక చోరబడేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అతని తల రెండు డోర్ల మధ్య ఇరుక్కుపోయింది, అతడి మిగతా శరీర భాగం బయటవైపు ఉండిపోయింది. దీంతో అతను అక్కడికక్కడే మృదొ చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సదరు వ్యక్తిని పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్న 30 ఏళ్ల జావేద్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మహిళ చేతివాటం.. మాటల్లో దింపి రూ.10 లక్షల నెక్లెస్ కొట్టేసింది) -
మహబూబాబాద్‌లో టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం నుంచి వలస వెళ్లిన సూరత్ వస్త్ర (పవర్లూమ్) పరిశ్రమల యజమానులు శనివారం తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) ప్రధాన కార్యాలయంలో చైర్మన్ బాలమల్లును కలిశారు. వస్త్ర పరిశ్రమ క్లస్టర్ ఏర్పాటుకు మహబూబాబాద్‌లో 200 ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. తాము ఇక్కడ వీరభద్ర స్వామి టెక్స్టైల్ మాన్యుఫ్యాక్చ రర్స్ అండ్ వీవర్స్ వేల్ఫేర్ సొసైటీని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఎంసీపీసీడీఎస్ కింద టెక్స్టైల్ క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, స్పెషల్ ప్యాకేజీ మంజూరయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రాజెక్టు రిపోర్టును బాలమల్లుకు అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన క్లస్టర్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
సర్కారు ఆర్డర్లు వద్దు సారూ!
సిరిసిల్ల: మొన్నటివరకు ఆశతో, ఆసక్తిగా వర్క్ ఆర్డర్లు స్వీకరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా నేతకార్మికులు ఇప్పుడు సర్కారు ఆర్డర్లు వద్దంటున్నా రు. పవర్లూమ్ కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ యూనిఫామ్స్, సంక్షేమ శాఖలకు అవసరమైన వస్త్రాలు, బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్ పండుగ దుస్తులు ఉత్పత్తి చేసే బాధ్యతను ఇక్కడి నేత కార్మికులకు ఇచ్చింది. అయితే, గతంలో తయారు చేసిన వస్త్రానికి నేటికీ నిధులు విడుదల కాకపోవటం.. నూలుపై జీఎస్టీ బాదుడు, ధరలు గిట్టుబాటు కాకపోవటంతో సర్కారీ ఆర్డర్లను నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. వస్త్రోత్పత్తి ఆర్డర్లు సిద్ధం.. సిరిసిల్లలోని నేత కార్మికుల కోసం ప్రభుత్వ ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయి. రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) ద్వారా రూ. 42 కోట్ల విలువైన కోటి మూడు లక్షల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్ ఉంది. అలాగే, వచ్చే క్రిస్మస్కు అవసరమైన రూ.6.73 కోట్ల విలువైన 25.52 లక్షల మీటర్లు, సంక్షేమశాఖకు చెందిన రూ.12 కోట్ల విలువైన 40 లక్షల మీటర్ల ఆర్డర్లు రెడీగా ఉన్నా.. వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఇవిపూర్తి కాగానే క్యాలెండర్ ప్రకారం మళ్లీ బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీకి ముందు నిర్ణయించిన ధరతోనే వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వడంతో వస్త్రోత్పత్తిదారులు ప్రభుత్వ ఆర్డర్లపై ఆసక్తి చూపడంలేదు. మళ్లీ అవే నష్టాలు.. వస్త్రోత్పత్తికి అవసరమైన నూలుపై గతంలో 2 శాతం సీఎస్టీ విధించేవారు. జీఎస్టీ అమలు చేయటంతో ఇప్పుడది 18 శాతం శ్లాబులోకి వెళ్లింది. దీంతో నూలు ధరలు పెరిగాయి. ఆ మేరకు ప్రభుత్వం వస్త్రం ధరను పెంచలేదు. అంతేకాకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నేతన్నకు రూ.15 వేలకు తగ్గకుండా కూలి ఇవ్వాలని ఆదేశించిన విషయం తెల్సిందే. ఈ మేరకు నేత కార్మికులకు మీటరుకు రూ.2.25, ఆసాములకు రూ.2.75 చెల్లించాలని జౌళిశాఖ అధికారులు నిబంధన పెట్టారు. వస్త్రపరిశ్రమకు అనుబంధంగా ఉన్న వైపని, వార్పిన్, టాకాలుపట్టే కార్మికులు, హమాలీలు సైతం కూలి రేట్లు పెంచేసుకున్నారు. ప్రభుత్వం ఆర్వీఎం ఆర్డర్ల ద్వారా సూటింగ్ మీటరు వస్త్రం రూ.54, షర్టింగ్‌కు రూ.34, ఓణీ వస్త్రానికి రూ.31, ప్యాకెట్ క్లాత్‌కు రూ.28 చెల్లిస్తోంది. 2016 నాటి ఒప్పం దం మేరకు ఈ ధరలు అమలవుతున్నాయి. కానీ, జీఎస్టీ బాదుడుతో కూలి రేట్లు గిట్టుబాటు కావడం లేదని వస్త్రోత్పత్తిదారులు అంటున్నారు. బిల్లుల చెల్లింపుల్లో జాప్యం.. సర్కార్ ఆర్డర్లు పొంది వస్త్రం సరఫరా చేస్తే.. ఆరు నెలలదాకా బిల్లు రావడంలేదు. దీంతో కార్మికుల వేతనాలు చెల్లించడం ఇబ్బందిగానే మారింది. చివరికి 10 శాతం బిల్లును అధికారులు ఆపేసి నాణ్యతనిర్ధారణ చేసిన తర్వాత చెల్లించడంతో ఆసాములు ఇబ్బందిపడుతున్నారు. మంత్రి కేటీఆర్‌పైనే ఆశలు.. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌కు సిరిసిల్ల నేత కార్మికులు, యజమాని, ఆసామి అనే మూడంచెల వస్త్రోత్పత్తి రంగంపై అవగాహన ఉంది. ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించి వస్త్రోత్పత్తి రేట్లను సవరించి, జీఎస్టీకి అనుగుణంగా ధర పెంచాలి. శాస్త్రీయంగా విశ్లేషించి వాస్తవాలను పరిగణనించాలి. ఇలాగైతేనే ప్రభుత్వ ఆర్డర్లకు ఆసాములు ముందుకు వచ్చే అవకాశం ఉంది. టెక్నికల్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాం వస్త్రోత్పత్తిదారులకు ఇచ్చేందుకు ప్రస్తుతం ఆర్వీఎం ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని పొందేందుకు పవర్లూమ్ మ్యాక్స్ సంఘాలు, చిన్నతరహా పరిశ్రమల(ఎస్ఎస్ఐ)యజమానులు ముందుకు రావడంలేదు. వస్త్రం ధర గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రస్థాయిలో టెక్నికల్ కమిటీ రేట్ల నిర్ధారణను పరిశీలిస్తోంది. – వి.అశోక్‌రావు, చేనేత, జౌళిశాఖ ఏడీ -
గ్రే వస్త్రాల ఉత్పత్తి తగ్గిద్దాం..
భివండీ, న్యూస్‌లైన్: గ్రే వస్త్రాలకు డిమాండ్ తగ్గిన నేపథ్యంలో ఉత్పత్తి తగ్గిద్దామని తెలుగువారికి చెందిన పవర్లూమ్ పరిశ్రమల యజమానులు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం వారు పట్టణంలోని పద్మశాలి సమాజ్ యువక్ మండలి కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు వ్యాపారులు మాట్లాడుతూ.. మూడు నెలలుగా గ్రే వస్త్రాల మార్కెట్ పడిపోవడంతో మీటర్‌కు రూ.8-12 వరకు నష్టం వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వస్త్రాల డిమాండ్ తగ్గినందున యధావిధిగా ఉత్పత్తి కొనసాగిస్తే మరింత నష్టాల పాలవుతామని వ్యాపారులు అభిప్రాయపడ్డారు. త్వరలో మజూరీ వీవర్స్‌తో చర్చించి కనీసం వారానికి ఒక రోజైనా పరిశ్రమల బంద్ పాటిస్తే కాస్త నష్టాల నుంచి బయటపడే అవకాశముందని వారు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు మజూరీ వీవర్స్‌తో చర్చించేందుకు యజమానుల తరఫు నుంచి యెల్ల సాగర్, వల్లాల్ శ్రీనివాస్, బొల్లు నవీన్, కొక్కు శ్రీనివాస్, గడ్డం మహేందర్‌ను ఎంపిక చేశారు. ఈ బృందం త్వరలో మజూరీ వీవర్స్ అసోసియేషన్‌తో చర్చించిన అనంతరం అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని పవర్లూమ్ యజమానుల సంఘం పేర్కొంది. ఇదిలా ఉండగా, రాష్ట్రంలోనే అతి ఎక్కువ సంఖ్యలో పవర్లూమ్ పరిశ్రమలు భివండీలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాదిమంది ఇక్కడకు వలసవచ్చి పవర్లూమ్ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. అలాగే చాలామంది తెలుగువాళ్లు సొంతంగా పరిశ్రమలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం భివండీలో ఉన్న సుమారు 50 వేల పవర్లూమ్ పరిశ్రమల్లో 7.5 లక్షల య్రంతాలు ఉన్నాయి. ఇందులో తెలుగువారి వాటా కూడా ఎక్కువగానే ఉంది. వీరు ఎక్కువగా కాటన్-సాటిన్ వస్త్రాలను ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. అయితే మూడు నెలలుగా మార్కెట్లో గ్రే వస్త్రాలకు డిమాండ్ తగ్గింది. ఉత్పత్తికి సరిపడా డిమాండ్ లేకపోవడంతో యజమానులు నష్టాలను చవిచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ సంస్థలు పూర్తి నష్టాలబారిన పడిపోతాయనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. వస్త్రాలకు డిమాండ్ తగ్గడంతో పాటు, విద్యుత్, లేబర్ ఖర్చులు కూడా పెరిగిపోవడంతో మీటర్‌కు రూ.8 నుంచి 12 వరకు ఆ సంస్థలు నష్టపోతున్నట్లు అంచనా. దీన్ని బయటపడేందుకు త్వరలోనే తగిన కార్యాచరణ చేపట్టేందుకు పవర్లూమ్ సంస్థల యాజమాన్యాలు చర్యలు తీసుకుంటున్నాయి. -
కొనసాగుతున్న పోరాటం
భివండీ, న్యూస్‌లైన్: పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరించుకోవడం తదితర డిమాండ్లతో భివండీ మరమగ్గాల యజమానులు చేపట్టిన బంద్ శనివారంతో 11వ రోజుకు చేరుకుంది. నిరవధిక బంద్‌తో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం లేదని యజమానులు, కార్మికులు, స్థానిక నాయకులు మండిపడుతున్నారు. అందుకే బంద్‌ను ఈ నెల 20 వరకు పొడగిస్తున్నట్లు ప్రకటించారు. గత పది రోజుల నుంచి రాస్తారోకోలు, ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం దారుణమని భివండీ పవర్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు, ఎంపీ సురేష్ ఠావురే అన్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించడానికి ఆయన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే ర షీద్ తాహిర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సోహెబ్ గుడ్డూ తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 15 వరకు నిర్వహించాల్సిన బంద్‌ను 20 వరకు పొడగించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే భివండీలోని ఆనంద్దిగే చౌక్ నుంచి ముంబై మంత్రాలయం వరకు ర్యాలీ నిర్వహిస్తామని సురేష్ ఠావురే ప్రకటించారు. నాయకులు అసమర్థులు... భివండీలో రాజకీయ నాయకులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తే సమస్య పరిష్కారమవుతుంది. వారి అసమర్థత వల్లే ప్రభుత్వమూ పట్టించుకోవడం లేదు. బీజేపీ, శివసేన, సమాజ్‌వాదీ పార్టీలకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, అధికార పార్టీ ఎంపీ కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. అయితే మా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు వీళ్లు ఎందుకు విఫలమవుతున్నారో అర్థం కావడం లేదు. - వడ్డెపల్లి శ్రీనివాస్ (టెక్స్టైల్ డిజైన్ మాస్టర్) మిలాఖత్ వల్లే... కొందరు విలేకరులు, పోలీసులు టోరెంట్ పవర్ కంపెనీతో చేతులు కలుపుతున్నారు. అందుకే విద్యుత్ చార్జీలు పెంచినా ఎవరూ ఏమీ అనడం లేదు. వస్త్రపరిశ్రమలు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. ఎంఎస్ఈబీ విద్యుత్ సరఫరా చేస్తున్న సమయంలో పోలీసులతోపాటు విలేకరులు ఏదైనా అన్యాయం జరిగితే ప్రజలకు అండగా నిలిచేవారు. ఇప్పడు వారు టోరెంట్ కంపెనీకే సహకరిస్తున్నట్టు అనిపిస్తోంది. -వాసం రాజేందర్ (నేత కార్మికుడు)