Premalata
-
విచారణలపై స్టే
కెప్టెన్ దంపతులకు హైకోర్టులో ఊరట 14 కేసుల్లో ఉపశమనం మరో పీటీ వారెంట్ పెరంబలూరు కోర్టు జారీ సాక్షి, చెన్నై: డీఎండీకే అధినేత విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలతలకు ఊరట నిస్తూ మద్రాసు హైకోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఆ ఇద్దరి మీదున్న పద్నాలుగు పరువు నష్టం దావా కేసుల విచారణలకు న్యాయమూర్తి ప్రకాష్ మధ్యంతర స్టే విధించారు. ఓ వైపు కేసుల విచారణకు మద్రాసు హైకోర్టు స్టే ఇచ్చి ఉంటే, మరో వైపు విచారణకు హాజరు కాలేదని పెరంబలూరు కోర్టు విజయకాంత్‌కు పీటీ వారెంట్ జారీ చేయడం గమనార్హం. రాష్ట్రంలో సీఎం జయలలిత, మంత్రులకు వ్యతిరేకంగా ఆధార రహిత ఆరోపణలు గుప్పిస్తే, పరువు నష్టం దావాల మోత మోగుతున్న విషయం తెలిసిందే. అన్ని రాజకీయ పక్షాల నాయకుల్లో డీఎండీకే అధినేత విజయకాంత్ మీద ఈ కేసులు మరీ ఎక్కువగా ఉన్నాయి. జిల్లాకు ఒకటి చొప్పున దావాలను ఆయన ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. ఈ కేసుల విచారణకు డుమ్మా కొడుతున్న ఆయన మీద జిల్లా కోర్టుల న్యాయమూర్తులు కన్నెర్ర చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే విజయకాంత్‌కు పలు పీటీ వారెంట్లు జారీ అయ్యా యి. ఇక, ఆయన సతీమణి ప్రేమలత మీద కూ డా ఈ కేసుల మోత మోగుతున్నది. ఈ పరిస్థితుల్లో ఇటీవల తిరుప్పూర్ కోర్టు పీటీ వారెంట్ జారీ చేయడం, విల్లుపురం కోర్టు అక్షింతలు వేయడం వెరసి ఈ కేసుల వ్యవహారాల్ని ఎదుర్కొనేందుకు సుప్రీం కోర్టును విజయకాంత్ ఆశ్రయించారు. ఈ దావాలపై సుప్రీంకోర్టు సై తం అసహనం వ్యక్తం చేసి ఉన్నదని చెప్పవచ్చు. ఎట్టకేలకు సుప్రీం ఆదేశాలతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించి, ఈ కేసుల్ని ఎదుర్కొనేందుకు తగ్గ కసరత్తుల్లో విజయకాంత్, ఆ యన సతీమణి ప్రేమలత నిమగ్నమయ్యారు. ఇందుకు తగ్గ పిటిషన్ మద్రాసు హైకోర్టుకు గత నెలాఖరులో చేరింది. బుధవారం పిటిషన్ విచారణకు రావడంతో విజయకాంత్ తరఫు న్యాయవాదులు తమ వాదనలను న్యాయమూర్తి ప్రకాష్ నేతృత్వంలోని బెంచ్ ముందు ఉంచారు. వాదనల అనంతరం విజయకాంత్, ప్రేమలత విజయకాంత్‌కు ఊరట నిస్తూ ఆ దేశాలు జారీ అయ్యాయి. సీఎం జయలలిత, మం త్రుల తరఫున ఆ ఇద్దరిపై దాఖలై ఉన్న పద్నాలు గు కేసుల విచారణలకు మధ్యంతర స్టే విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఓ వైపు పద్నాలుగు కేసుల విచారణకు మధ్యంతర స్టే జారీ అయితే, మరోవైపు పెరంబలూరు కోర్టు విజయకాంత్‌కు పీటీ వారెంట్ జారీ చేయడం గమనార్హం. పీటీ వారెంట్: పెరంబలూరు కోర్టులు విజయకాంత్‌పై పరువు నష్టం దావా కేసుకు తగ్గ పిటిషన్ విచారణ సాగుతూ వస్తోంది. బుధవారం విజయకాంత్ కోర్టు మెట్లు ఎక్కాల్సి ఉంది. అయితే, ఆయన డుమ్మా కొట్టారు. విజయకాంత్ తరఫు న్యాయవాదులు కోర్టుకు రాని దృష్ట్యా, న్యాయమూర్తి నషీమా భాను కన్నెర్ర చేశారు. విజయకాంత్‌కు పీటీ వారెంట్ జారీ చేస్తూ, కోర్టులో హాజరు పరచాలని ఆదేశించారు. -
ఈ కెప్టెన్ వద్దు బాబోయ్!
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘విజయకాంత్ ప్రచారానికి వస్తున్నారా... వద్దు బాబోయ్’ అని వేడుకునేలా డీఎండీకేలో చిత్రమైన పరిస్థితి నెల కొంది. పార్టీ అధినేత విజయకాంత్ ప్రచారానికి రాకుండా చూడాలని పార్టీ నేతలు, కార్యకర్తలే ప్రాధేయపడుతున్నారు. ప్రేమలతతో సరిపెట్టుకుంటామని సర్దుబాటు మంత్రం జపిస్తున్నారు. సహజంగా రాజకీయాల్లో పార్టీ అగ్రనేత వచ్చి ప్రచారం చేయాలని కార్యకర్తలు ఆశిస్తారు. అగ్ర జులు వచ్చి ప్రసంగిస్తే అధికసంఖ్యలో ప్రజలను ఆకట్టుకోవచ్చని ఆశపడతారు. పార్టీ అధ్యక్షుల రాకకోసం పరితపిస్తారు. అయితే దేశంలో మరే పార్టీలో లేని విధంగా డీఎండీకే నేతలు సాక్షాత్తు అధ్యక్షుల రాకనే తిరస్కరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే విజయకాంత్ వస్తున్నాడంటే భయపడిచస్తున్నారు. అవును, ఇందులో ఆశ్చర్యమేముందని తమిళనాడు రాజకీయాలను గమనిస్తున్న ఎవ్వరిని అడిగినా ఇట్టే చెబుతారు. విగ్రహమేకానీ నిగ్రహం లేని కెప్టెన్: ఒక ప్రధాన రాజకీయ పార్టీ నేతగా చలామణి అయ్యేందుకు అవసరమై నిండైన విగ్రహం కలిగి ఉన్న విజయకాంత్‌కు అందుకు తగిన నిగ్రహం లేదని చెప్పక తప్పదు. ప్రజా బాహుళ్యంలోకి అడుగుపెట్టినపుడు తరచూ ఆవేశానికి లోను కావడం పరిపాటిగా మారింది. గత ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులనే తన్నిన దాఖలు ఉన్నాయి. సుమారు నాలు గు నెలల క్రితం విమానాశ్రయంలో మీడియా ప్రతినిధు లు వేసిన ప్రశ్నకు బదులివ్వకపోగా ఆగ్ర హంతో విలేఖరిపైనే చేయిచేసుకున్నారు. దీంతో జర్నలిస్టు సంఘాలు ఆందోళనకు దిగాయి. అంతకు ముందు పార్టీ నేతలను, తన సెక్యూరిటీ గార్డును, మరోసారి కార్యకర్తలను కొట్టి ఉన్నారు. అలాగే తన కారు డ్రైవర్‌ను ఏకంగా కాలితో కొట్టి కలకలం రేపారు. ఇదిలా ఉండగా మూడు రోజుల క్రితం ఎన్నికల ప్రచార నిమిత్తం అభ్యర్థులతో సమావేశం నిమిత్తం సేలం చేరుకున్న విజయకాంత్‌కు స్వాగతం చెప్పేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలు తరలివచ్చారు. ఈ సమయంలో మరోసారి సహనాన్ని కోల్పోయిన విజయకాంత్ సెక్యూరిటీపైనా, పక్కనే ఉన్న మీడియా ప్రతినిధులపైనా చేయిచేసుకున్నారు. విజయకాంత్ వద్దని వేడుకోలు: రానురాను కెప్టెన్ వైఖరి శ్రుతిమించడంతో ‘అయ్యా తమరు రావద్దు’ అని చెప్పేందుకు సైతం వెనుకాడని పరిస్థితి పార్టీలో ఉత్పన్నమైంది. రాష్ట్రంలో రసవత్తరంగా ఎన్నికల పోరుసాగుతున్న దశలో సర్వశక్తులు ఒడ్డి ఓటర్లను ఆకట్టుకోవాల్సి పోయి విమర్శలకు తావిచ్చేలా విజయకాంత్ వ్యవహరించడం పార్టీ నేతలు సహించలేక పోతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో విజయకాంత్ అనాగరికంగా నడుచుకోవడం పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తుందని ఆందోళన చెందుతున్నారు. పార్టీ అభ్యర్థులు సమావేశమై ప్రత్యామ్నాయం ఏమిటని చర్చించుకున్నారు. విజయకాంత్‌కు బదులుగా ఆయన సతీమణి ప్రేమలత ప్రసంగించేలా ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అంశాన్ని డీఎండీకే కార్యాలయానికి తెలుపగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. -
తమిళనాట ప్రత్యక్ష రాజకీయాల్లోకి వదినమ్మ
తమిళనాట వదినమ్మ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టనుంది. తమిళ సినీ రంగంలో కెప్టెన్‌గా, అభిమానులకు అన్నగా ప్రజాదరణ పొందిన విజయ్ కాంత్ సతీమణి ప్రేమలత అలగర్‌స్వామి వచ్చే ఎన్నికల బరిలోకి దిగటాని ఆసక్తి చూపుతున్నారు. లోక్‌సభకు పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. విజయ్ కాంత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెండి తెర నుంచి రాజకీయ తెరపై మెరిసిన తమిళ స్టార్ విజయ్ కాంత్ డిఎండికే (దేశీయ ముర్పొక్కు ద్రవిడ ఖజగం) పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి రియల్ కెప్టెన్‌గా మారారు. రాజకీయాలలో ఆయనకు అన్ని విధాల భార్య ప్రేమలత సహరిస్తుంటారు. మొన్నటి ఎన్నికల్లో ఎత్తులు-పైఎత్తులు, పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, సీట్ల కేటాయింపు...వంటి అన్ని ప్రక్రియల్లోనూ విజయ్ కాంత్‌కు వెన్నుదన్నుగా నిలచారు. సూత్రధారిగా వ్యవహరించారు. ఈ మధ్య కాలంలో పార్టీలో అభిప్రాయ భేదాలు, కుమ్ములాటలు, కీలక నేతలు వలస దారిపట్టడంతో విజయ్ కాంత్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీలో పెద్ద తలకాయలా, విజయ్ కాంత్ కుడిభుజంగా ఉండే రామచంద్రన్ ఈ మధ్యనే రాజకీయాల నుంచి విమరించుకున్నారు. దాంతో పార్టీ పరిస్థితి మరింతగా దెబ్బతింది. ఈ సంక్షోభం నుండి గట్టెక్కడానికే భార్యను తెరపైకి తేవాలని విజయ్ కాంత్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం తెర వెనుక ఉండి రాజకీయాలు నడిపిన ప్రేమలత ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. దీనికి పార్టీ అధిష్టానం అంగీకరించింది. తన రాజకీయ అరంగేట్రానికి అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో ఏకంగా పార్లమెంటు ఎన్నికల బరిలో దిగాలన్న యోచనలో ప్రేమలత ఉన్నారు. కళ్ల కుర్చి లోక్‌సభ నియోజక వర్గం నుంచి పోటీ చేయాలని కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ లోక్‌సభ నియోజక వర్గ పరిధిలో డిఎండికేకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగతా 5 నియోజక వర్గాల్లోనూ పార్టీకి చెప్పుకోదగ్గ ఆదరణే ఉంది. అందుకే ఈ లోక్‌సభ నియోజక వర్గం నుంచి ఏదైనా ఇతర రాజకీయ పార్టీ పొత్తుతో గానీ లేదా ఒంటరిగానైనా పోటీ చేయాలని ప్రేమలత నిర్ణయించుకున్నట్లు సమాచారం. తమిళ నాట ఇప్పటికే కాంగ్రెస్ నుంచి జయంతీ నటరాజన్, డిఎంకే నుంచి కనిమొళి, బిజెపి నుండి తమిళిసై సౌందర్ రాజన్, అన్నా డిఎంకే నుండి గోకుల ఇందిర, పిఎంకే నుండి సౌమ్య అన్బుమణి వంటి మహిళా నాయకురాళ్లు సత్తా చాటుతున్నారు. ఆ కోవలో తాను పయనించాలని ప్రేమలత పట్టుదలగా ముందుకు సాగుతున్నారు.