ప్రైవేటు ఆస్పత్రిలో బాలుడి మృతి
చికిత్స సరిగ్గా అందించలేదంటూ బాధిత కుటుంబీకుల ఆగ్రహం
ఆసుపత్రి ఫర్నీచర్ ధ్వంసం, సిబ్బందిపై దాడి
మహబూబాబాద్ : ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నాలుగు నెలల బాలుడు మృతి చెందగా, బాధిత కుటుంబానికి చెంది న పలువురు దవాఖానలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. కాంపౌండర్‌పై చే యిచేసుకొని ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ సంఘటన బుధవారం మానుకోటలో చోటు చేసుకుంది. మరిపెడ మండలంలోని జ య్యారం గ్రామ శివారు మన్నెగూడేనికి చెందిన తేజావత్ స్వప్న, రాకేష్‌శర్మ కుమారుడైన సాయితేజ నాలుగు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. జలుబు, దగ్గు ఉండటంతో తల్లిదండ్రులు మానుకోట పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. వైద్యులు బాబును పరీక్షించి, ఆసుపత్రిలో అ డ్మిట్ చేసుకున్నారు. కాగా మంగళవారం రాత్రి 11 గంటలకు చిన్నారి బాగా ఏడ్వడంతో వైద్యుడికి తెలిపారు.
ఈక్రమంలో ఆ బాలుడికి చికి త్స అందించారు. అయినా బాబు ఆరోగ్యం కుదుట పడకపోవడంతో వైద్యుల సలహా మేరకు అంబులెన్స్‌లో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, బాలుడు రెండు గంటల క్రితమే మృతిచెందాడని చెప్పారు. అక్కడి నుంచి మానుకోటలోని ఆసుపత్రికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. దీనిపై వైద్యుడు భీమ్సాగర్ను వివరణ కోరగా ‘బాలుడు ఏడుస్తుండగా తల్లి ఆ బాలుడ్ని పడుకోబెట్టి సిరప్ పోసింది. అది బాబు ఊపిరితిత్తుల్లోకి నేరుగా వెళ్లడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది’ అని పేర్కొన్నారు.