PRATIBHA PURASKARLU
-
అలా పిలిస్తే నా లక్ష్యం నెరవేరినట్టే!
తెనాలి: మోక్ష... టీవీ షో, సీరియల్, వెబ్ సిరీస్‌ల ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు. మూడున్నరేళ్లకే కెమెరా ముందు కనిపించింది. 13 ఏళ్లకు బాలనటిగా స్టార్‌డమ్‌ను తెచ్చుకుంది. తన అద్భుత నటనతో పద్మమోహన అవార్డు, జాతీయ ప్రతిభా పురస్కార్ సహా 19 అవార్డులను గెలుచుకుంది. ఇటీవల బాలల దినోత్సవంలో భాగంగా జరిగిన వివేక కల్చరల్ ఫెస్ట్‌లో బాల అతిథిగా తన మాట, ఆట, పాటతో సందడి చేసింది. ఈ నేపథ్యంలో పలుకరించిన ‘సాక్షి’తో బోలెడు కబుర్లు పంచుకుంది. వివరాలు ఆమె మాటల్లోనే... ‘‘ నా పూర్తి పేరు మోక్ష విజయ రామలక్ష్మి. తల్లిదండ్రులు సురేష్‌బాబు, శంకరీ రాజ్యలక్ష్మి. స్వస్థలం రాజమహేంద్రవరం. మూడున్నరేళ్ల వయసులో ఓ ఫంక్షనుకు తీసుకెళ్లారు. అక్కడే టీవీ షోకు ఆడిషను జరుగుతోంది. నన్ను చూసి బాగుందనటంతోపాటు ఆడిషనులో కూర్చోబెట్టారు. సెలెక్టు చేసుకున్నారు. అందరికీ టికెట్లు పంపి, హైదరాబాద్‌కు ఆహ్వానించారు. అలా ఊహ తెలీని వయసులో ‘పిల్లలు పిడుగులు’ టీవీ షోలో నటించాను. తర్వాత అవకాశాలు వరుసకట్టాయి. హైదరాబాద్‌కు వచ్చేశాం..నాన్నకు ఊరిలో ఉన్న అట్టల ఫ్యాక్టరీని లీజుకిచ్చి హైదరాబాద్‌కు వచ్చేశారు. అమ్మ ఇక్కడే ‘అమెజాన్’లో వర్క్ చేస్తోంది. పలు టీవీ ఛానళ్లలో ‘అయస్కాంతం’, ‘కోడలు’, ‘సూర్యకాంతం’, ‘గుండమ్మకథ’, ‘శుభస్య శీఘ్రం’, ‘నువ్వేకావాలి’ సీరియల్స్, ‘పిల్లలు పిశాచాలు’తో ఆరంభించి ‘డ్రామా జూనియర్స్’, ‘ఎక్స్ట్రా జబర్దస్త్’ వంటి టీవీ షోలు, ‘మ్యూజిక్ స్కూల్’, ‘హీరో’ సినిమాలు, మరికొన్ని వెబ్ సిరీస్‌లలో నటించాను. కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. విభిన్న కళల్లోనూ ప్రతిభ నటనే కాదు.. రచన, చిత్రలేఖనం, డ్యాన్స్, యాంకరింగ్ నాకిష్టం. సినీనటులు శ్రేయ, నాని, అనసూయ ఈ విషయం తెలిసి ప్రశంసించారు. ప్రముఖ యాంకర్ సుమ, ‘నా తర్వాత నువ్వే మోక్ష’ అనటం సంతోషమేసింది. రచనంటే ఇష్టమని చెప్పాకదా... నేను మూడు కథలు రాసుకున్నా. అందులో రెండు షార్ట్ ఫిలిమ్స్, మరోటి వెబ్ సిరీస్. శివుడుకి సంబంధించిన భక్తిపూర్వక కథనం. నాకొచ్చిన కలను డెవలప్ చేసి కథ, స్క్రిప్టు సిద్ధం చేశా. నా దర్శకత్వంలోనే తీయాలని ఆశ పడుతున్నా. తగిన ప్రొడ్యూసర్ ముందుకొస్తే వెబ్ సిరీస్ తీసి, అతి పిన్న దర్శకురాలు అనిపించుకోవాలని ఆశిస్తున్నా. కథానాయిక కావాలనేదే లక్ష్యంపెద్దయ్యాక హీరోయిన్గా నటించాలనేది నా మరో డ్రీమ్. హైదరాబాద్‌లోనే తొమ్మిదో తరగతి చదువుతున్నా. నెలలో రెండు వారాలు బడికి, రెండు వారాలు షూటింగులకు కేటాయించుకున్నా. ఎక్కడకు వెళ్లిన బుక్స్ వెంటే ఉంటాయి. షూటింగ్ గ్యాప్‌లో చదువుకుంటా. పరీక్షల్లో 90 శాతం పైగానే మార్కులు వస్తుంటాయి. కూచిపూడి నాట్యం నేర్చుకుంటున్నా. నా కోసం తల్లిదండ్రులు హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. ఎంతో త్యాగం చేశారు. చదువు, నటన, రచన... అన్నింటిలోనూ గెలిచి, నా తల్లిదండ్రులను గెలిపిస్తూ ఉండాలనేది నా ఆశయం. టాలెంట్ ఉంటే బోలెడు వేదికలుటీవీ, ఓటీటీ ప్లాట్‌ఫాంలు వచ్చాక చిన్న పిల్లల్నుంచి పెద్దల వరకు నటన, సాంకేతిక నైపుణ్యంలో ఎన్నో అవకాశాలున్నాయి. టాలెంట్ ఉన్నవాళ్లు అలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాణించవచ్చు. పిల్లలు చదువుతోపాటు ఏదో ఒక కళలో నైపుణ్యం సాధించాలనేది నా భావన. అప్పుడు జీవితంలో ఉన్నతంగా ఎదుగుతారని చెబుతాను. అందుకు నేనే నిదర్శనం. తెనాలి, రాజమహేంద్రవరం అంటే నాకెంతో ఇష్టం. ఎందరో కళాకారులు ఇక్కడ్నుంచి వచ్చారు. మహానటి సావిత్రి నాకు ఆదర్శం. ఆమె సినిమాలు ఇప్పటికీ ఎవర్‌గ్రీనే కదా!’’ -
12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు
నాంపల్లి (హైదరాబాద్): వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ 2018 ఏడాదికి ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. రామకవచం వెంకటేశ్వర్లు (కవిత), ఆచార్య వెలుదండ నిత్యానందరావు (విమర్శ), డి.అనంతయ్య (చిత్రలేఖనం), ఆర్.గంగాధర్ (శిల్పం), ఓలేటి రంగమణి (నృత్యం), డాక్టర్ ఎస్.కె.వెంకటాచార్యులు (సంగీతం), కల్లూరి భాస్కరం (పత్రికారంగం), రావుల వెంకట్రాజం గౌడ్ (నాటకం), కౌళ్ళ తలారి బాలయ్య (జానపద కళారంగం), డాక్టర్ మలుగ అంజయ్య (అవధానం), ఎన్.అరుణ (ఉత్తమ రచయిత్రి), పి.చంద్రశేఖర ఆజాద్ (నవల) పురస్కారాలకు ఎంపికయ్యారు. (చదవండి: జోనల్ సర్దుబాటు తర్వాత కొత్త ఉద్యోగాలు) డిసెంబరులో హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ తెలిపారు. (చదవండి: ఉద్యోగుల కేటాయింపులో ఆప్షన్లు) -
‘ఆయన ఇంగ్లీషులో మాట్లాడితే ఆశ్చర్యపోవాల్సిందే’
సాక్షి, విజయవాడ : జాతీయ విద్యాదినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏ ప్లస్ కన్వెన్షన్‌లో ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. భారత మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి సందర్భంగా జాతీయ విద్యాదినోత్సవం నిర్వహిస్తున్నాం. సంపూర్ణ అక్షరాస్యత సాధించిన రోజునే అభివృద్ధి సాధ్యం. మా ప్రభుత్వం సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. మైనారిటీ విద్యార్థులకు అనేక రకాల ప్రోత్సాహకాలు ఇస్తోంది. ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజీలకు రూ.ఐదు వేలకు సీఎం జగన్ పెంచారు. దేశంలోనే తొలిసారిగా హజ్ యాత్రికలకు పూర్తి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మనది. జెరూసలెం యాత్రికులకు కూడా ఆదాయాన్ని బట్టి అరవై, ముప్పై వేలు చొప్పున ప్రభుత్వం సాయం అందిస్తుంది. చర్చి ఫాదర్లకు నెలకు ఐదువేలు ఇస్తున్నాం’అన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. ‘విద్యాశాఖ, మైనారిటీ శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉంది. విద్యాభివృద్ధితోనే సమానత్వం వస్తుందని అంబేద్కర్ చెప్పారు. ఆయన స్పూర్తి తో సీఎం జగన్ అందరికీ విద్యను అందేలా కృషి చేస్తున్నారు. మైనారిటీలకు మంచి విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. వైఎస్ జగన్.. అంజాద్ బాషాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చి.. గుర్తించారు. కార్పొరేట్ విద్యా సంస్థల కు పోటీగా ఫలితాలు సాధించిన ప్రభుత్వ విద్యార్దులకు ప్రోత్సాహం అందించాలని జగన్ నిర్ణయించారు. వైఎస్ ఫీజు రీయంబర్స్మెంట్ ఇచ్చి పేదలకు ఉన్నత విద్యను దగ్గర చేశారు. సీఎం జగన్ కూడా దళితులు, మైనారిటీ లకు మెరుగైన విద్యను అందించేలా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇంగ్లీషు మీడియం స్కూల్స్ అందుబాటులోకి తీసుకురావడం ముఖ్యమంత్రి జగన్ చిత్తశుద్ధి నిదర్శనం. దీనిపై కొందరు అవాకులు, చవాకులు పేలుతున్నారు. వైఎస్ జగన్ ఇంగ్లీషులో మాట్లాడితే జాతీయ ఛానళ్లే ఆశ్చర్యపోతాయి. నారా వారు కూడా మాట్లాడతారు.. మనం చూశాం.. బ్రీఫ్ డ్ మీ అని. కమిషన్ల కోసం వందల, వేల కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసింద’అని విమర్శించారు. కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామంద్రారెడ్డి, వెల్లపల్లి శ్రీనివాస్, ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, జోగి రమేష్, ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణ నిధి పాల్గొన్నారు. -
ట్యాబ్‌ల పేరుతో డాబు
నిడమర్రు : చదువుల్లో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభా పురస్కారాలు ప్రచార ఆర్భాటంగా ఉన్నాయని విద్యార్థుల తల్లితండ్రులు విమర్శిస్తున్నారు. ఉన్నత, మాధ్యమిక పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు వారికి ఏటా నగదు పురస్కారాలతోపాటు ట్యాబ్‌లను అందించేందుకు ప్రభుత్వం ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. ఈ పురస్కారాలు ఏటా ప్రచారం కోసం మాత్రమే సా...గుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది ఎంపికైన విద్యార్థులకు రెండు రోజుల క్రితమే నగదు జమచేసినట్లు అధికారులు చెపుతున్నారు. ట్యాబ్లైతే నేటికీ విద్యార్థులకు అందలేదు. ఈ ఏడాదికి సంబంధించి ఈ ప్రతిభా పురస్కారాల కార్యక్రమం మే నెల్లోనే పూర్తయింది. అయితే ఈ ఏడాది ఎవరు ఎంపికయ్యారనే సమాచారం జిల్లా అధికారులు వద్ద లేదు. దీంతో ఈ ప్రతిభ పురస్కారాలు జన సమీకరణ చేసుకునే ప్రభుత్వ ప్రచారంగా మిగిలుతున్నాయి. ట్యాబ్ డాబేనా..? ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనల మేరకు ప్రతిభా అవార్డులకు అన్ని విద్యాస్థాయిల నుంచి జిల్లాలో 525 మంది ఎంపికయ్యారు. 10వ తరగతి నుంచి 388 మంది, ఇంటర్ మీడియట్ నుంచి 39 మంది, ఉన్నత, సాంకేతిక విద్యలో ప్రతిభ చాటిన మరో 98 మందికి ఆయా శాఖల అధికారుల ద్వారా ఎంపిక చేశారు వీరికి ఒక్కొక్కరికి రూ. 20 వేలు నగదు, ట్యాబ్‌లు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది, దీని కోసం గత ఏడాది అక్టోబర్‌లో విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వాటిని అందించాలని అధికారులు జిల్లా నుంచి విద్యార్థులను విజయవాడ తీసుకు వెళ్లారు. అయితే ప్రభుత్వం ముఖ్యులు ఎప్పటిలాగే జిల్లాకు ఒకరిద్దరి చొప్పున ఎంపికచేసిన విద్యార్థులకు ట్యాబ్‌లు, నగదు, పురస్కారాలు సీఎం చేతుల మీదుగా పంచి చేతులు దులుపుకున్నారు. కార్యక్రమం అనంతరం మిగిలిన వారికి ప్రతిభా అవార్డుల సర్టిఫికెట్లు మాత్రమే అందించారు. వారందరికీ ట్యాబ్‌లు వారి వారి స్కూల్స్, కళాశాలలకు పంపిస్తామని చెప్పి ఒట్టి చేతులతో వెనక్కి పంపారు. ఇది జరిగి ఏడాది అవుతున్నా నేటికీ ట్యాబ్‌లు మాత్రం విద్యార్థులకు చేరలేదు. రెండేళ్లుగా ఇలాగే.. 2014–15 సంవత్సరానికి తిరుపతిలో జరిగిన ప్రతిభా పురస్కారాల్లో కూడా విద్యార్థులకు పురస్కారాలు సరిగా అందలేదని విమర్శలున్నాయి. అయినా 2015–16 ఏడాదిలోనూ ప్రభుత్వం ఆ విషయాన్ని సరిదిద్దుకోలేదు, నగదు కోసం విద్యార్ధులు నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి, సాంకేతిక కారణాలతో చాలామంది విద్యార్థులకు 2014–15 సంవత్సరం పురస్కార నగదు ఇప్పటికీ బ్యాంక్ ఖాతాలో జమకాలేదని తెలిసింది. 2015–16 సంవత్సరానికి నగదు జమలు అరకొరగా జరిగినట్లు ఉపాధ్యాయులు చెపుతున్నారు. ఈ రూ. 20 వేలు నగదు జమలు కూడా రెండు రోజుల క్రితమే విద్యార్థుల ఖాతాలో వేసినట్లు డీఈవో ఆర్ఎస్ గంగాభవాని తెలిపారు. గత ఏడాదికి సంబంధించిన ట్యాబ్‌లు కూడా అందుబాటులో ఉన్నాయని వాటిని ఆయా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి విద్యార్థు లకు అందిస్తామని తెలిపారు. ఈ నగదు జమలు అరకొరగా జరిగినట్లు హెచ్ఎంలు తెలిపారు. ఈ ఏడాది పురస్కారాలు హుళక్కేనా..? రెండేళ్లుగా జిల్లా నుంచి 500 మందికి పైగా విద్యార్థులు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఈ ప్రతిభా పురస్కార కార్యక్రమం మే 24న విజయవాడలో ముగిసింది. ఈ ఏడాది జిల్లాకు ఒక్కరి చొప్పున మాత్రమే పిలిచినట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు చెపుతున్నారు. ఈ ఏడాది ఎంతమంది విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారో అధికారులకే తెలియని పరిస్థితి. నేటీకీ ఆ జాబితా జిల్లా అధికారులకు అందలేదు. జిల్లాలో ఈ ఏడాది ఎస్ఎస్సీ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 84.3 ఉన్నా 10 జీపీఏ సాధించిన విద్యార్థులు సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ ఏడాది 10 జీపీఏ 1,301 మంది విద్యార్థులు సాధించారు. మరి వీరిలో ఎంతమందికి పురస్కారాలు అందాయో అన్న విషయం నేటికీ ప్రభుత్వం స్పష్టం చెయ్యలేదు. దీంతో ఈ ఏడాది ప్రతిభా పురస్కారాలు ఇస్తారా ఇవ్వరా అనే సందిగ్ధం విద్యార్థులు తల్లిదండ్రుల్లో నెలకొంది. ప్రయివేటు విద్యా సంస్థలకు పంపిణీపై అనుమానం గత ఏడాదికి సంబంధించిన ట్యాబ్‌లను ప్రయివేటు విద్యార్థులకు వారి కళాశాలలకు పంపిస్తామని ప్రభుత్వ అధికారులు చెప్పడంతో ఇంటర్, డిగ్రీ, సాంకేతిక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విధానం వల్ల కళాశాల విద్యార్థులు ట్యాబ్‌లు మాకు అందవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సీనియర్స్‌కు నేటికీ ట్యాబ్‌లు అందలేదని వారే చెపుతున్నారు. పురస్కారాలు అందుకుని ఏడాది పూర్తవుతున్నందున విద్యార్థుల్లో ఎక్కువ మంది ఆయా కళాశాలలను విడిచిన నేపథ్యంలో పూర్వ కళాశాల యాజమాన్యాలు వారికి ట్యాబ్‌లు ఇచ్చే విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నా ఉన్నత విద్యకు ఎంతో అవసరం నేను ప్రస్తుతం పెదవేగి గురుకుల కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్నాను. ప్రతిభా అవార్డుతో పాటు రూ. 20 వేల నగదు, ట్యాబ్ ఇస్తానన్నారు, దీని కోసం నా బ్యాంక్ ఖాతా నెంబర్ తీసుకున్నారు, కానీ నేటి వరకూ అందలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆ రెండు నాకు చాలా అవసరం. – తోట యహోషువ, ప్రతిభా అవార్డు పురస్కార గ్రహీత, దేవరగోపవరం పురస్కారం విషయంలో ప్రభుత్వం స్పందించాలి మా పాఠశాల నుంచి నలుగురు విద్యార్థులు ప్రతిభా పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరంతా నిరుపేద కుటుంబాలకు చెందినవారే, వీరంతా నూజివీడు ట్రిపుల్ ఐటీ, పెదవేగి గురుకుల పాఠశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్నారు. పురస్కారం అందుకుని ఏడాది అవుతున్నా నేటికీ ట్యాబ్‌లు కూడా పంపిణీ చెయ్యకపోవడం దురదృష్టకరం. – కమ్మిల నాగలక్ష్మి, చైర్మన్, ఎస్ఎంసీ, జెడ్పీ సూ్కల్, పెదనిండ్రకొలను బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం మా అబ్బాయి గత ఏడాది ప్రతిభా అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డులో భాగంగా రూ. 20 వేలు నగదు ఇస్తామన్నారు. నేటీకీ ఆ నగదు జమకాలేదు. దీనికోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నాం. అప్పట్లో విజయవాడ వస్తేనే అవార్డు ఇస్తామంటే వ్యయ ప్రయాసలతో అక్కడికి వెళ్ళాము. కానీ నేటికీ ట్యాబ్ అందలేదు. నగదు జమకాలేదు. – తోట వెంకమ్మ, పెదనిండ్రకొలను ఈ ఏడాది జాబితాపై ఎటువంటి సమాచారం లేదు ప్రతిభా పురస్కారాల పంపిణీ ఈ ఏడాది జాబితాపై నేటి వరకూ ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు. గత నెలలో జరిగిన కార్యక్రమంకు జిల్లాకు ఒక విద్యార్థి చొప్పున పిలిచారు. గత ఏడాదికి సంబంధించిన ప్రోత్సాహకంగా అందించే రూ. 20 వేలు నగదు విద్యార్థుల బ్యాంక్ ఖాతాల్లోకి వారం రోజుల క్రితం జమచేశాము. ఏ విద్యార్థి ఖాతాలోనైనా నగదు జమ కానట్లయితే నాదృష్టికి తీసుకువస్తే బ్యాంకర్లతో మాట్లాడి పరిష్కరిస్తాము. – ఆర్ఎస్ గంగాభవాని, జిల్లా విద్యాశాఖాధికారి