praja darbar program
-
కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Live Updates.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చ సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు థాకరే ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్.. కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ సీఎం రేవంత్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, మిగతా బెర్తులపై అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ అసెంబ్లీలో మంత్రుల ప్రమాణ స్వీకారం. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష సమీక్షకు హాజరు కాని సీఎండీ ప్రభాకర్ రావు. సమావేశానికి రావాలని ఆదేశించినా హాజరు కాని ప్రభాకర్ రావు. విద్యుత్ శాఖలో ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయన్న అధికారులు మహిళలకు ఉచిత ప్రయాణంపై సీఎం రేవంత్ సమీక్ష సమీక్షకు హాజరైన రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు మహిళలకు ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల చేయనున్న ప్రభుత్వం. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. విధివిధానాలను రూపొందించాలని అధికారులకు రేవంత్ ఆదేశం. ఆర్టీసీ పరిస్థితులు, ఆదాయం, వ్యయంపై సీఎం రేవంత్ ఆరా. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4కోట్ల భారం పడే అవకాశం. ఆర్టీసీ బస్సుల్లో రోజూ 12-13 లక్షల మంది ప్రయాణం. ►కాసేపట్లో విద్యుత్ శాఖ, ఆర్టీసీపై సీఎం రేవంత్ సమీక్ష ►మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రివ్యూ. ►మహిళలకు ఉచిత ప్రయాణంపై నేడు మార్గదర్శకాలు. ►నిన్న తొలి కేబినెట్లోనే విద్యుత్ శాఖపై వాడీవేడి చర్చ ►నేడు సమీక్షకు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రెడ్డి హాజరుకావాలన్న సీఎం రేవంత్. ►ప్రజా దర్బార్ ముగించుకుని సెక్రటేరియట్ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి ►విద్యుత్ శాఖపై సెక్రటేరియట్లో రివ్యూ చేయనున్న సీఎం రేవంత్ ►సీఎం రేవంత్‌ను కలిసిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులు ►జెన్కో ఏఈ నియామక పరీక్ష వాయిదా వేయాలని వినతి. ►సీఎం రేవంత్‌ను కలిసి సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సీఎం రేవంత్. ప్రజా దర్బార్‌లో సీఎంను కలిసిన కొండపోచమ్మ ముంపు బాధితులు. ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని సీఎంకు వివరించిన బాధితులు. ►ఇక, ప్రజా దర్బార్‌కు ప్రత్యేక యంత్రాగం. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించేందుకు 20 మంది సిబ్బంది. వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖ అధికారులకు సిఫార్స్ చేస్తున్న సీఎం రేవంత్. వచ్చిన ఫిర్యాదులపై మళ్లీ సమీక్ష చేయాలని నిర్ణయించుకున్న సీఎం రేవంత్. ప్రతీ నెల వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష. ►కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా దర్బార్ ప్రారంభమైంది. అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. ►జూబ్లీహిల్స్ నివాసం నుంచి జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌కు బయలు దేరిన సీఎం రేవంత్ రెడ్డి.. ►మరికాసేపట్లో ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌కు హాజరు కానున్న సీఎం రేవంత్ ►కాసేపట్లో ప్రజా దర్బార్.. ►ప్రజా దర్భార్‌లో కోసం భారీగా వచ్చిన ప్రజలు.. గడీల పాలన అంతం కోసం ఇనుప కంచెలను తొలగించి, జ్యోతిరావు పూలే ప్రజా భవన్ కు తెలంగాణ ప్రజలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ప్రజా దర్బార్ లో తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజా భవన్ కు తరలివచ్చిన ప్రజలు.@revanth_anumula#PrajalaTelanganaSarkaar pic.twitter.com/quqLv4pKeT — Telangana Congress (@INCTelangana) December 8, 2023 తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిన్న(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. నేడు, జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్(ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజా దర్బార్‌ను నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బర్ నిర్వహించనున్నారు. ఈ ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ తొలి అడుగు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎన్నికల సమయంలో రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక, విద్యుత్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. సెక్రటేరియట్లో విద్యుత్ శాఖపై మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టనున్నారు. సీఏండీ ప్రభాకర్ రావును రివ్యూకు అటెండ్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థలో 85వేల కోట్ల అప్పులపై ఆరా తీయనున్నారు. నేడు సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరోవైపు, విద్యుత్ సంక్షోభం సృష్టించే కుట్ర జరిగిందని తొలి క్యాబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించిన సీఎం రేవంత్. అయితే, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. Praja Telangana - ప్రజల తెలంగాణ 10 గంటలకు ప్రజాభవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్. -- తమ వినతులతో ప్రజా భవన్ కు భారీగా చేరుకున్న ప్రజలు. Telangana Chief Minister Revanth Reddy Praja Darbar at Praja Bhavan at 10 o'clock. -- People reached the Praja… pic.twitter.com/aZUhEhzd43 — Congress for Telangana (@Congress4TS) December 8, 2023 -
నన్నెవరూ ఆపలేరు.. మహిళా దర్బార్‌లో గవర్నర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదు. నా పని నేను చేస్తాను. నన్ను ఎవరూ ఆపలేరు. మహిళల సమస్య లను పరిష్కరించే వరకు పోరాడతా..’ అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. ఒక మహిళగా తను స్త్రీ సమస్యలకు ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. రాష్ట్రంలోని మహిళల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ఒక బలమైన శక్తిగా ముందు నిలుస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన మహిళా ప్రజా దర్బార్ కార్యక్రమంలో గవర్నర్ పాల్గొన్నారు. హాజరైన మహిళలతో నింపాదిగా మాట్లాడి వారి సమస్య లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారినుద్దేశించి మాట్లాడారు. మహిళా దర్బార్‌కు పెద్దయెత్తున వినతులతో మహిళలు తరలి రావడంతో తన బాధ్యత మరింత పెరిగినట్లు భావిస్తున్నానని తమిళిసై చెప్పారు. మహిళా దర్బార్‌కు వచ్చిన ప్రతి వినతిని రికార్డు చేయటమే కాకుండా, ఆయా వినతులను సంబంధిత ప్రభుత్వ శాఖ లకు పంపించి వాటి పరిష్కారం కోసం నిరంతరం పర్యవేక్షి స్తానని తెలిపారు. ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే.. ఎన్నో సమస్యలతో మహిళలు సతమతం ‘రాజ్యాంగబద్ధమైన హోదాలో ఉన్న గవర్నర్ విషయంలో ప్రభుత్వం గౌరవప్రదంగా ఉండాలి. ప్రొటోకాల్ పాటిం చాలి. కానీ రాజ్‌భవన్‌కు రాష్ట్ర ప్రభుత్వ సహకారం సంతృప్తి కరంగా లేదు. నాకు వ్యక్తిగత గౌరవం అక్కర్లేదు. ప్రజలకు సంబంధించిన సమస్యలపై స్పందిస్తే చాలు. ప్రజాదర్బార్, మహిళా దర్బార్‌కు వచ్చిన వినతులపై ఆయా శాఖలు వేగంగా స్పందించి పరిష్కరిస్తే సరిపోతుంది. నేను సీఎంను కలవనప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కారమైతే చాలు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ముందుగా మహిళ లకు అం డగా ఉండాలనే ఉద్దేశంతో మహిళా దర్బార్ నిర్వహిస్తున్నా. కేవలం 24 గంటల క్రితమే దీనిపై నిర్ణయం తీసుకున్నా. విశేష స్పందన వచ్చింది. మహిళలు ఎన్నో సమస్యలతో సత మతమవుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు..’ అని తమిళిసై స్పష్టం చేశారు. రాజ్‌భవన్‌కు ఆ హక్కు ఉంది ‘కొందరు రాజ్‌భవన్‌లో ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించ డాన్ని ప్రశ్నిస్తున్నారు. కానీ రాజ్‌భవన్‌కు ఇలాంటి కార్య క్రమాలు నిర్వహించే హక్కు ఉంది. ఇది రాజకీయ కార్యా లయం కాదు. నేను చేయదగిన కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తున్నా. మహిళా దర్బార్ భవిష్యత్తులోనూ కొనసాగి స్తాను. జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించాను. ఇప్పటివరకు ఎలాంటి నివేదిక ఇవ్వలేదు. బహుశా వాళ్ల టైం స్లోగా నడుస్తున్నట్టుంది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని నేను గౌరవిస్తాను. ప్రభుత్వం కూడా అలాగే స్పందించాలి. నేను వివాదాస్పద వ్యక్తిని కాదు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే లక్ష్యంతో పని చేస్తున్నా..’ అని తెలిపారు. ఒక వారధిగా ఉంటాను ‘ప్రభుత్వ కార్యాలయాలున్నదే ప్రజల కోసం. ఎలాంటి కార్యాలయమైనా ప్రజలు వచ్చే వీలుండాలి. కొందరు ‘గవ ర్నర్ ప్రజలను కలుస్తారా?’’ అని ప్రశ్నించారు. ప్రజలను కలిసేందుకే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా. కోవిడ్–19 సమయంలో సెక్యూరిటీ వాళ్లు వద్దన్నా రోగులు, బాధిత వైద్యులు, వైద్య సిబ్బందిని కలిసి పరామర్శించాను. సమాజంలో ఎక్కువ శాతం బాధపడుతున్నది మహిళలే. ఒక మహిళగా నేను బాధిత మహిళలకు అండగా ఉండి, ఆదరిం చాలని ఆశిస్తున్నాను. నా తెలంగాణ మహిళలకు తోడుగా ఉండాలనుకుంటున్నాను. మహిళలకు, ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఉంటాను. తెలంగాణ మహిళలు సురక్షితంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. ఆ మహిళల వెన్నంటి ఉంటాను. నాకున్న బాధ్యతలను నేను సమర్థవంతంగా నెరవేరుస్తాను. బాధితుల స్వరాన్ని ప్రభుత్వానికి వినిపిస్తాను. ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలకు ఇలాంటి మద్దతు చాలా అవసరం. మనం గెలుస్తాం. మహిళల గెలుపును ఎవరూ ఆపలేరు..’ అంటూ గవర్నర్ అచ్చ తెలుగులో మహిళలకు భరోసా ఇచ్చారు. దీంతో అక్కడున్నవారు పెద్దయెత్తున చప్పట్లతో మద్దతు పలికారు. మహిళలకు రక్షణ లేదంటూ వినతులు మహిళా దర్బార్‌కు పెద్ద సంఖ్యలో వినతులు వచ్చాయి. దాదాపు 5 వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. వచ్చిన వారిలో ఎక్కువ మంది మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, వారిపై దాడులు విపరీతంగా పెరిగా యని, అడుగడుగునా అత్యాచారాలు జరుగుతున్నా యని, శాంతి భద్రతలు గాడి తప్పాయని ఫిర్యాదు చేశారు. మరోవైపు జీఓ 317 కారణంగా పిల్లలకు దూరంగా ఉద్యోగం చేస్తున్నట్లు పాలిటెక్నిక్ కాలేజీ అధ్యాపకురాలు ఉదయశ్రీ గవర్నర్‌కు వినతి సమ ర్పిం చారు. సిద్దిపేట జిల్లా నంగునూరుకు చెందిన 92 సంవ త్సరాల కుందేటి పెద్దమ్మ.. తాను స్వాతంత్య్ర సమర యోధురాలినని, అయినా తనకు పింఛను రావడం లేదని వివరించారు. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు కూడా హాజరై వినతులు సమర్పించారు. ఇది కూడా చదవండి: రైతుబంధు నిధులు వెంటనే జమచేయాలి -
తెలంగాణ గవర్నర్ తమిళ సై కీలక నిర్ణయం
-
తెలంగాణ గవర్నర్ తమిళిసై కీలక నిర్ణయం.. ఇక గవర్నర్ ప్రజాదర్బార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే రీతిలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ అభీష్టానికి విరుద్ధంగా రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించాలన్న తన పంతాన్ని ఆమె నెగ్గించుకోబోతున్నారు. ప్రజాదర్బార్‌లో భాగంగా ఈ నెల 10న ఉదయం 12 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు తమిళిసై రాజ్‌భవన్‌లో ‘మహిళా దర్బార్’నిర్వహిస్తారని గవర్నర్ కార్యాలయం బుధవారం ప్రకటించింది. దీంతో గవర్నర్ ప్రజాదర్బార్‌కు శ్రీకారం చుట్టబోతున్నట్టు స్పష్టమైంది. మరుగునపడిపోయిన మహిళల గొంతుకను ఆలకించడానికి గవర్నర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు రాజ్‌భవన్ పేర్కొంది. గవర్నర్‌ను కలవాలనుకుంటున్న మహిళలు 040–23310521 నంబర్‌కు ఫోన్ లేదా rajbhavan&hyd@gov.inకు మెయిల్ చేసి అపాయింట్మెంట్ పొందాలని కోరింది. రెండేళ్లుగా ఆలోచన...: తమిళిసై గవర్నర్‌గా 2019 సెప్టెంబర్ 8న బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆమె తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఐదేళ్ల పాటు వ్యవహరించారు. గవర్నర్‌గా వచ్చిన తొలినాళ్లలోనే ప్రజాదర్బార్ నిర్వహించాలన్న తన మనోగతాన్ని బయటపెట్టారు. ప్రజాదర్బార్ నిర్వహణకు ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను సైతం రూపకల్పన చేయించారు. సామాన్య ప్రజలను స్వయంగా కలుసుకుని వారి నుంచి అర్జీలు స్వీకరించి, ఆన్లైన్ ద్వారా సంబం ధిత ప్రభుత్వ శాఖలకు పంపించడానికి, వాటి పరిష్కారానికి ఆయా శాఖలతో సమీక్షించడానికి, పురోగతిని తెలుసుకోవడానికి ఏర్పాట్లు చేశారు. కోవిడ్–19 మహమ్మారి వల్ల ప్రజాదర్బార్ నిర్వహించాలన్న తన ఆలోచనను వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని, త్వరలో శ్రీకారం చుడతానని ఇటీవల తమిళిసై మీడియాకు వెల్లడించారు. అర్జీల స్వీకరణకు గత జనవరి 1న రాజ్‌భవన్ గేటు ఎదుట ఆమె ఓ పెట్టెను సైతం ఏర్పాటు చేయించగా, ప్రభుత్వానికి ఏ మాత్రం రుచించలేదు. గవర్నర్ చర్యపై విలేకరులు గతంలో ఓసారి సీఎం కేసీఆర్ అభిప్రాయం కోరగా, ఆయన దీనిని ‘సిల్టీ థింగ్’(చిల్లర విషయం)గా పరిగణి స్తున్నామని వెల్లడించడం గమనార్హం. ఆమె శుక్రవారం నుంచి ప్రజాదర్బార్‌కు శ్రీకారం చుట్టబోతుండగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిస్పందన ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. పెరిగిన విభేదాలు, వివాదాలు: గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు పరాకాష్టకు చేరడంతో కొంత కాలంగా రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగిపోయింది. బహిరంగంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే స్థాయికి సంబంధాలు క్షీణించాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ముందు తన ప్రసంగాన్ని రద్దు చేశారని, రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర దినోత్సవానికి సీఎం, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులెవరూ హాజరు కాకుండా తనను అవమానించారని, మేడారం జాతరకు వెళ్లడానికి హెలికాప్టర్ కోరితే నిరాకరించారని, క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు రావడం లేదని, సీఎం కేసీఆర్ తనను కలవడానికి రాజ్‌భవన్‌కు రావడం లేదని.. ఇలా గవర్నర్ పలు సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఆమె ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సైతం కలిసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై ఫిర్యాదు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ అవినీతి జరిగినట్టు ఫిర్యాదులున్నాయని, దర్యాప్తు జరిపించాలని సైతం కోరారు. మరోవైపు గవర్నర్ తమిళిసై బీజేపీ మూలాలను కలిగి ఉండటంతో రాజ్‌భవన్‌ను బీజేపీ రాజకీయాలకు కేంద్రంగా మార్చారని పలువురు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ అగ్రనేతలు ప్రత్యారోపణలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ప్రజాదర్బార్ నిర్వహించాలని గవర్నర్ నిర్ణయించడంతో వివాదం మరింతగా ముదిరే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. -
గవర్నర్.. ప్రజాదర్బార్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజల సాదక బాధలను తెలుసుకుని వారికి ఉపశమనం కల్పించే చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు చేయాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నిర్ణయించారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో నెలకోసారి ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించనున్నారు. గవర్నర్ ఆదేశాలతో రాజ్‌భవన్ సచివాలయం ప్రజాదర్బార్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులకు కచ్చితంగా పరిష్కారం లభించేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. దరఖాస్తులకు పరిష్కారం లభించిందా? అవి ఏ దశలో ఉన్నాయి? ఏ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి? ఎన్ని రోజులుగా పెండింగ్‌లో ఉన్నాయి? తదితర వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు కొత్త ఫైల్ ట్రాకింగ్ సాఫ్ట్‌వేర్‌ను రాజ్‌భవన్ సచివాలయం రూపొందిస్తోంది. రాజ్‌భవన్ సచివాలయం అన్ని ప్రభుత్వ శాఖలతో అనుసంధానమై పనిచేసే విధంగా ఈ సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేస్తున్నారు. నెల రోజుల్లో ఏర్పాట్లు పూర్తికానున్నాయని, ఆ తర్వాత గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహణ తేదీని ప్రకటిస్తారని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. నేపథ్యంమిది... సీఎం కేసీఆర్ ప్రజలను కలుసుకోవడం లేదని, ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు ఓ వేదిక లేకుండా పోయిందని, కనీసం మీరైనా ప్రజాదర్బార్ నిర్వహించాలని ఎంబీటీ నేత అంజాదుల్లా ఖాన్ ట్వీట్టర్ వేదికగా గవర్నర్‌కు విజ్ఞప్తి చేయగా, తమిళిసై సానుకూలంగా స్పందించారు. ప్రజాదర్బార్‌పై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నానని, ఈ అంశం తన పరిశీలనలో ఉందని గతేడాది సెప్టెంబర్‌లో ట్వీట్టర్లో ప్రకటించారు. ఆ తర్వాత మరో రెండు దఫాల్లో ప్రజాదర్బార్ నిర్వహిస్తానని ప్రకటన చేశారు. ఆ దిశగా రాజ్‌భవన్ సచివాలయం చకచకా ఏర్పాట్లు చేస్తోంది. వైఎస్‌తో ప్రారంభమై... ఉమ్మడి రాష్ట్రంలో 2004కు ముందు ముఖ్యమంత్రులు సాధారణ ప్రజలను నేరుగా కలిసి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించే వ్యవస్థ లేదు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2004లో ఆయన లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు 7 నెలల పాటు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆ తర్వాత గ్రీన్‌ల్యాండ్స్‌లో కొత్త నివాసం ఏర్పాటు చేసుకున్నాక ఐదేళ్ల పాటు ఆయన సాధారణ ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకునేవారు. ఆయన మరణం తర్వాత సీఎంగా పనిచేసిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి సైతం ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాదర్బార్ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. పాత సీఎం క్యాంపు కార్యాలయం వాస్తుప్రకారం లేకపోవడంతో కొత్త కార్యాలయం కట్టుకున్న తర్వాత కేసీఆర్ ప్రజాదర్బార్ నిర్వహిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. ప్రగతి భవన్ నిర్మాణం పూర్తైనా సామాన్య ప్రజలు ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం లేకుండా పోయింది. సీఎంను కలసి తమ సమస్యలను వినిపించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రగతిభవన్‌కు వచ్చే సాధారణ ప్రజలను అక్కడి భద్రత సిబ్బంది ‘సీఎం అపాయింట్మెంట్’లేదని పేర్కొంటూ వెనక్కి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్‌లో ప్రజాదర్బార్ నిర్వహించాలని నిర్ణయించడం రాజకీయంగా ప్రత్యేకత సంతరించుకుంది. గవర్నర్లు ప్రజాదర్బార్ నిర్వహిస్తే ప్రజల్లో చెడు సంకేతాలు వెళ్తాయని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత స్థాయి అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో ఎన్నడూ గవర్నర్లు ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుంచి విజ్ఞప్తులు తీసుకున్న సందర్భాలు సైతం లేవని గుర్తు చేస్తున్నాయి. -
ఈ నెల 5 నుంచి ‘రాజన్న ప్రజాదర్బార్’
సాక్షి, కావలి: నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల్లో ప్రజల సమస్యలను ప్రజల వద్దకే వచ్చి తెలుసుకుని అక్కడికక్కడే అధికారులతో సమస్యలు పరిష్కరించుకొనేందుకు సాధ్యాసాధ్యాలు చర్చించి నిర్ణయం తీసుకొనే ‘రాజన్న ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని ఈ నెల 5 వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చూపిన స్ఫూర్తితో, ఆయన తనయుడు, రాష్ట్ర ప్రజల అభిమాన నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సాహంతో నియోజకవర్గంలో ‘రాజన్న ప్రజాదర్బార్’ కార్యక్రమాన్ని నిరంతరం నిర్విహించనున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం, ముఖ్యంగా ప్రజలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభ్యున్నత సాధించడానికి అవసరమైన చారిత్రాత్మకమైన చట్టాలు, పథకాలు అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షల మేరకు, వాటిని ప్రజలకు చేర్చాలనేదే రాజన్న ప్రజాదర్బార్ మౌలిక లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కులాలకు, మతాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వం అందించే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందరికీ అందేలా చేయడం కోసం నిర్వహిస్తున్న రాజన్న ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని తమ వ్యక్తిగత సమస్యలు, వార్డు, గ్రామ సమస్యలు తెలియజేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ప్రజల తెలియజేసే ఏ చిన్న పెద్ద సమస్య అయినా, ప్రభుత్వం ద్వారా చేసే అవకాశం ఏమాత్రం ఉన్నా అధికారుల ద్వారా అవసరమైతే సంబంధిత శాఖల మంత్రులు, ముఖ్యమంత్రి ద్వారా వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చెప్పారు. -
జూలై 1నుంచి వైఎస్ జగన్ ప్రజాదర్బార్
-
1 నుంచి వైఎస్ జగన్ ప్రజాదర్బార్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జూలై 1వ తేదీ నుంచి తన క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం(సీఎంవో) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం పీఠాన్ని అధిష్టించిన దగ్గర్నుంచి జగన్ తరచుగా సామాన్య ప్రజలను కలుస్తూనే ఉన్నారు. అయితే, ఒక క్రమపద్ధతిలో ఈ కలయికలు జరుగలేదు. అందువల్ల తానే స్వయంగా ప్రజానీకాన్ని కలుసుకునేందుకు వీలుగా జూలై 1 నుంచి ప్రజాదర్బార్‌ను తలపెట్టారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించేవారు. ఆయన తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా కొంతవరకూ అదే బాటను అనుసరించే యత్నం చేసినప్పటికీ సఫలం కాలేదు. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన తండ్రి బాటలో పయనిస్తూ ప్రజలను ప్రతిరోజూ ఒక గంట పాటు కలుసుకోవాలని నిర్ణయించారు. ప్రజాదర్బార్‌లో పాల్గొన్న తర్వాతే సీఎం తన రోజువారీ అధికారిక కార్యక్రమాలు, శాఖాపరమైన సమీక్షల్లో పాల్గొంటారని ప్రభుత్వ అధికార వర్గాలు వెల్లడించాయి. జగన్ క్యాంపు కార్యాలయం ఆవరణలో ఓ వైపున ఆయన కోసం వచ్చే సందర్శకులు వేచి ఉండటానికి ఒక షెడ్డును ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ వేచి ఉండే వారికి మంచినీటి సదుపాయం, పెద్ద ఫ్యాన్లు సైతం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు, నివేదనలను ముఖ్యమంత్రి స్వీకరిస్తారు. సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటారు. -
ప్రజాదర్బార్‌ను మరిచారు!
కర్నూలు(అగ్రికల్చర్),న్యూస్‌లైన్ : జిల్లా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను చూపేందుకు నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని అధికారులు విస్మరించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమానికి అన్నిశాఖల అధికారులూ డుమ్మా కొట్టారు. పార్లమెంటు, శాసనసభ ఎన్నికలకు ముందు ప్రతి సోమవారమూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ కలెక్టర్, తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజాదర్బార్ నిర్వహిస్తుండేవారు. అయితే ఎన్నికల నేపథ్యంలో దాదాపు రెండు నెలలపాటు అవి నిలిచిపోయాయి. డయల్ యువర్‌కలెక్టర్ ప్రారంభం కాకపోయినా సోమవారం ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని తిరిగి కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి ప్రారంభించారు. కలెక్టర్‌తోపాటు అదనపు జేసీ అశోక్‌కుమార్, డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి కాన్ఫరెన్స్ హాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అయితే కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులూ డుమ్మా కొట్టారు. కొన్ని శాఖల నుంచి కిందిస్థాయి సిబ్బంది మాత్రమే హాజరయ్యారు. దీంతో కలెక్టర్ తదితరులు ప్రజల నుంచి వినతులు తీసుకుని ఎండార్స్మెంట్ రాసి ఫలానా అధికారిని కలువాలని సూచించి పంపారు.