Pravasi Samman awardees
-
నెతన్యాహుకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతులను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్కు ఎంపికచేసింది. ఇజ్రాయెల్లో నెతన్యాహు స్నేహితురాలు, భారతీయ మూలాలున్న మహిళా పారిశ్రామికవేత్త రీనా వినోద్ పుష్కామాతోపాటు మరికొందరిని ఈ అవార్డ్కు ఎంపికచేశారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈనెల 8 నుంచి జరిగే ప్రవాసీ భారతీయ దివస్ వేడుకల్లో వీరికి అవార్డులను ప్రదానంచేస్తారు. సంగీత విభావరి నిర్వాహకులు జుబెన్ మెహతా, నటి సోఫియా లోరెన్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఐజాక్ రాబిన్, మాజీ అధ్యక్షుడు, ప్రధాని షిమోన్ పెరీస్సహా ఈ ఏడాది 21 మందిని ఈ అవార్డుతో సత్కరించనున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ దారుణం: వెలుగులోకి మరిన్ని నివ్వెరపరిచే నిజాలు -
సత్య నాదెళ్లకు 'ప్రవాసి భారతీయ సమ్మాన్'
గాంధీనగర్: గయానా అధ్యక్షుడు డొనాల్డ్ రవీంద్రనాథ్ రమోతర్, మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సహా 15 మందికి కేంద్ర ప్రభుత్వం ప్రవాసి భారతీయ సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేయనుంది. గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న ప్రవాసి భారతీయ దివస్ లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీరికి పురస్కారాలు ప్రదానం చేస్తారు. మలా మెహతా(ఆస్ట్రేలియా), కమల్ జీత్ బక్షి(న్యూజిలాండ్) నందిని టాండన్(అమెరికా), ఆష్రాఫ్ పలరకుమ్మాల్(యూఏఈ), రాజ్మాల్ ఎం పరాఖ్(ఒమన్), సంజయ రాజారామ్(మెక్సికో), జస్టిస్ దొరైకన్ను కరుణాకరణ్((సిచెల్లస్), లార్డ్ రాజ్ లుంబా(బ్రిటన్), మహేంద్ర నాన్జీ(ఉగాండా), కమ్లేష్ లల్లూ(అమెరికా), నాథూరామ్ పూరి అవార్డులు అందుకోనున్నారు.