prasanth kishore
-
ఆసక్తి రేపుతున్న పవార్, ప్రశాంత్ కిశోర్ భేటి.. అందుకేనా?
న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) శరద్ పవార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. దీంతో రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేను ధీటుగా ఎదుర్కొనేందుకు దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. కాగా జూన్ 11న ముంబైలోని శరద్ పవార్ ఇంటిలో వారి సమావేశం తరువాత నేడు ఢిల్లీలో మళ్లీ కలుసుకున్నారు. నేడు జరిగిన భేటీతో ఈ ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. నివేదికల ప్రకారం.. రాజకీయ వ్యూహకర్తను కలిసిన తరువాత, 15 పార్టీలతో కూడిన విపక్ష ప్రతినిధులను మంగళవారం సాయంత్రం 4 గంటలకు సమావేశానికి హాజరు కావాలని పవార్ ఆహ్వానించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చడేమే గాక ఆసక్తి కూడా రేపుతోంది. ‘ఇది సాధారణ సమావేశంగా కలిసామని, రాజకీయాలతో సంబంధం లేదని’ కిషోర్ అన్నారు. టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా ప్రారంభించిన రాజకీయ యాక్షన్ గ్రూప్ రాష్ట్ర మంచ్ సమావేశం శరద్ పవార్ నివాసంలో జరుగునుంది. ఈ సమావేశనికి ఎన్సీపీకి చెందిన మజీద్ మీనన్, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఘన్‌శ్యామ్ తివారీ ఇతర నాయకులు పాల్గొననున్నారు. ఇక తాజా భేటీలో ఎన్సీపీ మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్, పవార్ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కీలక నేతలు ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్ హాజరు కాలేదు. పవార్, ప్రశాంత్ కిషోర్ భేటీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో బీజేపీని ధీటుగా ఎదుర్కొనే దిశగా చర్చలు సాగినట్టు సమాచారం. #NewsAlert | Prashant Kishor meets NCP chief Sharad Pawar in Delhi. Kishor says, 'it's just a routine meeting'. This is the second meeting between the duo in 2 months. Prashant Kumar with analysis. pic.twitter.com/FIJB6E4RS8 — TIMES NOW (@TimesNow) June 21, 2021 చదవండి: బీజేపీతో కలిసిపోదాం.. సీఎంకు శివసేన ఎమ్మెల్యే లేఖ -
ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేసిన వైఎస్ జగన్
గుంటూరు : ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలకు ఆ పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయనను పార్టీ శ్రేణులకు పరిచయం చేశారు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర వహించిన ప్రశాంత్ కిషోర్‌ను పరిచయం చేస్తూ రానున్న ఎన్నికల నేపథ్యంలో పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ సహకారం అందించనున్నారని తెలిపారు. అందరం కలిసికట్టుగా పార్టీ విజయం కోసం.... శ్రమిద్దామని పిలుపునిచ్చారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీని ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టడంలో ప్రశాంత్ కిషోర్ క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. అలాగే బిహార్‌లో నితీశ్ కుమార్ సీఎం గద్దెనెక్కడానికి, పంజాబ్‌లో విజయం సాధించి కెప్టెన్ అమరీంద్ర సింగ్ ముఖ్యమంత్రి కావడానికి కూడా ప్రశాంత్ కిషోర్ కృషి ఉందన్నారు. అయితే ఒక్క ఉత్తరప్రదేశ్ లో మాత్రం ఎన్నికల ఫలితాలు అటూ ఇటూగా అయ్యాయని, అయితే అందుకు కారణాలు కూడా అందరికీ తెలుసునని వైఎస్ జగన్ అన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉంటారని ఆయన తెలిపారు. -
షీలాదీక్షిత్ ఎవరి ఎంపికో తెలుసా?
ఎన్నికల వ్యూహకర్తగా ప్రసిద్ధిచెందిన ప్రశాంత్ కిషోర్ రచించిన స్క్రీన్ ప్లే ప్రకారమే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన కొనసాగుతోందని స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన చేసిన ప్రతిపాదన మేరకే యూపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ను రంగంలోకి దింపడం అందుకు ప్రత్యక్ష సాక్ష్యం. ఓ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీ సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ సంప్రదాయం కాదు. కానీ ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని పార్టీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పట్టుబట్టారు. బ్రాహ్మణ వర్గం నుంచే సీఎం అభ్యర్థి ఉండాలని కూడా సూచించారు. ఆయన మొదటి ప్రాధాన్యం ప్రియాంక గాంధీకాగా, రెండో ప్రాధాన్యం షీలా దీక్షిత్. రాహుల్‌కు పార్టీలో ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ప్రియాంకను రంగంలోకి దించడం పార్టీ అధిష్టానానికి ఏ మాత్రం ఇష్టం లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలు ఉన్నా.. షీలా దీక్షిత్‌ను రంగంలోకి దింపక తప్పలేదు. ముందుగా పార్టీ సీనియర్ నాయకుల నుంచి రాజ్‌బబ్బర్ పేరు తెరమీదకు రాగా, పార్టీలో ప్రశాంత్ కిషోర్ వ్యూహరచన కూడా సాగడం లేదనే వదంతులు వచ్చాయి. యూపీలో ఉన్న 12 శాతం బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకోవాలంటే షీలాదీక్షిత్‌ను రంగంలోకి దించక తప్పదనే ప్రశాంత్ కిషోర్ వాదనతో కాంగ్రెస్ అధిష్ఠానం ఏకీభవించింది. యాదవులు, జాట్లకు వ్యతిరేకంగా బ్రాహ్మణులను ఆకర్షించక తప్పని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. యాదవులు, దళితుల్లో ఇప్పటికే ఎస్పీ, బీఎస్పీ పార్టీలకు పట్టు ఎక్కువగా ఉంది. బీజేపీని ప్రస్తుతం రాష్ట్రంలో వ్యతిరేకిస్తున్న బ్రాహ్మణవర్గాన్ని ఆకర్షించడమే సులువైన మార్గమన్నది కిషోర్ అభిప్రాయం. పైగా షీలా దీక్షిత్ యూపీ కోడలు కూడా. ఆమె మామ ఉమా శంకర్ దీక్షిత్ యూపీలో పేరుపొందిన బ్రాహ్మణ నాయకుడు. ఓ వ్యక్తిపైనే ప్రధానంగా ప్రచారాన్ని కేంద్రీకరించి పనిచేయడం ప్రశాంత్ కిషోర్‌కు అలవాటు. ఆయన 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీపైనా, ఆ తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్ కుమార్‌పైనా దృష్టిని కేంద్రీకరించే ప్రచారవ్యూహాన్ని అమలు చేసి.. విజయం సాధించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ ఈసారి కూడా ప్రచారం చేయనున్నా.. పార్టీ ప్రచార బాధ్యతలను ఆమెకు పూర్తిగా అప్పగించడం లేదు. ఇదివరకు రాహుల్ గాంధీ విషయంలో చేసిన పొరపాటును ప్రియాంక గాంధీ విషయంలో చేయరాదన్నది పార్టీ అధిష్టానం ఉద్దేశం. అందుకనే పార్టీ ఈసారి అన్ని సామాజిక వర్గాల నుంచి ఎంపికచేసిన నాయకులకు పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించింది. ఫలితం ఎలా ఉంటుందో చూడాలని స్థానిక పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తుండగా, కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలైతే ఆ పరాభవం బాధ్యతను ప్రియాంక గాంధీ పంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందని ఆమె మద్దతుదారులు వ్యాఖ్యానిస్తున్నారు. -
'యూపీ ఎన్నికల వరకు కాంగ్రెస్ తోనే'
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగిసే వరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉంటానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. సీనియర్ నాయకుల వ్యవహారం నచ్చక కాంగ్రెస్ కు దూరమవుతారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. యూపీ ఎన్నికల ప్రచారానికి కొత్త టీమ్ ను ఏర్పాటు చేయాలని ప్రశాంత్ కిశోర్ పట్టుబడుతున్నట్టు సమాచారం. కమల్ నాథ్, గులాంనబీ ఆజాద్, షీలా దీక్షిత్ వంటి సీనియర్ నాయకులతో ఈ బృందం ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. దీంతో పలువురు సీనియర్ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. అమరీందర్ సింగ్, షకీల్ అహ్మద్ వంటి నాయకులు బహిరంగంగానే ఆయనపై విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిశోర్ గుడ్ బై చెబుతారని ప్రచారం జరిగింది. ఇవన్నీ ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ లకు ఎన్నికల ప్రచారంతో వ్యూహకర్తగా వ్యవహరించి వారికి విజయాలు సాధించిపెట్టడంలో ప్రశాంత్ కిశోర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
లిస్టు ఇస్తేనే అసెంబ్లీ టికెట్లు!
వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిబద్ధత కలిగిన కార్యకర్తల జాబితా ఇవ్వని నేతలకు అసెంబ్లీ టికెట్లు ఇచ్చేది లేదని కాంగ్రెస్ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత కిషోర్ హెచ్చరించారు. 2017 సంవత్సరంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్న ఆయన.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నేతలకు లేఖలు రాశారు. ఈ లేఖలను యూపీసీసీ ఒకటి రెండు రోజుల్లో నేతలకు పంపనుంది. దాని ప్రకారం ప్రతి నియోజకవర్గంలో పార్టీ పట్ల నిబద్ధత కలిగిన 20 మంది కార్యకర్తల జాబితాను ఇవ్వాల్సి ఉంటుంది. అలా జాబితా ఇవ్వనివాళ్లకు ఎట్టిపరిస్థితుల్లో టికెట్లు ఇచ్చేది లేదని ప్రశాంత కిషోర్ స్పష్టం చేశారు. ప్రతి బూత్ వారీగా కార్యకర్తల జాబితాలు కావాల్సిందేనని వారణాసిలో ఇటీవల జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కూడా చెప్పారు. ఎన్నికలకు తగిన వాతావరణాన్ని సిద్ధం చేస్తానని, అయితే అందుకు యూపీ కాంగ్రెస్ నేతల నుంచి సహకారం కావాలని ఆయన అన్నారు. లిస్టు ఇవ్వకుండా టికెట్ కావాలంటే కుదరదని, రాహుల్ వద్దకు వెళ్లినా ఆయన కూడా కార్యకర్తల బలం లేకుండా నెగ్గలేమన్న విషయాన్ని అంగీకరిస్తారని తెలిపారు. పార్టీ బలంగా ఉన్నచోటల్లా నేతలు ర్యాలీలు చేయాలని.. అయితే ఏ నియోజకవర్గం కూడా బలమైనది, బలహీనమైనదని చెప్పలేమని అన్నారు. గుజరాత్లో గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ కంటే కాంగ్రెస్‌కు నాలుగు సీట్లు ఎక్కువ వచ్చినా, పట్టణ ప్రాంతాలపై దృష్టి పెట్టకపోవడంతో ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్నారు. యూపీ మహిళా కాంగ్రెస్ నేతలు కూడా నియోజకవర్గాల వారీగా కార్యకర్తల జాబితా ఇవ్వడం లేదని ప్రశాంత కిషోర్ మండిపడ్డారు. దళితుల ఓటుబ్యాంకు బీఎస్పీకి ఉందని భయపడాల్సిన అవసరం లేదని, అదే ఉంటే గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు సీట్లు వచ్చి, బీఎస్పీకి ఒక్కటీ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ప్రతి పార్టీలోనూ విభేదాలు ఉంటాయని.. అలాగే కాంగ్రెస్‌లో కూడా ఉన్నాయని, దానిగురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.