సత్య నాదెళ్లకు 'ప్రవాసి భారతీయ సమ్మాన్' | Guyana president, Microsoft CEO among 15 Pravasi Samman awardees | Sakshi
Sakshi News home page

సత్య నాదెళ్లకు 'ప్రవాసి భారతీయ సమ్మాన్'

Published Thu, Jan 8 2015 8:14 PM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

సత్య నాదెళ్లకు 'ప్రవాసి భారతీయ సమ్మాన్'

సత్య నాదెళ్లకు 'ప్రవాసి భారతీయ సమ్మాన్'

గాంధీనగర్: గయానా అధ్యక్షుడు డొనాల్డ్ రవీంద్రనాథ్ రమోతర్, మైక్రో సాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సహా 15 మందికి కేంద్ర ప్రభుత్వం ప్రవాసి భారతీయ సమ్మాన్ పురస్కారాలను ప్రదానం చేయనుంది. గుజరాత్ లోని గాంధీనగర్ లో జరుగుతున్న ప్రవాసి భారతీయ దివస్ లో  రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వీరికి పురస్కారాలు ప్రదానం చేస్తారు.

మలా మెహతా(ఆస్ట్రేలియా), కమల్ జీత్ బక్షి(న్యూజిలాండ్) నందిని టాండన్(అమెరికా), ఆష్రాఫ్ పలరకుమ్మాల్(యూఏఈ), రాజ్మాల్ ఎం పరాఖ్(ఒమన్),  సంజయ రాజారామ్(మెక్సికో), జస్టిస్ దొరైకన్ను కరుణాకరణ్((సిచెల్లస్), లార్డ్ రాజ్ లుంబా(బ్రిటన్), మహేంద్ర నాన్జీ(ఉగాండా), కమ్లేష్ లల్లూ(అమెరికా), నాథూరామ్ పూరి అవార్డులు అందుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement