బడి గంట మోగేవేళ... సమస్యల తంటా
విజయనగరం అర్బన్ :విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే అన్ని పాఠశాలల్లో కనీస వసతులు కల్పిస్తాం.- జిల్లా సమీక్షా సమావేశంలో గత ప్రభుత్వం ప్రాథమిక విద్యా శాఖా మంత్రి శైలజానాథ్. ‘సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి పాఠశాలలో మరుగుదొడ్డి ఉండి తీరాలి, ఆ దిశగా లక్ష్యాలు సాధించాలి’.- రాజీవ్ విద్యామిషన్ అధికారులకు జిల్లా పరిపాలనాధికారి ఇచ్చిన ఆదేశాలివి. పాఠశాలలు పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు యూనిపాం, పాఠ్యపుస్తకాలు అందజేయాలి - రాష్ట్రం విడిపోక ముందు సమయంలో రాజీవ్ విద్యామిషన్ ఏస్పీడీ ఉషారాణి. సమావేశాల్లో అధికారులు, నాయకులు ఇలా బోలెడు చెబుతుంటారు. కానీ వీటిలో
అమలయ్యేవి మాత్రం ఒక్కటి కూడా ఉండదు. బుధవారంతో వేసవి సెలవులు ముగుస్తున్నాయి.గురువారం నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. కానీ సమస్యలు మాత్రం పాతవే వేధిస్తున్నా యి. గత విద్యా సంవత్సరంలో మంజూరైన నిధులు ఇంకా 50 శాతం పాఠశాలలకు అందలేదు. దీంతో అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రాజీవ్ విద్యామిషన్కు ఏటా రూ. కోట్లు కేటాయిస్తున్నా పాఠశాలల్లో సమస్యలు పరిష్కా రం కావడం లేదు. మూడేళ్లుగా వచ్చిన నిధుల్లో కనీసం 20 శాతం కూడా ఖర్చుకాలేదు. .
అదనపు తర‘గతి’: పాఠశాలలకు అదనపు తరగతి గదుల నిర్మాణానికి నిధులు కేటాయించినా భవనాలు మాత్రం పూర్తి కాలే దు. రాజీవ్ విద్యామిషన్ ఇంజినీరింగ్ విభాగంలో ఇం జినీర్ల కొరత, సమైక్యాంధ్ర ఉద్యమం, నిధులు సకాలంలో అందకపోడం వంటి పలు కారణాల వల్ల అదనపుగదుల నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. ఫలి తంగా నేటికీ విద్యార్థులు కూర్చోడానికి చోటు కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా నిలిపివేసింది. గతంలో పాఠశాలలకు ఇచ్చిన నిధులు మిగిలితే వాటిని నిర్మాణాలు పూర్తయిన వాటికి బిల్లులుగా చెల్లించాలని ఆదేశాలిచ్చింది. ఈ విధంగా 726 నిర్మాణాలలో పూర్తికాని 413 పాఠశాలల నిధులను గత ఏడాది వెనుకకు తెప్పించి సర్దుబాటు చేశారు.
దుస్తుల పంపిణీలో గందరగోళం:యూనిఫాంల కోసం కేటాయించిన నిధుల పరిస్థితి గందరగోళంగా మారింది. హైదరాబాద్ నుంచి నేరుగా ఆన్లైన్ ద్వారా పాఠశాలల విద్యా కమిటీ ఖాతాలకు నిధులు అందజేశారు. ఖాతా సంఖ్యలు తారుమారు కావడం వల్ల ఒక పాఠశాలకు రావాల్సిన నిధులు మరో పాఠశాలకు, ఒక జిల్లా నిధులు మరో జిల్లాకు, అసలు సంబంధం లేని ఎయిడెడ్ పాఠశాలలకు, అసలు పిల్లలేలేని పాఠశాలల కు ఈవిధంగా నిధులు గందరగోళంగా జమయ్యాయి. దీని వల్ల జిల్లాలో సుమారు వంద పాఠశాలకు దుస్తుల పంపిణీ ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది.
పాఠ్యపుస్తకాల పంపిణీ: పాఠ్యపుస్తకాల పంపిణీలో మాత్రం ఈఏడాది జిల్లా విద్యాశాఖ ముందంజలో ఉం ది. జిల్లాలో సుమారు 17లక్షల పాఠ్యపుస్తకాలు ఈ విద్యాసంవత్సరంలో అవసరమవుతాయని విద్యాశాఖ అంచనా. వాటికి సంబంధించి పాతవి మరో లక్ష వర కూ అందుబాటులో ఉంచారు. ఈఏడాది రావాల్సిన కొత్త పుస్తకాల్లో 95 శాతం మూడునెలల క్రితమే వచ్చేశాయి. ఈ ఏడాది మారిన 10వ తరగతుల పాఠ్యపుస్తకాలు కూడా ముందుగానే పంపిణీ కావడం విశేషం.
మరుగుదొడ్ల మాటేదీ..?
ఈఏడాది మరుగుదొడ్లకు కేటాయించిన నిధులు కూ డా పూర్తిగా ఖర్చు పెట్టలేదు. మొత్తం 3,503 పాఠశాల లుండగా వాటిలో సుమారు 60శాతం పాఠశాలల్లో మ రుగుదొడ్లు ఉన్నా నిర్మాణలోపాలవల్ల వినియోగానికి దూరంగా ఉన్నాయి. మరో 15శాతం స్కూళ్లలో అసలు లేవు. నీటి సదుపాయానికి ఆర్డబ్ల్యూఎస్ విభాగానికి రూ.3 కోట్ల నిధులు కేటాయించగా.. నాణ్యతలేని కలిగిన పరికరాలు ఏర్పాటు చేయడం వల్ల సక్రమంగా పనిచేయడంలేదు. వికలాంగ విద్యార్థులకోసం ప్రత్యేక మరు గుదొడ్లు నిర్మాణం పూర్తిగా చేపట్టలేదు. ప్రహరీలకు కే టాయించిన నిధులు కూడా అరకొరగా ఖర్చయ్యాయి.
ఆరుబయటే వంట: ఈ ఏడాది వంట గదుల నిర్మాణానికి రూ.75వేలు చొప్పున నిధులు మంజూరు చేశారు. నిర్మాణాల యూనిట్ ఖరీదు గిట్టుబాటు కావటం లేద ని కాంట్రాక్టర్లు ముందుకురాలేదు. దాంతో రెండో విడ త ఇంతవరకూ మొదలు కాలేదు. ఫలితంగా ఈ ఏడా ది కూడా ఆరుబయటే రక్షణ లేని ప్రదేశాల్లో మధ్యాహ్నం భోజనం వండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరుగుదొడ్లు
గడచిన ఏడాది మంజూరైన పాఠశాలు: 186
నిధులు: రూ.1.11 కోట్లు
పూర్తై నిర్మాణాలు: 57
ఇంకా మొదలు కానివి: 129
తరగతి గదులు
మంజూరైనవి: 916
నిధులు : రూ..80 లక్షలు
పూర్తై నిర్మాణాలు: 649
ఇంకా పూర్తికానివి: 267
ప్రహరీలు:
మంజూరైనవి: 14 స్కూళ్లకు
నిధులు: రూ.36 లక్షలు
పూర్తయిన నిర్మాణాలు: 1,188
ఇంకా పూర్తికానివి: 256
తాగునీటి సరఫరా:
ఈ ఏడాదికి మంజూరైన పాఠశాలలు: 337
ఏర్పాటు పూర్తయినవి స్కూళ్లు: 303
జలమణి పథకం తాగునీటి సరఫరా బడులు:150
వంట గదులు:
మొత్తం వంటగదులకు ప్రతిపాదనలు : 880
పూర్తయినవి: 40 శాతం
రెండో విడత మంజూరైనవి: 750
వీటికి ఇంతవరకు టెండర్లు పిలువలేదు.