Pritam Munde
-
భారత రెజ్లర్లకు బీజేపీ ఎంపీ మద్దతు.. ‘ఒక మహిళగా అభ్యర్థిస్తున్నా’
మహారాష్ట్రలో జరిగిన ఓ ప్రెస్ మీట్లో బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే భారత రెజ్లర్ల వివాదంపై విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా భారత రెజ్లర్లు భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం సృష్టించింది. అయినా కూడా ఈ కేసులో విచారణ నత్తనడకన సాగడం దురదృష్టకరమని ప్రీతమ్ ముండే ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీగా కాకుండా ఒక మహిళగా విచారణ వేగవంతం చేయమని కోరుతున్నానని తెలిపారు. పెరుగుతోన్న వ్యతిరేకత... భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నారంటూ భారత రెజ్లర్లు చేస్తోన్న నిరసన రోజురోజుకీ ఉధృత రూపం దాల్చుతోంది. స్వయంగా సొంత పార్టీకి చెందినవారే బ్రిజ్ భూషణ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. తాజాగా ఈ కోవలో మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ ప్రీతమ్ ముండే చేరిపోయారు. విచారణ జరుగుతున్న తీరు విచారకరం... ఓ ప్రెస్ మీట్లో ప్రీతమ్ ముండే మాట్లాడుతూ.. ‘ఒక మహిళ నుంచి ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ముందు విచారణ చేపట్టాలి. అలా చేయకుండా కాలయాపన చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం. ఇంతకాలం వారు కష్టపడి సాధించిన పతకాలను గంగానదిలో వేయడానికి సిద్దపడ్డారంటేనే వారు ఎంత వ్యధను అనుభవిస్తున్నారో నాకు అర్ధమవుతోంది. వారి బాధను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. నేను బీజేపీ ప్రభుత్వానికి చెందిన ప్రతినిధినే అయినా కూడా ఈ కేసులో విచారణ జరుగుతున్న తీరు పట్ల విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను. దయచేసి విచారణను వేగవంతం చేసి, వీలైనంత తొందరగా నిజానిజాలు తేల్చి వారికి న్యాయం చేయండి. ఒక ఎంపీగా కాకుండా ఒక మహిళగా అభ్యర్ధిస్తున్నాను’ అని అన్నారు. చదవండి: పాకిస్తాన్, చైనాతో పోలిస్తే ఆ విషయంలో భారత్ చాలా బెటర్.. -
పంకజా, ప్రీతం మద్దతుదారుల రాజీనామా
సాక్షి, ముంబై: కేంద్ర మంత్రి మండలి విస్తరణలో స్థానం దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ బీజేపీ ఎమ్మెల్యే పంకజా ముండే, ఎంపీ ప్రీతం ముండేల మద్దతుదారులు సుమారు 20 మందికిపైగా పైగా తమ పదవులకు రాజీనామాలు చేశారు. బీడ్ జిల్లాకు చెందిన వీరంతా రాజీనామాలు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడేక్కింది. అసంతృప్తి లేదంటూనే.. కేంద్ర మంత్రిమండలి విస్తరణ అనతంరం మంత్రి మండలిలో స్థానం దక్కకపోవడంపై దివంగత సీనియర్ బీజేపీ నేత గోపీనాథ్ ముండే కూతుళ్లు పంకజా ముండే, ప్రీతం ముండేలు అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమి లేదని ఆ వార్తలన్నీ అవాస్తవమంటూ ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ కొట్టిపడేశారు. మరోవైపు పంకజా ముండే కూడా విలేకరుల సమావేశం నిర్వహించి ఎలాంటి నిరాశ లేదని, అదేవిధంగా అసంతృప్తి కలగలేదంటూ ఈ వార్తలకు విరామం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ముండే మద్దతుదారులు మాత్రం శనివారం బీజేపీలో తమ పదవులకు రాజీనామాలు చేయడం కలకలం సృష్టించింది. ముఖ్యంగా బీడ్ జిల్లా పరిషత్ సభ్యురాలు సవితా బడే, పంచాయతి సమితి సభ్యులు ప్రకాష్ ఖోడ్కర్, బీజేపీ విద్యార్థి ఆఘాడీ జిల్లా అధ్యక్షుడు సంగ్రామ్ బంగార్, బీజేపీ బీడ్ జిల్లా ఉపాధ్యక్షుడు వివేక్ పాఖరేతోపాటు డా. లక్ష్మణ్ జాధవ్ తదితరులు తమ పదవులకు రాజీనామా చేశారు. -
696,321 ఓట్ల తేడాతో ప్రీతమ్ ముండే విజయం
ముంబై: బీద్ లోకసభ నియోజకవర్గంలో దివంగత బీజేపీ సీనియర్ నేత గోపినాథ్ ముండే కూతురు ప్రీతమ్ ముండే రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నారు. గోపినాధ్ ముండే ఆకస్మిక మరణంతో ఏర్పడిన ఖాళీతో బీద్ లోకసభకు ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ ఎస్. పాటిల్ పై 696,321 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రీతమ్ ముండేకు 922,416 ఓట్లు పోలయ్యాయి. శివసేన, ఎన్సీపీలు ఈ స్థానంలో అభ్యర్థులను పోటీకి పెట్టలేదు.