Pregnants dies
-
ఆపదలో అమ్మ
– రక్తహీనతతో గర్భిణుల బలి – అందని పోషకాహారం, వైద్య సేవలు – ఆడిట్ నిర్వహణలో పారదర్శకత కరువు – ఏడాదిగా జరగని జిల్లా స్థాయి సమీక్ష – ఇదీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తీరు 37,800 ప్రస్తుతం జిల్లాలో ఉన్న గర్భిణులు 10 శాతం 7 గ్రాముల కన్నా తక్కువగా హిమోగ్లోబిన్ ఉన్న గర్భిణులు 40 శాతం 7 గ్రాముల నుంచి 9 గ్రాములలోపు ఉన్న గర్భిణులు 11-14 గ్రాములు గర్భిణుల్లో హిమోగ్లోబిన్ సాధారణ స్థాయి గణాంకాలు ఇలా ఏడాది మాతృ మరణాలు 2012–13 58 2013–14 58 2014–15 85 2015–16 71 2016–17 63 అనంతపురం మెడికల్: మాతృత్వం.. మహిళ జీవితంలో మధురానుభూతి పొందే క్షణం. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవమయ్యే వరకు ఒకటే టెన్షన్.. ఆ పని చేయకూడదు..ఈ పని చేయకూడదు అని కుటుంబ సభ్యులు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా...వైద్య ఆరోగ్యశాఖ పరంగా ప్రత్యేక పర్యవేక్షణ అవసరం. కానీ జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా మాతృత్వపు మాధుర్యాన్ని చూడకుండానే ఎంతో మంది మృత్యుఒడికి చేరుతున్నారు. ఏదో ఒక చోట మాతృ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఒక మరణం కూడా జరగకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నా అమలులో చిత్తశుద్ధి లోపిస్తుండడంతో ‘మృత్యుఘోష’ ఆగడం లేదు. తూతూ మంత్రంగా ఆడిట్ మాతృమరణాలపై జిల్లాలో సమగ్ర ఆడిట్ జరగడం లేదు. ఎందుకు చనిపోతున్నారన్న కారణాలను అన్వేషించే తీరికే అధికారులకు ఉండడం లేదు. ఏదైనా మాతృ మరణం జరిగితే డీఎంహెచ్ఓ, జాతీయ ఆరోగ్య మిషన్, పీహెచ్సీ, వైద్య విధాన పరిషత్‌కు చెందిన సీనియర్ వైద్యుల సమక్షంలో ఆడిట్ చేయాలి. ప్రతి నెలా కలెక్టర్ సమక్షంలో సమీక్ష జరగాలి. అయితే దీన్ని తూతూమంత్రగా నిర్వహిస్తున్న పరిస్థితి నెలకొంది. ఏడాదిగా కనీసం సమీక్ష జరపని దుస్థితి నెలకొంది. ఏదో ఒక కారణం చూపి ఆ కేసులను మూసి వేస్తున్నారు. మాతృ మరణాలకు వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది నిర్వాకమా? లేక ప్రసవ సమయంలో సత్వర వైద్యం అందని పరిస్థితా..? అన్నది నిగ్గు తేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవడం లేదు. ఆరోగ్యశాఖ నిర్లక్ష్యంతోనే మరణాలు సహజంగా మాతృమరణాలు రక్తహీనత, ప్రసవ సమయంలో నిర్లక్ష్యం, హైరిస్క్ ప్రెగ్నెన్సీ (35 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం) వల్ల సంభవిస్తున్నాయి. ఇలాంటి వారిని గుర్తించి తగిన సూచనలు ఇవ్వడంతో వైద్య ఆరోగ్యశాఖ విఫలమవుతోంది. చావుకు, తద్దినానికి ఒకటే మంత్రం అన్నట్లు గుండె సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారని తప్పించుకుంటున్నారు. ఒక వేళ రక్తహీనతతో మరణిస్తున్నారని తెలిస్తే అందుకు యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే రక్తహీనత నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రతినెలా హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో పరీక్షలు నిర్వహించి రక్త శాతం తగ్గితే దాన్ని అధిగమించడానికి అవసరమైన చర్యలు చేపట్టడానికి పూర్తి స్థాయి అధికారులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ఉన్నాయి. రక్తం పెంపుదలకు అవసరమైతే మందుల ద్వారా చర్యలు చేపట్టడానికి ఆస్పత్రి అభివృద్ధి నిధులు, జననీ సురక్ష నిధుల నుంచి ఖర్చు పెట్టుకోవచ్చు. ఇంత అవకాశం ఉన్నా వైద్యులు సకాలంలో గర్భిణులకు వాడేలా అవగాహన కల్పించకపోవడం, నెలవారీగా వారికి హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో తెలుసుకోకపోవడం వంటివి మరణాలకు కారణమవుతున్నాయి. అన్మోల్ నమోదూ అంతంతే..! గర్భం దాల్చిన మూడో వారం నుంచి వైద్య ఆరోగ్యశాఖ పరంగా అందించిన వైద్య పరీక్షలు, మందులు, పౌష్టికాహారం వంటివి కేంద్ర ప్రభుత్వానికి చెందిన అన్మోల్ సాఫ్ట్‌వేర్‌లో అప్లోడ్ చేయాలి. గర్భిణులకు ప్రతి నెలా హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉందో వైద్య పరీక్షలు జరిపి గుర్తించాలి. ఏడు గ్రాముల కన్నా తక్కువ ఉంటే రక్తహీనతగా గుర్తించి వారిలో రక్తం పెంచడానికి ఐరన్, ఫోలిక్ మాత్రలు 120 రోజుల పాటు వాడించాలి. వాటిని మింగలేని వారికి అవే మందులతో కూడిన సిరప్ బయట మార్కెట్లో లభ్యమవుతుంది. దాన్ని తాగాలని సూచించాలి. ఈ వివరాల నమోదులో అధికారులు అంకెల గారడి చూపుతున్నారు. ప్రతి నెలా గర్భిణులకు అందించిన వివరాలన్నీ ఎప్పటికప్పుడు నమోదు చేస్తే ప్రసవ సమయంలో రక్తహీనత కారణంగా ఎవరైనా గర్భిణి చనిపోయిందని తేలితే అప్పుడు గర్భం దాల్చిన నాటి నుంచి రక్తహీనత అధిగమించేందుకు చర్యలు తీసుకోలేదని భావిస్తారు. దీని నుంచి తప్పించుకోవడానికి చివరకు అనుమోల్ సాఫ్ట్‌వేర్‌లో కూడా సమాచారం పూర్తి స్థాయిలో అప్లోడ్ చేయడం లేదు. త్వరలోనే సమావేశం పెడతాం రక్తహీనతతోనే ఎక్కువ మరణాలు జరుగుతున్నాయి. ఇవి జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. తరచూ అధికారులతో సమావేశమై సూచనలు చేస్తున్నాం. త్వరలోనే మాతృ మరణాలపై కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. - డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్ఓ రక్తహీనత అంటే... శరీరంలో రక్తం ప్రయాణిస్తున్న సమయంలో ఉపిరితిత్తుల వద్ద హిమోగ్లోబిన్ ప్రాణవాయువును పీల్చుకుని శరీరం మొత్తానికి దాన్ని సరఫరా చేస్తుంటుంది. హిమోగ్లోబిన్ ద్వారా శరీర అవయవాల్లోని విడిపోయిన కణజాలాలకు ప్రాణవాయువు వెళ్తుంది. మన శరీరంలో హిమోగ్లోబిన్ శాతం తగినంత లేకపోతే వారు రక్తహీనతతో బాధపడుతున్నట్లు లెక్క. జిల్లాలో గర్భిణులు : 37,800 – ఒక లీటర్లో పదో వంతును డెసీలీటర్ అంటారు. ఒక డెసీలీటర్ను 1 డీఎల్ అని రాస్తారు. – మహిళల్లో హిమోగ్లోబిన్ సాధారణ స్థాయి 12.1 నుంచి 15.1 గ్రాములు/డెసీలీటర్ ఉండాలి. – గర్భిణుల్లో హిమోగ్లోబిన్ సాధారణ స్థాయి 11 నుంచి 14 గ్రాములు/డెసీలీటర్ ఉండాలి. – ప్రస్తుతం జిల్లాలో 7 గ్రాముల కన్నా తక్కువగా 10 శాతం మంది ఉన్నారు. – 7 గ్రాముల నుంచి 9 గ్రాములలోపు 40 శాతం మంది ఉన్నారు. -
సెలైన్ బాటిల్స్ వాపస్
-
సెలైన్ బాటిల్స్ వాపస్
► ప్రభుత్వాసుపత్రుల నుంచి వెనక్కి తెప్పించండి ► సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్‌కు వైద్య శాఖ అత్యవసర ఆదేశాలు ► ఇటీవల బాలింతల మరణంతో అనుమానాలు.. ► 3.5 లక్షల బాటిల్స్ వెనక్కి వచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, బోధనాసుపత్రులకు సరఫరా చేసిన వివిధ రకాల ఐవీ ఫ్లూయిడ్స్ సెలైన్ బాటిళ్లను వెనక్కి తెప్పించాల్సిందిగా తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) అత్యవసర ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు అన్ని జిల్లా సెంట్రల్ మెడిసిన్ స్టోర్ల ఫార్మసిస్టులకు టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్‌రావు ఉత్తర్వులు జారీచేశారు. అత్యవసర ఆదేశంతో మొత్తం 8 రకాల ఐవీ ఫ్లూయిడ్స్‌ను వెనక్కి రప్పిస్తున్నారు. ఇటీవల నీలోఫర్, తాజాగా సుల్తాన్‌బజార్ ఆసుపత్రుల్లో బాలింతల మరణాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకు వెనక్కు రప్పిస్తున్నారన్న సమాచారాన్ని మాత్రం బయటకు పొక్కనీయడం లేదు. ఇటీవల చనిపోయిన బాలింతలకు ఈ ఐవీ ఫ్లూయిడ్ సెలైన్లను వాడారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలింతలకు ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఈ ఐవీ ఫ్లూయిడ్స్‌ను వాడతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆగమేఘాలపై అత్యవసర ఉత్తర్వులు జారీచేసినట్లు ప్రచారం జరుగుతోంది. 3.5 లక్షలకుపైనే.. ఐవీ ఫ్లూయిడ్స్‌ను వివిధ సందర్భాల్లో రోగులకు వాడతారు. వాటిల్లో అనేక రకాలున్నాయి. కొన్ని సాధారణ ఐవీ ఫ్లూయిడ్స్‌ను డయేరియా, జ్వరంతో బాధపడుతున్న వారికి వాడతారు. యాంటీబయోటిక్ ఐవీ ఫ్యూయిడ్స్ను శస్త్రచికిత్సలు చేశాక ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు ఉపయోగిస్తారు. టీఎస్ఎంఎస్ఐడీసీ ఇప్పుడు వెనక్కి రప్పించాలని ఆదేశించిన వాటిల్లో అనేకం శస్త్రచికిత్సలు జరిగినప్పుడు ఉపయోగించే ఐవీ ఫ్లూయిడ్స్ ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులకు 8 రకాల ఐవీ ఫ్లూయిడ్స్‌ను సరఫరా చేశారు. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ఉస్మానియా, గాంధీ వంటి బోధనాసుపత్రులన్నింటా కలిపి మొత్తం 3.5 లక్షలకు పైనే ఈ సెలైన్ బాటిళ్లు నిల్వ ఉన్నట్లు సమాచారం. వీటి విలువ మార్కెట్లో రూ.4–5 కోట్ల మధ్య ఉండొచ్చని చెబుతున్నారు. ఇప్పుడు వాటన్నింటినీ ఆగమేఘాలపై వెనక్కు తెప్పించాలని ఆదేశించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటివల్ల ఎంత మందికి ఇతరత్రా దుష్ప్రభావాలు కలిగాయో సమాచారం లేదు. టీఎస్ఎంఎస్ఐడీ వర్గాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. టీఎస్ఎంఎస్ఐడీసీ గత చరిత్ర చూస్తే... నాసిరకం మందులను ఆసుపత్రులకు పంపి తిరిగి వెనక్కు తెప్పించిన చరిత్ర టీఎస్ఎంఎస్ఐడీసీకి ఉంది. అలా తప్పిదాలు చేసిన వాటిల్లో కొన్ని... – గతేడాది మార్చిలో 24,456 సీసాల (మూడు బ్యాచ్‌ల్లో) కాంపౌండ్ సోడియం లాక్టేట్ ఇంజెక్షన్ ఐపీ 500 ఎంఎల్‌ను టీఎస్ఎంఎస్ఐడీసీ ఓ సంస్థ నుంచి కొనుగోలు చేసింది. వాటిని సరోజినీ కంటి ఆసుపత్రి సహా వివిధ ఆసుపత్రులకు పంపిణీ చేసింది. సరోజినీ కంటి ఆసుపత్రిలో ఈ మందును గతేడాది జూన్ 30న జరిగిన శస్త్రచికిత్సల సమయంలో 13 మంది రోగులకు వినియోగించారు. ఆ మరుసటి రోజున రోగులు ఇన్ఫెక్షన్కు గురయ్యారు. కొందరు కంటిచూపు కోల్పోయారు. – 1.12 లక్షల ‘ఆన్డాన్సెట్రాన్ 4 ఎంజీ’మాత్రలను టీఎస్ఎంఎస్ఐడీసీ 2015 జనవరిలో ఒక సంస్థ నుంచి కొనుగోలు చేసి వివిధ ఆసుపత్రులకు పంపించింది. అప్పటివరకు వాటికి సంబంధించిన నాణ్యత నివేదిక రాలేదు. అదే ఏడాది అక్టోబర్‌లో ప్రభుత్వ ఔషధ నియంత్రణ ప్రయోగశాల ఆ మందులు నాణ్యమైనవి కావని, వెనక్కు పంపాలని డిసెంబర్లో ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ అప్పటికే ఆసుపత్రులు చాలావరకు వాటిని వినియోగించాయి. – 51 వేల ‘ఈనలప్రిల్ మాలెట్ 5 ఎంజీ’మాత్రలను 2015 ఏప్రిల్, నవంబర్ మధ్య హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి సరఫరా చేసింది. అప్పటికి ఇంకా నాణ్యత నివేదిక రాలేదు. ఈ మందులు నాణ్యమైనవి కావని టీఎస్ఎంఎస్ఐడీసీ 2016 ఏప్రిల్‌లో తెలిపింది. అప్పటికే 44,400 మాత్రలను రోగులకు అందజేశారు. మిగిలిన 6,600 మాత్రలను మాత్రమే తిప్పి పంపారు. వాటిని బాలింతలకు ఉపయోగించలేదు: టీఎస్ఎంఎస్ఐడీసీ వెనక్కి తెప్పించే ఐవీ ఫ్లూయిడ్స్ సెలైన్ బాటిళ్లను సుల్తాన్‌బజార్‌లో ఇటీవల చనిపోయిన బాలింతలకు ఉపయోగించలేదు. అంతర్జాతీయ బ్రాండ్ కలిగిన కొత్త ఐవీ ఫ్లూయిడ్స్ స్టాక్ వచ్చినందునే వీటిని వెనక్కి తెప్పిస్తున్నాం. వీటిపై ఎటువంటి ఫిర్యాదులు లేవు. ముందస్తుగా వెనక్కు తెప్పిస్తున్నాం. పైగా చాలావరకు కాలం తీరే దశకు చేరుకున్నాయి. -
మరణ మృదంగం
సుల్తాన్‌బజార్‌లో ఒకరు.. పేట్లబురుజులో మరొకరు మరో ఏడుగురికి ఇన్ఫెక్షన్.. ఉస్మానియాకు తరలింపు మృతుల బంధువుల ఆందోళన.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రుల్లో మరణ మృదంగం మోగుతోంది. సుఖ ప్రసవం కోసం ఆస్పత్రుల్లో చేరిన వారిలో ఒకరి తర్వాత మరొకరు మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సుల్తాన్‌బజార్ ఆస్పత్రిలో శుక్రవారం ఇద్దరు మహిళలు మృతి చెందగా... శనివారం అదే ఆస్పత్రిలో ఒకరు, పేట్లబరుజులో మరొక మహిళ మరణించారు. ఇన్ఫెక్షన్కు గురైన మరో ఏడుగురు బాలింతలను ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లను మూసివేసి తాత్కాలికంగా సిజేరియన్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన గర్భిణులను నిలోఫర్, గాంధీ ఆస్పత్రులకు తరలిస్తోంది. బాలింతల మృతిపై విచారణకు ఆదేశించింది. హఠాత్తుగా పడిపోయిన బీపీ... సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో ఈ నెల 20న 19 సిజేరియన్లు జరిగాయి. వీరిలో పది మందికి ఇన్ఫెక్షన్ సోకింది. అరుణానగర్‌కు చెందిన శారద(22) మొదటి కాన్పుకోసం ఈ నెల 18న, మహబూబ్‌నగర్‌కు చెందిన జయమ్మ మూడో కాన్పు కోసం 19న ఆస్పత్రిలో చేరారు. వీరికి 20న డెలివరీ చేశారు. వీరికి హఠాత్తుగా బీపీ పడిపోయి శుక్రవారం మృతి చెందారు. అదే విధంగా రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలానికి చెందిన అర్చన(28) కాన్పుకోసం ఈ నెల 17న ఆస్పత్రిలో చేరింది. 20న ఆమెకు వైద్యులు సిజేరియన్ చేశారు. అకస్మాత్తుగా ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఉస్మానియాకు తరలించగా... శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆమె కూడా తుదిశ్వాస విడిచింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే... నాగర్‌కర్నూలుకు చెందిన రత్నమాల సుఖ ప్రసవం కోసం గురువారం పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో చేరింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెకు వైద్యులు శనివారం ఉదయం 11 గంటలకు డెలివరీ చేశారు. ప్రసవించిన గంటన్నరకే ఆమె మృతి చెందింది. దీంతో ఆమె బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతి చెందిందని ఆమె భర్త ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నలుగురి పరిస్థితి విషమం..! ప్రస్తుతం ఉస్మానియాలో రజిత, సుజాత, నాగేశ్వరి, భాగ్యలక్ష్మి, అనసూయ, షహానా బేగం చికిత్స పొందుతుండగా... మరో మహిళ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిపోయారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే సుల్తాన్‌బజార్ ఆస్పత్రి నాలుగో అంతస్తులో ఇటీవల మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించిన ఆపరేషన్ థియేటర్లో కనీస సౌకర్యాలు లేక మూసివేసి ఉంచడం కొసమెరుపు.