Pradeep Kumar Joshi
-
యూపీఎస్సీ చైర్మన్గా ప్రదీప్ కుమార్ జోషి
న్యూఢిల్లీ: యూపీఎస్సీ కొత్త చైర్మన్గా విద్యావేత్త ప్రదీప్ కుమార్ జోషి శుక్రవారం నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన కమిషన్లో సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటి వరకూ పదవీ బాధ్యతలు నిర్వహించిన అరవింద్ సక్సేనా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కమిషన్లో సభ్యుడిగా చేరక ముందు ఆయన ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్లకు చైర్మన్గా పనిచేశారు. 2015 మే 12న ఆయన కమిషన్లో చేరారు. ఆర్థిక నిర్వహణ విభాగంలో నిపుణత కలిగిన జోషి 2021 మే 12వరకూ చైర్మన్గా ఉంటారు. జోషి చైర్మన్గా ఎంపికతో, కమిషన్లో ఓ సభ్యుడి స్థానం ఖాళీ అయింది. (అత్యుత్తమ సీఎంలలో వైఎస్ జగన్కు మూడో స్థానం) -
యూపీఎస్సీ సభ్యుడిగా ప్రదీప్ కుమార్ జోషీ
న్యూఢిల్లీ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సభ్యుడిగా ప్రముఖ విద్యావేత్త ప్రదీప్ కుమార్ జోషీ సోమవారం నియమితులయ్యారు. ప్రస్తుతం యూపీఎస్సీ చైర్మన్గా దీపక్ గుప్తా వ్యవహరిస్తుండగా, కమిషన్లో 10మంది సభ్యులకు గాను తొమ్మిది మందే ఉ న్నారు. జోషీ నియామకంతో మొత్తం సభ్యుల నియామకం పూర్తయింది. జోషీ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్నా రు. యూపీఎస్సీలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జోషీ పదవీకాలం మొదలవుతుంది.