pragnapur
-
ప్రాణాలు తీసిన అతివేగం
గజ్వేల్ రూరల్: రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా తాండూరు గ్రామ సర్పంచ్ అంజిబాబుకు చెందిన కారు హైదరాబాద్‌లో ఉండటంతో దానిని తీసుకొచ్చేందుకు, అదే గ్రామానికి చెందిన సాయిప్రసాద్, భానుప్రసాద్‌తో కలసి గణేష్‌కు చెందిన నిస్సాన్ మిక్రా (టీఎస్20 0006) కారులో బుధవారం రాత్రి బయలుదేరారు. గణేష్ డ్రైవింగ్ చేస్తుండగా.. అతని పక్కన సర్పంచ్ అంజిబాబు, వెనుక సీట్లో సాయిప్రసాద్, భానుప్రసాద్ కూర్చున్నారు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు గురువారం తెల్లవారుజామున ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్‌డిపో సమీపంలో రాజీవ్ రహదారిపై నిలిపి ఉన్న సిమెంట్ లారీని వెనుక భాగంలో ఢీకొనడంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో సర్పంచ్ అంజిబాబు, డ్రైవర్ గణేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్రగాయాలైన సాయిప్రసాద్‌ను 108లో గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్లు తెలిపారు. భానుప్రసాద్‌కు సైతం ఛాతిపై, కాళ్లు, చేతులకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. గజ్వేల్ సీఐ ఆంజనేయులు సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. రాత్రివేళ రోడ్డుపై వాహనాలు ఆపొద్దు: సీపీ ప్రమాద స్థలిని గురువారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయెల్ డేవిస్, గజ్వేల్ ఏసీపీ నారాయణ, సీఐ ఆంజనేయులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీ జోయెల్ డేవిస్ మాట్లాడుతూ.. రాత్రి సమయాల్లో లారీలను రోడ్డుపై నిలపకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. -
పేపర్ అడ్డుపెట్టి జేబు కొట్టేసిన ప్రబుద్దుడు
-
కన్నీరుపెట్టిన వేగురుపల్లి
సాక్షి, మానకొండూర్(కరీంనగర్) : హైదరాబాద్‌లో ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వెళ్లిన కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు విగత జీవులుగా ఇంటికి వచ్చారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. ఇంటికి చేరిన మృతదేహాలను చూసి ఊరంతా బోరున విలపించింది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వేన్షన్లో జరుగుతున్న ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌కు సంతోషంగా వెళ్లిన వారు రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బోరున విలపించారు. సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం వేగురుపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు మృతిచెందడం, నలుగురు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామంలోని ముగ్గురు ప్రముఖులు ఒకే ప్రమాదంలో చనిపోవడంతో గ్రామస్తులు ఘోల్లుమన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వేన్షన్లో ఆదివారం ఓ సినిమాకు సంబంధించిన ఫ్రీ రీలీజ్ ఫంక్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి మానకొండూర్ మండలం వేగురుపల్లికి చెందిన మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు కనుకుంట్ల మల్లేశం(47), టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ఆర్ఎంపీ జంగ ప్రభాకర్‌రెడ్డి(50), వేగురుపల్లి గ్రామపంచాయతీ ఐదో వార్డుసభ్యుడు అలుగువెల్లి జనార్ధ్దన్‌రెడ్డి(40), టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నిట్టురు పుల్లయ్య(40), పెరుమాల్ల గోవర్ధన్(38), కోల శంకరయ్య(55), కారు డ్రైవర్ పబ్బతి దేవేందర్‌రెడ్డి(35)లు ఓకే గ్రామానికి చెందినవారు. కారు కిరాయికి మాట్లాడుకుని ఆదివారం ఉదయం హైదరాబాద్ వెళ్లారు. ఫంక్షన్ ముగిసిన అనంతరం కారులో అర్ధరాత్రి ఇంటికి వస్తుండగా సుమారు 12 గంటల సమయంలో ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనుకుంట్ల మల్లేశం, జంగ ప్రభాకర్‌రెడ్డి, అలుగువెల్లి జనార్ధన్‌రెడ్డి అక్కడిక్కడే మృతిచెందారు. గాయపడినవారిని స్థానికులు సికింద్రబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వేగురుపల్లికి తీసుకురావడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులరోదనలు మిన్నంటాయి. కుటుంబానికి పెద్ద దిక్కు.. అలువెల్లి జనార్థన్‌రెడ్డి మృతితో అతడి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయారు. మృతుడికి భార్య శైలజ, ఇంటర్ చదివే రుచిత, విష్ణువర్ధన్‌రెడ్డి ఉన్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి.. కనుకుంట్ల మల్లేశం మానకొండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ ఉపాధ్యక్షుడిగా, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరి రాజకీయంగా ఎది గాడు. నాడు అతడి భార్య స్వరూప సర్పంచ్ ప దవి అలంకరించి అనారోగ్యంతో మృతిచెందగా నేడు కోడలు సంగీత సర్పంచ్. మృతుడికి కూతురు సౌమ్య, కుమారుడు అభిలాష్, రెండో భార్య బుజ్జమ్మ ఉన్నారు. సీనియర్ నాయకుడిగా.. మృతిచెందిన జంగ ప్రభాకర్‌రెడ్డి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్నాడు. ఇతడు మంత్రి ఈటలకు బంధువు, అత్యంత సన్నిహితుడు. మృతుడి భార్య వనజ ఉంది. ఇద్దకు కుమారులు కాగా ఒకరు వైద్య వృత్తిలో, మరొకరు సాప్ట్వేర్ ఇంజనీరుగా రాణిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి ఆర్ఎంపీగా కొనసాగుతున్నారు. మంత్రుల పరామర్శ ప్రజ్ఞపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వేగురుపల్లికి చెందిన ముగ్గురు మృతిచెందగా, బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజందర్ మృతదేహాలకు నివాళులు అర్పించి బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. జెడ్పీ చైర్ పర్సన్ విజయ, స్థానిక ఎమ్మెల్యే రసమయి, ఎమ్మెల్సీ లక్ష్మణ్‌రావు, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, సుడా చైర్మన్ జీవీ రామక్రిష్ణారావు తదితరులు నివాళులర్పించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడి దిగ్భ్రాంతి.. వేగురుపల్లి గ్రామస్తులు ముగ్గురు మృతి చెందడంపై రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్ సానుభూతి వ్యక్తం చేశారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. నివాళులర్పిస్తున్న మంత్రులు ఈటల రాజేందర్, గంగుల కమలాకర్, తదితరులు -
దొంగలను పట్టించిన సీసీ కెమెరా
వర్గల్(గజ్వేల్) : ఏటీఎంలో పెట్టేందుకు తీసుకెళ్తున్న రూ. 22 లక్షలను పక్కా స్కెచ్ ప్రకారం కొట్టేసిన నిందితులను సీసీ కెమెరా ఫుటేజీలు పట్టించాయి. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ మంగళవారం ఏసీపీ మహేందర్‌తో కలిసి గౌరారం రూరల్ సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌కు చెందిన అరుణోజి నవీన్(24) రైటర్ సేఫ్‌గార్డ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో కస్టోడియన్‌గా పనిచేస్తున్నాడు. మరో కస్టోడియన్ ప్రవీణ్‌తో కలిసి వివిధ ఏటీఎమ్‌లలో డబ్బులు పెట్టి వస్తాడు. వర్గల్ ఏటీఎమ్‌లో డబ్బులు పెట్టేందుకు వెళ్తుండగా వాటిని కాజేయాలని తన మిత్రుడు ప్రజ్ఞాపూర్‌కు చెందిన మెతుకు ప్రసాద్ కుమార్ (23)తో కలిసి స్కెచ్ వేశాడు. పథకంలో భాగంగా శనివారం నవీన్ సెలవు పెట్టాడు. వర్గల్ ఏటీఎమ్‌లో డబ్బులు పెట్టేందుకు శనివారం మధ్యాహ్నం రూ. 22 లక్షల నగదు బ్యాగుతో ఇద్దరు కస్టోడియన్లు ప్రవీణ్ కుమార్, మామిడిపల్లి హరికృష్ణ గజ్వేల్ నుంచి బయల్దేరారు. వీరిని బైక్ మీద అనుసరిస్తున్న ప్రసాద్ కుమార్ మక్త సమీపంలో డబ్బుల బ్యాగును లాక్కొని పారిపోయాడు. ప్రత్యేక బృందం ఏర్పాటు.. సీపీ ఆదేశాల ప్రకారం అదనపు డిప్యూటీ సీపీ నర్సింహారెడ్డి, ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. వీరు సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల ఆధారంగా విచారణ చేశారు. కస్టోడియన్ నవీన్ సెలవు పెట్టాడని తెలసుకుని మంగళవారం ఉదయం అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మిత్రుడు ప్రసాద్‌కుమార్‌తో కలిసి డబ్బును కాజేసినట్లు అతను వెల్లడించాడు. దొంగిలించిన నగదును శ్రీగిరిపల్లి గుట్ట ప్రాంతంలో దాచినట్లు చెప్పాడు. ప్రసాద్‌కుమార్‌ను కూడా అదుపులోకి తీసుకుని నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. గౌరారం రూరల్ సీఐ శివలింగం, ఎస్సై ప్రసాద్, పీసీలు రామచంద్రారెడ్డి, రాజు, ఉపేందర్‌లకు రివార్డు అందజేయనున్నట్లు తెలిపారు. -
అనాథ చిన్నారుల మధ్య హరీశ్ జన్మదిన వేడుకలు
గజ్వేల్ : అనాథ చిన్నారుల మధ్య నీటి పారుదల శాఖామంత్రి హరీశ్‌రావు జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. దుబ్బాక పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఆదివారం రాత్రి గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆశాజ్యోతి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు చిన్నారుల మధ్య కేక్‌ను కట్ చేసి తినిపించారు. చిన్నారుల సంక్షేమం కోసం రూ. 25వేల నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ భాస్కర్, కేసీఆర్ యువసేన అధ్యక్షుడు అనూప్, ఆశాజ్యోతి డైరెక్టర్ ఫాదర్ ఆల్వీన్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే బాజిరెడ్డి పీఏ మృతి
డిచ్పల్లి: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వద్ద పీఏగా పని చేస్తున్న చంద్రకంటి బాలగంగాధర్(61), ఆయన సతీమణి విజయ(55) గురువారం సిద్దిపేట్ జిల్లా గజ్వేల్–ప్రజ్ఞాపూర్ శివారులో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. ఉదయం వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్న బాలగంగాధర్ దంపతులు తమ కారులో గజ్వేల్–ప్రజ్ఞాపూర్‌కు బయలు దేరారు. ప్రజ్ఞాపూర్‌లో బంధువుల ఇంట్లో రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే యాదగిరి గుట్టలో జరిగే శుభకార్యానికి పోవాలని వారు నిర్ణయించుకున్నారు. గురువారం సాయంత్రం 5గంటల సమయంలో ప్రజ్ఞాపూర్ శివారులోకి చేరుకోగానే రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీ కిందకు వీరు ప్రయాణిస్తున్న కారు చొచ్చుకుపోయింది. దీంతో కారు నడుపుతున్న బాలగంగాధర్, ఆయన సతీమణి విజయ అక్కడికక్కడే మృతి చెందారు. మరో కిలోమీటరు ప్రయాణిస్తే వారు బంధువుల ఇంటికి చేరుకునేలో పే రోడ్డు ప్రమాదం వారిని కబళించింది. ధ ర్పల్లి మండల కేంద్రానికి చెందిన బాలగంగాధర్ 1998లో ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగంలో చే రారు. అనంతరం ఇరిగేషన్ విభాగంలో పని చేశారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు వద్ద పీఏగా సుధీర్ఘ కాలం పని చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జుక్కల్ ఎమ్మె ల్యే గంగారాం వద్ద పీఏగా పని చేశారు. 2014 నుంచి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ వద్ద పీఏగా పని చేస్తున్నా రు. అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధు లు, రాజకీయ నాయకులు, కార్యకర్తలు అం దరితో కలుపుగోలుగా ఉండే బాలగంగాధర్ మృతి చెందడంపై రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాలగంగాధర్‌కు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
బైక్ పైనుంచి దూకిన మహిళ మృతి
తొగుట(దుబ్బాక): బైక్ పైనుంచి దూకి గాయపడిన మహిళ సోమవారం మరణించిందని తొగుట ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన నరెడ్ల భారతమ్మ (50) రోజూ సిద్దిపేటలో భవన నిర్మాణ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం సిద్దిపేటకు వెళ్లి తిరిగి వచ్చేందుకు ఘణపురం వెళ్లే ఆటోలో మెట్టు వరకు వచ్చింది. అక్కడ మరో ఆటోకోసం ఎదురుచూస్తున్న క్రమంలో వేములఘాట్ మదిర తుర్కబంజేరుపల్లికి చెందిన ఇరుగదిండ్ల ప్రశాంత్ బైక్ ఎక్కింది. ఈ క్రమంలో అతడు ఎల్లారెడ్డిపేట స్టేజీ వద్ద బైక్ ఆపకుండా వెళ్తున్నాడు. దీంతో భయాందోళనకు గురైన భారతమ్మ బైక్ పైనుంచి కిందకు దూకింది. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. దీంతో ఆమెను ప్రశాంత్ చికిత్స కోసం సిద్దిపేటకు తరలించాడు. పరిస్థితి విషమంగా మారడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రజ్ఞాపూర్ వద్ద భారతమ్మ మృతిచెందింది. ఆమె భర్త ఫిర్యాదు మేరకు శవాన్ని పోస్టుమార్టం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఎస్ఐ వివరించారు. -
మహిళను చిదిమేసిన లారీ
గజ్వేల్‌రూరల్: లారీ ఢీకొని ఓ మహిళ మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టిన సంఘటన మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ చౌరస్తా జగదేవ్‌పూర్ వెళ్లే మార్గంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఎర్ర కలమ్మ(46) కూలీ పనులు చేస్తుంది. సోమవారం ఉదయం ప్రజ్ఞాపూర్ చౌరస్తా వద్ద జగదేవ్‌పూర్ మార్గంలో రాజీవ్ రహదారిని దాటుతుండగా గజ్వేల్ నుంచి భువనగిరి వైపు వెళ్తున్న హరియాణకు చెందిన లారీ (హెచ్ఆర్ 55క్యూ 7034) ఆమెను ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కలమ్మ కాలు తెగిపడి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున సంఘటనా స్థలానికి చేరుకొని న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించారు. దీంతో రాజీవ్ రహదారిపై రోడ్లకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గజ్వేల్ సీఐ ప్రసాద్, ట్రాఫిక్ సీఐ నర్సింగరావులు సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేయగా తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రోడ్డుపైనే బైఠాయించారు. మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ రోడ్డుపై «రాస్తారోకో చేస్తున్న వారికి నచ్చజెప్పి ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ధర్నా విరమించారు. మృతురాలు కలమ్మకు కొడుకు, కూతురు ఉన్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులకు మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ రూ. 10 వేలు ఆర్థిక సాయం చేశారు. టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బూరుగుపల్లి ప్రతాపరెడ్డి బాధిత కుటుంబీకులను పరామర్శించారు. -
నడిరోడ్డుపై ‘నీటి’గోస!
దాహార్తి తీర్చాలంటూ ప్రజ్ఞాపూర్‌లో మహిళల ఆందోళన సమన్వయ లోపంతోనే పూర్తి కాని పనులు సీఎం ఆదేశించినా పట్టని అధికారులు గజ్వేల్: పల్లెల గొంతు తడిపే ‘మిషన్ భగీరథ’ ప్రారంభమైన కోమటిబండకు కూతవేటు దూరంలోని ప్రజ్ఞాపూర్‌లో గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఇక్కడ కొన్ని రోజులుగా మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఫలితంగా విసిగిపోయిన మహిళలు బుధవారం ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. ఈ సందర్భంగా పోలీసులతో మహిళలకు వాగ్వాదం జరిగింది. సమస్యలుంటే నగర పంచాయతీ కార్యాలయంలో చెప్పాలని.. రోడ్డెక్కితే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించి ధర్నాను విరమింపజేశారు. ఇదీ సమస్య.. నగర పంచాయతీ పరిధిలోని గజ్వేల్, ప్రజ్ఞాపూర్, ముట్రాజుపల్లి, క్యాసారం గ్రామాలకు నిత్యం 5.19 ఎంఎల్డి (50.19 లక్షల లీటర్ల నీరు) అవసరం. 4 వేల వరకు నల్లాలు ఉన్నాయి. గతంలో 15 ఓవర్‌హెడ్ ట్యాంకుల ద్వారా 2 (20 లక్షల లీ.) ఎంఎల్డీ లీటర్ల నీటిని సరఫరా చేసేవారు. నాలుగు నెలలుగా పరిస్థితి మారింది. ఇక్కడ ‘మిషన్ భగీరథ’ శాశ్వత పైప్‌లైన్ నిర్మాణం, నల్లా కనెక్షన్ల నిర్మాణం చేపట్టకున్నా...(ఇప్పటికీ ఇంకా ఇక్కడ ‘మిషన్ భగీరథ’ పనులు చేపట్టలేదు) సీఎం కేసీఆర్ ఆదేశాలతో కోమటిబండలోని ‘మిషన్ భగీరథ«’ హెడ్ రెగ్యులేటరీ నుంచి నిత్యం ఇక్కడికి గడువుకు ముందే 10-20 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. పాత నల్లాల వ్యవస్థ నీటి సరఫరా ద్వారా గోదావరి జలాలతోపాటు ఇక్కడున్న వనరులతో కలిపి మొత్తం 30-35 లక్షల లీటర్ల నీటి సరఫరా జరుగుతున్నది. మొదటగా గజ్వేల్ పట్టణానికి మాత్రమే పాత నల్లాల వ్యవస్థ ద్వారా నీటిని అందించారు. ప్రజ్ఞాపూర్‌లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరిగేది. ఈ నీళ్లు సరిపోక గతేడాది మే నుంచి ఇప్పటి వరకు నాలుగు సార్లు జనం ఆందోళనకు దిగారు. విస్తరణ పనులతోనే ఆటంకం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ రోడ్డు విస్తరణ పనులు కారణంగా పైప్‌లైన్ దెబ్బతిని నీరు ఇవ్వలేకపోతున్నామని చెప్పిన అధికారులు...జనం ఆగ్రహావేశాలు చూసి 3 నెలల క్రితం తాత్కాలిక పైప్‌లైన్ వేసి వాటితో ట్యాంకులు నింపి గజ్వేల్‌లో మాదిరిగానే ఇక్కడా పాత నల్లాల వ్యవస్థ ద్వారానే నీటిని అందించారు. దీంతో సమస్య తీరింది. ఇటీవల ప్రధాని పర్యటన నేపథ్యంలో వడివడిగా పైప్‌లైన్ విస్తరణ పనులు చేపట్టిన క్రమంలో తవ్వకాలతో గతంలో తాత్కాలికంగా వేసిన పైప్‌లైన్ దెబ్బతిన్నది. ఫలితంగా ప్రజ్ఞాపూర్‌కు నీటి సరఫరా ఆగింది. 10 వేల జనాభా ఉన్న ప్రజ్ఞాపూర్‌లో 1500కిపైగా నల్లా కనెక్షన్లు ఉన్నాయి. తక్కువలో తక్కువగా ఇక్కడికి నిత్యం 5 లక్షల నీటిని అందించగలిగితే ఇబ్బంది ఉండదు. కానీ ప్రస్తుతం 30 ట్యాంకర్ల ద్వారా 1.5 లక్షల లీటర్ల నీటినే సరఫరా చేస్తున్నారు. పైప్‌లైన్ విస్తరణ పనుల్లో జాప్యం మరోవైపు శాశ్వతంగా ఏర్పాటు చేస్తున్న పైప్‌లైన్ విస్తరణ 20 రోజులైనా పూర్తి కావడం లేదు. ప్రత్యేకించి ఇందిరాపార్క్ చౌరస్తా నుంచి పిడిచెడ్ రోడ్డు వరకు, మరికొన్ని చోట్ల పనులు పూర్తి చేస్తే శాశ్వతంగా వేస్తున్న ఈ లైన్ ద్వారా ప్రజ్ఞాపూర్‌లోని ట్యాంకుల్లోకి నీటిని ఎక్కించుకొని...నల్లాల బిగించే వరకు నీటిని అందించవచ్చు. ఇందుకోసం కొన్ని చోట్ల తాత్కాలిక లైన్ కూడా వేయాల్సి ఉన్నది. కానీ ఈ పనుల నిర్వహణలో నగర పంచాయతీ, వాటర్‌గ్రిడ్ విభాగం మధ్య సమన్వయ లోపం నెలకొంది. మరోవైపు ఆర్అండ్బీ అధికారులు కూడా పనులు వేగిరం చేయటం లేదన్న ఆరోపణలున్నాయి. మొత్తానికి ఈ మూడు విభాగాల నిర్వాకం ప్రజ్ఞాపూర్ మహిళలకు చుక్కలు చూపిస్తోంది. కాగా, గురువారం ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు నగర పంచాయతీ, మిషన్ భగీరథ, ఆర్అండ్బీ అధికారులతో గురువారం నిర్వహించే సమావేశంలో తాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుందోమోనని ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
ప్రజ్ఞాపూర్‌లో షర్మిలకు ఘనస్వాగతం
గజ్వేల్ (మెదక్ జిల్లా) : వైఎస్సార్సీపీ నాయకురాలు వై.ఎస్.షర్మిలకు సోమవారం గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్‌లో పార్టీ శ్రేణులు, అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా డప్పు చప్పుళ్లు, నినాదాలతో చౌరస్తా ప్రాంగణం హోరెత్తింది. హైదరాబాద్ నుంచి వరంగల్ జిల్లాలో పరామర్శయాత్రకు బయలుదేరిన సందర్భంగా మార్గమధ్యంలోని ప్రజ్ఞాపూర్‌లో కొద్దిసేపు ఆగిన షర్మిల చౌరస్తాలోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా రాజన్న కూతుర్ని చూడటానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి మహిళలు ఇక్కడికి వచ్చారు. చౌరస్తా వద్ద తన కోసం వేచి వున్న మహిళలను షర్మిల ఆత్మీయంగా పలకరించారు. అందరినీ 'బాగున్నారామ్మా...?' అంటూ అడిగి యోగక్షేమాలు తెలుసుకున్నారు. షర్మిలను చూస్తుంటే దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి గతంలో ఈ ప్రాంతానికి వచ్చిన రోజులు గుర్తుకువస్తున్నాయని వర్గల్ మండలం మైలారం గ్రామానికి చెందిన బూర్గుపల్లి రేణుక, పోతగల్ల పోశమ్మ, నర్సమ్మ తదితరులు 'సాక్షి'తో పేర్కొన్నారు. రాజశేఖర్‌రెడ్డిని చూసినట్లు అనిపించిందని అభిప్రాయపడ్డారు. పేదల కోసమే వైఎస్ కుటుంబం నిరంతరం పనిచేస్తుందని వారు కొనియడారు. తరలివచ్చిన జిల్లా నేతలు ప్రజ్ఞాపూర్‌లో షర్మిలకు ఘన స్వాగతం పలకడానికి వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొమ్మెర వెంకట్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ విగ్రహాన్ని పూలతో అలంకరించారు. షర్మిల రాగానే వైఎస్ విగ్రహానికి పూలమాలుల వేసి కొద్దిసేపు ప్రార్ధించారు. ఆ తర్వాత వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న పరామర్శయాత్రకు తరలివెళ్లారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర నేతలు నల్లా సూర్యప్రకాష్‌రావు, సాయికుమార్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు నర్రా బిక్షపతి, రాష్ట్ర కార్యదర్శి గౌరిరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అజహర్, మొహినోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
గజ్వేల్‌కు మహర్దశ!
నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ నుంచి ఇండేన్ గ్యాస్ కార్యాలయం, ఇందిరాపార్క్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు గత కొంత కాలంగా విపరీతమైన ట్రాఫిక్ సమస్య నెలకొనడంతో స్థానికులు తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రత్యేకించి సంత జరిగే బుధవారం నాడు ప్రధాన రహదారిపై అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి నెలకొని ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ఈ మార్గం గుండానే భారీ వాహనాలు వెళ్లాల్సి రావడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ క్రమంలోనే ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 9న నామినేషన్ వేయడానికి, 18న మెతుకుసీమ గర్జన పేరిట నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు వచ్చిన సందర్భంలోనూ ట్రాఫిక్ సమస్యను కేసీఆర్ స్వయంగా అనుభవించారు. ఆయన వాహన శ్రేణిని బయటకు తీసుకురావడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. ఈ క్రమంలోనే కేసీఆర్ మెతుకు సీమగర్జన సభలో ట్రాఫిక్ సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గజ్వేల్‌లో రింగ్ రోడ్డు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆర్అండ్బీ అధికారులకు పనులను పురమాయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్అండ్బీ ఎస్ఈ శ్రీధర్, సిద్దిపేట ఈఈ బాల్‌నర్సయ్య, గజ్వేల్ శాఖ డిప్యూటీ ఈఈ బాల్‌నర్సయ్య తదితరులు సోమవారం పట్టణంలో సర్వే చేపట్టారు. అధికారుల కథనం ప్రకారం పట్టణంలోని 133/33కేవీ సబ్స్టేషన్నుంచి జాలిగామ, బయ్యారం చౌరస్తా, క్యాసారం, ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్టాండ్, శ్రీగిరిపల్లి, హషీమ్కళశాల, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్ పాలిటెక్నిక్ కళాశాల మీదుగా తిరిగి సబ్‌స్టేషన్ వరకు రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. రింగ్ రోడ్డు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. రింగ్‌రోడ్డు నిర్మాణానికి ఆర్అండ్బీ అధికారులు స్థల పరిశీలన జరిపారు. ఈ క్రమంలో నగరపంచాయతీ పరిధిలోని క్యాసారంలో టీఆర్ఎస్ ముఖ్య నేతలు సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ముఖ్యనేతలు డాక్టర్ యాదవరెడ్డి, గాడిపల్లి భాస్కర్ టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆకుల దేవేందర్ తదితరులతో సమావేశమై అభిప్రాయ సేకరణ చేపట్టారు. మొత్తానికి గజ్వేల్‌లో రింగ్‌రోడ్డు నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.