
న్యూఢిల్లీ : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) శరద్ పవార్, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం ఢిల్లీలో సమావేశం అయ్యారు. దీంతో రానున్న 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయేను ధీటుగా ఎదుర్కొనేందుకు దేశంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఊహాగానాలు ఊపందుకున్నట్లు తెలుస్తోంది. కాగా జూన్ 11న ముంబైలోని శరద్ పవార్ ఇంటిలో వారి సమావేశం తరువాత నేడు ఢిల్లీలో మళ్లీ కలుసుకున్నారు. నేడు జరిగిన భేటీతో ఈ ప్రచారం మరింత జోరుగా సాగుతోంది.
నివేదికల ప్రకారం.. రాజకీయ వ్యూహకర్తను కలిసిన తరువాత, 15 పార్టీలతో కూడిన విపక్ష ప్రతినిధులను మంగళవారం సాయంత్రం 4 గంటలకు సమావేశానికి హాజరు కావాలని పవార్ ఆహ్వానించడం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూర్చడేమే గాక ఆసక్తి కూడా రేపుతోంది. ‘ఇది సాధారణ సమావేశంగా కలిసామని, రాజకీయాలతో సంబంధం లేదని’ కిషోర్ అన్నారు. టీఎంసీ నేత యశ్వంత్ సిన్హా ప్రారంభించిన రాజకీయ యాక్షన్ గ్రూప్ రాష్ట్ర మంచ్ సమావేశం శరద్ పవార్ నివాసంలో జరుగునుంది.
ఈ సమావేశనికి ఎన్సీపీకి చెందిన మజీద్ మీనన్, సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఘన్‌శ్యామ్ తివారీ ఇతర నాయకులు పాల్గొననున్నారు. ఇక తాజా భేటీలో ఎన్సీపీ మహారాష్ట్ర చీఫ్ జయంత్ పాటిల్, పవార్ మేనల్లుడు, ఎమ్మెల్యే రోహిత్ పవార్ పాల్గొన్నారు. ఈ సమావేశానికి కీలక నేతలు ప్రఫుల్ పటేల్, అజిత్ పవార్ హాజరు కాలేదు. పవార్, ప్రశాంత్ కిషోర్ భేటీలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుతో బీజేపీని ధీటుగా ఎదుర్కొనే దిశగా చర్చలు సాగినట్టు సమాచారం.
#NewsAlert | Prashant Kishor meets NCP chief Sharad Pawar in Delhi. Kishor says, 'it's just a routine meeting'.
— TIMES NOW (@TimesNow) June 21, 2021
This is the second meeting between the duo in 2 months.
Prashant Kumar with analysis. pic.twitter.com/FIJB6E4RS8